బొండా ఉమా, పార్థసారధి రాజీనామా | Bonda Umamaheswara Rao Quits TTD Membership | Sakshi
Sakshi News home page

బొండా ఉమా, పార్థసారధి రాజీనామా

Published Tue, Mar 19 2019 8:08 PM | Last Updated on Tue, Mar 19 2019 9:11 PM

Bonda Umamaheswara Rao Quits TTD Membership - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, బీకే పార్థసారధి మంగళవారం టీటీడీ పాలకమండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. టీటీడీ బోర్డులో కొనసాగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందన్న భావనతో వారు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. టీటీడీతో పాటు ఏపీ ప్రభుత్వం వీరి రాజీనామాలను వెంటనే ఆమోదించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీటీడీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. కాగా, తాజా ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నుంచి బొండా ఉమామహేశ్వరరావు, అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు.

కొత్తపల్లి రాజీనామా
కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టిక్కెట్‌ ఆశించి భంగపడటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా నరసాపురం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తాను ఏవిధంగా పోటీకి దిగుతాననే దానిపై రెండు మూడు రోజుల్లో తెలియజేస్తానన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement