కొడుకు వీరంగాన్ని వెనకేసుకొచ్చిన ఎమ్మెల్యే! | MLA Bonda supported his son activities | Sakshi
Sakshi News home page

కొడుకు వీరంగాన్ని వెనకేసుకొచ్చిన ఎమ్మెల్యే!

Published Tue, May 12 2015 7:05 PM | Last Updated on Tue, Oct 30 2018 4:47 PM

బొండా ఉమామహేశ్వరరావు - Sakshi

బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ: బెజవాడ రోడ్లపై తన రెండవ కొడుకు రవితేజ, అతని అనుచరుల వీరంగాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వెనకేసుకొచ్చారు. తన కొడుకు ఏ తప్పు చేయలేదని ఆయన చెప్పారు.  కేవలం 15 బైకులు, రెండు కార్లతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. గోరంత ర్యాలీని కొన్ని మీడియాలు కొండంత చేసి చూపాయన్నారు.

ట్రాఫిక్ ఉల్లంఘనకు ఈ-చలాన్ కడితే సరిపోతుందని చెప్పారు.  గతంలో మిగతా పార్టీలు కూడా అనుమతిలేకుండా ర్యాలీలు నిర్వహించినట్లు చెబుతూ తన కొడుకు చర్యలను బొండా ఉమ సమర్ధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement