
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అరచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని, ఆయనపై రౌడీ షీట్ ఓపెన్ చెయ్యాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ‘విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజ్యమేలుతున్న అరాచకం’ అన్న అంశంపై దళిత సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల జేఏసీ నాయకుడు పాలకీర్తి రవి మాట్లాడుతూ.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా అరాచకాలకు హద్దులేకుండా పోతున్నాయన్నారు.
బోండా ఉమాపై ఎఫ్‌ఐఆర్ నమోదైన ఏడు కేసులు ఉన్నాయని, అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాధగాని గురునాధం మాట్లాడుతూ.. ఏడు కేసులున్న బోండా ఉమా.. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని ఆరోపించారు. బోండా ఉమాపై చర్యలు తీసుకునేంతవరకు దళిత సంఘాలతో కలిసి న్యాయ పోరాటం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment