kottapalli subba rayudu
-
బొండా ఉమా, పార్థసారధి రాజీనామా
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, బీకే పార్థసారధి మంగళవారం టీటీడీ పాలకమండలి సభ్యత్వాలకు రాజీనామా చేశారు. టీటీడీ బోర్డులో కొనసాగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందన్న భావనతో వారు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. టీటీడీతో పాటు ఏపీ ప్రభుత్వం వీరి రాజీనామాలను వెంటనే ఆమోదించింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీటీడీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. కాగా, తాజా ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి బొండా ఉమామహేశ్వరరావు, అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి బీకే పార్థసారథి పోటీ చేస్తున్నారు. కొత్తపల్లి రాజీనామా కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి కొత్తపల్లి సుబ్బారాయుడు రాజీనామా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం టిక్కెట్ ఆశించి భంగపడటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా నరసాపురం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తాను ఏవిధంగా పోటీకి దిగుతాననే దానిపై రెండు మూడు రోజుల్లో తెలియజేస్తానన్నారు. -
కాంగ్రెస్‌కు మద్దతు ప్రసక్తే లేదు: వైఎస్సార్ సీపీ
► రాష్ట్ర ప్రయోజనాలే కొలబద్దగా కేంద్రంలో పాత్ర ► తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా వ్యవహరిస్తాం ► చంద్రబాబులా సాగిలబడే తత్వం మాది కాదు ► జాతీయ స్థాయిలో మా విధానం స్పష్టం ► కేంద్రంలో మద్దతుపై వక్రీకరించడం సరికాదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని పేర్కొంది. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా తమ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపింది. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వాటిని పట్టుబట్టి సాధించుకుంటామని పేర్కొంది. కేంద్రంలో మోడీ ఉండొచ్చు, మరెవరైనా ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే పార్టీకే మద్దతునిస్తామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, అందుకు ప్రాతిపదిక ఏమిటనే అంశాలపై ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనాలు సత్యదూరమని ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అందులోని ముఖ్యాంశాలు... ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 25 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీలో పైచేయి సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించవచ్చునని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైనవి పట్టుబట్టి సాధించుకోవచ్చని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అనేకమార్లు ప్రచార సభల్లో చెబుతూ వచ్చారు. చంద్రబాబులా ఢిల్లీలో సాగిలపడిపోం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరిస్తామని పోలింగ్ ముగిసిన తరువాత పులివెందులలో జరిగిన పత్రికా సమావేశంలోనూ విస్పష్టంగా ప్రకటించారు. ► చంద్రబాబు రాష్ట్రంలో మోడీని చూపి ఓట్లు అడగ్గా జగన్మోహన్రెడ్డి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడతామంటూ ప్రజా మద్దతు కోరిన విషయం అందరికీ తెలుసు. ఈ అంశాలను పట్టించుకోకుండా ఆంగ్ల మీడియా కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనే అంశంపై తోచిన రీతిలో కల్పితాలతో కథనాలు ఇవ్వడం సమంజసం కాదు. ► రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, అసంబద్ధంగా, అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. 25 ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ప్రాతిపదికగా మా మద్దతు మోడీకా, మల్లయ్యకా, ఎల్లయ్యకా అనే అంశంలో నిర్ణయం తీసుకుంటామని జగన్మోహన్రెడ్డి పలుమార్లు విస్పష్టంగా ప్రకటించారు. దీనికి విరుద్ధంగా ప్రజల్లో భయాందోళనలు, సందిగ్ధతను సృష్టిం చేందుకు పార్టీ వైఖరిని వక్రీకరిస్తూ కొన్ని ఆంగ్ల పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రచురించాలి. జగన్‌ను కలిసిన పార్టీ నేతలు పార్టీ నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు, బాలశౌరి తదితరులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. పోలింగ్ సరళి గురించి వారు పార్టీ అధినేతకు వివరించారు. -
కడలి తరంగం
` వీధులన్నీ నిండిపోగా.. రోడ్లపై రాకపోకలు స్తంభించిపోయూరుు. వైఎస్సార్ జనభేరి పేరిట ఎన్నికల సమర శంఖారావం పూరించేందుకు శుక్రవారం నరసాపురం వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఆయనపై తమకు గల అభిమానాన్ని చాటుకున్నారు. స్టీమర్ రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. నిజాయితి, విశ్వసనీయత అనే పదాలకు అర్థం తెలిసిన వాడే నాయకుడు. కార్యకర్తలు కాలర్ ఎగరేసి అతనే మా నాయకుడని గర్వంగా చెప్పుకునేలా మసలుకునే వాడే నాయకుడు. ఒక మాట చెబితే దానిని నిలుపుకోవడంలో మడమ తిప్పని వాడే నాయకుడనిపించుకుంటాడ’ని నాయకుడనే పదానికి వైఎస్ జగన్ నిర్వచనం చెప్పారు. ఆయన ప్రసంగించినంతసేపూ ప్రతి మాటకు జనం జయజయధ్వానాలు పలికారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్న ఆల్ ఫ్రీ హామీల మర్మాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డివిడమరిచి చెబుతున్నప్పుడు జనం ఆసక్తిగా విన్నారు. బాబు బుర్రలో ఇన్ని కుట్రలున్నాయా అని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తన సోదరుడు కొత్తపల్లి జానకిరామ్, వందలాది మంది అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆప్యాయంగా పలకరిస్తూ... శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం విమాశ్ర యం నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు బయలుదేరారు. హనుమాన్ జంక్షన్ వద్ద కని పించిన వృద్ధులను ఆప్యాయంగా పలకరిం చారు. అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిగూడెం సమీపంలో వైఎస్సార్ సీపీ నేత చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఫామ్ హౌస్‌లో కొద్దిసేపు ఆగారు. అక్కడి నుంచి తణుకు, పెరవలి, పెనుగొండ మీదుగా నరసాపురం పయనమయ్యారు. అడుగడుగునా ఆయనకు అభిమాన ప్రవాహం అడ్డుపడింది. ప్రతి ఒక్కరినీ ఆగిమరీ ఆయన పలకరించారు. మార్టేరు, పాలకొల్లు సెంటర్లలో పెద్దఎత్తున ప్రజలు జననేతకు జేజేలు పలికారు. నరసాపురంలో అడుగుపెట్టే సందర్భంలో జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగ తం లభించింది. యువకులు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పూలతో అలంకరించిన ఏడు పంచకల్యాణి ఆశ్వాలతో కూడిన రథంపై జగన్మోహన్రెడ్డిని ఎక్కించి సభావేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు జనభేరి బహిరంగ సభ మొదలైంది. వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నంతసేపూ జనం పూల వర్షం కురిపించారు. చంద్రబాబులా సాధ్యం కాని హామీలు ఇచ్చి మాట తప్ప డం తనకు రాదని, చెప్పినవన్నీచేసి తీరుతానని, చెప్పనివి కూడా చేస్తానని జనానికి జగన్ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఆవేశాన్ని రగిలించేలా.. జనాన్ని ఆలోచింపజేసేలా సాగింది. సభానంతరం వేదిక దిగుతున్నప్పుడు కూడా సమీప భవంతులపై నుంచి అభిమానులు పూలు చల్లి వీడ్కోలు పలికారు. అంతకుముందు సభలో వైఎస్ జగన్‌ను కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇతర నాయకులు గజమాలతో సత్కరించారు. పూల కిరీ టాన్ని జననేతకు అలంకరించేందుకు ప్రయత్నించగా జగన్ దానిని కొత్తపల్లి శిరస్సున ఉంచారు. అవినీతిపై రామబాణాన్ని ఎక్కుపెట్టినట్టు పూల ధనుస్సుతో బాణాన్ని జగన్ ఎక్కుపెట్టారు. సభ ముగించుకుని రాత్రి బసకు పాలకొల్లులోని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నివాసానికి వెళ్లారు. జగన్మోహన్రెడ్డి వెంట పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అశోక్‌గౌడ్, పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఇందుకూరి రామకృష్ణంరాజు, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, నిడదవోలు వైసీపీ నేత జీఎస్‌రావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు, రాజోలు నియోజకవర్గ సమన్వయకర్త బొంతు రాజేశ్వరావు మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు, ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కండిబోయిన శ్రీనివాస్, నరసాపురం పట్టణ, మండల అధ్యక్షులు నల్లిమిల్లి జోషప్, దొంగ గోపాలకృష్ణ, పార్టీ నాయకులు సాయినాథ్ ప్రసాద్, తదితరులు ఉన్నారు.