
సాక్షి, విజయవాడ: విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రౌడీయిజం పెరిగిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాది విష్ణు ఆరోపించారు. ఒక్కసారి గెలిచిన కూడా బొండా ఎన్ని కబ్జాలు, దౌర్జన్యాలు చేశారో అందరికీ తెలుసనని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉండే విజయవాడలో టీడీపీ నాయకులు అలజడి సృష్టించారని విమర్శించారు. సెటిల్‌మెంట్లకు, బెదిరింపులకు విజయవాడను కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. నాలుగు రోజుల కిందట బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వైద్యుడిపై బొండా దాష్టీకాన్ని రాష్ట్ర ప్రజలు అందరు చూశారని గుర్తుచేశారు.
బొండా వల్లే విజయవాడలో రౌడీయిజం పెరిగిపోయిందని విమర్శించారు. టీడీపీ నేతలు ఐదేళ్లలో తాము ఏం చేశారో చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఎఫ్‌ఐఆర్ తన పేరు లేదని విష్ణు స్పష్టం చేశారు. టీడీపీ కుట్రలో భాగంగానే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలో మద్యంలో కల్తీ జరగలేదని తేల్చారని తెలిపారు. వాటర్ కులర్‌లో సైనేడ్ కలిపినవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు బొండా ఉమా సిద్దమా అని సవాలు విసిరారు.
(చదవండి: వైద్యుడిపై బొండా ఉమా వీరంగం!)
Comments
Please login to add a commentAdd a comment