
కిలారి రోశయ్య (ఫైల్ ఫోటో)
గుంటూరు : కాపు రిజర్వేషన్లను వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించట్లేదని, ఆ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని మాత్రమే జగన్ చెప్పారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి లాల్ పురం రాముతో కలిసి సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్ మాత్రమే కాపులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు.
కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంను టీడీపీ ప్రభుత్వం గృహ నిర్భదం చేసినప్పుడు, వారి కుటుంబ సభ్యులకు జగన్ అండగా నిలిచిన విషయం ముద్రగడ మర్చిపోవడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తేనే కాపులకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ముద్రగడ వెనుకున్న టీడీపీ నేతలు ఆయనతో అలా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment