Dalit union leaders
-
జనసేన ఎమ్మెల్యే నానాజీకి దళిత నేతలు వార్నింగ్..
-
లోకేష్ కు చుక్కలు చూపిస్తున్నారు అయ్యయ్యో ఎంత కర్మ..
-
బాబు వ్యాఖ్యలపై నిరసనల వెల్లువ
బాపట్ల/కర్నూలు(సెంట్రల్)/నెల్లూరు(పొగతోట): ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ఉద్దేశించి మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా సోమవారం కూడా నిరసనలు వెల్లువెత్తాయి. గుంటూరు జిల్లా బాపట్లలో చంద్రబాబు దిష్టిబొమ్మను డాక్టర్ అంబేడ్కర్ సేవా సమాజం, దళిత సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద దహనం చేశారు. చంద్రబాబూ క్షమాపణ చెప్పు.. లేదంటే బయట తిరగనివ్వబోం దళిత ఐఏఎస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు సోమవారం కర్నూలులో చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించి ఆందోళన చేశారు. కలెక్టరేట్ ఎదుట చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు లాక్కున్న దిష్టిబొమ్మను తమకు అప్పగించాలని రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. అనంతరం కలెక్టర్ వీరపాండియన్‌కు ఫిర్యాదు చేశారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ విజయకుమార్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనను బయట తిరగనివ్వబోమని హెచ్చరించారు. నెల్లూరులో ర్యాలీ నిర్వహించిన డీఆర్డీఏ, మెప్మా ఉద్యోగుల సంఘాలు దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డీఆర్డీఏ, మెప్మా ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. సంఘం నేతలు సోమవారం నెల్లూరులో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. చంద్రబాబుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ వి.వినోద్‌కుమార్‌కు వినతిపత్రమిచ్చారు. వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి సాక్షి, అమరావతి: ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ల సంఘం, మున్సిపల్ ఉద్యోగుల సంఘం చంద్రబాబును డిమాండ్ చేశాయి. రాజధాని అంశంలో ప్రభుత్వానికి బీసీజీ సమర్పించిన నివేదికలోని అంశాలను ప్రణాళిక విభాగం కార్యదర్శి హోదాలో విజయకుమార్ ప్రజలకు వివరించారని మున్సిపల్ కమిషనర్ల సంఘం అధ్యక్షురాలు అశాజ్యోతి, మున్సిపల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.వెంకటరామయ్య సోమవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రణాళికపరమైన నిర్ణయాలను ప్రజలకు వివరించడం ఆయన బాధ్యత అని తెలిపారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు విజయకుమార్‌ను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. బాబును తక్షణమే అరెస్టు చేయాలి సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ సాక్షి, అమరావతి: సీనియర్ ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దళితుల పట్ల ఆయనకి ఉన్న చిన్నచూపును బయటపెట్టిందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఉత్తరాంధ్ర దళిత ఉద్యోగుల సంఘం డిమాండ్ డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర దళిత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రతినిధి, విశాఖ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ దాసు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దళితులను కించపరుస్తూ మాట్లాడి వారిని మనోవేదనకు గురి చేశారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చంద్రబాబుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, లేకుంటే దళితులంతా ఏకమై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లా దళిత జేఏసీ కన్వీనర్ కల్లేపల్లి రామ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు. బాపట్లలో బాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దళిత సంఘం నేతలు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ గుంటూరు/చోడవరం: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం గుంటూరు రూరల్ ఎస్పీ సీహెచ్ విజయారావును ఆయన కార్యాలయంలో కలసి వినతిపత్రమిచ్చారు. అనంతరం కిషోర్ విలేకరులతో మాట్లాడుతూ..ఐఏఎస్ అధికారి విజయకుమార్‌ను చులకన చేసి మాట్లాడిన చంద్రబాబును దళితులు క్షమించరన్నారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు దళితులంటే మాజీ సీఎం చంద్రబాబుకు చులకన భావమని మరోసారి రుజువైందని మాల మహానాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ మాలమహానాడు నాయకులు చోడవరం పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.ఈశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. దళితులకు క్షమాపణలు చెప్పాలి మంగళగిరి: దళిత ఐఏఎస్ అధికారిని అవమానించేలా మాట్లాడి తాను దళిత, బీసీ అణగారిన వర్గాలకు వ్యతిరేకమని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారని, ఆయన వెంటనే దళితులకు క్షమాపణ చెప్పకపోతే తమ సత్తా చూపుతామని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. మూడు ప్రాంతాల్లో రాజధాని గురించి బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికను మీడియాకు వెల్లడించిన ఐఏఎస్ అధికారి విజయకుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చింతమనేనిని ఓడించినా బుద్ధి రాలేదు
-
దేవుడికీ తప్పని కుల వివక్ష
కుల వ్యవస్థ ఈ దేశంలోని కోటానుకోట్ల దేవుళ్ళలోనూ దళిత దేవుళ్ళ స్థానాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 500 ఏళ్ళ కిందట నిర్మితమైన సంత్ రవిదాస్ మందిర్‌ను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఒక్క ఉదుటున కూల్చివేసింది. అది ప్రభుత్వం గుర్తించిన అడవిలో ఉన్నందువల్ల దానిని తొలగించాలని ఢీడీఏ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కోర్టు కూడా తోసిపుచ్చింది. 1450లో వారణాసిలో అంటరాని కులంలో జన్మించిన సంత్ రవిదాస్ కుల వివక్షను, అంటరానితనాన్ని నిరసిస్తూ, ప్రారంభించిన భక్తి ఉద్యమం కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. సంత్ రవిదాస్ తన జీవితకాలంలో ఈ సమాజంపై ఎంతో ప్రభావాన్ని కలగజేశారు. ఏ దేవుడైనా దేవుడే అన్నప్పుడు తక్కువ కులాల దేవుడికో నీతి, అగ్రకుల దేవుళ్ళకో నీతి ఎలా ఉంటుంది. ఈ ద్వంద్వ నీతి పేరే కుల వివక్ష. మానవ అభ్యున్నతికి పాటుపడిన మహనీ యులను దేవుళ్ళతో సమంగా తలుస్తారు. రాళ్ళూ రప్పల కంటే సమాజానికి ఏదో ఒకటి చేసి చనిపోయినవారిని కొలవడంలో తప్పుపట్టాల్సిన పనిలేదు. కాకపోతే భారత దేశానికి మాత్రమే పరిమితమైన కుల వ్యవస్థ ఈ దేశంలోని కోటానుకోట్ల దేవుళ్ళలోనూ దళిత దేవుళ్ళ స్థానాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. సరిగ్గా ఇదే కోణంలో సంత్ రవిదాస్ దేవాలయం కూల్చివేతను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో అయిదు వందల ఏళ్ళ కిందట నిర్మితమైన సంత్ రవిదాస్ మందిర్‌ను ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ ఒక్క ఉదుటున కూల్చివేసింది. 1992లో ఢిల్లీ డెవ లప్మెంట్ అథారిటీ రవిదాస్ మందిర్‌ను అక్కడి నుంచి తొలగించా లని, మందిర్ నిర్వాహకులకు నోటీసులు జారీచేసింది. ఆ మందిర్ ప్రభుత్వం గుర్తించిన అడవిలో ఉన్నందువల్ల దానిని తొలగించాలని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే మందిర్ నిర్వాహకులు దీనిని వ్యతిరేకిస్తూ, న్యాయస్థానాన్ని ఆశ్ర యించారు. కానీ న్యాయస్థానాలలో సంత్ రవిదాస్ మందిర్ నిర్వా హకుల మాట చెల్లుబాటు కాలేదు. అటవీ ప్రాంతంలో ఉంది కాబట్టి దానిని తొలగించాలని న్యాయస్థానం నిర్ధారించింది. అందుకను గుణంగానే ఈనెల మొదటి వారంలో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ రవిదాస్ మందిర్‌ను నిలువునా కూల్చివేసింది. ఈ సంఘటన పంజాబ్, హర్యానాలతో సహా ఉత్తర భారతాన్ని ఓ కుదుపు కుదిపే సింది. రవిదాస్ మందిర్‌ను కూల్చివేసినందుకు ఆగస్టు 21వ తేదీన ఢిల్లీలో వేలాది మంది నిరసన ప్రదర్శన చేశారు. రవిదాస్ సాంప్రదా యాన్ని అవలంభిస్తున్న వాళ్లే కాకుండా, అనేక సంఘాల కార్యకర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పంజాబ్, హర్యానాల్లో రోజుల తరబడి నిరసనలు వెల్లువెత్తాయి. సంత్‌రవిదాస్ మందిర్‌ను కూల్చడం వెనుక కుల వివక్ష, సామాజిక అణచివేతలే కారణమని భావించక తప్పదు. సంత్ రవిదాస్ మందిర్ చరిత్రను పరిశీలిస్తే, ఈ వాదనకు బలం చేకూరుతుండడం కూడా సుస్పష్టం. సంత్ రవిదాస్ 1450 సంవత్సరంలో వారణాసిలోని అంటరాని కులంలో జన్మించారు. ఆయన కుటుంబం చర్మకార వృత్తిలో జీవితం సాగిస్తుండేది. అప్పటికే పంజాబ్‌తో సహా ఉత్తర భారతదేశంలో సిక్కుమతం పురుడు పోసుకుంటోంది. సంత్ రవిదాస్ కూడా అదే తరహాలో కుల వివక్షను, అంటరానితనాన్ని నిరసిస్తూ, తన భక్తి ఉద్య మాన్ని ప్రారంభించాడు. సిక్కు మత వ్యవస్థాపకులైన గురునానక్‌ను సంత్ రవిదాస్ కలిసినట్టు సంత్ రవిదాస్ రాసిన కొన్ని పద్యాలు సిక్కు మత పవిత్ర గ్రంథమైన ‘‘ఆదిగ్రం«థ్’’లో పొందుపరిచినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. సంత్ రవిదాస్ అనుచరులు క్రమంగా సిక్కుమతంలో చేరిపోయారు. కానీ అక్కడ కూడా కుల వ్యవస్థ పైశాచికత్వం కోరలు చాచింది. అంటరాని కులాల్లో సైతం కుల వివక్ష కొనసాగింది. దానిని నిరసించిన వాళ్ళు ప్రత్యేకంగా రవిదాస్ మందిర్‌ను నిర్మించుకొని తమ సాంప్రదాయాలను కొనసా గిస్తూ వచ్చారు. వీరంతా చమార్ల నుంచి వచ్చినప్పటికీ. వీరిని రవి దాసియా చమార్లుగా పిలిచారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాప కులు కాన్షీరాం ఈ సామాజిక నేపథ్యం నుంచి వచ్చినవారే. రవిదాస్ సాంప్రదాయానికి చెందిన రామానంద్దాస్ను 2009లో వియన్నాలో కొంత మంది హత్యచేశారు. సిక్కు అగ్రకుల శక్తులే ఈపని చేశారని భావించిన రవిదాస్ అనుచరులు తమకు తాముగా ప్రత్యేక మతంగా ప్రకటించుకున్నారు. కానీ రవిదాస్ సంప్రదాయాన్ని పాటిస్తున్న వాళ్ళు చాలా కాలంగా ప్రధాన గురుద్వారాలలో భాగస్వాములు కాలేకపోయారు. పదిహేనవ శతాబ్దం నుంచి ప్రారంభమైన సంత్ రవిదాస్ భక్తి ఉద్యమం కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసింది. కుల వివక్షను బద్దలు కొట్టుకొని, కొన్ని వేల మంది విదేశాలలో ఈ రోజు స్వేచ్ఛా జీవులుగా గడుపుతున్నారు. భారతదేశం నుంచి విదేశాల్లో స్థిరపడిన పంజాబీలలో సగం మందికి పైగా సంత్ రవిదాస్ భక్తులే ఉంటా రంటే ఆశ్చర్యం లేదు. సంత్ రవిదాస్ తన జీవితకాలంలో ఈ సమాజంపై ఎంతో ప్రభావాన్ని కలగజేశారని చెప్పొచ్చు. ఆయన వారణాసి ప్రాంతంలోనే కాదు, దేశంలోని చాలా ప్రాంతాల్లో పర్యటించి ఎంతో మందిని తన మార్గంలోకి తీసుకొచ్చారు. ఆ క్రమం లోనే ఆయన ఢిల్లీని సందర్శించి, అప్పటి ఢిల్లీ సుల్తాన్ సికిందర్లోడి మన్ననలు పొందారు. అందుకు గాను ఆయన సంత్ రవిదాస్‌కు ఢిల్లీలో ఇప్పుడున్న ప్రాంతంలో కొంత భూమిని కేటాయించి, ఆశ్రమ నిర్మాణానికి అవకాశమిచ్చారు. అప్పటి నుంచి అదే స్థలంలో సంత్ రవిదాస్ మందిర్ నిర్మాణం జరిగింది. 1949లో గురు రవిదాస్ జయంతి ఉత్సవ సమితి ఏర్పాటై, అక్కడ కొన్ని వసతులతో కూడిన రవిదాస్ మందిర్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. 1949లో ప్రారంభమైన ఆ నిర్మాణం 1954లో పూర్తయ్యింది. అప్పటి రైల్వే శాఖా మంత్రి జగజ్జీవన్ రాం 1954లో దానికి ప్రారంభోత్సవం చేశారు. దాదాపు అయిదు వందల ఏళ్ళకు పైగా గురు రవిదాస్ బోధనలకు కేంద్రమైన ఈ మందిర్‌ను 1992లో అటవీప్రాంతంలో ఉన్నదని నోటీసులు ఇచ్చి, 2019లో కూల్చి వేశారు. దీన్ని బట్టి చూసినా ఇది కేవలం వివక్షతో చేసిందన్న విషయం సుస్పష్టం. ఒకవేళ గురు రవిదాస్ మందిర్ అటవీ ప్రాంతంలో ఉన్నదంటే, చాలా దేవాలయాలు, ఆశ్రమాలూ, అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఢిల్లీలోనే చూసినట్లయితే ప్రభుత్వం గుర్తించిన ఆరు అటవీ ప్రాంతాలు ఉన్నాయి. పాత ఢిల్లీలోని నార్తరన్ రిడ్జ్, మంగేర్ బని అడవి, రాజోక్రి అటవీప్రాంతం, జహన్పన సిటీ ఫారెస్ట్, తుగ్లక్ బాద్ రిడ్జ్ ఫారెస్ట్, సంజయ్ వనం వాటిపేర్లు. సంజయ్ వనంలో రామ్ తలాబ్ మందిర్, ప్రాచీన గురు గోరఖ్‌నాథ్ మందిర్, తుగ్లక్ బాద్ అడవిలో కాళి బారిదేవాలయం ఉన్నాయి. వీటిలో వేటికీ కూడా నోటీసులు లేవు. కూల్చివేతలు లేవు. ఒకవేళ రక్షిత అటవీ ప్రాంతంలో ఎటువంటి కట్టడాలూ ఉండకూడదని భావిస్తే ఈ దేవాలయాలను కూడా తొలగించడానికి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ తన అధికారాలను ఉపయోగించి ఆ పనిచేయాలి. కానీ అలా జరగలేదు. అంతేకాదు, ఈ దేశంలోని దేవాలయాలలో సగానికిపైగా రక్షిత అటవీ ప్రాంతంలోనే నిర్మితమై ఉన్నాయి. కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం సహా చాలా దేవాలయాలు మంగళదేవి, దేవియార్ ఫారెన్ టెంపుల్, కర్ణాటకలోని హిమావత్ గోపాలస్వామి దేవాల యం, ఉత్తరాఖండ్‌లోని అనేక దేవాలయాలు, ఆంధ్రప్రదేశ్‌లోని తిరు పతి, శ్రీశైలం అహోబిలం ఇట్లా చెప్పుకుంటూపోతే కొన్ని వందల పేర్లు వస్తాయి. ఇక్కడ పొరపాటు పడొద్దు. ఈ దేవాలయాలను కూల్చాలనో, తొలగించాలనో నా అభిప్రాయం కాదు. ఏ దేవుడైనా దేవుడే అన్నప్పుడు తక్కువ కులాల దేవుడికో నీతి, అగ్రకుల దేవు ళ్ళకో నీతి ఎలా ఉంటుంది అన్నదే నా ప్రశ్న. ఈ ద్వంద్వ నీతి పేరే కుల వివక్ష. నిజానికి ఈ పాపంలో కాంగ్రెస్ పార్టీకి భాగమున్నది. 1992లో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నోటీసులు ఇచ్చినప్పుడే ఈ చర్యని అడ్డుకోవాల్సింది. ఆ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీయే అధికారంలో ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి, సానుభూతి తెలి పితే ప్రయోజనమేముంటుంది? పోనీ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమైనా ఎందుకు దీనిని పట్టించుకోలేదో సమాధానం చెప్పాలి. ఇది పూర్తిగా సామాజిక వివక్ష, అణచివేత, వెలివేతలకు ఒక నిలువెత్తు నిదర్శనం. పర్యావరణానికి ఇబ్బంది కలిగించే ఎన్నో ప్రాజెక్టులకు రక్షిత అటవీ ప్రాంతాల్లో రిజర్వు ఫారెస్ట్‌లలో, అభయా రణ్యాలలో రహదారులకు, రైల్వే లైనులకు, పరిశ్రమలకు అనుమతి ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం, ఒకటì æరెండున్నర ఎకరాల రవిదాస్ మందిరానికి మినహాయింపు ఇవ్వలేకపోవడం ఏ సామాజిక న్యాయాన్ని సూచిస్తున్నది? రోడ్లకి అడ్డంగా కుప్పలుగా పుట్టుకొస్తోన్న దేవాలయాలు ఇంతింతై వటుడింతై అన్నట్టు విస్తరిస్తోంటే, దాన్ని వదిలేసి, ఎక్కడో అడవిలో కట్టుకున్న ఆలయాన్ని సైతం నిర్దాక్షి ణ్యంగా కూల్చేయడం లోని మతలబుని అర్థం చేసుకోలేనంత వెర్రి జనం కాదుకదా ప్రజలు. కోట్లాది మంది దళితులు, ప్రజాస్వామ్య వాదులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే తప్పును సరిదిద్దుకొని, ఆ స్థలంలోనే గురు రవిదాస్ మందిరాన్ని నిర్మించి ప్రాయశ్చిత్తం చేసు కోవాల్సిన అవసరం ఉంది. లేదంటే దేవాలయాల్లో దళితుల ప్రవే శాన్ని అడ్డుకున్నట్టే, నేడు దళితుల దేవుళ్లని చివరకు అడవినుంచి సైతం తరమికొట్టే ప్రయత్నాలుగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే వాటిని కాపాడుకోవడానికి ఆ వర్గాలు మరో మహోద్య మానికి ఉద్యుక్తులు కావాల్సి వస్తుంది. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
‘బోండా ఉమాపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి’
సాక్షి, విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అరచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని, ఆయనపై రౌడీ షీట్ ఓపెన్ చెయ్యాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ‘విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజ్యమేలుతున్న అరాచకం’ అన్న అంశంపై దళిత సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల జేఏసీ నాయకుడు పాలకీర్తి రవి మాట్లాడుతూ.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా అరాచకాలకు హద్దులేకుండా పోతున్నాయన్నారు. బోండా ఉమాపై ఎఫ్ఐఆర్ నమోదైన ఏడు కేసులు ఉన్నాయని, అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాధగాని గురునాధం మాట్లాడుతూ.. ఏడు కేసులున్న బోండా ఉమా.. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని ఆరోపించారు. బోండా ఉమాపై చర్యలు తీసుకునేంతవరకు దళిత సంఘాలతో కలిసి న్యాయ పోరాటం చేస్తామన్నారు. -
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
సాక్షి, మేడ్చల్ : జిల్లాలోని కీసర మండలం రాంపల్లి గ్రామ ప్రధాన చౌరస్తాలో గుర్తుతెలియని దుండగులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహ తలను పూర్తిగా తొలగించి కిందపడేశారు. ఈ సమాచారం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు సంఘటనా స్ధలానికి చేరుకొని దుండగులను అరెస్ట్ చేయాలంటూ ఆందోళను దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కీసర సీఐ సంఘటన స్థలానికి అందోళకారులను శాంతింపజేశారు. దుండగులను అదుపులోకి తీసుకున్నామని సీఐ ప్రకాష్ పేర్కొన్నారు. -
దళిత యువకులపై టీడీపీ నేతలు పైశాచికం
-
దళిత యువకులపై పైశాచికం
రెండు రోజులుగా లాకప్‌లో లాఠీలతో తీవ్రంగా కొట్టిన పోలీసులు చుండూరు(అమృతలూరు): కక్ష సాధింపు కోసం టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై కనీసం విచారించకుండా దళిత మైనర్ బాలురను పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారు. రెండు రోజులుగా లాకప్‌లో లాఠీలతో తీవ్రంగా కొట్టడంతో వారు నడవలేని స్థితికి చేరుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో చోటుచేసుకుంది. చుండూరులో ఇటీవల జనచైతన్య యాత్ర జరిగింది. ఆ సందర్భంగా కాలనీలో టీడీపీ ఫ్లెక్సీలు, జెండాలను కట్టారు. ఈ నెల ఒకటో తేదీన అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన కొందరు యువకులు రోడ్డు పక్కనున్న చెత్తతో చలిమంటలు వేసుకున్నారు. ఆ చెత్తలో టీడీపీ జెండా ఉందన్న విషయం వారు గమనించలేదు. అరుుతే జెండాను మంటల్లో వేసి కాల్చుతున్నారని టీడీపీకి చెందిన కొందరు ప్రచారం చేశారు. దీంతో అదే కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఎమ్మెల్యే అండదండలతో ఆ యువకులపై కేసు పెట్టాడు. దీంతో గురువారం అర్థరాత్రి పోలీసులు ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఒకరిని వదిలి,మిగిలిన ఆరుగురిని లాకప్‌లో లాఠీలతో చితకబాదారు. సీఐ సుభాషిణి ఆదేశాల మేరకు ఎస్ఐ విక్టర్ మైనర్లపై పైశాచికంగా వ్యవహరించాడంటూ బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చుండూరు సర్కిల్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. -
దళితులను అవమాన పరుస్తారా?
► అంబేడ్కర్ జయంతి సభలో అర్ధాంతరంగా వెళ్లిపోయిన ప్రజాప్రతినిధులు ► దళిత సంఘాల నాయకుల మండిపాటు అనంతపురం సెంట్రల్ : అంబేడ్కర్ వర్ధంతి సభ నుంచి ప్రజా ప్రతినిధులు అర్ధాంతరంగా వెళ్లి పోవడంపై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. గురువారం అంబేద్కర్ వర్దంతి సభ జిల్లా పరిషత్ హాలులో నిర్వహించారు. పలువురు దళిత సంఘాల నాయకులు వారి అభిప్రాయాలు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఉన్న ఫలంగా ఒకేసారి జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్న సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో దళిత సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు శంకర్, జిల్లా అధ్యక్షుడు ఓబిలేసు తదితరులు ఆందోళనకు దిగారు. దళితులు అంటే అంత చులకనా? అంబేడ్కర్‌ను అవమాన పర్చేలా ప్రజాప్రతినిధులు వెళ్లిపోవడం ఏంటని ఇన్చార్జ్ కలెక్టర్ సయ్యద్ఖాజామొహిద్దీన్తో వాగ్వాదానికి దిగారు. ముందస్తు షెడ్యూల్ మేరకు వారు ఇందిరమ్మ గృహాల శంకుస్థాపన అనంతరం తిరిగి సమావేశంలో పాల్గొంటారని ఆయన వివరించారు. అప్పటికీ దళిత సంఘాల నాయకులు ఆందోళన విరమించకపోవడంతో పోలీసుల సహకారంతో సభనుంచి బయటకు పంపించారు. -
అంబేడ్కర్ విగ్రహాలకు అపచారం
కె.గంగవరం : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలకు అపచారం జరిగింది. జిల్లాలోని కె.గంగవరం, కొత్తపేటలోని కమ్మిరెడ్డిపాలెం సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలను సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. కె.గంగవరం సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు మంగళవారం ఉదయం ధర్నా, రాస్తారోకో చేశారు. కాకినాడ- కోటిపల్లి ప్రధాన రహదారిని దిగ్బంధం చేశారు. సుమారు రెండు గంటల సేపు జరిగిన రాస్తారోకో వల్ల రోడ్డుకిరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. రామచంద్రపురం సీఐ కాశీవిశ్వనాథ్, రామచంద్రపురం, ద్రాక్షరామ ఎస్సైలు ప్రసాద్, రెహ్మాన్‌లు దళిత నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మ చైర్మన్ అల్లూరి దొరబాబు, జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ తదితరులతో కొంతసేపు చర్చించారు. అయినా ఆందోళనకారులు వినలేదు. అనంరతం భారీ ర్యాలీగా స్థానిక పోలీస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. సీఐతో దళిత నాయకుల చర్చలు స్థానిక పోలీస్టేషన్‌కు చేరుకున్న సీఐ కాశీవిశ్వనాథ్‌తో వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్, ఎంపీపీ పెట్టా శ్రీనివాస్, దళిత ఐక్యవేదిక నాయకులు మద్దా కృష్ణమూర్తి తదితర దళిత నాయకులు చర్చలు జరిపారు. వెంటనే నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని సీఐ హామీ ఇచ్చారు. అనంతరం డాగ్ స్క్వాడ్‌ను రప్పించి నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించారు.మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బత్తుల అప్పారావు, సర్పంచ్‌లు జనిపెల్ల సాయి, గోవిందరాజు, ఎంపీటీసీ సుజాత, దళిత నాయకులు కూర్మారాజు, గనిరాజు, భీమశంకరం, తోకల శ్రీను, శ్రీహరి పాల్గొన్నారు. కమ్మిరెడ్డిపాలెం సెంటర్లో.. కొత్తపేట : స్థానిక కమ్మిరెడ్డిపాలెం సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహాన్ని సోమవారం రాత్రి కాగితాలతో కాల్చి దుండగులు ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం స్థానికులు విషయాన్ని గుర్తించి రాష్ట్ర వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజుకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై డివిజయకుమార్కు ఆయన విషయాన్ని చెప్పారు. తన కుమారుడు, మండల వైఎస్సార్సీపీ యువజన విభాగం కన్వీనర్ స్వరూప్‌రాజ్‌ను సంఘటనా స్థలానికి పంపించి ఆందోళన చేయకుండా విగ్రహాన్ని శుద్ధిచేయాలని డేవిడ్‌రాజు సూచించారు. దీంతో స్వరూప్, దళిత యూత్ నాయకుడు బీరా ఇస్సాక్ ఆధ్వర్యంలో విగ్రహాన్ని శుద్ది చేశారు. ఎస్సై విజయకుమార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఎస్సై తెలిపారు. అంబేడ్కర్ విగ్రహాన్ని దుండగులు అవమానించడంపై వైఎస్సార్సీపీ నేత డేవిడ్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. -
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం
శ్రీరంగాపూర్లో ఘటన పాక్షికంగా దెబ్బతిన్న వైనం నిందితులను కఠినంగా శిక్షించాలి దళిత సంఘాల నాయకుల ఆందోళన పదిమంది కేసులు నమోదు చేసిన పోలీసులు శ్రీరంగాపూర్ (పెబ్బేరు) : మండలంలోని శ్రీరంగాపూర్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు దుండగులు రాళ్లతో దాడిచేయడంతో విగ్రహం పాక్షికంగా దెబ్బతింది. విగ్రహం దెబ్బతిన్న విషయాన్ని బుధవారం ఉదయం గుర్తించిన దళితసంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో శ్రీరంగాపూర్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం, ఇతర దళిత సంఘాల నాయకులు విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారినిశిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వనపర్తి ఆర్డీఓ రాంచందర్, ఇన్చార్జి తహశీల్దార్ రాజేందర్‌గౌడ్, కొత్తకోట సీఐ కిషన్, పెబ్బేరు ఎస్ఐ ప్రకాష్‌యాదవ్ ఆందోళనకారులతో మాట్లాడారు. నిందితులను త్వరలోనే పట్టుకొని కేసులు నమోదు చేస్తామని హామీనిచ్చారు. పది మందిపై కేసులు నమోదు వనపర్తి డీఎస్పీ జోగుల చెన్నయ్య ఆదేశాలతో కొత్తకోట సీఐ కిషన్, పెబ్బేరు ఎస్ఐ ప్రకాష్ యాదవ్, ఇతర సిబ్బంది బుధవారం అంబేద్కర్ విగ్రహం ధ్వంసం సంఘటనపై విచారణ చేశారు. బోనాల పండుగ సందర్భంగా మంగళవారం అర్థరాత్రి మద్యం కోసం గ్రామానికి చెందిన కేశపాగ కుర్మన్నతో అదే గ్రామానికి చెందిన కొందరు దాడిచేసినట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు నిర్థారించారు. ఇదే గ్రామానికి చెందిన సంపత్‌కుమార్, రంగస్వామినాయుడు, క్రాంతికుమార్, వెంకటేష్, స్వామి, దేవదాసు, రవి, నరసింహ, రవి, పరమేష్‌లపై వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేశారు. వీరిలో ప్రస్తుతం ఐదు మంది పోలీసుల అదుపులో ఉన్నారు. హోటల్ నిర్వాహకుడు కేశపాగ కుర్మన్న ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేసినట్లు కొత్తకోట సీఐ కిషన్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటస్వామి, మాజీ ఉప సర్పంచ్ బీసన్న, నాయకులు బుచ్చన్న, ఎల్లస్వామి, చంద్రయ్య, కురుమన్న, బాలస్వామి, ఎల్లస్వామి, పర్వతాలు, చెన్నమ్మ, దేవమ్మ, మణ్యం, గంధం రాజశేఖర్, వివిధ గ్రామాల దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.