'బోండా' చర్యలపై బ్రాహ్మణుల ఆందోళన
Published Sat, Oct 1 2016 11:26 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
విజయవాడ: విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీరును నిరసిస్తూ బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేపట్టాయి. స్థానిక మాచవరం పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన సంఘాలు జగన్మోహనరాజును బోండా ఉమ అరెస్టు చేయించారని ఈ సందర్భంగా ఆందోళన కారులు ఆరోపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి రుణాలు మంజూరు చేయాలని నిలదీసినందుకే తమ నేతను అరెస్టు చేయించారని తెలిపారు.
బోండా ఉమ ప్రోద్బలంతోనే కార్పొరేషన్ సీఈవో అభిజిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారని వారన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలను జగన్మోహన రాజు జరిపిస్తున్నాడనే అక్కసుతోనే ఎమ్మెల్యే ఇదంతా చేయిస్తున్నారన్నారు. జగన్మోహన రాజును వెంటనే విడుదల చేయకుంటే ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కృష్ఱారావు ఈ విషయంలో వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement