
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. బోండా దంపతులతో సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని హై కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలో ఓ స్వతంత్ర్య సమరయోధుడి భూమిని ఎమ్మెల్యే బోండా అధికారం అడ్డుపెట్టుకుని కబ్జా చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఫోర్జరీ సంతకాలతో నకిలీ డ్యాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిని ఎమ్మెల్యే బొండా కబ్జా చేశారని బాధితుడు రామిరెడ్డి కోటేశ్వరావు నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ భూవిషయంలో ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడతున్నట్లు కూడా తెలిపారు. అయినా పోలీసులు ఎమ్మెల్యేపై కేసునమోదు చేయకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న విధంగా ఎమ్మెల్యే బోండా దంపతులతో సహా 9 మందిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు విజయవాడ పోలీసులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment