ఇంద్రకీలాద్రిపై అధికార టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు హడావిడి చేశారు. టీటీడీ పట్టువస్త్రాల సమర్పణను బోండా ఉమ వివాదాస్పదం చేశారు. టీటీడీ ఏఈఓ సాయిలు టీటీడీ నుంచి పట్టువస్త్రాలను తీసుకువచ్చారు. ఆయనతో పాటే దుర్గగుడికి ఎమ్మెల్యే బోండా ఉమ వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం టీటీడీ ఏఈఓకు దుర్గగుడి సిబ్బంది స్వాగతం పలికి, తలపాగా కట్టారు. ఈ ఘటన బోండాకు కోపం తెప్పించింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఉన్న తనను పక్కకు పెట్టి ఏఈఓకు స్వాగతం పలకడంపై బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గగుడి అధికారుల తీరును నిరసిస్తూ బోండా ఉమ అలిగి వెళ్లిపోయారు. దీంతో బోండా ఉమను అవమానించారంటూ ఉమ అనుచరులు, దుర్గగుడి పాలకమండలి సభ్యులపై వీరంగం సృష్టించారు.