అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండించిన వైఎస్సార్‌సీపీ నేతలు
అంబేద్కర్ స్మృతి వనం వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన
సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండించిన వైఎస్సార్‌సీపీ నేతలు.. అంబేద్కర్ స్మృతివనం దగ్గర నిరసనకు దిగారు. భావితరాలకు దిక్సూచిగా ఉండాలని అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని.. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఉండకూడదనే టీడీపీ నేతలు దాడి చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘‘కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూలగొట్టే అవకాశముంది. వెంటనే దాడి ఘటనపై విచారణ చేయాలి. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’ అని మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం
గుంటూరు: గుంటూరు లాడ్జి సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నేతలు పాలాభిషేకం నిర్వహించారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం వద్ద శిలాఫలకాన్ని టీడీపీ నేతలు ధ్వంసం చేయటాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త నూరీ ఫాతిమా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది: అంబటి రాంబాబు
ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ‘‘అంబేద్కర్ స్మృతివనంపై దుండగులు దాడి చేశారు. చంద్రబాబు,లోకేష్ ప్రమేయంతోనే అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగింది. దాడి దురదృష్టకరం. అంబేద్కర్ విగ్రహంపై దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. దాడి ఘటనపై వెంటనే కేసు నమోదు చేయాలి’’ అని అంబటి డిమాండ్ చేశారు.
టీడీపీ నేతల హస్తం ఉంది: పోతిన మహేష్
అంబేద్కర్ విగ్రహంపై దాడి కాదు.. ప్రజాస్వామ్యంపై దాడి. దాడిలో టీడీపీ నేతల హస్తం ఉంది. అధికారుల అండదండలతో దాడి చేశారు వెంటనే ప్రజలకు చంద్రబాబు క్షమాప చెప్పాలి
Comments
Please login to add a commentAdd a comment