
ఏంట్రా అరేయ్... అసెంబ్లీలో పాతేస్తా...
హైదరాబాద్: ఏపీ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచితంగా ప్రవర్తించారు. చట్టసభలో విపక్ష సభ్యులను తీవ్ర పదజాలంతో తూలనాడారు. బజారు రౌడీ కంటే హీనంగా ప్రవర్తించారు.
ఏంట్రా అరేయ్ అంటూ వైఎస్సార్ సీపీ సభ్యుల వైపు వేలు చూపించి నోరుపారేసుకున్నారు. అసెంబ్లీలో పాతేస్తానంటూ ఒంటికాలిపై లేచారు. వైఎస్సార్ సీపీ సభ్యులను 420 అంటూ రెచ్చిపోయారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజాను 'ఆంటీ' అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి పీతల సుజాత కూడా రోజాపై విమర్శలు చేశారు.