
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టీడీపీ చూస్తోందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే చంద్రబాబు కుట్ర అని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ అలజడులు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 కార్లలో బోండా ఉమా, బుద్ధా వెంకన్న మాచర్లకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. టీడీపీ నేతల కార్లు ఓవర్ స్పీడ్‌తో దివ్యాంగుడిపైకి దూసుకెళ్లాయని, దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని చెప్పారు.
- ఈ ఎన్నికల్లో మద్యం, డబ్బు ఉండకూడదని, వ్యవస్థలో మార్పు రావాలని సీఎం చెప్పారు. దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. దీన్ని తట్టుకోలేక రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాక్షసానందం పొందాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారు.
- గత ఐదేళ్లలో ఏ విధంగా బాబు ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు. అయినప్పటికీ వాటిని సహించాం. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన మాకు లేదు. ప్రజల ఆలోచన మేరకు సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలతో ముందుకెళ్తున్నాం.
- పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి సతీష్‌రెడ్డి, విశాఖలో పంచకర్ల రమేష్ చంద్రబాబు చేసిన మోసాన్ని, అన్యాయాన్ని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment