సాక్షి, అమరావతి : టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు రోజున ఈవీఎంలను సరిగా లెక్కించలేదంటూ ఉమ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ గత మంగళవారం తన వాదనలు వినిపించింది. టీడీపీ అభ్యర్థి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌కు విచారణార్హత లేదని వాదించింది. కాగా, పదిహేను రోజులక్రితం దాఖలైన బొండా ఉమ రిట్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్న ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment