ఎమ్మెల్యే బొండాకు చంద్రబాబు షాక్‌? | chandrababu naidu fires on bonda umamaheswara rao | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే బొండాకు చంద్రబాబు షాక్‌?

Published Sun, Apr 2 2017 5:53 PM | Last Updated on Sat, Jun 2 2018 7:14 PM

ఎమ్మెల్యే బొండాకు  చంద్రబాబు షాక్‌? - Sakshi

ఎమ్మెల్యే బొండాకు చంద్రబాబు షాక్‌?

విజయవాడ: తాజా కేబినెట్‌ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బొండా ఉమామాహేశ్వరరావుపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు కల్పించకుండా కాపుల గొంతు కొస్తున్నారన్న బొండా వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారని సమాచారం. మంత్రి పదవి ఇవ్వనందుకు అలిగిన బొండా ఆదివారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబును కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండాపై చంద్రబాబు మండిపడినట్టు సమాచారం. మంత్రి పదవి ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తారా? అంటూ బొండాను నిలదీసినట్టు తెలిసింది. ఈ సమయంలో బొండాకు చెందిన పలు కబ్జా వివాదాలను సైతం ప్రస్తావించి సీఎం షాక్‌ ఇచ్చినట్టు సమాచారం. ఆర్టీఏ కమిషనర్‌ గన్‌మెన్‌పై దాడి చేసినా.. కేసు పెట్టని విషయాన్ని సీఎం గుర్తుచేశారని, క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారని సమాచారం. మంత్రివర్గం విషయంలో కాపుల అంశాన్ని వివాదం చేస్తారా? అంటూ చంద్రబాబు బొండాపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement