సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. రొద్దంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి సవిత ఆవిష్కరించగా, ఎంపీ బీకే పార్థసారథిని ఎందుకు ఆహ్వానించలేదంటూ ఆయన వర్గీయుల నిరసనకు దిగారు. హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య అధిపత్య పొరు కొనసాగుతోంది.
కాగా, పెనుకొండ నియోజకవర్గంలో అన్నింటా ఆధిపత్యం చాటుకోవాలని మంత్రి ప్రయత్నిస్తుండగా.. పట్టు నిలుపుకోవాలని బీకే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇదివరకే ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్న బీకే పార్థసారథిని కాదని సవిత ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని గెలిచిన సంగతి తెలిసిందే.
మంత్రి పదవినీ కూడా దక్కించుకున్న సవిత.. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం మద్యం షాపుల టెండర్లలో సైతం ఎంపీ వర్గీయులు పాల్గొనకూడదంటూ మంత్రి వర్గీయులు అడ్డుపడటంతో గతంలో పెనుకొండ ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణ తలెత్తిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment