
విజయవాడ: చంద్రబాబు నాయుడు, బోండా ఉమాపై విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. బోండా ఉమ లాంటి ఒక లోఫర్‌ను చంద్రబాబు తప్ప ఎవరూ ప్రోత్సహించరని అవినాష్ మండిపడ్డారు.బెజవాడకు గంజాయి అలవాటు చేసిన వ్యక్తి బోండా ఉమ అని, బైక్ కార్ రేసులతో పాటు రేవ్ పార్టీ కల్చర్‌ను నగరానికి తెచ్చింది కూడా బోండా ఉమనేనని అన్నారు అవినాష్. ‘బోండా ఉమ ఒక చిల్లర వ్యక్తి, బజారు మనిషి. బోండా ఉమ కుటుంబం గురించి చెప్పాలంటే చాలా ఉంది.
తిరుపతిలో సారా వ్యాపారం చేసిన వ్యక్తి బోండా ఉమ. కోగంటి సత్యం, ఐలాపురం వెంకయ్య దగ్గర డ్రైవర్‌గా పని చేసి వారినే మోసం చేసిన వ్యక్తి బోండా ఉమ. గతంలో టీడీపీ ప్రభుత్వమే బోండా ఉమ అక్రమాలపై విచారణ చేసింది.చంద్రబాబు కాళ్లు పట్టుకొని బోండా ఉమ బయటపడ్డాడు. బైక్, కార్ రేసులు, రేవ్ పార్టీ కల్చర్ నగరానికి తెచ్చిందే బోండా ఉమ. మంత్రి పదవి కోసం చంద్రబాబును బోండా బ్లాక్ మెయిల్ చేస్తే, భూ కబ్జాలపై బోండా ఉమకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. బోండా ఉమ లాంటి లోఫర్ చంద్రబాబు తప్ప ఎవరూ ప్రోత్సహించరు’ అని అవినాష్ విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment