
సాక్షి, మేడ్చల్ : జిల్లాలోని కీసర మండలం రాంపల్లి గ్రామ ప్రధాన చౌరస్తాలో గుర్తుతెలియని దుండగులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహ తలను పూర్తిగా తొలగించి కిందపడేశారు. ఈ సమాచారం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు సంఘటనా స్ధలానికి చేరుకొని దుండగులను అరెస్ట్ చేయాలంటూ ఆందోళను దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కీసర సీఐ సంఘటన స్థలానికి అందోళకారులను శాంతింపజేశారు. దుండగులను అదుపులోకి తీసుకున్నామని సీఐ ప్రకాష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment