ప్రజా సంక్షేమమే టీడీపీ లక్ష్యమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
కంకిపాడు ప్రజా సంక్షేమమే టీడీపీ లక్ష్యమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా కంకిపాడు బస్టాండు సెంటరులో బహిరంగ సభ నిర్వహించారు. బొండా ఉమా మాట్లాడుతూ లోటు బడ్జెట్‌తో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ సాహసోపేతమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొచ్చిన సమర్థుడు చంద్రబాబు అన్నారు. ఇబ్బందులను అధికమిస్తూ ప్రభుత్వం పాలన సాగిస్తుందని వివరించారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. తొలుత ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గ్రామంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.
ప్రజలు తామెదుర్కొంటున్న ఇళ్లస్థలాలు, అంతర్గత రహదారుల సమస్యను ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవినేని రాజా వెంకటేశ్వర ప్రసాద్, జెడ్‌పీటీసీ గొంది శివరామకృష్ణ ప్రసాద్, సర్పంచి తత్తరమూడి వజ్రకుమారి, ఉప సర్పంచి పులి కామేశ్వరరావు, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నెక్కలపూడి సుబ్బారావు, ఏఎంసీ చైర్మన్ కొణతం సుబ్రహ్మణ్యం, డెరైక్టర్లు మారం రామారావు, సుదిమళ్ల రవీంద్ర, యనమదల వెంకటేశ్వరరావు, కంకిపాడు, పెనమలూరు మండల అధ్యక్షులు బత్తుల కామేశ్వరరావు, అనుమోలు ప్రభాకర్, చలవాది రాజా, ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు డి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పోరంకిలో జనచైతన్య యాత్ర
పోరంకి(పెనమలూరు) : పోరంకి గ్రామంలో టీడీపీ జనచైతన్య యాత్ర నిర్వహించింది. గ్రామంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, ఎంపీపీ బొర్రా కనకదుర్గ, వైస్ ఎంపీపీ కోయా ఆనంద్ , జెడ్పీటీసీ శ్రీనివాసారావు, టీడీపీ శంకరబాబు పార్టీ నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ వీధుల్లో డప్పులు కొట్టుతూ తిరిగారు. ప్రభుత్వ పథకాలపై విసృ్తతంగా ప్రచారం చేశారు.