
భారతీయులు అప్రమత్తంగా ఉండాలి
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా
మధురానగర్ ( విజయవాడ సెంట్రల్ ): విదేశాలలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సూచించారు. స్థానిక మధురానగర్ బీఆర్‌టీఎస్ రోడ్డులో శనివారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరికి నిరసనగా మానవహారం కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. కూచిభోట్ల శ్రీనివాస్ హత్య భావితరాలకు హెచ్చరికగా గుర్తించాలని అన్నారు.
అమెరికాలో పరిస్థితులు మారిన నేపథ్యంలో అక్కడ నివసించేవారు జాగ్రత్తగా ఉండాలని, అమెరికా వెళ్లదలుచుకున్నవారు కొంతకాలం ఆగి చూడాలన్నారు. విజయకృష్ణ సూపర్‌బజార్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఏఎంసీ డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్, 45వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.