
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీకి చుక్కెదురైంది. వీవీప్యాట్ల ముందస్తు లెక్కింపుపై దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున మొదట ఐదు వీవీ ప్యాట్లను లెక్కించాలని, ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించాలని న్యాయవాది బాలాజీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై మూడు గంటలపాటు విచారించిన అనంతరం జస్టిస్ శ్యాంప్రసాద్ దీనిని తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment