విజయవాడ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పంతో బీసీ కమిషన్ వేయడం తప్పా అని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. కాపు సంక్షేమానికి సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ 20 రోజుల్లోపే మీరు దీక్షకు కూర్చుంటున్నామని ప్రకటించడం వెనుక ఆంతర్యమేటిటని కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఓ లేఖ రాశారు.ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో 30 మందికి పైగా కాపు నాయకులు మంత్రులుగా, శాసనసభ్యులుగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు.
పదేళ్లపాటు కాపుజాతి ప్రయోజనాలను పట్టించుకోని మీరు ఏ ప్రయోజననాలు ఆశించి ఇప్పుడు ఆందోళన చేస్తున్నారో అర్థం కావడం లేదని ఏపీ మంత్రి , కాపునేత ముద్రగడ పద్మనాభానికి బహిరంగలో పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ పై సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మీ సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా స్వాగతిస్తామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి బొండా ఉమా మహేశ్వరరావు తన లేఖలో వివరించారు.
ముద్రగడకు టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ లేఖ
Published Sat, Mar 5 2016 6:21 PM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM
Advertisement