
నీళ్లు నమిలిన బోండా ఉమా
విజయవాడ: అభివృద్ధి కోరుకుని వచ్చే వారికి ఎన్నికలతో సంబంధం ఏంటని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలు ఎమ్మెల్యే టి. జయరాములు తమ పార్టీలో చేరిన విషయాన్ని బుధవారం ఆయన విలేకరులకు వెల్లడించారు.
పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే బోండా నీళ్లు నమిలారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయని ఎదురు ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తాయా, లేదా అనే విషయాన్ని పార్టీలో చేరే ఎమ్మెల్యే చెప్తారని పేర్కొన్నారు.