విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావుతో పాటు ఆయన కుమారుడిపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు సంవత్సరాల క్రితం మరణించిన సాయిశ్రీ చావుకు బోండా ఉమాహేశ్వర రావు, ఆయన కుమారుడు శివ కారణమని సాయిశ్రీ తల్లి సుమన శ్రీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.