శ్రీకాకుళం: అధికారులను దూషించడం, దాడి చేయడం వంటి నేరంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరావులపై పోలీసులు కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు ధర్మాన ప్రసాద రావు డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. క్షమాపణ, శిక్ష అన్నది న్యాయస్థానం చూసుకుంటుందని అన్నారు. ప్రమాణస్వీకారం చేసిన మరునాడే టీడీపీ కార్యకర్తలు, నాయకులకు చట్టాలు, నిబంధనలు వర్తించవని చంద్రబాబు అధికారులకు చెప్పడం వలనే రాష్ట్రంలో ఇటువంటి అనర్ధాలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అధికారులు నిజాయితీగా తమ పనులు తాము చేసుకునే పరిస్థితి లేదని అన్నారు.