అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరగడాన్ని నిరసిస్తూ ఖానాపూర్‌లో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళితులు రాస్తారోకో చేశారు.
- దళితుల రాస్తారోకో
ఖానాపూర్(ఆదిలాబాద్ జిల్లా)
అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరగడాన్ని నిరసిస్తూ ఖానాపూర్‌లో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళితులు రాస్తారోకో చేశారు. ఖానాపూర్-నిర్మల్ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగడంతో ఆ మార్గంలో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. లోకేశ్వరం మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు చెప్పుల దండ వేసి అవమానపరిచారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని దళితులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.