VVPAT
-
ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ, సాక్షి: ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ఇస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈవీఎం, వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును పెండింగ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం ఉదయం ఆ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలున్నాయని, వీపీప్యాట్ స్లిప్‌లను ఓటర్లకు అందించాలని, ఆ తరవాత వాటిని 100శాతం లెక్కించాలంటూ పలువురు పిటిషన్లు వేశారు. అయితే ఈ విజ్ఞప్తితో పాటుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్(ADR) పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లను అన్నింటిని కలిపి మూడు రోజులపాటు విచారణ జరిపింది జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్. చివరకు.. పిటిషన్లు కొట్టేస్తూ ఏకాభిప్రాయంతో కూడిన తీర్పు ఇచ్చింది. ‘‘వీవీప్యాట్లు వందశాతం సరిపోల్చాలని వచ్చిన పిటిషన్లు సరికాదు.వ్యవస్థలో సమతుల్య దృక్పథం ముఖ్యమే. కానీ, ఆ వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం సంశయవాదాన్ని పెంపొందిస్తుంది. అందుకే.. అర్థవంతమైన విమర్శలు అవసరం. అది న్యాయవ్యవస్థ అయినాసరే చట్ట సభలు అయినాసరే. ప్రజాస్వామ్యం అంటేనే అన్నింటా సామరస్యం పాటిస్తూ నమ్మకాన్ని కొనసాగించడం. విశ్వాసం, పరస్సర సహకారం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయొచ్చు. అనుమానాలతో ఈవిఎంలను గుడ్డిగా వ్యతిరేకించొద్దు’’ అని జస్టిస్ దత్తా తీర్పు ద్వారా వెల్లడించారు.ఈ సందర్భంగా ఈసీకి రెండు కీలక సూచనలు చేసింది సుప్రీంకోర్టు 1. సింబల్ లోడింగ్ యూనిట్ ను సీల్ చేయాలి . అభ్యర్థులు వారి ప్రతినిధులు సంతకాలు దానిపై చేయాలి . ఈ యూనిట్ ను ఫలితాలు వెలువడిన 45 రోజుల వరకు భద్రంగా ఉంచాలి2. ఫలితాలు వెలువడిన ఏడు రోజుల్లో రెండు మూడో స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తే ఈవీఎంల వెరిఫికేషన్‌కు అవకాశం ఇవ్వాలి. ఇంజనీర్ల ద్వారా ఐదు శాతం ఈవీఎంలను తనిఖీ చేయాలి. దీనికోసం అయ్యే ఖర్చును అభ్యర్థి భరించాలి. ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని తేలితే ఖర్చు వెనక్కి ఇవ్వాలి. వెరిఫికేషన్ సమయంలో పోటీ చేసిన అభ్యర్థులందరూ చూసే అవకాశం ఇవ్వాలి.వీవీప్యాట్ మెషిన్లపై ఓటరుకు స్లిప్ సులువుగా కనిపించే అద్దం స్థానంలో ఏడు సెకన్ల పాటు లైట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపించేలా మరో రకమైన గ్లాస్‌ను ఏర్పాటుచేస్తూ 2017లో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని చెబుతోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది. రెండ్రోజుల వాదనలు ఇలా.. ఏడీఆర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్ బ్యాలెట్ల వద్దకే వచ్చాయి. ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని మేం చెప్పడం లేదు. ఈవీఎం, వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెబుతున్నాం. అందుకే మళ్లీ మనం కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతిని వినియోగించాలి. లేదంటే వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్ల చేతికి ఇవ్వాలి. అదీ కుదరకుంటే ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్లే బ్యాలెట్ బ్యాక్సుల్లో వేసేలా రూపొందించాలి అని వాదించారాయన.అయితే.. రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటిషనర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని పిటిషనర్‌కు సూచించింది. జర్మనీలాంటి దేశాల్లో పశ్చిమ బెంగాల్ కన్నా తక్కువ జనాభా ఉందని, మన దేశంలో వంద కోట్ల మంది ఓటర్లున్నారని, అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని మీరు(పిటిషనర్) కోరుతున్నారని, బ్యాలెట్ పేపర్లు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో మాకు తెలుసునని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇక ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్‌సింగ్ తన వాదనలు వినిపిస్తూ.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని, అయితే మానవతప్పిదాలను మాత్రం తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పును ఏప్రిల్ 24వ తేదీ నాటికి సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. అయితే..తీర్పు ఇవ్వకుండా ట్విస్ట్అయితే ఏప్రిల్ 24వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించలేదు. ఈ అంశంలో ఇంకా తమకు సందేహాలు ఉండటంతో ధర్మాసనం స్పష్టత కోరింది. ఈక్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది. కంట్రోలింగ్ యూనిట్‌లోనా లేదా వీవీప్యాట్‌లోనా? అని ప్రశ్నించింది. మైక్రో కంట్రోలర్ అనేది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా, కాదా? అన్నది నిర్ధారించాలని సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నం ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.ఎన్నికల సంఘం వివరణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మా సందేహాలను ఈసీ నివృత్తి చేసింది. మీ (పిటిషనర్ల) ఆలోచనా ధోరణిని మేం మార్చలేం. కేవలం అనుమానాలను ఆధారం చేసుకుని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేం. ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగ సంస్థ. దాని పనితీరును మేం నిర్దేశించలేం. ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేం’’ అని స్పష్టం చేసింది.ఈ విచారణ సందర్భంగా ఈవీఎమ్ సోర్స్ కోడ్‌కు సంబంధించిన అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు. పారదర్శకత కోసం దాన్ని బయటపెట్టాలని కోరారు. దీన్ని ధర్మాసనం వ్యతిరేకించింది. ‘‘సోర్స్ కోడ్‌ను ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది’’ అని వ్యాఖ్యానించింది. ఇక ఈ ఉదయం(ఏప్రిల్ 26) అన్ని పిటిషన్లను తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించింది.వీవీప్యాట్ ఎందుకు?ఓటర్ తాను వేసిన ఓటు పడిందా? లేదా?.. పడితే తాను అనుకున్న అభ్యర్థికే పడిందా? ఇదంతా తెలసుకోవడం కోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) తీసుకొచ్చింది. ఓటర్ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేసింది. ఆ తర్వాత దఫ దఫాలుగా పలు రాష్ట్రాల్లో అమలు చేస్తూ వచ్చింది. -
అనుమానం ఉందని ఎన్నికలపై ఆదేశాలివ్వలేం
న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందనో, వాటిని నియంత్రణలోకి తీసుకుని ఫలితాలను తలకిందులు చేయొచ్చనే ఆరోపణలతోనో ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈవీఎంలో ‘మార్పులు’ చేసే ఆస్కారం ఉందని, అందుకే బ్యాలెట్ పేపర్ విధానమే ఉత్తమం అని వాదించే వారి ఆలోచనను మార్చలేమని కోర్టు వ్యాఖ్యానించింది.ఈవీఎంలో నమోదయ్యే ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలంటూ దాఖలైన పలు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషన్‌దారులు లేవనెత్తిన ప్రశ్నలపై తమ అనుమానాలను నివృత్తిచేసుకునేందుకు జడ్జీలు మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నితేశ్ వ్యాస్‌ను కోర్టుకు రప్పించి ఐదు ప్రశ్నలు సంధించారు. మైక్రోకంట్రోలర్లను ఎక్కడ బిగిస్తారు? వాటి ప్రోగ్రామ్‌ను మళ్లీ మార్చొచ్చా? అంటూ ప్రశ్నలు అడిగారు.బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్లలో మైక్రోకంట్రోలర్లను బిగిస్తామని, వాటి పోగ్రామ్‌ను సరిచేసేందుకు ఎవరైనా ఓపెన్ చేస్తే పనిచేయకుండాపోతాయని వ్యాస్ వివరణఇచ్చారు. ఈ వివరణతో అసిసోయేషన్ ఫర్ డెమొక్రట్రిక్ రిఫారŠమ్స్ తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విభేదించారు. ఎన్నికల గుర్తులను అప్లోడ్ చేసేటపుడు తప్పుడు ప్రోగామ్‌ను అప్లోడ్ చేసే ఆస్కారముందని వాదించారు. దీనిపై జడ్జీ దత్తా కలి్పంచుకుని.. ‘ మీ ఆలోచనలను మేం మార్చలేం. ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థను నియంత్రించలేం’’ అని వ్యాఖ్యానించారు. ఈవీఎంల సోర్స్ కోడ్‌ను బహిర్గతంచేయాలని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది సంతోశ్ వాదించగా కుదరదని జడ్జీ తిరస్కరించారు. -
వీవీప్యాట్ స్లిప్పుల క్రాస్‌చెక్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లలో వేసిన మొత్తం ఓట్ల వీవీప్యాట్ స్పిప్పులు వెరిఫై చేయాలని వేసిన పిటిషన్లపై బుధవారం(ఏప్రిల్24) మరోసారి విచారణ జరిపిన అత్యున్నత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగసంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఏ పనిచేయాలన్నది తాము సూచించలేమంది. ఎన్నికల్లో మొత్తం వీవీప్యాట్ స్లిప్పుల వెరిఫికేషన్‌పై సుప్రీంకోర్టు బుధవారమే తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే ఈ విషయంలో తమకు ఉన్న పలు సందేహాలపై న్యాయమూర్తులు ఈసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తీర్పు రిజర్వు చేశారు. -
వీవీప్యాట్ల తీర్పు ముందర ట్విస్ట్
న్యూఢిల్లీ, సాక్షి: ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్(Voter-Verifiable Paper Audit Trail) స్లిప్‌లతో సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే తీర్పు ముందర ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి నాలుగు ప్రశ్నలు సంధించిన ద్విసభ్య ధర్మాసనం.. వాటికి సమాధానాలతో రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లపై రెండ్రోజులపాటు విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో ఎక్కువ భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం వాదనల వైపే బెంచ్ తన అభిప్రాయాల ద్వారా మొగ్గుచూపించినట్లు అనిపించింది. అయితే ఇవాళ తీర్పు వెల్లడించడానికి కొన్ని గంటల ముందు ఈసీకి ప్రశ్నలు సంధించింది.మైక్రోకంట్రోలర్‌ను వీవీప్యాట్‌లో లేదంటే కంట్రోలింగ్ యూనిట్లో ఇన్స్టాల్ చేశారా?మైక్రోకంట్రోలర్ ఒక్కసారి మాత్రమే పని చేస్తుందా?సింబల్ లోడింగ్ యూనిట్లు.. ఎన్నికల సంఘం వద్ద ఎన్ని అందుబాటులో ఉన్నాయి?మీరు(ఈసీ) చెప్పిందాన్ని బట్టి ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడానికి పరిమితి 30 రోజులు. నిల్వ, రికార్డులు మాత్రం 45 రోజులు నిర్వహించబడతాయి. కానీ పరిమితి రోజు 45 రోజులా? మీరు దాన్ని సరిచేయాల్సి ఉంది.వీటికి మేం క్లారిటీ కావాలని కోరుతున్నాం. వీటికి సమాధానాలతో ఈసీ ఆఫీసర్ మధ్యాహ్నాం మా ముందుకు రావాలి అని కోర్టు బుధవారం ఉదయం ఆదేశాలు జారీ చేసింది. వీవీప్యాట్ మెషిన్లపై ఓటరుకు స్లిప్ సులువుగా కనిపించే అద్దం స్థానంలో ఏడు సెకన్ల పాటు లైట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపించేలా మరో రకమైన గ్లాస్‌ను ఏర్పాటుచేస్తూ 2017లో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఆదేశించాలని ADR(అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్) దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.విచారణ సందర్భంగా.. ఏడీఆర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ ఐరోపా దేశాల్లోని ఎన్నికల ప్రక్రియను ప్రస్తావించారు. జర్మనీ లాంటి దేశాలు ఈవీఎంల నుంచి తిరిగి పేపర్ బ్యాలెట్ల వద్దకే వచ్చాయి. ఈవీఎంల వల్ల అవకతవకలు జరుగుతాయని మేం చెప్పడం లేదు. ఈవీఎం, వీవీప్యాట్లను మార్చే అవకాశం ఉందని చెబుతున్నాం. అందుకే మళ్లీ మనం కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతిని వినియోగించాలి. లేదంటే వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్ల చేతికి ఇవ్వాలి. అదీ కుదరకుంటే ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్‌లను ఓటర్లే బ్యాలెట్ బ్యాక్సుల్లో వేసేలా రూపొందించాలి అని వాదించారాయన.అయితే.. రహస్య బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటిషనర్లపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చి వ్యవస్థను తక్కువ చేయొద్దని పిటిషనర్‌కు సూచించింది. జర్మనీలాంటి దేశాల్లో పశ్చిమ బెంగాల్ కన్నా తక్కువ జనాభా ఉందని, మన దేశంలో వంద కోట్ల మంది ఓటర్లున్నారని, అన్ని వీవీప్యాట్లను లెక్కించాలని మీరు(పిటిషనర్) కోరుతున్నారని, బ్యాలెట్ పేపర్లు వినియోగించినప్పుడు గతంలో ఏం జరిగిందో మాకు తెలుసునని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇదీ చదవండి: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్‌సింగ్ తన వాదనలు వినిపిస్తూ.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని, అయితే మానవతప్పిదాలను మాత్రం తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. ఇక విచారణ సందర్భంగా ఓటింగ్, ఈవీఎంలను భద్రపర్చడం, కౌటింగ్ ప్రక్రియ గురించి ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆరా తీసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినవారికి కఠిన శిక్ష లేకపోవడంపై ధర్మాసనం పెదవి విరిచింది. మరోవైపు.. రెండ్రోజుల విచారణ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ఓ అధికారి ద్వారా ఈవీఎంల పని తీరును ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించడం గమనార్హం.వీవీప్యాట్ ఎందుకు?ఓటర్ తాను వేసిన ఓటు పడిందా? లేదా?.. పడితే తాను అనుకున్న అభ్యర్థికే పడిందా? ఇదంతా తెలసుకోవడం కోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) తీసుకొచ్చింది. ఓటర్ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేసింది. -
ఓటర్లు వీవీప్యాట్ స్లిప్‌లు పొందవచ్చా?: ఈసీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తన్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో పవిత్రత ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. దేశంలో ఎన్నికలు సజావుగా, నిస్పక్షపాతంగా జరిగేలా అనుసరించే చర్యలను వివరించాలని ఈసీ కోరింది. ‘ఇది ఎన్నికల ప్రక్రియ. పవిత్రంగా ఉండాలి. ఓటర్లు ఆశించినది జరగడం లేదని ఎవరూ భయాందోళన చెందకుండా చూసుకోవాలి’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) ఓట్లతో వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా రూపొందించిన పేపర్ స్లిప్‌లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారణ జరిపింది. ఈసీ తరపున సీనియర్ న్యాయవాది మణిందర్‌సింగ్, పిటిషనర్లలో ఒకరి తరపున అడ్వకేట్ నిజాంపాషా మాట్లాడుతూ.. ఓటరు ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్ తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. అయితే అలాంటి ప్రక్రియ ఓటరు గోప్యతను ప్రభావితం చేయదా అని జస్టిస్ ఖన్నా ప్రశ్నించారు. ఇది ఓటర్ గోప్యతను, ఓటరు హక్కులను భంగం కలిగించదని పాషా బదులిచ్చారు. అనంతరం మరో పిటిషనర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. VVPAT మెషీన్‌లోని లైట్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండాలని కోరారు. ప్రస్తుతం ఈ లైట్ అది ఏడు సెకన్ల పాటు ఆన్‌లో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ఒకవేళ పేపర్ స్లిప్ అందించడం వీలు కాకపోతే కనీసం ఎల్లవేళలా లైట్ వెలుగుతూనే ఉండేలా చూడాలని కోరారు. దీనివల్ల ఓటర్ స్లిప్ కటింగ్, బాక్స్‌లో పడిపోవడం చూడగలుగుతాడని చెప్పారు. ఇది వారి గోప్యతకు అడ్డు రాదని చెప్పారు. ఈ సందర్భంగా ఇటీవల కేరళలో జరిగిన మాక్ పోల్ గురించి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాసర్గోడ్లో జరిగిన మాక్ ఓటింగ్‌లో బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయని కోర్టుకు తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అనంతరం ఆ నివేదిక పూర్తి అవాస్తవమని ఈసీ వెల్లడించింది. పారదర్శక ఓటింగ్ నిర్వహణ కోసం ఎలాంటి విధానాలను పాటిస్తున్నారని ఈసీని ప్రశ్నించింది. దీంతో ఎన్నికల సంఘం తమ ప్రక్రియను న్యాయస్థానానికి వివరించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. చదవండి: రాహుల్ గాంధీకి ధైర్యం లేదు: రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు -
ఈసీ తీరుపై సీఐసీ విస్మయం
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరు, విశ్వసనీయతను ప్రశ్నిస్తూ అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) తీవ్రంగా తప్పుబట్టింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఈసీని సీఐసీ ఆదేశించింది. ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తాము లేవనెత్తిన అనుమానాలను నివృత్తిచేసేలా సమాచారం ఇవ్వాలని మాజీ ఐఏఎస్ అధికారి ఎంజీ దేవసహాయం సహా ప్రముఖ సాంకేతికవిద్యా నిపుణులు, ఐఐటీ, ఐఐఎంలలోని విద్యావేత్తలు, మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు 2022 మే రెండో తేదీన ఈసీకి ఆర్టీఐ చట్టంకింద దరఖాస్తు పెట్టుకోవడం తెల్సిందే. తమ ఆర్టీఐ దరఖాస్తుపై ఈసీ ఏ మేరకు చర్యలు తీసుకుందని 2022 నవంబర్ 22న దేవసహాయం మరోసారి ఆర్టీఐ కింద సమాచారం అడిగారు. 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాల్సి ఉన్నా ఈసీ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆయన సీఐసీను ఆశ్రయించారు. దేవసహాయానికి ఎందుకు మీ స్పందన తెలపలేదు? అని ఈసీలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హీరాలాల్ సమరియా అడగ్గా ఆయన సమాధానం ఇవ్వలేదు. ‘‘ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇవ్వకుండా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ) వ్యవహరించిన తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. దీనిపై 30 రోజుల్లోగా పాయింట్లవారీగా వివరణ ఇవ్వండి’ అని ఈసీని సీఐసీ ఆదేశించింది. -
ఆగం కావొద్దు.. జాగ్రత్తగా ఓటెయ్యాలె!
ఎన్నికలు.. ఓటు అనే వజ్రాయుధంతో సామాన్యుడు మాత్రమే పాల్గొనే నిశబ్ధ యుద్ధం. ప్రజాస్వామ్య పరిరక్షణలో అర్హత లేని నేతల్ని ఓడించేందుకు.. అర్హత ఉంటే మళ్లీ ఎన్నుకునేందుకు అదికూడా ఐదేళ్లకొకసారి దొరికే అవకాశం ఎలక్షన్స్. అందుకే ఆ అవకాశం వదులుకోకుండా ఓటేసి బాధ్యత నెరవేర్చుకోవాల్సిన అవసరం ప్రతీ పౌరుడికీ ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసారి భారీగా కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. అందులో 18 ఏళ్లు నిండి తొలిసారి ఓటేసేందుకు సిద్ధమైన వాళ్లు దాదాపు 10 లక్షలుకాగా.. మిగతా వాళ్లు మరో ఏడు లక్షలు ఉన్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ కోసం సర్వం సిద్ధమైన వేళ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఈవీఎంలపై ఓటు ఎలా వేయాలి? సరైన ఓటు వేశామా? లేదా? అనేది ఎలా నిర్ధారించుకోవాలి.. ఒకవేళ పొరపాటు జరిగితే ఏం చేయాలి.. ఆ విషయాలన్నీ ఈ కథనంలో.. ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు.. పోలింగ్ కేంద్రాల వద్ద తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాలి. పార్టీల గుర్తులు, పార్టీలను ప్రతిబింబించే రంగుల దుస్తులు.. కండువాలు.. టోపీలు ధరించొద్దు. అలాగే పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఓటేసేందుకు లోనికి వెళ్లాక.. బూత్ లోపలికి సెల్ఫోన్లు, ఇతర డివైజ్‌లు(పరికరాలు) తీసుకెళ్లకూడదు. అలాగే.. అక్కడుండే భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించాలి. ఓటు హక్కు ఉండి ఓటర్ కార్డు లేకున్నా.. కింద ఉన్నవాటిల్లో ఏదో ఒక కార్డుతో వెళ్లి ఓటేయొచ్చు ఆధార్‌కార్డు బ్యాంక్ పాస్‌బుక్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పాస్‌పోర్ట్ పెన్షన్ కార్డు(ఫొటో తప్పనిసరి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే సర్వీస్ ఐడీ కార్డులు ఓటు వేసేందుకు లోపలికి వెళ్లినప్పుడు ముగ్గురు అధికారులు ఉంటారు. ఓటర్ లిస్ట్‌లో ఉన్న పేరు, గుర్తింపు కార్డు చూసి అధికారులు పోలింగ్ బూత్‌లోకి పంపుతారు. అక్కడ ఎడమచేతి చూపుడు వేలు చెక్ చేసి దానికి సిరా వేస్తారు. ఆ తర్వాత రిజిస్టర్లో ఓటరు వివరాలు నమోదు చేసి స్లిప్ రాసి ఓటు వేసేందుకు లోపలికి పంపిస్తారు. ఆ తర్వాతే ఓటరు.. పోల్ చీటీ తీసుకుని కంట్రోల్ యూనిట్ (సీయూ)లోపలికి వెళ్లి ఓటు వేయాలి. అక్కడ ఈవీఎంలపై ఉన్న పార్టీ గుర్తును ప్రెస్ చేస్తే ఓటేసినట్లు లెక్క. ఇంతకీ మనం వేసిన ఓటు పడిందా? లేదా? పడితే మనం వేయాలనుకున్న అభ్యర్థికే పడిందా? ఎలా తెలుసుకోవడం.. ఇందుకోసమే ఈవీఎంకు అనుసంధానంగా వీవీ ప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) ఉంటుంది. ఓటర్ ఈవీఎం బటన్ నొక్కిన తర్వాత.. ఓటేసిన గుర్తు అక్కడి తెరపై ఏడు సెకన్ల పాటు కనిపిస్తుంది. అలా ఓటుని నిర్ధారించుకోవచ్చు. ఆ తర్వాత బయటకు వచ్చేయడంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఒకవేళ ఓటేసే టైంలో.. సెల్ ఫోన్ లో చిత్రీకరించడం, దానిని బహిర్గతం చేయడం నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే ఓటు రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవు. తొలిసారిగా 2013లో జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజక వర్గాల్లో వీవీ ప్యాట్ విధానాన్ని ఎన్నికల కమిషన్ అమలు చేసింది. ఆ తర్వాత దశలవారీగా వీవీ ప్యాట్ విధానాన్ని అమలు చేస్తూ వస్తోంది. తెలంగాణలో వీవీ ప్యాట్ విధానం అమలు చేయడంతో ఇది రెండోసారి. ఫిర్యాదులు కూడా.. ఓటు వేయడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా.. ఓటరు ఒకరికి ఓటు వేస్తే మరొక అభ్యర్ధికి ఓటేసినట్టుగా రికార్డు అయినా.. బ్యాలెట్ పత్రంపై ఉన్న అభ్యర్థి/ పార్టీ గుర్తును తప్పుగా చూపితే.. లేదంటే ఓటు ఒకరికి బదులు మరొకరు వేసినా.. వెంటనే పోలింగ్ కేంద్రంలో ఉండే ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఎన్నికల కమిషన్ రూల్స్ 1961.. 49 ఎంఏ ప్రకారం ప్రిసైడింగ్ అధికారికి ఓటరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. లేదంటే టోల్‌ఫ్రీ నెంబర్లు 1950, సీ-విజిల్ యాప్ లేదంటే ఎన్నికల సంఘానికి సంబంధించిన ఫిర్యాదుల విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు. ఓటు విషయంలో నష్టం జరిగిందని భావిస్తే.. న్యాయస్థానాల్ని కూడా ఆశ్రయించొచ్చు. ఇలా జరుగుతుంది.. ఈ విషయమై టెస్ట్ ఓటు వేసేందుకు ఓటరును అనుమతిస్తారు. ఒకవేళ ఓటరు చెప్పేది తప్పుడు సమాచారమని తేలితే దాని పరిణామాల గురించి కూడా వివరిస్తారు. ఓటరు చెప్పిన సమాచారం వాస్తవమని నిరూపించేందుకు టెస్ట్ ఓటు నిర్వహిస్తారు. ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ ఏజంట్ల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఓటరు చెప్పినట్టుగా ఒక సింబల్ బటన్ నొక్కితే మరో సింబల్ గా రికార్డైతే వెంటనే రిటర్నింగ్ అధికారికి ఈ సమాచారాన్ని సంబంధిత పోలింగ్ స్టేషన్ అధికారి నివేదిస్తారు. ఈ సమయంలో పోలింగ్ ను నిలిపివేస్తారు. ఆపై రిటర్నింగ్ అధికారి నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఈ ఆరోపణ తప్పని తేలితే ప్రిసైడింగ్ అధికారి ఫారం 17 ఏలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారు. -
కర్ణాటక: ఈవీఎంలను పగలకొట్టి.. కారును పల్టీకొట్టించి..
బెంగళూరు: కర్ణాటకలో పోలింగ్ వేళ.. ఉద్రిక్తకరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. బుధవారం పోలింగ్ కేంద్రం నుంచి తీసుకెళ్తున్న ఈవీఎంలను పగలగొట్టారు గ్రామస్థులు. విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో ఇది చోటుచేసుకోగా.. పోలీసు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అడ్డొచ్చిన పోలీసులను చితకబాది ఈవీఎంలను లాక్కుని ధ్వంసం చేశారు గ్రామస్తులు. అంతటితో ఆగకుండా ఎన్నికల సిబ్బందిపైనా గ్రామస్తుల్లో కొందరు దాడికి తెగబడ్డారు. ఎన్నికల సిబ్బంది కారును పల్టీకొట్టించి మరీ ధ్వంసం చేశారు. వీవీఎం ప్యాట్ మిషన్లను నుజ్జు నుజ్జు చేసిన గ్రామస్తుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. బాలెట్ యూనిట్లను డ్యామేజ్ చేసిన వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఈవీఎంలను పగలకొట్టడంతో పాటు ఓ అధికారిపైనా దాడి చేసినందుకుగానూ.. 23 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కంట్రోల్, బాలెట్ యూనిట్‌తో పాటు మూడు వీవీప్యాట్లు ధ్వంసం చేశారని తెలిపింది. -
హుజురాబాద్ ఫలితాలు: ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాటే కీలకం
సాక్షి, కరీంనగర్: ఓట్లు లెక్కించే సమయంలో ఈవీఎంల సమస్య ఉంటే వీవీప్యాట్లే కీలకం కానున్నాయి. ఎన్నికల సంఘం 2014 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో వీవీప్యాట్లను అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ అభ్యర్థుల ఫొటో, గుర్తులు ఉన్న ఈవీఎంను ఉపయోగించి ఓటు హక్కు వినియోగించుకుంటారు. గతంలో ఒకరికి ఓటు వేస్తే మరొకరికి నమోదవుతుందన్న అపోహ ఓటర్లతో పాటు నేతల్లో ఉండేది. ఓటర్ల సందేహాలకు తెరదించేందుకు ఎన్నికల సంఘం ఈవీఎంలతో వీవీప్యాట్లను అనుసంధానం చేసింది. వీవీప్యాట్లకు అమర్చి ఉన్న పెట్టెల్లో ఓటరు వేసిన ఓట్లకు సంబంధించిన చీటీలు పడే ఏర్పాటు చేశారు. ఏ గుర్తుకు ఓటు వేశారో వీవీప్యాట్ అద్దంపై 7 సెకన్ల పాటు కనిపించడంతో ఓటరు సంతృప్తి చెందుతాడు.ఈవీఎంల నుంచి ఫలితాన్ని రాబట్టలేకపోవడంతో పాటు ఇతర సమస్యలు ఎదురైతే ఈ చీటీలను లెక్కించి ఫలితాన్ని ప్రకటించే వెసులుబాటు ఉంది. నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేసుకొని ఈవీఎం ద్వారా లెక్కించిన తరువాత వీవీప్యాట్‌లోని చీటీలను కూడా లెక్కించి ఫలితాన్ని సరిచూసుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: అవును.. ఆ ఊళ్లో 95.11 శాతం పోలింగ్ ఈవీఎంలు మొరాయించినా.. ఒక్కో ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల వివరాలు సాధారణంగా లెక్కించేందుకు గరిష్టంగా రెండు నిమిషాల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈవీఎంలు మొరాయిస్తే ఆగ్జిలరీ యూనిట్ ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుసుకునే అవకాశం ఉంది. ఈ విధానం కూడా సాధ్యం కాకపోతే వీవీప్యాట్ చీటీలను లెక్కించేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఎక్కడైనా మెజార్జీ స్వల్పంగా ఉన్నప్పుడు వీవీప్యాట్ చీటీలను లెక్కించాలని అభ్యర్థులు పట్టుపడితే ఈ విషయాన్ని స్థానిక అధికారులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటారు. వీవీప్యాట్ల్లను అమర్చడం వల్ల పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపులో కూడా ఎలాంటి అనుమానాలకు తావుండదు. చదవండి: Huzurabad By Election Results 2021: హుజూరాబాద్ తీర్పు నేడే ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లు తలెత్తకూడదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ సూచించారు. కౌంటింగ్ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను భద్రంగా కౌంటింగ్ టేబుల్స్ వద్దకు తీసుకురావాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిశాక రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేయాలని తెలిపారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ.. కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. -
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు: రవీందర్ రెడ్డి
-
వీవీ ప్యాట్ల అంశంపై సమగ్ర వివరణకు సీఈవో ఆదేశం
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వీవీ ప్యాట్లు తారుమారయ్యాయని బీజేపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సీఈవో శశాంక్ గోయల్ ఎన్నికల అధికారులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. వీవీ ప్యాట్ల అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలని కలెక్టర్, వీఆర్వోలకు ఆదేశాలు జారీచేశారు. రేపు (సోమవారం) అన్ని పార్టీల నేతలతో సీఈవో శశాంక్ గోయల్ భేటీకానున్నారు. చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బు పంచారు: ఈటల -
‘ఎన్నికల’ పిటిషన్ల దాఖలుకు టైమ్‌లైన్ విధించండి
న్యూఢిల్లీ: అస్సాం, కేరళ, ఢిల్లీ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేయడానికి నిర్ధిష్టమైన గడువు(టైమ్‌లైన్) విధించాలని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పిటిషన్లు దాఖలు చేయడానికి కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా గడువును పెంచుతూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిందని, ఫలితంగా 6 రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను తాము ఇంకా భద్రపర్చాల్చి వస్తోందని పేర్కొంది. త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పెద్దసంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరమని తెలియజేసింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరింది. ఎన్నికల సంఘం వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. దీనిపై వచ్చేవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 కింద పిటిషన్లు దాఖలు చేయడానికి గడువును పెంచుతూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ గడువును పెంచుతున్నట్లు కోర్టు ప్రకటించింది. ఎన్నికైన అభ్యర్థులపై, ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలుంటే ఎవరైనా సరే కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టులో విచారణ ముగిసి, తీర్పు వచ్చేదాకా సదరు ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపర్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. కోర్టులు వాటిని సాక్ష్యంగా పరిగణిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 27న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు వల్ల భారీ సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం వాటిని విడుదల చేయాలని ఎన్నికల సంఘం కోరుతోంది. -
వీవీప్యాట్ లెక్కింపు చివర్లోనే
న్యూఢిల్లీ: ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎం ఓట్ల లెక్కింపునకు ముందే వీవీప్యాట్ చీటీల లెక్కింపు జరపాలన్న 22 విపక్ష పార్టీల డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఇది ఆచరణ సాధ్యం కాదని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. విపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం ఈసీని కలసి ఈ మేరకు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంగళ, బుధవారాల్లో రెండు దఫాలుగా లోతుగా చర్చించామని, మొత్తం మీద, ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇది ఆచరణ సాధ్యం కాదని, విపక్షాల డిమాండ్‌కు అంగీకరించే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. కాగా రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పాటే అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లను కూడా అనుమతించే అంశంపై ఇప్పటికే తగిన ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈవీఎంలకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలను అనుసరించి నడుచుకోవాల్సిందిగా ఏప్రిల్ 8 నాటి తీర్పులో ఈసీని సుప్రీం ఆదేశించింది. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత చివర్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ఆ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిగా బలహీన కమిషన్ : కాంగ్రెస్ ఈసీ నిర్ణయంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పూర్తి బలహీన కమిషన్‌గా ఈసీని కాంగ్రెస్ అభివర్ణించింది. ఈసీ ఈవీఎంలను బీజేపీకి విజయాన్ని చేకూర్చే ‘ఎలక్ట్రానిక్ విక్టరీ మిషన్లు’గా ఏమన్నా మార్చిందా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ ప్రశ్నించారు. అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి)ను ‘మోదీస్ క్యాంపెయిన్ కోడ్’గా (మోదీ ప్రచార నియమావళి) మార్చారా? అంటూ నిలదీశారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల ఒత్తిళ్లకు ఈసీ లొంగిపోయిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి దినమని అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ విధంగా వ్యవహరించడం విచారకరం, దురదృష్టమని పేర్కొన్నారు. ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి విమర్శించారు. శాంపిల్‌ను తొలుత పరీక్షించాలన్న ప్రాథమిక సూత్రానికి ఈసీ ఎందుకు కట్టుబడటం లేదో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. డీఎంకే సైతం ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఎన్నికల కమిషన్ కేవలం ప్రదాని మోదీ మాటే వింటుందా? అని ఆ పార్టీ సీనియర్ నేత దొరైమురుగన్ ప్రశ్నించారు. విపక్షాల వినతి రాజ్యాంగ విరుద్ధం: అమిత్ వీవీ ప్యాట్లను తొలుత లెక్కించాలన్న విపక్షాల వినతి రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా అన్నారు. ఆరో విడత ఎన్నికల తర్వాతే విపక్షాలు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టాయని, ఎగ్జిట్ పోల్స్ తర్వాత దాన్ని మరింత తీవ్రం చేశాయని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఈవీఎంల విశ్వసనీయతను ఎలా ప్రశ్నిస్తారని బుధవారం నాటి ట్వీట్లలో ఆయన ప్రశ్నించారు. మూడు వ్యాజ్యాలను (పిల్స్) విచారించిన తర్వాతే ఎన్నికల ప్రక్రియకు సుప్రీంకోర్టు తుదిరూపునిచ్చిందని అమిత్ షా చెప్పారు. వీవీప్యాట్లపై విపక్షాల అసహనం ఎన్నికల్లో వారి ఓటమికి సంకేతంగా కేంద్ర మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు. -
మరికొన్ని గంటల్లో లోక్‌సభ ఫలితాలు
న్యూఢిల్లీ: నరాలు తెగే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. దిగువసభ ఎన్నికల్లో పోటీ చేసిన జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన 8,049 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఏప్రిల్ 11 మొదలు మే 19 వరకు ఏడు విడతల్లో.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలతో హోరాహోరీగా సాగిన 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈసీ అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే మొదటిసారిగా ఈవీఎంల్లోని ఓట్ల వివరాలను వీవీప్యాట్ల చీటీలతో ఈసీ సరిపోల్చనుంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2–3 మధ్యే పూర్తయిపోయినా వీవీప్యాట్ల చీటీలను కూడా లెక్కించాల్సి ఉండటంతో ఫలితాలు సాధారణ సమయం కన్నా ఐదారు గంటలు ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా గురువారమే వెలువడనున్నాయి. చౌకీదార్ చోర్‌హై నుంచి మొదలై.. ఈ ఎన్నికల్లో ప్రధాన పక్షాలైన ఎన్డీయే, యూపీఏకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. చౌకీదార్ చోర్ హై, అవినీతిపరుడు నంబర్ 1, ఖాకీ అండర్వేర్ వంటి కటువైన ఆరోపణలు.. స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికలను వేడెక్కించాయి. బీజేపీ 437 మంది, కాంగ్రెస్ 423 మంది అభ్యర్థులను బరిలో నిలిపాయి. 19న చివరి విడత ఎన్నికలు ముగియగా.. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే తిరిగి అధికార పీఠాన్ని అధిరోహిస్తుందని చాలావరకు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నరేంద్ర మోదీ వ్యక్తిగత చరిష్మాతో 2014లో ఎలాగైతే ఎన్డీయే అధికారం చేజిక్కించుకుందో.. ఈసారి కూడా అలాగే ఆ కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల్లో అసంతృప్తి, ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని విపక్షాలు పేర్కొన్నాయి. మోదీ, కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా తదితరులు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. 542 స్థానాలకే ఎన్నికలు విపక్ష పార్టీలు మంగళవారం ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపులో పారదర్శకతను పాటించాల్సిందిగా ఆ పార్టీలు ఈసీని కోరాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 542 నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. పెద్దయెత్తున నగదు పంపిణీ ఆరోపణల నేపథ్యంలో తమిళనాడులోని వెల్లూరులో ఎన్నికను ఈసీ రద్దు చేసింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 282 సీట్లు రాగా 44 సీట్లతో కాంగ్రెస్ గతంలో ఎన్నడూలేని విధంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. 2009లో కాంగ్రెస్ 206 సీట్లు సాధించింది. అప్రమత్తంగా ఉండండి: హోం శాఖ గురువారం కౌంటింగ్ సందర్భంగా కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. అవాంఛనీయ సంఘటనలు, హింస చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్త వహించాల్సిందిగా రాష్ట్రాల సీఎస్‌లను, డీజీపీలను కోరింది. స్ట్రాంగ్‌రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, త్రిపుర రాష్ట్రాలకు చెందిన కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు చేసిన ప్రకటనలు హింసకు దారితీయవచ్చని, కౌంటింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించవచ్చునంటూ కేంద్ర భద్రతా సంస్థలకు సమాచారం అందినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ఇలా... పోస్టల్ బ్యాలెట్లతో పాటే ఈవీఎం ఓట్ల లెక్కింపు వీవీప్యాట్ల లెక్కింపుతో ఫలితాలు ఆలస్యం! ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్ల ఓట్లను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చే ప్రక్రియ చేపట్టడం వల్ల ఫలితాలు సాధారణం కంటే అయిదారు గంటలు ఆలస్యంగా వెలువడే అవకాశముంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2–3 గంటల మధ్య పూర్తయిపోయినా, వీవీప్యాట్ల చీటీలను కూడా లెక్కించాల్సి రావడంతో అధికారిక ఫలితాలు వచ్చేసరికి రాత్రి 8 దాటిపోతుందని అంచనా. ఆర్వోల ప్రతినతో మొదలు.. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఓట్ల రహస్యాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేస్తారు. ఆ మేరకు పత్రాన్ని బయటకి చదివిన తర్వాతే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. సాధారణంగా సాయుధ బలగాలు, కేంద్ర పోలీసు సిబ్బంది, రాష్ట్ర పోలీసు సిబ్బంది, ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి చెందిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తొలుత లెక్కిస్తారు. దౌత్యవేత్తలు, ఇతర దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఓట్లను కూడా సర్వీసు ఓట్ల కిందే పరిగణిస్తారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 18 లక్షలు నమోదు కాగా రికార్డు స్థాయిలో 16.49 లక్షల ఓట్లు పోలయ్యాయి. వాటిని మే 17నే ఆయా రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. పోస్టల్ బ్యాలెట్లు భారీగా ఉన్న నేపథ్యంలో వాటితో పాటు ఈవీఎంల ఓట్ల లెక్కింపు రెండూ ఒకేసారి జరపాలని ఈసీ నిర్ణయించినట్లు కమిషన్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఉండే హక్కు ఉంటుంది. వారి సమక్షంలోనే కౌంటింగ్ సాగుతుంది. వీవీప్యాట్ల చీటీల లెక్కింపు ఎలాగంటే.. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాతే వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించే ప్రక్రియ మొదలవుతుంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఎంపిక చేసిన అయిదు పోలింగ్ స్టేషన్లలో వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాల్సి ఉంది. ఈ పోలింగ్ కేంద్రాలను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 10.3 లక్షల పోలింగ్ స్టేషన్లు ఉండగా.. వీవీప్యాట్ల లెక్కింపు ప్రక్రియ 20,600 పోలింగ్ స్టేషన్లలో జరగనుంది. 25 వీవీప్యాట్ చీటీలను ఒక కట్టగా కట్టి లెక్కించి ఆయా అభ్యర్థుల బాక్సుల్లో వేస్తారు. వాటిని ఈవీఎం డిస్ప్లేలతో పోల్చి చూస్తారు. ఒకవేళ రెంటికీ మధ్య తేడా వస్తే మరోసారి లెక్కిస్తారు. అలా మూడు సార్లు లెక్కించినా సరిపోలకపోతే వీవీప్యాట్లలో ఫలితాలనే తుదిగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక వీవీ ప్యాట్ అయిన తర్వాతే, మరో వీవీప్యాట్ లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్‌ను లెక్కించడానికి గంట సమయం పట్టొచ్చు. 5 వీవీప్యాట్లలో చీటీల లెక్కింపు పూర్తి కావడానికి 5 గంటలు పట్టే అవకాశం ఉంది. వీవీప్యాట్ చీటీలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, లేదంటే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మాత్రమే లెక్కిస్తారు. అలా లెక్కించిన తర్వాత తుది ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఈవీఎంలు మొరాయించినా, వాటిలో లోపాలు తలెత్తినా, ఎన్నికల కమిషన్ దృష్టికి అధికారులు తీసుకువెళతారు. పోలింగ్ కేంద్రంలో అప్పటి పరిస్థితులను బట్టి రీ పోలింగ్‌కు ఆదేశిస్తారు. పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీల ఏజెంట్ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే కౌంటింగ్ ముగిసినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. -
మరికొద్ది గంటల్లో!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. 41 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడనుంది. రాష్ట్రంలోని 17లోక్‌సభ స్థానాలతోపాటు దేశంలోని 542 లోక్‌సభ స్థానాల్లో పోలైన ఓట్లను గురువారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నా రు. నేడు జరగనున్న కౌంటింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కు మార్ ప్రకటించారు. బుధవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వివరించా రు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ని ర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రా ష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు తొలిదశలో (ఏప్రిల్ 11న) పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటలకు ప్రారంభం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 35 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కలిపి లెక్కింపు కోసం 126 హాళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్నికల పరిశీలకుడు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లోక్‌సభ స్థానాల పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను లెక్కించనున్నారు. ప్రతి శాసనసభ స్థానం పరిధిలో పోలైన ఓట్లను లెక్కించడానికి ఒక హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు సంఖ్యలో 185 మంది బరిలో ఉన్నందున అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలైన ఓట్లను రెండేసి హాళ్లలో లెక్కించనున్నారు. ఒక్కో హాల్లో 18 చొప్పున మొత్తం 36 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న మల్కాజ్గిరి లోక్‌సభ స్థానంలోని మేడ్చల్, ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను లెక్కించడానికి 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సువిధ యాప్‌లో ఫలితాలు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ (ఈటీపీబీ)లను లెక్కించనున్నారు. అనంతరం ఉదయం 8.20 గంటలకు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. ఈవీఎంల రౌండ్లన్నీ పూర్తయిన తర్వాత ప్రతి శాసనసభస్థానం పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాలను ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసి, అక్కడ నమోదైన వీవీప్యాట్స్ ఓట్లను లెక్కించనున్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లతో వీవీప్యాట్స్ ఓట్లను సరిపోల్చి చూస్తారు. ఈవీఎం, వీవీప్యాట్స్లలోని ఓట్లలో తేడాలొస్తే వీవీప్యాట్స్ స్లిప్పుల కౌంటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి రౌండు పూర్తి కాగానే సువిధ అప్లికేషన్ ద్వారా ఫలితాలను రిటర్నింగ్ అధికారులు పోర్టల్‌లో నమోదు చేస్తారు. దీంతో ఓట్ల లెక్కింపు ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌పోర్టల్ (https://results.eci.gov.in) ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవులు ప్రకటించిందని రజత్‌కుమార్ తెలిపారు. గురువారం మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించామన్నారు. రిటర్నింగ్ అధికారే కింగ్! ఓట్ల కౌంటింగ్, రీ–కౌటింగ్‌కు సంబంధించిన ఏ విషయంలోనైనా నిర్ణయాధికారం స్థానిక రిటర్నింగ్ అధికారిదేనని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే స్థానిక రిటర్నింగ్ అధికారి ఫలితాలను చదివి వినిపిస్తారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు నిశ్శబ్ద సమయం ఉండనుంది. ఓట్ల లెక్కింపుపై అనుమానాలుంటే ఆ రెండు నిమిషాల్లోగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు లిఖితపూర్వకంగా రీ–కౌంటింగ్ కోరాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారులు తమ విచక్షణ ఉపయోగించి రీ–కౌంటింగ్ జరపాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఒక వేళ విజ్ఞప్తిని తిరస్కరిస్తే మాత్రం ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారులు లిఖిత పూర్వకంగా తెలియచేయాల్సి ఉంటుందని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. వీవీప్యాట్స్ ఓట్లు కీలకం! కొన్ని సందర్భాల్లో వీవీప్యాట్స్ ఓట్లు కీలకం కానున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంల మీద ఉండే ‘క్లోజ్’మీటను నొక్కడాన్ని ప్రిసైడింగ్ అధికారులు మరిచిపోతే, మళ్లీ క్లోజ్ మీటను నొక్కే వరకు అలాంటి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం సాధ్యం కాదు. ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో సంబంధిత పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లను సరిచూసుకున్న తర్వాత క్లోజ్ మీటను నొక్కి ఓట్లను లెక్కిస్తారు. ఒక వేళ పోలైన ఓట్ల సంఖ్య, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యలో తేడాలుంటే, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను కాదని వీవీప్యాట్స్ స్లిప్పులను లెక్కిస్తారు. ఇప్పటి వరకు ఎక్కడా ఈవీ ఎం, వీవీప్యాట్స్ ఓట్ల మధ్య తేడాలు రాలేదని రజత్‌కుమార్ వెల్లడించారు. పోలింగ్ రోజు మాక్ పోల్ లో వేసిన ఓట్లను ఈవీఎం నుంచి డిలీట్ చేయడాన్ని పోలింగ్ సిబ్బంది మరిచిపోతే, వాస్తవ పోలింగ్ ఓట్లతో మాక్‌పోల్ ఓట్లు కలిసిపోనున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సైతం వీవీప్యాట్స్ ఓట్లను పరిగణలోకి తీసుకుంటామని రజత్‌కుమార్ వెల్లడించారు. తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య మార్జిన్ ఓట్ల సంఖ్య కంటే ఎక్కువ ఉంటేనే మళ్లీ తిరస్కరించిన పోస్టల్ ఓట్లకు రీ–కౌంటింగ్ చేయనున్నారు. -
వీవీప్యాట్ల లెక్కింపుపై విపక్షాలకు ఈసీ షాక్
-
విపక్షాలకు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : వీవీప్యాట్ల లెక్కింపు వ్యవహారంలో విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లెక్కింపు ప్రక్రియను మార్చేందుకు నిరాకరించిన ఈసీ ముందుగా ఈవీఎంల లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేసింది. ముందుగా 5 వీవీప్యాట్లను లెక్కించాలని విపక్షాలు మంగళవారం ఈసీని కలిసి వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈవీఎం, వీవీప్యాట్లపై రాద్ధాంతానికి స్వస్తిపలికి లెక్కింపు ప్రక్రియకు సహకరించాలని, ఫలితాలను అంగీకరించాలని బీజేపీ కోరింది. విపక్షాలు మాత్రం ఈసీ తీరును తప్పుపడుతున్నాయి. వీవీప్యాట్ల లెక్కింపునకు ఈసీకి ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించాయి. ఇక వీవీప్యాట్ల లెక్కింపు సంఖ్యను పెంచాలన్న విపక్షాల అప్పీల్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టుపై కాంగ్రెస్ నేత, వాయువ్య ఢిల్లీ మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టెన్షన్..టెన్షన్
నరాలు తెగే ఉత్కంఠ.. గెలిచేదెవరంటూ చర్చోపచర్చలు.. పందెంరాయుళ్ల బెట్టింగులు.. తమ అభ్యర్థే గెలుస్తాడంటే.. కాదు తమవాడే అంటూ సాగిన సవాళ్లు.. ప్రతి సవాళ్లకు మరో 24 గంటల్లో తెరపడనుంది. హోరాహోరీగా పోరాడిన అభ్యర్థుల భవితవ్యంపై ఓటర్లు ఇచ్చిన తీర్పు గురువారం వెలువడనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇన్ని రోజులు పైకి బాగానే కనబడ్డా లోలోపల మాత్రం ఫలితాలపై ఆందోళనతోనే ఉన్నారు. చిత్తూరు అర్బన్: జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాల ఫలితాలు వెలువడ్డానికి ఒక్క రోజు మిగిలి ఉంది. ఈ ఏడాది మార్చి 10న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడం, ఏప్రిల్ 11న తొలి విడతలో జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగడం చకచకా జరిగిపోయాయి. అయితే తుది విడత ఎన్నికలు పూర్తయితే తప్ప ఓట్ల లెక్కింపు చేపట్టకూడదనే నిబంధన ఉండటంతో పోటీలో ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులు ఒకింత డీలా పడిపోయారనే చెప్పాలి. ఇప్పుడు ఓట్లేస్తే 43 రోజుల తర్వా త ఫలితాలు చెబుతారా అంటూ నిట్టూర్చారు. కానీ కాలచక్రం గిర్రున తిరిగింది. 43 రోజుల్లో 42 రోజులు చకచకా గడిచిపోయాయి. ఫలితాలు వెలువడే రోజు వచ్చేస్తోందని డీలాపడ్డ అభ్యర్థులే ఎగిరి గంతేస్తున్నారు. ఆ గంతుల్లో పలువురు అభ్యర్థులు కాస్త ఆందోళన, కొంచెం ధైర్యం, మరికొంత మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు. తొలి ఓట్లు పోస్టల్ బ్యాలెట్లే.. ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రాంరభమవుతుంది. ఈవీఎం యంత్రాలను లెక్కింపు కేంద్రాల్లో ఉంచిన తర్వాత ప్రిసైండింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెల్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. ఇది పూర్తయ్యాక ప్రతి నియోజకవర్గంలోని 5 వీవీప్యాట్లలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇందులో తేడా వస్తే మళ్లీ లెక్కిస్తారు. అప్పటికే తేడా ఉంటే వీవీప్యాట్దే తుదిగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో తుది ఫలితాలు రావడానికి రాత్రి 8 గంటలు పట్టే అవకాశముంది. అయితే ఏకపక్షంగా అభ్యర్థులకు తొలిరౌండ్ నుంచే ఆధిక్యం కొనసాగితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటన్నరలో ఫలితం తెలిసిపోతుంది. మెజారిటీపై లెక్కలు.. ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో కొందరు ధీమాగా ఉన్నారు. గెలుపు దాదాపు ఖరారైపోయిందని, మిగిలింది మెజారిటీ ఎంతొస్తుందనే దానిపైనే లెక్కలు వేసుకుంటున్నారు. ఇందులో మండలాల వారీగా ఏయే ప్రాంతంలో ఎంత మెజారిటీ వస్తుంది..? అక్కడున్న సామాజికవర్గాల వారీగా ఓట్ల వివరాలు, కలిసొచ్చే అనుకూల అంశాలు, మెజారిటీ రాకపోవడానికి ప్రతికూల అంశాలపై బేరీజు వేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే మొన్నటి వరకు 20 వేల ఓట్ల మెజారిటీతో తానే గెలుస్తానని ధీమాగా ఉన్న అభ్యర్థులు గెలిస్తే చాలు దేవుడా అంటూ కార్యకర్తల వద్ద దిగాలు పడుతున్నారు. ఏది ఏమైనా ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఆంక్షలు.. ఇక ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లాలో ఆంక్షలు విధించారు. 23వ తేదీ జిల్లాలో ఎక్కడా మద్యం దుకాణాలు తెరవడానికి వీల్లేదు. బార్లు సైతం మూసేయాలి. ఎక్కడైనా మద్యం విక్రయించినట్లు తెలిస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. దుకాణాన్ని సీజ్ చేస్తారు. అలాగే గెలిచిన అభ్యర్థులు ఊరేగింపులు చేసుకోవడం.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎదుటివారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించినా చర్యలు తీసుకుంటారు. కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చిత్తూరు కలెక్టరేట్ : ఓట్ల లెక్కింపునకు సమయం 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఫలితాలపై రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుం ది. ఏప్రిల్ 11న జరిగిన ఈవీఎంలన్నింటినీ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న సీతమ్స్, ఎస్వీ సెట్ కళాశాలల్లోని స్ట్రాంగ్ రూములలో భద్రపరిచారు. వాటికి సీసీ కెమెరాలు, కేంద్ర బలగాల పహారాలో ఉంచారు. జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న మంగళవారం సాయంత్రం ఆర్వోలకు సీతమ్స్ కౌంటింగ్ కేంద్రంలో శిక్షణ కల్పించారు. ఎస్వీ సెట్ కళాశాలలో డెప్యూటీ ఎన్నికల అధికారి గిరీష ఏర్పాట్లను పరిశీలించారు. -
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఆదేశాలు ఇవ్వలేం..
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపు సందర్భంగా ముందు ఈవీఎంలను కాకుండా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఒకవేళ వీవీ ప్యాట్లకు, ఈవీఎంలకు మధ్య తేడాలుంటే.. అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలన్న అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. ఈ విషయాల్లో ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున, అందుకు విరుద్ధంగా తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్, జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు పేర్కొనగా.. కొట్టేస్తున్నట్లుగా పేర్కొనవద్దని, పిటిషన్‌ను మూసివేస్తున్నట్లు పేర్కొనాలని పిటిషనర్ బాలాజీ అభ్యర్థించారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌ను మూసేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈవీఎంల కన్నా ముందు వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు, తేడాలు వచ్చినప్పుడు నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ శ్యాంప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బాలాజీ వాదనలు వినిపించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాల అమలు కోసం ఎన్నికల సంఘం ఎటువంటి సర్క్యులర్‌ను జారీ చేయలేదని తెలిపారు. వీవీ ప్యాట్లు, ఈవీఎంలకు మధ్య తేడాలు వస్తే, వాటిని అధిగమించేందుకు ఏం చేస్తారన్న విషయంపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. అలా చేయడం నిబంధనలకు విరుద్ధం ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ స్పందిస్తూ... ఎన్నికల నిబంధనల ప్రకారం ముందు ఈవీఎంలనే లెక్కించాల్సి ఉందన్నారు. ముందు వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించడం చట్ట విరుద్ధమవుతుందని కోర్టుకు నివేదించారు. ఖర్చు చేయక ముందే ఆడిట్ చేయడం ఏ విధంగా సాధ్యం కాదో, ఈవీఎంలను లెక్కించకుండా వీవీ ప్యాట్లను లెక్కించడం కూడా సాధ్యం కాదని వివరించారు. వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే రెండుసార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. తాజాగా మంగళవారం కూడా మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాల అమలుకు అన్నీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. పిటిషనర్ చేస్తున్న అభ్యర్థన సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందన్నారు. ఈ విషయంలో ఏ ఆదేశాలు ఇచ్చినా సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని తెలిపారు. అవినాశ్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం, ఈ పిటిషన్‌పై ఏ రకమైన ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. వీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పుడు, అందుకు విరుద్ధంగా తాము ఆదేశాలు ఎలా జారీ చేయగలమంటూ పిటిషన్‌ను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది. -
హైకోర్టులో టీడీపీకి చుక్కెదురు
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీకి చుక్కెదురైంది. వీవీప్యాట్ల ముందస్తు లెక్కింపుపై దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున మొదట ఐదు వీవీ ప్యాట్లను లెక్కించాలని, ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించాలని న్యాయవాది బాలాజీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై మూడు గంటలపాటు విచారించిన అనంతరం జస్టిస్ శ్యాంప్రసాద్ దీనిని తోసిపుచ్చారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీ హైకోర్టులో టీడీపీకి చుక్కెదురు
-
వీవీప్యాట్ లెక్కింపుపై పిటిషన్ కొట్టెసిన సుప్రీం
-
వందశాతం వీవీప్యాట్లు లెక్కింపు: సుప్రీంలో చుక్కెదురు
సాక్షి,న్యూఢిల్లీ: 100శాతం వీవీప్యాట్లు లెక్కించాలన్న డిమాండ్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వందశాతం వీవీప్యాట్లను లెక్కించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. టెక్నోపర్ ఆప్ అనే సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని వెకేషణ్ బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, ఇది న్యూసెన్స్ పిటిషన్ అని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఎన్డీయేతర 21 విపక్ష పార్టీల నాయకులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్లనే మొదట లెక్కించి తర్వాత ఈవీఎంలను లెక్కించాలని.. ఈవీఎం, వీవీప్యాట్లలో నమోదైన ఓట్ల మధ్య తేడాలుంటే నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని ఈసీని కోరనున్నట్లు తెలుస్తోంది. కాగా వీవీప్యాట్ల అంశంపై సుప్రీంకోర్టులో ప్రతిపక్ష పార్టీలకు ఇదివరకే ఎదురుదెబ్బ తగిలిన విషయంతెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50 శాతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల) ఫలితాలతో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ స్లిప్(వీవీప్యాట్)లను సరిపోల్చాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఇదివరకే తోసిపుచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏవేని 5 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్ 8వ తేదీన తాము వెలువరించిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని ఇదివరకే సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఫస్ట్ ఖమ్మం... లాస్ట్ ఇందూరు
సాక్షి, హైదరాబాద్: మరో 48 గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. లోక్‌సభ ఎన్నికల్లో విజేతలెవరో తేలనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతోపాటు ఏ నియోజకవర్గం ఫలితం ఎప్పుడు వస్తుంది... ముందుగా ఫలితం ఎక్కడ తేలుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎన్నికల సంఘం కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్ల ప్రకారం చూస్తే ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపులో తొలుత ఖమ్మం ఫలితం రానుందని అంచనా. చివరగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నిజామాబాద్ ఫలితం వెలువడనుంది. అయితే ప్రతి నియోజకవర్గానికి సగటున ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్లను లెక్కించాలన్న సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆయా పార్లమెంటు సెగ్మెంట్లలో ర్యాండమ్‌గా తీసుకొనే పోలింగ్ స్టేషన్లలో ఉన్న ఓట్లనుబట్టి ఫలితాల వెల్లడి స్థానాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కౌంటింగ్’తీరూ కీలకమే... తెలంగాణలోని 35 కౌంటింగ్ కేంద్రాల్లో 17 లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేసిన ఈసీ.. ఒక రౌండ్‌కు 14 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కించనుంది. ఈ లెక్కన రాష్ట్రంలో తక్కువ 1,476 పోలింగ్ స్టేషన్లున్న ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్ ఫలితం మొదట రానుంది. అయితే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఐదు వీవీప్యాట్లను లెక్కించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసినందున వాటి లెక్కింపునకు అదనంగా మరో ఐదు గంటలు పట్టనుంది. తొలుత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించిన అనంతరం చివరగా ర్యాండమ్ పద్ధతిలో ఐదు వీవీప్యాట్లలోని ఓట్ల ను లెక్కించనున్నారు. ఈవీఎంలలో పోలైన ఓట్ల తో వాటిని సరిపోల్చుకున్న అనంతరం విజేతను అధికారికంగా ప్రకటించనున్నారు. ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపునకు సగటున 20 నుంచి 30 నిమిషాలు పట్టనుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉన్న చోట ఈ సమ యం మరింత పట్టే అవకాశం లేకపోలేదని ఈసీ వర్గాలంటున్నాయి. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లోని పరిస్థితులు, ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్ అధికారి పనితీరు ఫలితాల వెల్లడికి పట్టే సమయంపై ప్రభా వం చూపే వీలుందని చెబుతున్నాయి. పోలింగ్ బూత్‌లు ఎక్కువగా ఉన్న పార్లమెంటు సెగ్మెంట్ ఫలితాలు కూడా ముందుగానే వెలువడే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నాయి. ఈవీఎం ఓట్ల కౌంటింగ్ సమయంలో ప్రతి అభ్యర్థికి పోలైన ఓట్లను రికార్డు చేయాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట్ల ఆలస్యం జరిగే అవకాశముంది. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలు తక్కువగా ఉన్న జహీరాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఫలితాలు ముందుగా వెలువడినా ఆశ్చర్యంలేదు. నిజామాబాద్‌లో ఆలస్యం... దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితం ఆలస్యం కానుంది. దేశంలోనే ఆలస్యంగా ఫలితం వెలువడే లోక్‌సభ స్థానం ఇదే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సీటుకు 185 మంది పోటీపడుతుండటంతో ఓట్ల లెక్కింపు నెమ్మదిగా సాగనుంది. ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన ఒక్కో అభ్యర్థికి నమోదైన ఓట్లను పరిశీలించి రికార్డు చేసేందుకు సగటున ఏడు నిమిషాలు తీసుకోనుంది. దీంతోపాటు చివరగా లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని 35 పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్లను లెక్కించాల్సి ఉండటంతో ఫలితం ఆలస్యం కానుంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపుతో పోలిస్తే దీనికే ఎక్కువ సమయం పట్టనుంది. అయితే అభ్యర్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. ఈ కౌంటింగ్ కేంద్రంలో 18 టేబుళ్లను ఏర్పాటు చేసింది. తద్వారా ఫలితాల వెల్లడిలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంది. మరోవైపు దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలోని ఎల్బీ నగర్, మేడ్చల్ అసెంబ్లీ స్థానాల పరిధిలోని 500 పైచిలుకు పోలింగ్ కేంద్రాలు ఉండటంతో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సగటున ఇక్కడ 30 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే మేడ్చల్, ఎల్బీ నగర్ అసెంబ్లీల పరిధిలో 28 టేబుళ్లు ఏర్పాటు చేయడంతో పార్లమెంటు కౌంటింగ్ రౌండ్లు తగ్గుతాయనే అంచనా ఉంది. అయితే అవి ఏ మేరకు తగ్గుతాయన్న దానిపై స్పష్టత లేదు. మొత్తంమీద అత్యధిక ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు ఉన్న ఈ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. -
ఓట్ల లెక్కింపు ఇలా..
సార్వత్రిక ఎన్నికల చివరి ఘట్టం వచ్చేసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే కౌంటింగ్ ప్రక్రియ మరో 48గంటల్లో ప్రారంభం కానుంది. ఈ దఫా ఎన్నికల్లో ఈవీఎంతో పాటు వీవీప్యాట్లు కూడా ఉండటంతో ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది? వీవీప్యాట్ల లెక్కింపు ఎలా చేస్తారు? ఫలితాల వెల్లడి ఎప్పుడు ఉంటుంది? అన్న వాటిపై అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతతోపాటు లెక్కింపు కోసం సుమారు 25,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఓట్ల లెక్కింపును 200 మంది కేంద్ర పరిశీలకులతో పాటు 200 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు పరిశీలించనున్నారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రక్రియలో నియమ నిబంధనలు, కౌంటింగ్ జరిగే తీరు, ఫలితాల వెల్లడి తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, అనంతపురం ఉదయం నాలుగు గంటలకే కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, 4వ తరగతి ఉద్యోగులు, మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ కేంద్రాలు, వారికి కేటాయించిన నియోజకవర్గాల కేంద్రాల వద్దకు చేరుకోవాలి. 5 గంటలకు ఎవరు, ఏ టేబుల్ వద్ద కౌంటింగ్‌కు వెళ్తారో తెలుస్తుంది. 24 గంటల ముందు వారు ఏ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు చేయాలో తెలుస్తుంది. ఎన్నికల నిర్వహణ గురించి కౌంటింగ్ హాలులోని అందరితో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ‘కౌంటింగ్ గోప్యత’పై ప్రమాణం చేయిస్తారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు వేర్వేరుగా జరుగుతుంది. ఈ కౌంటింగ్ నాలుగు విధాలుగా జరుగుతుంది. - ఈటీపీబీఎస్ (ఎలక్ట్రానికల్లీ ట్రాన్సిమిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్) - జనరల్ పోస్టల్ బ్యాలెట్ - ఈవీఎం/కంట్రోల్ యూనిట్స్ - వీవీప్యాట్స్ ..పై నాలుగింటిలో ఒకదాని తర్వాత మరొకటి లెక్కింపు చేపడతారు. ఏజెంట్లు గంట ముందే చేరుకోవాలి కౌంటింగ్ కేంద్రంలో ఎన్ని టేబుళ్లు ఏర్పాటుచేస్తే ఆ టేబుళ్ల సంఖ్యకు సమానంగా పోటీచేసిన ప్రతీ అభ్యర్థి ఏజెంట్లను నియమించుకోవచ్చు. కౌంటింగ్ టేబుళ్ల చుట్టూ ఇనుప మెష్ ఉంటుంది. ఈ మెష్ అవతలే ఏజెంట్లు కూర్చోవడానికి ప్రత్యేకంగా సీట్లు ఏర్పాటుచేస్తారు. రాజకీయ పార్టీల గుర్తింపు ఆధారంగా ఈ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఏజెంట్లు ఆ కేటాయించిన సీట్లలోనే కూర్చోని వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఏజెంటుగా నియమితులైన వారు లెక్కింపు మొదలయ్యే సమయానికి ఒక గంట ముందుగా రిటర్నింగ్ అధికారికి గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఈలోపు వచ్చిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఓటింగ్ రహస్యానికి సంబంధించిన ప్రకటనపై సంతకం చేసిన తర్వాతే ఏజెంట్‌ను హాల్లోకి పంపిస్తారు. ఏజెంటు ఏ అభ్యర్థికి చెందిన వారు, ఏ సీరియల్ నెంబరు టేబుల్ వద్ద లెక్కింపు గమనిస్తారో సూచించే బ్యాడ్జీలను రిటర్నింగ్ అధికారి ఇస్తారు. ఏ టేబుల్ కేటాయించారో అక్కడే కూర్చోవాలి. హాలంతా తిరగడానికి అనుమతించరు. రిటర్నింగ్ అధికారి బల్ల దగ్గర ఉండే ఏజెంటు మిగిలిన ఏజెంట్లు లేని సమయంలో ఆ టేబుల్స్ దగ్గరకు వెళ్లడానికి అనుమతిస్తారు. ఒకసారి లోపలికి వచ్చిన ఏజెంట్లను కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బయటకు పంపరు. వీరికి కావాల్సిన మంచినీరు, ఆహార పదర్థాలను అక్కడకే పంపిస్తారు. ఈవీఎంల తరలింపు.. మే 23న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అసెంబ్లీ, పార్లమెంటు ఈవీంఎలు తారుమారు కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి తీసుకువచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫాంని కేటాయిస్తున్నారు. కౌంటింగ్ సమయంలో వీరు కేవలం ఈవీఎం కంట్రోల్ యూనిట్‌ను మాత్రమే తీసుకువస్తారు. అలాగే, ఒక రౌండ్ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్‌కు సంబంధించిన ఈవీఎంల కంట్రోల్ యూనిట్లను తీసుకురావాలి. సీళ్లన్నీ సరిగా ఉంటేనే కౌంటింగ్ సాధారణంగా కౌంటింగ్ కేంద్రాల్లో సగటున 14 టేబుళ్లు ఉంటాయి. అంటే ప్రతీ రౌండుకు సగటున 14 ఈవీఎంలు చొప్పున లెక్కిస్తారు. ఈవీఎంల లెక్కింపు మొదలు పెట్టడానికి ముందు కౌంటింగ్ ఏజెంట్లు ఈవీఎంలకు ఉన్న ముఖ్యమైన సీళ్లు అన్నీ సరిగా ఉన్నాయా లేదా.. కంట్రోల్ యూనిట్ సీరియల్ నెంబర్‌తో సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఇందుకోసం ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషనుకు సంబంధించిన ఫారం–17సీలో నమోదైన సమాచారం చూడాల్సి ఉంటుంది. ప్రతీ ఏజెంటు ఫారం–17సీని తప్పకుండా తీసుకెళ్లాలి. బయటి స్ట్రిప్ సీలు, ప్రత్యేక టాగ్, గ్రీన్ పేపరు సీళ్లన్నీ సరిగా ఉంటేనే ఆ మెషీనును కౌంటింగ్‌కు ఉపయోగిస్తారు. అన్నీ సరిగా ఉన్న తర్వాతే ఈవీఎం కంట్రోల్ యూనిట్ వెనుక వైపు ఉన్న స్విచ్‌ను ఆన్ చేస్తారు. ఆ తర్వాత ఫలితం వెల్లడించే బటన్‌ను నొక్కుతారు. ఈ బటన్ నొక్కగానే ఆ పోలింగ్ స్టేషనులో ప్రతీ అభ్యర్థికీ నమోదైన ఓట్లు డిస్ప్లే ప్యానల్ వరుస క్రమంలో చూపిస్తుంది. నోటాకు పడిన ఓట్లు కూడా చూపిస్తుంది. లెక్కింపులో మొరాయించిన ఈవీఎంలు, అభ్యంతరాలు వ్యక్తంచేసిన వాటిని పక్కకు పెట్టి కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఇలా పక్కకు పెట్టిన ఈవీఎంలపై చివర్లో నిర్ణయం తీసుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటల్లోపు ఈవీఎం లెక్కింపు పూర్తవుతుందని ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. సెల్ఫోన్లు అనుమతించరు.. కేవలం కేంద్ర ప్రత్యేక పరిశీలకులు తప్ప మిగిలిన వారి ఫోన్లను లోపలకు అనుమతించరు. ఆర్వోల ఫోన్లను అనుమతిస్తారు కానీ వాటిని సైలెంట్ మోడ్‌లో పెట్టి పరిశీలకుని టేబుల్‌పై ఉంచాల్సి ఉంటుంది. సువిధ యాప్‌లో ఫలితాలను ప్రకటించడం కోసం ఆర్వో ఫోన్‌కు వచ్చే ఓటీపీని చూసుకోవడానికి మాత్రమే ఫోన్ వినియోగించడానికి అనుమతిస్తారు. ఈ కౌంటింగ్‌లో ఆర్వో నిర్ణయమే ఫైనల్. అందుకని ఎటువంటి వివాదాలు, అనుమానాలకు తావు లేకుండా ఒకటికి రెండుసార్లు అన్నీ పరిశీలించుకున్న తర్వాతే ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్‌కు శ్రీకారం ఉ.8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఒకవేళ అరగంటలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకపోతే వాటికి సమాంతరంగా 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలు పెట్టవచ్చు. ఓట్ల లెక్కింపులో ఈ సారి రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో) టేబుల్ అత్యంత కీలకపాత్ర పోషించనుంది. పోస్టల్, సర్వీసు ఓట్లతో పాటు వీవీప్యాట్ లెక్కింపు కూడా ఆర్వో టేబుల్ వద్దే జరగడమే దీనికి కారణం. ఓట్ల లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత సర్వీసు ఓట్లతో మొదలవుతుంది. ఈవీఎంల లెక్కింపునకు ఏర్పాటు చేసిన టేబుళ్లకు అదనంగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఆర్వో వద్ద ఒక ప్రత్యేక టేబుల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ తరహా పోస్టల్ బ్యాలెట్లు చెల్లవు.. - 13సీ ఎన్వలప్/బీ కవర్లో కాకుండా ఇతర కవరులోని బ్యాలెట్లు చెల్లవు. - 13సీలో 13బీ లేకపోయినా, 13–సీలో 13–ఏ డిక్లరేషన్ లేకపోయినా, డిక్లరేషన్‌లో ఓటరు సంతకం, గెజిటెడ్ అధికారి అటస్టేషన్ లేకపోయినా ఓట్లు చెల్లవు. - బ్యాలెట్లో మార్కింగ్ లేకపోయినా, చిరిగినా, అతుకులు వేసినా చెల్లవు - బ్యాలెట్లో సంతకాలు, ఇతర రాతలు, నినాదాలు, వేలిముద్రలు ఉన్నా 13సీ ఖాళీగా పంపినా చెల్లవు..బ్యాలెట్లో ఎక్కువమందికి మార్కింగ్ చేసినా, ఎవరికి ఓటేశారో తెలీకపోయినా ఓటు చెల్లదు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు సుమారు 3 లక్షల మందికి పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయగా, దేశభద్రత కోసం వివిధ చోట్ల విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది 60,250 మందికి సర్వీసు ఓట్లు జారీ చేశారు. ఈ ఓట్లన్నీ మే 23న 8 గంటల్లోగా రిటర్నింగ్ ఆఫీసరకు అందాల్సి ఉంటుంది. అంటే ఆరోజు ఉదయం 7.59 గంటలలోపు వచ్చిన పోస్టల్, సర్వీసు ఓట్లను మాత్రమే లెక్కింపు కోసం పరిగణనలోకి తీసుకుంటారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొత్తం ఆర్వో పర్యవేక్షణలోనే జరుగుతుంది. ప్రతీ 500 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ఒక ప్రత్యేకమైన టేబుల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మిగిలిన టేబుళ్ల వద్ద జరిగే వాటిని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు పర్యవేక్షిస్తారు. పోస్టల్ బ్యాలెట్లు అత్యంత కీలకం కావడంతో అన్ని విషయాలపై అవగాహన కలిగిన వారినే ఏజెంట్లుగా ఈ టేబుళ్ల దగ్గర నియమించుకోవాలని ఎన్నికల సంఘం అభ్యర్థులకు సూచిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన 30 నిమిషాల తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలు పెట్టుకోవచ్చు. కానీ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి అయితే కానీ ఈవీఎంల రౌండ్ల ఫలితాలను అధికారికంగా ప్రకటించడానికి వీలులేదు. గతంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తయితే కానీ ఈవీఎంల లెక్కింపు మొదలు పెట్టేవారు కారు. కానీ ఇప్పుడు 30 నిమిషాల తర్వాత మొదలు పెట్టడానికి అనుమతిచ్చారు. చివర్లో వీవీప్యాట్ల లెక్కింపు ఈవీఎంల ఓట్లు లెక్కింపు పూర్తయిన తర్వాత ఆర్వో టేబుల్ వద్ద వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. - పోలింగ్ సమయంలో ఈవీఎంల పనితీరు పరిశీలించడానికి 50 ఓట్లతో చేపట్టిన మాక్ పోలింగ్‌లో నమోదైన స్లిప్పులను వీవీప్యాట్లల నుంచి తొలగించకుండా కొన్నిచోట్ల ఎన్నికల ప్రక్రియ కొనసాగించారు. ఇలా జరిగిన వీవీప్యాట్లను లాటరీ నుంచి మినహాయించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. - ప్రతీ శాసనసభ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్లను లాటరీ విధానంలో ఎంపికచేసి లెక్కిస్తారు. - ఇలా ఎంపిక చేసిన వీవీప్యాట్ల నుంచి స్లిప్పులను అభ్యర్థుల వారీగా విడదీసి 25 చొప్పున ఒక కట్టగా కట్టి లెక్కిస్తారు. - ఈవీఎం కంట్రోల్ యూనిట్లో నమోదైన ఓట్లకు.. వీవీప్యాట్లలో నమోదైన ఓట్లకు తేడా వస్తే మళ్లీ వీవీప్యాట్ల స్లిపులను లెక్కిస్తారు. అప్పుడు కూడా ఈవీఎంలతో తేడా వస్తే చివరగా వీవీప్యాట్ల నెంబర్లనే పరిగణనలోకి తీసుకుని తుది ఫలితంలో మార్పులు చేస్తారు. - వీవీప్యాట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆర్వో తుది ఫలితాలను సువిధా యాప్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి అక్కడ నుంచి అనుమతి వచ్చాకే తుది ఫలితాలను ప్రకటించాలి. -
ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాట్లు లెక్కిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సోమవారం జిల్లాల ఎన్నికల పరిశీలకులు, ఎస్పీలు, సీపీలు, ఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్ల ఈవీఎంలు తెరుచుకోకపోతే వాటి స్థానంలో వీవీప్యాట్ల స్లిపులను లెక్కించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. ఈవీఎంకు సంబంధించి బ్యాటరీ రీప్లేస్మెంట్, కంట్రోల్ యూనిట్ మరమ్మతులు సాధ్యం కానప్పుడు వీవీప్యాట్లను లెక్కిస్తామన్నారు. లెక్కింపు సమయంలో మొరాయించిన ఈవీఎంలను పక్కకు పెట్టి మిగిలిన ఈవీఎంలతో ఓట్ల లెక్కింపు కొనసాగిస్తామన్నారు. చివర్లో మొరాయించిన ఈవీఎంల పరిస్థితి పరిశీలించి కేంద్ర పరిశీలకులు, ఆర్వో తగు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఓట్ల లెక్కింపులో ఫారం 17సీ అత్యంత కీలకమైనదని, ఈ ఫారంలోని వివరాలతో సరిపోలితేనే కౌంటింగ్ ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు. కౌంటింగ్‌కు ముందు మాక్‌పోల్ నివేదిక లెక్కలు కూడా సరిపోవాలన్నారు. ఒకవేళ మాక్‌పోల్ ఓట్లు తొలగించకుండా అంటే సీఆర్సీ చేయకుండా పోలింగ్ కొనసాగించి ఉంటే పీవో డైరీ ఆధారంగా ఆ ఓట్లను తొలగించి లెక్కింపు చేపట్టాల్సి ఉంటుందన్నారు. అలాగే సీఆర్సీ చేయని వీవీప్యాట్లను లాటరీ విధానంలో ఐదు ఎంపిక చేసే ర్యాండమైజేషన్ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ సమయంలో సందేహాలు తలెత్తితే పోలింగ్ డైరీ ఆధారంగా ఆర్వోలు నిర్ణయం తీసుకుంటారని, ఓట్ల లెక్కలపై పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఆర్వోనే తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. అభ్యర్థుల మధ్య పోటీ గట్టిగా ఉండి మెజార్టీ స్వల్పంగా ఉంటే ఆర్వో, కేంద్ర పరిశీలకులు రీ–కౌంటింగ్‌కు ఆదేశించే అవకాశం ఉందన్నారు. ఈ రీకౌంటింగ్‌లో మొత్తం ఈవీఎంలు చేయాలా లేక సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లకే పరిమితం చేయాలా అన్నది కూడా వారే నిర్ణయిస్తారన్నారు. సీఎం వ్యాఖ్యలపై ఖండన కౌంటింగ్ ఏజెంట్లకు 17సీ ఫారంలు ఇవ్వడం లేదని, కనీస ఆహార ఏర్పాట్లు కూడా చేయడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ద్వివేది ఖండించారు. కౌంటింగ్ హాల్లో ఎన్ని టేబుళ్లు ఉంటే అంత మంది ఏజెంట్లను అనుమతిస్తామని, అలాగే ఏజెంట్లకు 17సీ ఫారం కూడా తప్పకుండా ఇస్తామన్నారు. అలాగే ఏజెంట్లకు ఎప్పటికప్పుడు ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో అందించే విధంగా తగు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
వీవీ ప్యాట్లన్నీ లెక్కించాలి
సాక్షి, అమరావతి: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) ఫ్రీక్వెన్సీ మార్చే అవకాశం ఉందని అన్నిచోట్లా చెబుతున్నారని, తాను ఢిల్లీ వెళితే దీనిపైనే చర్చిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈవీఎంలు, సెల్ఫోన్లు తయారు చేసే ప్రోగ్రామర్ ఒక్కరేనని, వారి కంట్రోల్లోనే అంతా జరుగుతుందని చెప్పారు. కారు స్టార్ట్ చేసినట్లు, ఏసీ, టీవీలను రిమోట్‌తో ఆన్ చేసినట్లు ఈవీఎంలను కూడా మానిటర్ చేసే అవకాశం ఉందన్నారు. వీవీ ప్యాట్ల ప్రింటర్లను మార్చే అవకాశం ఉంటుందని అంటున్నారని, ఉన్న ఈవీఎంలను మార్చివేసి కొత్త ఈవీఎంలను పెడుతున్నారని చెబుతున్నారని, ఇవన్నీ ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. వీవీ ప్యాట్‌లన్నింటినీ లెక్కించాలని, వీవీ ప్యాట్ స్లిప్ తీసుకుని, తమ ఓటు తాము వేసిన వారికే పడిందో లేదో ఓటరు చూసుకుని, ఒక బాక్సులో వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో అన్ని పార్టీలు ఈవీఎంలను కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నాయన్నారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే... వీవీ ప్యాట్లు పెట్టించింది నేనే... ‘‘తమకు 300 ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు అంటున్నారు. సర్వేలన్నీ వారికి 300 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈవీఎంలలో ఏదో జరుగుతోందనే అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల లెక్కల్లో తేడా వస్తే ఏం చేయాలి? తేడా వచ్చిన చోట మిగిలిన వీవీ ప్యాట్‌లన్నింటినీ లెక్కించాలని 23 రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలు ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర్నుంచి ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌లో ధ్యానం చేసి పోలింగ్‌ను ప్రభావితం చేసే వరకూ చాలా అంశాలున్నాయి. రాష్ట్రంలో అవసరమైనప్పుడు కేంద్ర బలగాలను పంపలేదు, ఇప్పుడు పంపుతున్నారు. అన్ని పార్టీలను ఏకంచేసి, వీవీ ప్యాట్లు పెట్టించిందని నేనే. వాటిపై మాజీ సీఈసీ ఖురేషీకి నేనే ఐడియా ఇచ్చా. వీవీ ప్యాట్ల లెక్కింపుపై మా పోరాటం కొనసాగుతుంది. తమ ఓటు తాము అనుకున్న వారికే పడిందో లేదో అనే అనుమానం ప్రజలకు ఉండకూడదు. ఈ సమస్యకు పరిష్కారం లభించేదాకా పోరాడుతాం. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘంలోనే లుకలుకలు తలెత్తాయి. రూ.9 వేల కోట్ల ఖర్చుతో వీవీప్యాట్లు పెట్టారు. అంత లగ్జరీ అవసరమా? ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 33 ఏళ్లుగా సర్వేలు చేస్తున్నా.. సర్వేలు చేయడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. నేను 33 సంవత్సరాల నుంచి సర్వేలు చేస్తున్నా. ఈ ఎన్నికల్లో నూటికి వెయ్యి శాతం గెలిచేది తెలుగుదేశం పార్టీయే. ఎలాంటి అనుమానం అవసరం లేదు. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందపడిపోతున్నారు, అప్పుడే మంత్రివర్గం కూడా తయారు చేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను గతంలో వన్‌సైడ్‌గా ఇచ్చారు, ఇప్పుడు మిశ్రమంగా ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ చూసి భయపడొద్దు ఉండవల్లి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి భయపడవద్దని చెప్పారు. మన ప్రభుత్వమే వస్తుందని అన్నారు. 18 నుంచి 20 ఎంపీ స్థానాల్లో గెలుస్తున్నామని, 110 అసెంబ్లీ స్థానాలతో మొదలై 120–130 వరకూ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైండ్‌గేమ్‌తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల అక్రమాలపై మంగళవారం అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రపతిని కలుస్తామన్నారు. -
కౌంటింగ్ నుంచి ఆ వీవీప్యాట్లను తొలగిస్తాం
సాక్షి, అమరావతి: మాక్ పోలింగ్‌లో నమోదైన స్లిప్పులను తొలగించని వీవీప్యాట్లను ఓట్ల లెక్కింపునకు (లాటరీ ద్వారా ఎంపిక చేసినవి) తీసుకోబోమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వీవీప్యాట్ల లెక్కింపులో అనవసర సందేహాలు తలెత్తకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్నికల సమయంలో మాక్ పోలింగ్‌లో 50 ఓట్లు నమోదైన తర్వాత వాటిని తొలగించి సీఆర్సీ చేసి పోలింగ్ ప్రారంభించాల్సి ఉండగా కొన్ని చోట్ల వాటిని తొలగించకుండా పోలింగ్ కొనసాగించారని, దీనివల్ల ఈవీఎం, వీవీప్యాట్ ఓట్లకు తేడా వస్తుందని చెప్పారు. ఇలాంటి వీవీప్యాట్లను లెక్కింపు నుంచి మినహాయించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిపారు. శనివారం సచివాలయంలో కలిసిన విలేకరులతో మాట్లాడుతూ చంద్రగిరి రీపోలింగ్‌పై పిటీషన్ దాఖలు కావడంతో వీడియో దృశ్యాలను కోర్టుకు అందచేశామని, సోషల్ మీడియాలో వస్తున్న దృశ్యాలు చంద్రగిరివి కావని ఆయన స్పష్టం చేశారు. మే 23లోపు ఎప్పుడైనా రీ–పోలింగ్ చేయవచ్చని, పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాతనే ఏడు చోట్ల రీ–పోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రీపోలింగ్‌పై తనకు వచ్చిన ఫిర్యాదు పరిశీలించాలంటూ సీఎస్ లేఖ రాయడం ఎలా తçప్పవుతుందని ప్రశ్నించారు. పోస్టల్ బ్యాలెట్ జారీలో ఒక్కచోటే తప్పు పోస్టల్ బ్యాలెట్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ద్వివేది కొట్టిపారేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఒక్కచోట మాత్రమే ఒక ఉద్యోగికి రెండు ఓట్లు జారీ అయ్యాయని, ఇలా జారీ చేసిన ఓటులో ఒకటి వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లపై ఫిర్యాదులు రావడంతో అన్ని జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకొని పరిశీలించామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన తర్వాతనే ఆర్వోలు ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్‌లో 200 మంది ఆర్వోలు, 200 మంది కేంద్ర పరిశీలకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. -
ఓట్ల లెక్కింపులో బాధ్యతగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బాధ్యతగా వ్యవహరించాలని కౌంటింగ్ ఏజెంట్లకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. శనివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సికింద్రా బాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కౌంటింగ్ ఏజెంట్లు, కార్పొరేటర్లతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఏజెంట్లు ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 6.30 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు, వీవీ ప్యాట్ల లెక్కింపుల్లో ఎలాంటి సందేహాలు వచ్చినా... అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్ల బాధ్యతల గురించి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ అవగాహన కల్పించారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, జనార్దన్‌రెడ్డి, ప్రభాకర్, స్టీఫెన్ సన్, పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఫలితాన్ని తేల్చేవి వాటి స్లిప్పులే..
వీవీ ప్యాట్.. ఓట్ల లెక్కింపు తేదీ సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు అందరి దృష్టి.. చర్చా దీనిపైనే..గత నెలలో జరిగిన సార్వత్రిక పోలింగ్‌లో ఓటు వేసిన వారందరూ ఈవీఎంలతోపాటు దీన్ని చూసే ఉంటారు.. అందులో తాము వేసినవారికే ఓటు పడిందో లేదో చూసుకొని నిర్థారించుకొని ఉంటారు..ఇప్పుడెందుకు అందరి దృష్టీ వీటిపైనే అంటే.. ఎన్నిక ఫలితం అధికారికంగా ప్రకటించడానికి ఈవీఎంలతోపాటు ర్యాండమ్‌గా లెక్కించే వీవీ ప్యాట్ల స్లిప్పులనే ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఆ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో డ్రా పద్ధతిలో ఐదు, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదు చొప్పున మొత్తం 35 వీవీ ప్యాట్లను నిర్ణయించి.. వాటి స్లిప్‌లను లెక్కించాలని.. వాటి సంఖ్య ఆ వీవీ ప్యాట్‌కు అనుసంధానమైన ఈవీఎంలో నమోదైన ఓట్ల సంఖ్యతో సరిపోల్చి ఫలితం ప్రకటించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఎన్నికల అధికారులు ఆ ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు.ఒకవేళ ఈవీఎం ఓట్లకు దానికి అనుసంధానమైన వీవీప్యాట్ ఓట్ల సంఖ్యకు తేడా వస్తే మళ్లీ లెక్కిస్తారు.. అప్పటికీ తేడా ఉంటే వీవీ ప్యాట్ స్లిప్పుల సంఖ్యనే ప్రామాణికంగా తీసుకొని ఫలితాన్ని నిర్ణయిస్తారు. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నందున లెక్కింపు పూర్తి అయినా అధికారిక ప్రకటన ఆలస్యం కావచ్చు. సాక్షి, విశాఖపట్నం: వీవీ ప్యాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్రెయిల్.. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ప్రవేశపెట్టిన ఈ వీవీప్యాట్ ఓట్లే (స్లిప్పులు) ఇప్పుడు కీలకంగా మారాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)ల్లో ఓట్ల లెక్కింపుతోనే విజేతలెవరలో తేలిపోతుంది. కానీ వీవీ ప్యాట్ల స్లిప్పుల గణన తర్వాతే ఫలితాలు ప్రకటించనున్నారు. దాంతో వీవీప్యాట్లలో స్లిప్‌లను ఎలా లెక్కిస్తారు? వాటిలోని స్లిప్‌లకు, ఈవీఎంల్లో ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంటే ఏం చేస్తారు? అన్న అంశాలు ఆసక్తికరం. ఈవీఎంకు అనుసంధానంగా.. కంట్రోల్ యూనిట్లతో పనిచేసే ఈవీఎంలకు అనుబంధంగా వీవీప్యాట్లను తీసుకొచ్చారు. ఈవీఎంలో గుర్తుకు ఎదురుగా ఉండే బటన్ నొక్కగానే బీప్ అని సౌండ్ రాగానే మన ఓటు నమోదైనట్లు లెక్క. కానీ ఆ ఓటు తాను నొక్కిన గుర్తుకే పడిందా.. లేక వేరే గుర్తుకు పడిందా.. అనే సందేహాలుండేవి. వీటిని నివృత్తి చేసేందుకే తొలిసారి వీవీ ప్యాట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈవీఎంలో గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్ నొక్కిన తర్వాత సుమారు 7 సెకన్ల పాటు వీవీ ప్యాట్‌లో గుర్తుతో కూడిన స్లిప్ కన్పిస్తుంది. ఆ తర్వాత ఆ స్లిప్ కట్ అయి వీవీ ప్యాట్ చాంబర్లో పడిపోతుంది. దీని వల్ల తాము వేసిన వారికే ఓటు పడిందో లేదో నిర్థారించుకునే అవకాశం ఏర్పడింది. వీవీ ప్యాట్లలో పడిన స్లిప్పులను ఈవీఎంలతోపాటు పూర్తి స్థాయిలో లెక్కించాలని కొన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అలా లెక్కిస్తే ఇక ఈవీఎంలు ఎందుకు.. పాత కాలంనాటి బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు నిర్వహించవచ్చు కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. చివరికి ర్యాండమైజేషన్ ద్వారా అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున వీవీ ప్యాట్లను ఎంపిక చేసి.. వాటిలోని స్లిప్‌లను లెక్కించి.. వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చిన తర్వాత ఫలితాలు వెల్లడించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ఓట్ల లెక్కింపులో వీవీ ప్యాట్లు కీలకంగా మారాయి. తేడా వస్తే డెయిరీల పరిశీలన రెండు మూడుసార్లు లెక్కించిన ఈవీఎం, వీవీప్యాట్ ఓట్ల సంఖ్య సరిపోలకపోతే.. అప్పుడు ఆర్వో డెయిరీ, పోలింగ్ ఆఫీసర్ డెయిరీలు పరిశీలిస్తారు. పోలింగ్ రోజున కౌంటింగ్‌లో ఎక్కడైనా పొరపాట్లు జరిగాయేమో చెక్ చేస్తారు. అప్పటికి ఓట్లలోవ్యత్యాసం ఉంటే వీవీ ప్యాట్లలో ఓట్ల సంఖ్యనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక్కో వీవీ ప్యాట్‌లో స్లిప్‌ల లెక్కింపునకు కనీసం గంట సమయం పడుతుందని అంచనా. మొత్తం ఈ ప్రక్రియను వీడియో రికార్డు చేస్తారు. చివరగా ప్రతి నియోజకవర్గంలోనూ ఓట్లన్నీ క్రోడీకరించి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. దీనివల్ల ఫలితాల అధికారిక ప్రకటన కొంత ఆలస్యమవుతుంది. స్లిప్‌లు ఎలా లెక్కిస్తారంటే.. ♦ మొదట యథాతథంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు. ఆ వెంటనే వీవీప్యాట్ల స్లిప్‌ల లెక్కింపునకు శ్రీకారం చుడతారు. ర్యాండమైజ్‌గా.. అంటే డ్రా పద్ధతిలో ప్రతి నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్లు ఎంపిక చేస్తారు. ♦ వీటి లెక్కింపునకు ప్రత్యేకంగా వీవీ ప్యాట్ కౌంటింగ్ బూత్(వీసీబీ) ఏర్పాటు చేస్తారు. బ్యాంక్ క్యాషియర్ క్యాబిన్ మాదిరిగా ఈ బూత్లుంటాయి. –పూర్తిగా మెష్‌తో క్యూబికల్గా తయారు చేస్తారు. దాంట్లో ట్రాన్స్పరంట్ కంటైనర్ పెడతారు. ♦ తొలుత రిటర్నింగ్ అధికారి పోస్టల్ కార్డు సైజు పేపర్‌పై అసెంబ్లీ సిగ్మెంట్ పేరు, నెంబర్, డేట్. పోలింగ్ స్టేషన్ల పేర్లు నమోదు చేసి వాటిని నాలుగు మడతలుగా మడిచి ఆ ట్రాన్సపరంట్ కంటైనర్‌లో వేస్తారు. ♦ బాగా షేక్ చేసి తర్వాత లక్కీ డ్రా ద్వారా ఐదు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేస్తారు. ♦ అలా ఎంపిక చేసిన పోలింగ్స్టేషన్లకు సంబంధించి క్యారింగ్ కేస్‌లో ఉన్న వీవీ ప్యాట్లను వీసీబీలోకి తీసుకొస్తారు. ♦ ఆ సమయంలోనే అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. తొలుత వీవీ ప్యాట్లున్న క్యారింగ్ కేస్లకు సీల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే వీవీ ప్యాట్లకున్న కంట్రోల్ కేస్లకు కూడా సీల్స్ ఉన్నాయో లేదో పరిశీలించాలి. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఈ సీల్స్‌ను తొలగిస్తారు. ♦ సీల్ తీసిన తర్వాత ప్యాట్లోని ఒక్కో స్లిప్ తీసి గుర్తుల వారీగా ట్రాన్సపరెంట్ కంపార్టుమెంట్లో ఏర్పాటు చేసిన చాంబర్స్‌లో వేస్తారు. ♦ అలా వర్గీకరణ పూర్తి అయిన తర్వాత చాంబర్లలోని స్లిప్పులను 25 చొప్పున కట్టలు కట్టి ఆ కంపార్టుమెంట్లో పెట్టి లెక్కపెడతారు. ♦ ఈవీఎంలోని ఓట్లను వీవీ ప్యాట్‌లో స్లిప్‌లను సరిపోల్చి చూస్తారు. ♦ ఎక్కడైనా ఒకటి రెండు అతుక్కోవడం, కింద పడిపోవడం, గమనించకపోవడం వంటి వాటి వల్ల రెండు సంఖ్యలు సరిపోకపోతే.. మళ్లీ లెక్కిస్తారు. -
కౌంటింగ్‌పై శిక్షణ.. మూడంచెల భద్రత
సాక్షి, విజయవాడ : ఈవీఎం, వీవీప్యాట్లు, ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోన్న రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, 13 జిల్లాల కౌంటింగ్ కేంద్రాల పర్యవేక్షకులు హాజరయ్యారు. ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ ఓట్ల లెక్కింపు విధానంపై అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాలలో టేబుల్స్ ఏర్పాట్లు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టే వీడియో కవరేజ్ అంశాలపై ఈసీ అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నట్లు ఈసీఐ డైరెక్టర్ నిఖిల్ కుమార్ వెల్లడించారు. అభ్యర్థుల వారిగా వీవీప్యాట్ స్లిప్పులను సాగ్రిగేట్చేసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. అభ్యర్థుల వారిగా 25 వీవీప్యాట్ స్లిప్పులను ఒక బండిల్‌గా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఆర్వోలు పూర్తిగా నిర్థారణ చేసుకున్న తర్వాతే ఎన్నికల ఫలితాలు ప్రకటించాలన్నారు. -
చంద్రబాబుకు చురకలు అంటించిన మోదీ
-
విపక్షాలకు సుప్రీం కోర్టు షాక్
-
విపక్షాలకు భంగపాటు
నిరాధార ఆరోపణలు చేయడం, ఎదుటివారిపై సులభంగా నిందలేయడం మన రాజకీయ పార్టీ లకు వెన్నతో పెట్టిన విద్య. తాము దేనికీ జవాబుదారీ కాదన్న ధీమాయే ఇందుకు కారణం. కానీ సర్వోన్నత న్యాయస్థానం ముందు సైతం ఇలాగే ప్రవర్తిస్తే చెల్లుతుందా? పోలింగ్‌కు వినియో గిస్తున్న ఈవీఎంలలో 50 శాతాన్ని వాటికి అనుసంధానించే వీవీ ప్యాట్లలోని రశీదులతో సరిపోల్చి చూడాలని 21 రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. అయితే అందువల్ల సమయం వృధా అవుతుంది గనుక ఒక్కో అసెంబ్లీ స్థానంలో అయిదేసి ఈవీఎంల చొప్పున లెక్కిస్తే సరిపోతుందని గతనెలలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పువల్ల న్యాయం జరగలేదని భావించినప్పుడు అందుకు గల కారణాలేమిటో, తమ సందేహాలకు ప్రాతిపదికేమిటో ఆ పార్టీలు సహేతుకంగా వివరించి ఉంటే వేరుగా ఉండేది. అది లేకపోబట్టే ఆ తీర్పును పునఃసమీక్షించాలన్న విపక్షాల వినతిని మంగళవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తమ వాదనకున్న శాస్త్రీయత ఏమిటో ఈ పార్టీల్లో దేనికీ స్పష్టత లేదు. ఆ వంకన జాతీయ స్థాయిలో ఏదో మహోద్యమం సాగిస్తున్నామన్న అభిప్రాయం అందరిలోనూ కలగజేయడమే వీటి ధ్యేయంగా కనబడుతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ఇప్పటికే అయిదు దశలు పూర్తయ్యాయి. మరో రెండు దశలు మిగిలి ఉన్నాయి. పక్షం రోజుల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలై విజేతలెవరో, పరాజితులెవరో తేలిపోతుంది. ఈ దశలో ఈవీఎంల పనితీరుపై సందేహాలు లేవనెత్తుతూ ఎందుకీ రాద్ధాంతం? ఈవీఎంలపై రాజకీయ పార్టీలు ఇలా వివాదం రేకెత్తించడం కొత్తగాదు. కాకపోతే గతంలో ఓట్ల లెక్కింపు పూర్తయి, ఫలితాలు వెల్లడయ్యాక ఓడిన పార్టీలు ఆ పని చేసేవి. ఇప్పుడు ఓపక్క పోలింగ్ ప్రక్రియ సాగుతుండగానే దీన్ని మొదలెట్టాయి. సుప్రీంకోర్టు తమ రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చాక కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికెళ్లి 50 శాతం ఈవీ ఎంలను వీవీ ప్యాట్లతో లెక్కించాలని ఈ పార్టీలన్నీ వినతిపత్రం అందించాయి. తాజా గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 90 కోట్లమంది ఓటర్లున్నారు. 10 లక్షల పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇన్నిచోట్ల ఈవీఎంలు వాడుతున్నప్పుడు మానవ తప్పిదం వల్లకావొచ్చు, సాంకే తికపరమైన సమస్య వల్ల కావొచ్చు...వాటిల్లో కొన్ని మొరాయిస్తుంటాయి. ఫిర్యాదులొచ్చినప్పుడు ఎన్నికల అధికారులు వెంటనే వాటిని సరిచేయించి పోలింగ్ కొనసాగించడం ఆనవాయితీ. కానీ ఈవీఎంలను ట్యాంపర్ చేసి, ఎవరికి ఓటేసినా ఫలానా పార్టీకి ఆ ఓటు వెళ్లేలా సాఫ్ట్‌వేర్‌ను మార్చా రని ఈ పార్టీల ఆరోపణ. ఇలాంటి సందేహాలను పటాపంచలు చేయడం కోసం సుప్రీంకోర్టు ఆదే శాల మేరకు ఈవీఎంలకు వీవీప్యాట్ ప్రింటర్లను అనుసంధానించారు. కానీ 50శాతం ఈవీ ఎంలను వీవీప్యాట్లతో సరిపోల్చి చూడాలని ఈ 21 రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. చిత్రమే మంటే... ఇన్ని కోట్ల మంది ఓటర్లలో ఏ ఒక్కరూ ఇంతవరకూ తాము ఒకరికి ఓటేస్తే, మరొకరికి పోయిందని ఫిర్యాదు చేయలేదు. సాధారణ పౌరుల సంగతలా ఉంచి బరిలో ఉండే వేలాదిమంది అభ్యర్థులు సైతం ఇంతవరకూ ఆ మాట అనలేదు. ఈవీఎంల విషయంలో నిజాయితీగా అనుమా నాలు వ్యక్తం చేసిన పౌరసమాజ సంఘాలున్నాయి. ఆ సందేహాలను తీర్చడానికి ఎన్నికల సంఘం సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఉంది. పోలింగ్‌కు ముందు ఈవీఎంలను ప్రతి దశలోనూ తనిఖీ చేసేం దుకు, వాటి పనితీరును పరీక్షించుకునేందుకు పార్టీల ప్రతినిధులకు అవకాశం ఇస్తున్నారు. రెండేళ్ల క్రితం ఈవీఎం లోపాలను నిరూపించాలని కేంద్ర ఎన్నికల సంఘం పార్టీలను ఆహ్వానించింది. కానీ ఎవరూ ఆ సవాలును స్వీకరించి నిరూపించే ప్రయత్నం చేయలేదు. ఈవీఎంలలో వాడే సాఫ్ట్వేర్ ప్రోగ్రాం కోడ్‌తో వైఫై, బ్లూటూత్ వగైరాలను అనుసంధానించడం కుదరని పని అని ఎన్నికల సంఘం చెబుతోంది. అది తప్పని నిరూపించడానికి ఈ పార్టీలేవీ కనీసం ప్రయత్నించలేదు. అలాగని ఆరోపణలు చేయడం మానుకోలేదు. ఓడినప్పుడు నెపాన్ని ఈవీఎంలపై నెట్టడం, విజ యం సాధించినప్పుడు మౌనంగా ఉండిపోవడం ఈ పార్టీలు అనుసరిస్తున్న అవకాశవాద వైఖరి. 2004, 2009 ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక ఈవీఎంల వల్లే ఓడిపోయామని తెలుగుదేశం శోకాలు పెట్టింది. 2014లో నెగ్గాక నోరెత్తలేదు. 2012లో అకాలీల చేతుల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ కూడా ఈవీఎంలపైనే నెపం వేసింది. 2017లో నెగ్గినప్పుడు మాట్లాడలేదు. 2009లో బీజేపీ సైతం ఇలాంటి పాటే పాడింది. నిరుడు జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈవీఎంలను తారుమారు చేసేట్టయితే ఇది సాధ్యమయ్యేదా? ఏపీలో మళ్లీ తమకు అధికారం దక్కే అవకాశం లేదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు అర్ధమైంది. దాపురించక తప్పని ఆ ఓటమికి సాకులు వెదుక్కో వడంలో భాగంగానే ఈవీఎంల గొడవను ఆయన తలకెత్తుకున్నారు. వెనకా ముందూ చూడకుండా దానికి వంత పాడటం సరి కాదని కాంగ్రెస్‌తోసహా ఏ పార్టీ అనుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 23 మంది విపక్ష ఎమ్మెల్యేలను కొనడమే కాక, వారిలో ముగ్గురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన చంద్ర బాబుకు అసలు ఇలాంటి సమస్యను లేవనెత్తడానికి, ఉద్యమించడానికి నైతిక హక్కుందా? ఈవీ ఎంలపై సందేహాలుండటాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ సందేహాలను వ్యక్తం చేయ డానికి, వాటిపై పోరాడటానికి గడిచిన అయిదేళ్లలో ఈ పార్టీలకు తీరికే దొరకలేదా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమ వాదన సరైందని నిరూపించడానికి అవసరమైన ప్రాతిపదికల్ని కనీసం ఇప్ప టికైనా అవి రూపొందించుకోవాలి. ఈవీఎంలపై మాత్రమే కాదు... ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే లేదా ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారాన్ని ఎన్నికల సంఘానికి దఖలుపరచడం, అది ఆర్నెల్లలో నిర్ణయం ప్రకటించేలా చేయడం వంటి సంస్కరణలు అమలు కావడానికి ఉద్యమించాలి. ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తేవాలి. ఈ పార్టీలన్నీ కాలక్షేప ఉద్యమాలకు స్వస్తిపలికి నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. -
రోజుకో రివ్వూ!పూటకో భయం!
-
ఈవీఎం-వీవీప్యాట్ లెక్కలు సరిపోలకపోతే..
అమరావతి: వీవీప్యాట్ కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. అమరావతిలో గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. ప్రతి అసెంబ్లీకి ఐదు చొప్పున వీవీ ప్యాట్లను లెక్కించాల్సి ఉందన్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ పరిధిలో వేర్వేరుగా వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందని, ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాకే వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక దాని తర్వాత మరో వీవీప్యాట్ లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రతి పోలింగ్‌స్టేషన్‌కు ఒక్కో గుర్తింపు కార్డు ఇస్తారని తెలిపారు. కార్డుపై వివరాలు కనిపించకుండా లాటరీ ద్వారా వీవీప్యాట్ల ఎంపిక చేస్తారని చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో కంటైనర్ ద్వారా వీవీప్యాట్ కార్డుల ఎంపిక చేస్తామని వెల్లడించారు. వీవీప్యాట్ కార్డులు అందరికీ చూపిన తర్వాతే లాటరీలో వినియోగిస్తామని అన్నారు. ఆర్ఓ, అభ్జర్లవర్ల సమక్షంలోనే వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈవీఎం ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడా వస్తే మ్యాచ్ అయ్యేవరకు రీకౌంటింగ్ చేస్తామని పేర్కొన్నారు. ఈవీఎం, వీవీప్యాట్ లెక్కలు సరిపోలకపోతే వీవీప్యాట్‌లో వచ్చిన ఓట్లే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. -
‘49ఎంఏ’పై ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఈవీఎం లేదా వీవీప్యాట్లు సరిగా పనిచేయడం లేదంటూ ఎవరైనా ఓటరు ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదు తప్పని తేలిన పక్షంలో సదరు ఓటరుపై కేసు నమోదు చేసేలా ఉన్న నిబంధనను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలపాల్సిందిగా ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ నియమాల్లోని 49ఎంఏ నిబంధన ప్రకారం, ప్రస్తుతం తప్పుడు ఫిర్యాదు చేస్తే ఓటరుపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మెషీన్లు సరిగ్గా పనిచేయక పోవడం పట్ల ఫిర్యాదు చేస్తే ఓటరుపై కేసు నమోదు చేస్తామంటే అది ఓటరు భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనంటూ సునీల్ అహైయ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. -
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారిలా!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి.. ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీల (స్లిప్పులు) లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను జారీచేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారమే చీటీలను వెలికి తీసి అభ్యర్థుల వారీ పోలైన ఓట్లను లెక్కిస్తారు. 2014 ఎన్నికల్లో వీవీప్యాట్ యంత్రాలను వాడలేదు. ఈవీఎం యంత్రాల పనితీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఈసీ కొత్తగా వీవీప్యాట్ యంత్రాలను ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. తొలుత పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గానికి ఒక పోలింగ్ బూత్‌ను ఎంపికచేసి, అక్కడ ఉపయోగించిన వీవీప్యాట్ యంత్రంలోని చీటీలను లెక్కించాలని భావించారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు బూత్‌లోని వీవీప్యాట్లను లెక్కించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆయా యంత్రాల్లోని చీటీలను వెలికి తీసి, లెక్కింపు వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులపై లెక్కింపు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. లెక్కింపు ఇలా... ఎంపిక చేసిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీలు, దానికి అనుసంధానమై ఉన్న బ్యాలెట్ యూనిట్లో ఉన్న ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు. పోలింగ్ కేంద్రాల వారీ ఉన్న ఓట్లు, పోలైన ఓట్లు వంటి వివరాలతో రూపొందించిన ‘ఫారం–17ఏ’తో సరిపోల్చుతారు. అంతా సరిగ్గా ఉన్న తర్వాత వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఏజెంట్ల సమక్షంలో బయటకు తీస్తారు. వీటిని అభ్యర్థుల వారీగా వేరుచేస్తారు. తదుపరి 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అభ్యర్థుల వారీ విడదీసి, లెక్కింపు పూర్తి చేయడానికి 2 గంటలకుపైగా పట్టే అవకాశం ఉంది. అయిదు యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కించాల్సి ఉన్నందున సమాంతరంగా అన్నీ ఒకేసారి ప్రారంభిస్తారు. ఈవీఎం ఓట్లను లెక్కించే టేబుల్‌నే దీనికి వినియోగిస్తారు. చీటీలను మాత్రం ట్రేలో వేసి అభ్యర్థుల వారీ వేరుచేయనున్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక... లోక్‌సభ నియోజవర్గానికి సంబంధించి రాండమ్‌గా 35 వీవీప్యాట్ మెషీన్లను (అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్ మెషీన్ల చొప్పున) ఎంపికచేసి లెక్కిస్తారు. ఇదంతా అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి నిర్వహిస్తారు. లాటరీలో వచ్చిన నెంబర్ల వారీ యంత్రాలను వెలికి తీసి వాటిల్లో ఉన్న చీటీలను లెక్కించనున్నారు. లెక్కింపు ప్రక్రియ మొదలవగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లను, సర్వీసు ఓట్లను గణిస్తారు. తదుపరి ఈవీఎం యంత్రాల్లో పోలైన ఓట్లను గణిస్తారు. చివరిగా వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీల లెక్కింపు ఆరంభిస్తారు. ఇదంతా పూర్తయ్యాక విజేత పేరును అధికారికంగా ప్రకటిస్తారు. వీవీప్యాట్ యంత్రాల్లో చీటీల లెక్కింపు ఆరంభం కాకమునుపే రౌండ్ల వారీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను వెల్లడించనున్నారు. వచ్చే నెలలో లెక్కింపు సిబ్బందికి ఈ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. -
‘ఎన్నికల ఫలితాలు వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం’
సాక్షి, అమరావతి: వీవీప్యాట్ల లెక్కింపుతో సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థుల, ఏజెంట్ల సమక్షంలో అధికారులు వీవీప్యాట్ల ర్యాండమైజేషన్ చేస్తారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఐదు పోలింగ్ బూత్‌ల్లో వీవీప్యాట్లలోని స్లిప్పులను లెక్కిస్తారు. ఈ పద్దతిన రాష్ట్రవ్యాప్తంగా 1750 వీవీప్యాట్లలో పోలైన స్లిపుల్ని లెక్కించాలి. ఒక్కో వీవీప్యాట్‌లో వెయ్యి ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. ఒక వీవీప్యాట్‌లోని స్లిప్పుల లెక్కింపునకు సగటున గంట, గంటన్నర సమయం పడుతుంది. ఈ స్లిప్పులు లెక్కించే అధికారం ఆర్వో, అబ్జర్వర్లకు మాత్రమే ఉంది. దీంతో ఒక్కో అసెంబ్లీ పరిధిలో ఫలితాల వెల్లడికి సగటున ఐదారు గంటలకు పైగా సమయం పడుతుంది. ఈవీఎంలలో పోలైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులు సరిపోయిన తరువాతే ఫలితాలు వెల్లడిస్తాం. మొదట అసెంబ్లీ, తర్వాత లోక్‌సభ ఫలితాలు వెలువడుతాయ’ని తెలిపారు. -
ఏటీఎంలోకి పాము, వీడియో వైరల్
సాక్షి, కోయంబత్తూరు : కేరళలో వీవీ ప్యాట్‌లో పాము ప్రత్యక్షం అయిన ఘటన మరవకముందే ....తాజాగా ఏటీఎం మిషన్‌లోకి పాము దూరిన సంఘటన కలకలం రేపింది. తమిళనాడు కోయంబత్తూరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. థనీర్ర్పండల్ రోడ్‌లోని ఏడీబీఐ బ్యాంక్ ఏటీఎం మిషన్ నుంచి డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన ఓ కస్టమర్...పాము ఉండటాన్ని గమనించి...వెంటన అలారాన్ని మోగించాడు. సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని బ్యాంక్ దృష్టికి తీసుకు వెళ్లగా...పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. హుక్ హ్యాండిల్‌కు చుట్టుకున్న నాలుగు అడుగుల కోబ్రాను ఎట్టకేలకు పాములు పట్టే వ్యక్తి పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మూడో దశ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కేరళలోని కన్నౌర్ నియోజకవర్గంలోని మయ్యిల్ కందక్కైలో పోలింగ్ బూత్‌లోని ఓ వీవీ ప్యాట్‌లో పాము దర్శనమివ్వడంతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. చివరకు పామును బయటకు రప్పించిన అధికారులు ...పోలింగ్‌ను కొనసాగించారు. -
1 కాదు 5 లెక్కించండి
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 50 శాతం ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్(వీవీప్యాట్) స్లిప్పులను లెక్కించాలన్న విపక్షాల పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో లోక్‌సభ స్థానంలోని ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏవైనా 5 వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వసనీయత ఏర్పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. 50 శాతం వీవీప్యాట్ యంత్రాలను ఈవీఎంలతో సరిపోల్చాలని 21 విపక్ష పార్టీలు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఎక్కువ సిబ్బంది కావాలి సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సుదీప్ జైన్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతమున్న నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా 4,125 వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను ఈవీఎంల ద్వారా సరిపోల్చుతున్నాం. ఒకవేళ ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో లెక్కించాల్సిన వీవీప్యాట్ యంత్రాల సంఖ్యను పెంచితే, ఎన్నికల సిబ్బంది స్వయంగా లెక్కించాల్సి ఉంటుంది. దీనివల్ల తప్పులు జరిగే అవకాశముంది. ప్రస్తుతం వీవీప్యాట్ లెక్కింపునకు ముగ్గురు ఎన్నికల సిబ్బంది, ఓ పరిశీలకుడితో పాటు రిటర్నింగ్ అధికారిని నియమిస్తున్నాం. కానీ వీవీప్యాట్ల సంఖ్య పెరిగితే, భారీగా సిబ్బందిని విధుల్లోకి తీసుకోవడంతో పాటు వారికి విశేషమైన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది’ అని తెలిపారు. మరోవైపు విపక్షాల తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ స్పందిస్తూ.. 50 శాతం వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులను, ఈవీఎంలతో సరిపోల్చేందుకు అదనంగా 5.2 రోజుల సమయం అవసరమని ఈసీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకవేళ సిబ్బందిని పెంచితే ఫలితాల వెల్లడి ఆలస్యం కాదన్నారు. ఒకవేళ ఈసీ 50 శాతం వీవీప్యాట్లను లెక్కిస్తే ఆరు రోజులు ఆలస్యమైనా తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ర్యాండమ్ యథాతథం దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం..‘వీవీప్యాట్–ఈవీఎంల లెక్కింపునకు ప్రస్తుతం అనుసరిస్తున్న ర్యాండమ్ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది’ అని స్పష్టం చేసింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ, సుప్రీంకోర్టు తీర్పును పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటామని తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 20,600 పోలింగ్ స్టేషన్లలలో వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చనున్నారు. ఈ విషయమై ఈసీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. వీవీప్యాట్ల లెక్కింపునకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో రిజర్వులో ఉంచినవాటితో కలిపి 39.6 లక్షల ఈవీఎంలు, 17.4 లక్షల వీవీప్యాట్లు వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. -
ఎన్నికల ఫలితాలు జాప్యమైనా సరే..
న్యూఢిల్లీ: ఈవీఎం ఫలితాలతో 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చేందుకు ఓకే అంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఆర్రోజుల సమయం పట్టినా పర్లేదని ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రత దెబ్బతినడం లేదని ఈసీ తమకు భరోసా ఇవ్వగలిగితే చాలన్నారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంల ఫలితాలతో సరిపోల్చడం వల్ల ఫలితాల వెల్లడికి 5.2 రోజుల వరకు ఆలస్యమవుతుందన్న ఈసీ వాదనపై ఈ మేరకు 22 ప్రతిపక్ష పార్టీలు కోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. ధర్మాసనం దీనిపై సోమవారం వాదనలు విననుంది. ప్రస్తుత విధానంలో అసెంబ్లీ నియోజకవర్గంలోనైతే ఒక పోలింగ్ బూత్, లోక్‌సభకైతే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోని ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎం ఫలితాలను వీవీప్యాట్లతో సరిపోల్చి చూస్తున్నారు. కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చేలా ఈసీని ఆదేశించాలంటూ పార్టీలు కోర్టును ఆశ్రయించడం తెల్సిందే. -
ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కార్యక్రమం
-
ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కార్యక్రమం
సాక్షి, అమరావతి : రాబోయే ఎన్నికలకు ఈసీ సిద్దమవుతుండగా.. ఈవీఎంలు, వీవీప్యాట్లపై సచివాలయంలో ఏపీ ఎన్నికల కమీషన్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సీఈఓ గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. ఈవీఎంలపై అనుమానాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించాడు. ఈసారి కొత్తగా వీవీప్యాట్లు అందుబాటులోకి వచ్చాయని, ఓటు వేశాక సరిగా పడిందో లేదో వీవీప్యాట్ స్లిప్‌లో చూసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఏడు సెకండ్ల పాటు వీవీప్యాట్‌లో స్లిప్ కనిపిస్తుందని.. ఒక్కో నియోజకవర్గంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఒక్క వీవీప్యాట్ స్లిప్పులను మాత్రమే లెక్కిస్తామన్నారు. ఈసారి బ్యాలెట్ యూనిట్‌పై సీరియల్ నెంబర్, అభ్యర్థి పేరు, ఫోటో, గుర్తులు ఉంటాయని, 15 కంటే ఎక్కువ అభ్యర్థులు ఉంటే.. ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు ఉపయోగిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలతో సమావేశమైన ద్వివేది ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీ ఎన్నికల కమీషనర్ గోపాలకృష్ణ ద్వివేది రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఎమ్, సీపీఐ, బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ నెల ప్రకటించిన ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు సీఈవో అందజేశారు. తనకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందిస్తానని ద్వివేది తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారం సగానికిపైగా బోగసేనని అన్నారు. ఏపిలో మూడు కోట్ల 93లక్షల 45వేల 717 మంది ఓటర్లు ఉండగా.. కొత్తగా 25లక్షల 20వేల 924 మంది ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా అందిస్తారని అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు 2395మంది, 25 పార్లమెంట్ స్థానాలకు 344మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారని పేర్కొన్నారు. 15మంది కంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే అక్కడ అదనంగా మరో ఈవీఎమ్ వాడతామన్నారు. ఏపికి 200మంది అబ్జర్వర్లను కేంద్ర ఎన్నికల సంఘం పంపిందన్నారు. 75మంది జనరల్ అబ్జర్వర్లు కాగా.. 13మంది పోలీస్ అబ్జర్వర్లని, మిగిలిన వారంతా వ్యయ పరిశీలకులని పేర్కొన్నారు. ఒక్కొక్క పోలీస్ పరిశీలకుడు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉంటారని, జనరల్ అబ్జర్వర్ ఒక పార్లమెంట్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉంటారని.. వారి నెంబర్లు అందరికీ ఇస్తామని, ఏ సమస్య ఉన్నా వెంటనే సంప్రదించవచ్చని తెలిపారు. -
ఈసీ కూడా ఓటర్ల విశ్వాసాన్ని పొందాలి!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో ఓడి పోయిన ప్రతి అభ్యర్థి నెపాన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మషిన్లపైకి నెట్టడం నేడు ఫ్యాషన్ అయింది. అది సరే, ఓటర్లను విశ్వాసంలోకి తీసుకోకుండా ఓటింగ్ యంత్రాలను అదే పనిగా విమర్శించడం ఎక్కువైతే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్లనే నమ్మకం లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది. అలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఎన్నికల కమిషన్ మరింత పారదర్శకంగా, మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంది. ఈసారి ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ‘ఓటింగ్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)’ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్నికల షెడ్యూల్‌తోపాటు మార్చి 13వ తేదీన ఎన్నికల కమిషన్ ప్రకటించినప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లే అనిపించింది. ఈ వీవీపీఏటీని అంశం ఎప్పటి నుంచో సుప్రీం కోర్టులో నలుగుతోంది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలకు మరో భద్రతా వలయం ఉండాలనే ప్రతిపాదనను సుప్రీం కోర్టు ముందు ఎన్నికల కమిషన్ వ్యతిరేకిస్తూ వస్తోంది. వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదంటూ వాదిస్తూ వస్తోంది. సుప్రీం కోర్టులో సోమవారం ఈ అంశం విచారణకు వచ్చినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ అంతే మొండిగా వాదించింది. అన్ని పోలింగ్ బూత్‌ల్లో వీవీపీఏటీ వ్యవస్థను ఏర్పాటు చేయగలరా? అన్న సూచనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్క పోలింగ్ కేంద్రంలో మాత్రమే ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, అలాంటి పోలింగ్ కేంద్రంలో ఎలాంటి తేడా రానప్పుడు మిగతా పోలింగ్ కేంద్రాల్లో తేడా రానట్లేనని వాదించింది. వీవీపీఏటీ వ్యవస్థను మరింత విస్తరించేది, లేనిది తెలియజేస్తూ ఓ లిఖితపూర్వక సమాధానం ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను సుప్రీం కోర్టు ఆదేశిస్తూ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. మళ్లీ బ్యాలెట్ పత్రాల ఓటింగ్‌కు వెళ్లాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో విశ్వసనీయతను పెంచేందుకు వీవీపీఏటీ వ్యవస్థను ప్రతి బూతుకు ప్రతి మిషన్‌కు విస్తరించాల్సిన అవసరం ఉంది. అత్యాధునిక టెక్నాలజీ యుగంలోనూ యుగంలోను ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరుగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడమే కాదు, నిజంగా ట్యాంపరింగ్ జరగలేదని ప్రజలు విశ్వసించే విధంగా ఉండాలి. -
వీవీప్యాట్ లెక్కింపు కేంద్రాలను పెంచండి
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ స్థానానికి మించి వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించే విషయంలో అభిప్రాయం తెలపాలని సోమవారం ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో మార్చి 28లోగా జవాబివ్వాలని తెలిపింది. ఓటర్ల సంతృప్తికోసం వీవీపాట్ల స్లిప్పుల లెక్కింపు కేంద్రాలను పెంచే యోచనపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరింది. ఈ మేరకు ధర్మాసనం మార్చి 28, సాయంత్రం 4లోగా స్పందన తెలపాలని సూచించింది. ‘వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించే పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచాలని మేం ఆదేశిస్తున్నాం’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘తమను తాము మెరుగుపరుచుకునేందుకు ఏ వ్యవస్థ కూడా అతీతం కాదు. వ్యవస్థలో ప్రతీదీ మెరుగుపర్చుకోవడానికి ఒక విధానం ఉంది,‘ అని ధర్మాసనం పేర్కొంది. ఇది ఇప్పటికే ఉన్న వ్యవస్థపై అస్పష్టతగా భావించలేం.. కానీ ప్రామాణికతను మెరుగుపరిచేందుకు ఈసీకి అభ్యంతరం లేదని భావిస్తున్నాం’ అని స్పష్టం చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం యాభై శాతం పోలింగ్ మిషన్లలో వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని దేశంలోని 21 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును కోరిన విషయం తెలిసిందే. -
ఓటర్లు ఎక్కువ.. సమయం తక్కువ!
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఓట్ల శాతం పెంపునకు విసృత్త ప్రచారం చేస్తూంటుంది. ఓటర్లను చైతన్యపర్చడానికి అవగాహన కార్యక్రమాలతో పాటు వివిధ రకాల ప్రకటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూంటుంది. అయినా ఎన్నికల సంఘం అనుకున్న స్థాయిలో ఓట్ల శాతం పెరగడం లేదు. మరోవైపు ఓటింగ్ టైం మేనేజ్మెంట్ను పరిశీలించగా ఓటరు శాతం పెరగడానికి చేస్తున్న ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఓటింగ్ టైం ప్రకారం పోలింగ్ బూత్‌లో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని, వారికి సమయం సరిపోదని తెలుస్తోంది. ఒక ఓటరు ఓటు వేయడానికి కనీసం రెండు నిమిషాలు అనుకున్న గంటకు 60 ఓట్లు పడతాయి. పది గంటల్లో 600 ఓట్లు పడే అవకాశం ఉంది. ఒకవేళ క్రమం తప్పకుండా ఓట్లు వేసినా మరో 100– 150 మందికి ఓటు వేసే అవకాశం దక్కుతుంది. ఇలా దాదాపు 750 మందికి పది గంటల్లో ఓటు వినియోగించే అవకాశం దక్కవచ్చు. ఎందు కంటే గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాల పోలింగ్‌బూత్‌ల్లో 900 నుంచి 1200 వందల వరకు ఓటర్లు ఉన్నారు. పోలింగ్ బూత్‌ల పరిస్థితి ఇదీ.. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ బూత్‌ల్లో పోలింగ్ మేనేజ్మెంట్ సక్రమంగా ఉన్నా మిగతా నియోజకవర్గాల్లో పోలింగ్ మేనేజ్మెంట్ దారుణంగా ఉంది. ఎన్నికల నిర్వహణా అధికారులు ఏ లెక్క ప్రకారం పోలింగ్ బూత్‌లో 1200 వరకు అత్యధికంగా ఓటర్లు ఉండవచ్చని నిర్ధారించారో తెలియండంలేదు. ఓటింగ్ సమయం పది గంటలు ఉంది. ప్రతి ఓటరుకు పట్టే సమయం నిముషం అనుకున్న గంటకు 60 ఓట్లు పడతాయని, పది గంటల్లో కేవలం 600 ఓట్లు మాత్రమే పడతాయి. ఈ ఎన్నికల నుంచి వీవీ ప్యాట్ కూడా ఉంది. ఇందులో అభ్యర్థి గుర్తును చూసే అవకాశం ఉంది. దీంతో సమయం మరింత పట్టవచ్చు. 10 గంటలు కేవలం 600 మందే.. ఒక ఓటరు ఓటు వేయడానికి తన ఓటరు కార్డు తీసుకొని పోలింగ్ కేంద్రానికి వస్తే అతడికి నాలుగు రకాల ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయా పార్టీల అభ్యర్థుల ఓటు నిర్ధారణ అనంతరం ప్రిసైడింగ్, అసిస్టెంట్, పోలింగ్ అధికారులు తదుపరి ప్రక్రియ కొనసాగిస్తారు. ఓటరు లిస్టులో సదరు వ్యక్తి ఓటు ఉన్నట్లు గుర్తిస్తారు. ఓటరు వేలిపై ఇంక్ పెడతారు. అధికారి బ్యాలెట్ రిలీజ్ చేస్తారు. ఓటరు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి బటన్ నొక్కుతాడు. అనంతరం వీవీ ప్యాట్‌లో ఏ గుర్తుకు ఓటు వేశారో అది ఏడు సెకన్ల వరకు కనబడుతుంది. ఇలా ఒక ఓటరు ఓటు వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేసినా కనీసం ఒక్క నిమిషం సేపు పడుతుంది. ఒక పోలింగ్ బూత్‌లో 1200 వరకు ఓట్లు పోలింగ్ సమయం 10 గంటల వ్యవధి ఉంది. పది గంటల్లో కేవలం ప్రతి ఓటరు రెండు నిమిషాల సమయం కేటాయించినా కేవలం 600 మందికే ఓటు వేసే అవకాశం ఉంది. అయితే పలు పోలింగ్ బూత్‌లో 1200 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కనీసం 50 లేదా 60 శాతం ఓటింగ్ అయినా 600 నుంచి 720 మంది ఓట్లు వేయడానికి అవకాశం ఉండదు. ఓటింగ్ వేసే సమయం పది గంటలు ఇందులో 600 ఓట్లు పడతాయి. అదే ఓటరు వేసే ఓటింగ్ ప్రక్రియ చూస్తే కనీసం రెండు నిమిషాలైనా సరిపోదని ఎన్నిక అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి పోలింగ్ బూత్‌లో ఎక్కువగా 1200 ఓట్లు, తక్కువగా 900 వరకు ఉన్నాయి. ఎన్నికల ఐటీ విభాగం పోలింగ్ బూత్‌లో అత్యధికంగా 1200 వరకు ఓటర్లు ఉండవచ్చని నిర్ధారించారు. ఏ లెక్క ప్రకారం 1200 లేదా అందులో సగం అంటే 50 శాతం 600 మంది పది గంటల్లో ఓటు ఏలా వేస్తారో వారికే తెలియాలి. అంతుచిక్కని ఎన్నికల సమయం ఓటింగ్ శాతం పెంచాలని ఎన్నికల సంఘం ప్రచారం చేస్తున్నా.. ప్రతి ఓటింగ్ బూత్‌లో 900– 1200 మంది వరకు ఓట్లు నమోదై ఉన్నాయి. అధికారులు చెబుతున్న ప్రకారం ప్రతి ఓటరుకు కనీసం రెండు నిమిషాలు అవుతుందని చెప్పినా.. ఓటింగ్ శాతం 50– 60 శాతం ఓటింగ్ అయినా సమయం ఎలా సరిపోతుందో అంతుపట్టడంలేదు. పొంతన లేని సమాధానాలు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల సమయానికి పోలింగ్ బూత్‌లో నమోదయిన ఓటరు జాబితా ప్రకారం 30– 40 శాతం ఓటింగ్‌కు సమయం సరిపోయే విధంగా ఉంది. ఈ విషయంలో ఎన్నికల అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు ఈవీఎం టైమ్ నిర్ధారణ ఓటరు లిస్టులో ఉన్న ఓటర్ల సంఖ్య ఇరు విభాగాలకు తెలియదు. దీంతో ఇలాంటి విషయం గురించి ఎన్నికల సంఘానికి తెలియవని, పోలింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. కొత్త ఓటర్లు 56,000 నగరంలో ఓటరు చైతన్యం పెరుగుతోంది. రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక, లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు 60వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 15వ తేదీలోపు హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఇది. ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటేనే లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశముంటుందని అధికారులు, మీడియా విస్తృతంగా ప్రచార కార్యక్రమా లు నిర్వహించిన నేపథ్యంలో స్వల్ప వ్యవధిలోనే 60వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన అధికారులు వీరిలో 56వేల మందికిపైగా అర్హులని గుర్తించారు. వచ్చే నెల 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వీరంతా ఓటేయనున్నారు. అందిన దరఖాస్తుల్లో దాదాపు 200 దరఖాస్తుల్ని మాత్రం అధికారులు పరిశీలించాల్సి ఉంది. కొత్తగా పేరు నమోదు కోసం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సగటున 3వేల నుంచి 4వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. గతం లో మాదిరే అత్యధికంగా జూబ్లీహిల్స్ నుంచి 5,784 మంది కొత్తగా ఓటరు జాబితాలో పేరు కోసం దర ఖాస్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ నుం చి 5,747 మంది, అంబర్‌పేట నుంచి 5,269 మంది దరఖాస్తు చేసుకున్నారు. చార్మినార్ నుంచి 1934 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. -
ఈవీఎం, వీవీఫ్యాట్లపై అవగాహన
సాక్షి, గోపాల్పేట: ఉమ్మడి గోపాల్పేట మండలంలోని ఏదుట్ల, గొల్లపల్లి గ్రామాల్లో మంగళవారం ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏదుట్ల గ్రామంలోని కూలీలకు, గ్రామస్తులకు ఓటుహక్కు, మరియు ఓటును ఎలా వినియోగించుకోవాలని అధికారులు అవగాహన కల్పించారు. ఇంతకు ముందు ఓటు వేసేప్పుడు బీప్ శబ్ధం మాత్రమే వచ్చేదని ఇప్పుడు బీప్ శబ్ధంతో పాటు వారి ఓటుహక్కు ఎవరికి వినియోగించుకున్నారో వీవీప్యాట్‌లో చూపెడుతుందని అధికారులు వివరించి చెప్పారు. గొల్లపల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సులో గ్రామస్తులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఓటు ఎలా వేయాలో తెలుసుకున్నారు. సర్పంచ్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఓటును డబ్బులకు, లేదా మద్యానికి అమ్ముకోకుండా నిజాయితీగా వారికి ఏ నాయకుడు మేలు చేస్తాడో వారికే ఓటు వేయాలని సూచించాడు కార్యక్రమంలో వీఆర్ఓ కిషన్‌రావు, వీఆర్ఏ సతీష్ కుమార్, ఉడుముల యాదగిరి ఉన్నారు. గడువులోగా అభ్యంతరాలు తెలపాలి పాన్‌గల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై గడువులోగా తెలియపర్చాలని ఎంపీడీఓ సాయిబ్రింద అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పరిషత్ ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. డ్రాఫ్ట్ జాబితాపై ఈనెల 25 వరకు అభ్యంతరాలను స్వీకరించి మార్పులు చేస్తామన్నారు. పరిషత్ ఎన్నికలపై ఈనెల 27న తుది జాబితా విడుదల చేస్తామన్నారు. గడువులోగా అభ్యంతరాలు తెల్పకుంటే మార్పులకు అవకాశం ఉండదన్నారు. ఓటర్ల తుది జాబితా తర్వాత ఆయా రాజకీయ పార్టీల నేతలకు ఓటర్ల జాబితా ప్రతిని అందజేస్తామన్నారు. -
ఈవీఎం వయస్సు 36 ఏళ్లు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం) పుట్టి 36 ఏళ్లు అవుతోంది. ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలకు ప్రత్యామ్నాయంగా ఈ యంత్రాలను ప్రవేశ పెట్టింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవీఎంల పుట్టుకతో వాటి నిర్వహణ లోపాలు, సందేహాలతో కొంత కాలం కొట్టుమిట్టాడి ఆ తర్వాత నిలదొక్కుకుంది. అప్పటి నుంచి అనేక ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగిస్తున్నారు. మొదటి సారి కేరళ రాష్ట్రం పరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 19 మే 1982లో ఈవీఎంలను వినియోగించారు. ఆ తర్వాత 1982, 83లో జరిగిన ఉపఎన్నికల్లో దేశవ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో వీటిని వాడారు. ఈవీఎంలను ఉపయోగించవద్దని 1984, మే 5వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంల వాడకాన్ని 1988 డిసెంబర్లో కేంద్రం సెక్షన్ 61 ఏ ద్వారా ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేర్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 61 ఏ సవరణ 1989 మార్చి 15న అమల్లోకి తేవడంతో ఆ తర్వాత సుప్రీం కూడా సమర్థించింది. జనవరి 1990లో ఎన్నికల సంస్కరణల కమిటీ(ఈఆర్సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఏప్రిల్‌లో ఈవీఎంల వాడకాన్ని సాంకేతిక నిపుణుల కమిటీ సమర్థించింది. ఎన్నికల సవరణను 1992 మార్చి 24న ఎన్నికల నియమావళి 1961ని ప్రభుత్వం అధీకృతం చేసింది. ఈవీఎంల వాడకానికి 1998లో ప్రజామోదం లభించింది. వివిధ రాష్ట్రాల్లో 1999, 2004 సంవత్సరాల్లో వివిధ శాసనసభల ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వినియోగించారు. లోక్‌సభకు 2004–14 మధ్య జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఈవీఎంలను వినియోగించారు. వీవీ ప్యాట్ల వినియోగాన్ని 2013 ఆగస్టు 14న ఈవీఎంలకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. నాగాలాండ్ రాష్ట్రంలోని నాక్సెన్ అసెంబ్లీ నియోజకవర్గానికి 2013 సెప్టెంబర్ 4న వీవీ ప్యాట్లను మొదటిసారిగా వినియోగించారు. 2013 అక్టోబర్ 8న దశలవారీగా వీవీ ప్యాట్లను వినియోగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దశల వారీగా 2013 నుంచి వీవీ ప్యాట్లను ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. 2017 ఏప్రిల్‌లో రూ. 3,173.47 కోట్లతో 16.15 లక్షల వీవీ ప్యాట్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కూడా వీవీ ప్యాట్లను వినియోగించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. -
బ్యాలెట్ నుంచి వీవీ ప్యాట్ వరకూ..
సాక్షి, పశ్చిమ గోదావరి : మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానం మార్పును సంతరించుకుంటోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల సంఘం కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడగా 1951లో దేశంలో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. తొలినాళ్లలో బ్యాలెట్ విధానాన్ని ఎన్నికల సంఘం తీసుకువచ్చింది. ఈ విధానంలో బ్యాలెట్ పేపర్‌పై ఓటర్ అభ్యర్థిని ఎన్నుకునేలా ముద్ర వేసి బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. అనంతరం బ్యాలెట్ పేపర్లను లెక్కించి విజేతను ప్రకటించేవారు. 2004 వరకు ఇదే విధానం కొనసాగగా 2004 సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలు (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) అందుబాటులోకి వచ్చాయి. ఈవీఎం వినియోగంపై ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం పారదర్శకత కోసం వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్)ను ప్రవేశపెట్టింది. ఈసారి ఎన్నికల్లో వీవీ ప్యాట్‌ను వినియోగించనున్నారు. వీవీ ప్యాట్ అంటే.. ఇటీవల తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వీవీ ప్యాట్‌ను ప్రవేశపెట్టింది. ఓటు వేసిన తర్వాత ఎవరికి పడిందో సరిచూసుకునే వెసులుబాటు కల్పిస్తుండటం వీవీ ప్యాట్ ప్రత్యేకం. ఇందుకోసం వీవీప్యాట్ అనే అత్యాధునిక యంత్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఈ సరికొత్త యంత్రం ద్వారా ఎలా ఓటు వేయాలో తెలుసుకుందాం. వీవీప్యాట్ ద్వారా ఓటు వేసే విధానం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే అక్కడ ఓటింగ్ కోసం మూడు యంత్రాలు కనిపిస్తాయి. అవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. పోలింగ్ అధికారి తన వద్ద ఉండే కంట్రోల్ యూనిట్ ద్వారా మనల్ని ఓటింగ్‌కు అనుమతిస్తారు. అధికారులు చెప్పిన తర్వాత మనం ఓటు వేయడానికి బ్యాలెట్ యూనిట్ ఉంచిన బూత్‌లోకి వెళ్లాలి. బ్యాలెట్ యూనిట్ మీద అభ్యర్థులకు సంబంధించిన పార్టీల గుర్తులు ఉంటాయి. మనం మొదటగా బ్యాలెట్ యూనిట్లో మనకు నచ్చిన గుర్తుకు ఓటు వేస్తాం. ఎవరూ నచ్చకపోతే ‘నోటా’ బటన్‌పై క్లిక్ చేస్తాం. మనం ఓటు వేసిన వెంటనే ఏ అభ్యర్థికి ఓటు వేశామో.. ఆ అభ్యర్థికి సంబంధించిన గుర్తు ముద్రించిన కాగితం ఒకటి వీవీప్యాట్ యంత్రానికి అమర్చిన అద్దం వెనకాల కనిపిస్తుంది. ఇది 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. దానిని పరిశీలించి మనం ఎంచుకున్న అభ్యర్థికే ఓటు పడిందా, లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఈ విధానంలో ఏ గుర్తుకు ఓటు వేశామో అక్కడికక్కడే కచ్చితంగా ధ్రువీకరించుకోవచ్చు. వీవీప్యాట్‌తో ఓటు వీవీప్యాట్‌లో కనిపించిన కాగితం ముక్క 7 సెకన్ల అనంతరం.. యంత్రం అడుగు భాగంలో అమర్చిన బాక్సులోకి వెళ్లిపోతుంది. అది ఇక బయటకిరాదు. దీంతో మన ఓటు ప్రక్రియ ముగిసినట్లు. యంత్రం పనితీరుపై అభ్యర్థి ఎప్పుడైనా అనుమానం వ్యక్తం చేస్తే ఆ కాగితపు ముక్కలను పరిశీలించి, లెక్కించే సౌలభ్యం ఉండటం ఈ సరికొత్త ఓటింగ్ విధానం ప్రత్యేకత. -
వీవీప్యాట్ల తనిఖీ : ఈసీకి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం స్పందించింది. ఈ పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణ సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఒక అధికారి కోర్టుకు హాజరుకావాలని సుప్రీం ఆదేశించింది. మార్చి 25లోగా దీనిపై బదులివ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈసీని కోరింది. ఈవీఎంలలో నమోదైన ఓట్లకు వీవీప్యాట్ యంత్రాల స్లిప్పుల మధ్య వ్యత్యాసం నెలకొంటున్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లకు, వీవీప్యాట్ యంత్రాలు జారీచేసిన రసీదులను సరిపోల్చి చూడాల్సిందేనని ఆయా పార్టీలు కోర్టును అభ్యర్ధించాయి. కాగా, నియోజకవర్గంలో ఎంపిక చేసిన బూత్‌లోనే వీవీపాట్ల పరిశీలన చేపట్టాలన్న ఈసీ నిర్ణయాన్ని పిటిషనర్లు కోర్టులో సవాల్ చేశారు. ఈసీ నిర్ణయంతో పోలయిన ఓట్లలో కేవలం 0.44 శాతం ఓట్లనే వీవీప్యాట్ స్లిప్‌లతో సరిపోల్చుతారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్ల సమర్ధ వినియోగానికి కనీసం సగం వీవీప్యాట్ స్లిప్‌లను పరిశీలించాలని పిటిషనర్లు కోరారు. ఈవీఎంలతో పాటు కనీసం 50 శాతం వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులను లెక్కించేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ కోర్టును కోరింది. ఏపీ సీఎం చంద్రబాబు సహా 21 రాజకీయ పార్టీల నేతలు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. -
మే మొదటి వారంలో పరిషత్ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు మే నెల మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తొలిదశలోనే (ఏప్రిల్ 11) తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ రెండో నోటిఫికేషన్ ఇచ్చి.. దీనికి అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలు గడువు ముగిసేలోపు (మే 25) జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ముగించేలా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబరులో అసెంబ్లీ, జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇలా వరుస ఎన్నికల నేపథ్యంలో నెలల తరబడి ఎన్నికల నియమావళి అమల్లో ఉంటోంది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల పురోగతి ఉండటంలేదు. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను త్వరగా ముగించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈవీఎంలతో పరిషత్ ఎన్నికల్లో ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలు (ఈవీఎం) ఉపయోగించాలనే ఆలోచనలో ఎస్ఈసీ ఉంది. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై టీఆర్ఎస్, తదితర పార్టీల నుంచి సానుకూలత వ్యక్తమైనట్టు సమాచారం. ఈ ఎన్నికలు రెండువిడతల్లో నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తోంది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలను ఉపయోగించాలనే ఆలోచనతో ఎస్ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కూడా అన్ని పార్టీలనుంచి ఆమోదం వచ్చినట్లు సమాచారం. వేగంగా ఏర్పాట్లు పరిషత్ ఎన్నికలకోసం ఎస్ఈసీ ఏర్పాట్లును వేగవంతం చేసింది. వచ్చే జూలై 4న కొత్త జడ్పీలు, ఎంపీపీ పాలకవర్గాలు ఏర్పడేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలోని పాత 9 జడ్పీల స్థానంలో 32 జడ్పీల చైర్పర్సన్లు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాల పరిధిలో ఎంపీపీ అధ్యక్ష స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. కొత్త జడ్పీలు, ఎంపీపీల పరిధిలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కూడా పూర్తయింది. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సరిహద్దులు ఖరారయ్యాయి. 32 జడ్పీలు, 535 ఎంపీపీలు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ ప్రక్రియను పూర్తిచేయడంలో భాగంగా ఇప్పటికే పాత 9 జడ్పీల స్థానంలో జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా 32 జడ్పీలు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాలను ఎంపీపీలుగా పునర్విభజన పూర్తిచేశారు. 32 జడ్పీ చైర్పర్సన్లు, 535 ఎంపీపీలకు సంబంధించి ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో మొత్తం 5,984 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్టు సమాచారం. కొత్తగా 68 మున్సిపాటిలీలు ఏర్పడిన నేప థ్యంలో ఆయా మండలాల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీలను వాటిలో విలీనం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 489 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 27న ఓటర్ల తుది జాబితా ఈ నెల 27న రాష్ట్రంలో గ్రామపంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఎస్ఈసీ ఇదివరకే ఆదేశించింది. తుది జాబితా సిద్ధం చేసి మార్చి 27న ప్రచురించాలని గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సూచించిన మేరకు వార్డుల విభజన పూర్తిచేయాలని ఆదేశాలొచ్చాయి. ఈ నెల 16న వార్డుల వారీగా విభజించిన గ్రామపంచాయతీ ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ జాబితాలపై వివిధ ప్రక్రియలను నిర్వహించాక 27న డీపీవో చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా గ్రామపంచాయతీ ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రచురించాలి. -
వచ్చేసింది.. ఓట్ల పండుగ
పేరు చెప్పడానికీ సిగ్గుపడే దశ నుంచి... ఓటు మా హక్కు అని మహిళలు గొంతెత్తే వరకూ... నా ఒక్క ఓటేయకపోతే పోయేదేముందిలే అనుకునే దగ్గర్నుంచి... బాధ్యతగా చేసుకున్న మిలినియల్స్ వరకూ.. గల్లీ గల్లీ తిరిగి కరపత్రాలు పంచి ప్రచారం చేసే స్థాయి నుంచి... కాక రేపే ఫేస్బుక్ పోస్టు ఒక్కటి చాలని అనుకునే వరకు... గెలిచింది ఎవరో తెలిసేందుకు రోజులు పట్టే కాలం నుంచి.. గంటల్లో విజేతలను నిర్ణయించే దశ వరకూ... ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం.. మన భారతీయంలో వింతలు విశేషాలు.. అన్నీ ఇన్నీ కావు! సామాన్యుడు.. దేవుడయ్యే సమయం దగ్గరకొచ్చింది! ఎడమచేతి చూపుడువేలిపై సిరా గుర్తు పడే రోజు వచ్చేస్తోంది! ఏడు దశాబ్దాల ఎన్నికల పండుగ ప్రజాస్వామ్య ప్రస్థానం సాగింది ఇలా... అభ్యర్థికో బాక్స్ నుంచి ఈవీఎంల వరకు మన ఎన్నికల ప్రక్రియ అభ్యర్థికో బాక్స్ నుంచి బ్యాలెట్ పత్రం దిశగా వెళుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు చేరుకుంది. తొలి ఎన్నికల్లో ప్రతీ అభ్యర్థికి వేర్వేరు రంగుల్లో ఉన్న ఒక్కో బ్యాలెట్ బాక్స్‌ని కేటాయించారు. ఆ బాక్స్‌పై వారి పేరు, ఎన్నికల గుర్తుని పెయింట్ చేశారు. ప్రతీ పోలింగ్ బూత్‌లో బరిలో ఉన్న అభ్యర్థులు ఒక్కొక్కరికీ ఒక బ్యాలెట్ బాక్స్ అన్నమాట. నచ్చిన అభ్యర్థి బ్యాలెట్ బాక్స్‌లో ఓటరు బ్యాలెట్ పేపర్‌ను వేస్తే సరిపోతుంది. అప్పట్లో ఈ బ్యాలెట్ బాక్స్‌లను గోద్రేజ్ కంపెనీ బొంబాయిలోని విఖ్రోలి ప్రాంతంలో తయారు చేసింది. 1957 ఎన్నికల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించారు. మూడవ సార్వత్రిక ఎన్నికల (1962)లో బరిలో ఉన్న అభ్యర్థులు, గుర్తులను ఒకే బ్యాలెట్ పేపర్‌పై ముద్రించారు. ఇరవైఏళ్లపాటు ఇదే పద్ధతి కొనసాగగా.. 1982లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) వాడారు. అయితే అప్పట్లో పరూరు నియోజకవర్గంలోని 50 పోలింగ్ స్టేషన్లకే వీటిని పరిమితం చేశారు. 1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాల్లో వీటిని మరోసారి పరీక్షించారు. ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వడంతో 2004లో తొలిసారి మొత్తం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈవీఎంల వాడకం మొదలుపెట్టారు. అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో ఓటింగ్ ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు 2010లో ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీప్యాట్)లను ప్రవేశపెట్టారు. ఈవీఎంల వాడకంతో ఓటింగ్ ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా, ఫలితాల ప్రకటన కూడా వేగవంతమైంది. పోలింగ్ కేంద్రాల్లో జరిగే రిగ్గింగ్, ఆక్రమణ వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమైంది. తక్కువ బరువు ఉండటం వల్ల ఈవీఎల రవాణ కూడా సులభం. ఒక్కో ఈవీఎం ఖరీదు ఐదారు వేలు ఉంటుంది. పదిహేనేళ్ల పాటు పని చేస్తుంది. ఇన్ని లాభాలున్నా.. ఈవీఎంలలో లోపాలున్నాయన్న ఆరోపణలు రావడం సాధారణమైపోయింది. కాలినడక, పడవల్లో, ఏనుగులపై ప్రయాణాలు ఒకప్పుడు ప్రయాణ సాధనాలు అంతగా లేవు. సరైన రహదారి సౌకర్యాలు ఉండేవి కావు. కొండ ప్రాంతాల్లోనూ, నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, ఎడారుల్లోనూ, సముద్రం మధ్య ద్వీపాల్లోనూ ఓటింగ్ నిర్వహణ దుర్లభంగా ఉండేది. ఎన్నికల కమిషన్ సభ్యులు నానా పాట్లు పడేవారు. ఎన్నికల సామగ్రి మోసుకుంటూ మైళ్లకి మైళ్లు నడిచే పరిస్థితి. ఇఅదీ ప్రజాస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం. హిందూమహాసముద్రం ద్వీపాల్లో ఎన్నికల కోసం ఏకంగా నేవీ అధికారుల సాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని చేర్చడానికి హెలికాప్టర్ సాయం తీసుకునే వారు. ఇప్పుడు ప్రయాణ సాధనాలు మెరుగు పడినప్పటికీ అటవీ ప్రాంత పోలింగ్ స్టేషన్లకి వెళ్లాలంటే కాలినడకే మార్గం. ఇక ప్రత్యేక వాహనాలు, రైళ్లు, హెలికాప్టర్లు, బోట్లలో కూడా సిబ్బందని తరలిస్తారు. కొన్నిసార్లు పోలింగ్ స్టేషన్ చేరుకోవడానికి ఏనుగులు వాడిన సందర్భాలూ లేకపోలేదు. రాజస్థాన్ వంటి ఎడారుల్లో ఒంటెలే సాధనం. దేశం మొత్తమ్మీద దాదాపుగా 80 వేల పోలింగ్ కేంద్రాల వద్ద మోబైల్ఫోన్ సౌకర్యం కూడా లేదు. ఇంకో ఇరవై వేల పోలింగ్ స్టేషన్లు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కడున్నాడు! ఒక్క ఓటు. ఒకే ఒక్క ఓటు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది కూడా ఎంతో కీలకం. అందుకే ఎన్నికల సంఘం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మరీ గుజరాత్లో దట్టమైన గిర్ అడవుల్లోకి కాలినడకన వెళుతుంది. ఆ ఒక్కడి కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అతని పేరు మహంత్ భరత్‌దాస్ దర్శన్ దాస్. ఆలయపూజారి. ఆయన ప్రతీ ఏడాది తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సిబ్బంది గిర్ అడవుల్లోని బనేజ్కు ఏకంగా 35 కి.మీ. ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణంలో వారిని సింహాలు భయపెడతాయి. అడవి జంతువులు ఎదురవుతాయి. అయినా ప్రాణాలకు తెగించి మరీ ఆ ఒక్క ఓటు నమోదు కోసమే అధికారులు వెళతారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ పౌరుడు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 2 కి.మీ.దూరానికి మించి ప్రయాణించకూడదు. అందుకే తాము భరత్‌దాస్ దగ్గరకి వెళతామని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఆ ప్రాంతంలో ఫోన్లు పని చెయ్యవు. టీవీ రాదు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అయినప్పటికీ దర్శన్‌దాస్ శివుడిపై అపారమైన భక్తితో ఆ ప్రాంతంలోనే చాలా ఏళ్లుగా ఉంటున్నారు. చూడడానికి కాస్త ఆధునికంగానే కనిపిస్తారు. 60 ఏళ్లు దాటిన దర్శన్ దాస్ నల్ల కళ్లద్దాలు,తెల్ల గడ్డం, తలకి టోపీతో అందరినీ ఆకర్షిస్తుంటారు. ఆయనపై నమ్మకంతో ఆ అడవిలో వెళ్లేవారికి ఆధ్యాత్మిక బోధనలు చేస్తారు. పౌర సమాజానికి దూరంగా విసిరేసి ఉన్నప్పటికీ ఆయనకు ఓటు విలువ గురించి బాగా తెలుసు. ‘‘నా ఓటు ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. వాజపేయి సర్కార్ కేవలం ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిపోయింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని ఎన్నికల సిబ్బంది ఇంత దూరం వస్తున్నందుకు వారిని ఎంతో గౌరవిస్తాను. నా ఓటు ఎంత విలువైనదో తెలుసుకొని గర్విస్తాను‘‘ అని అంటారు. ఒక్క వ్యక్తి కోసం పోలింగ్ బూల్ ఏర్పాటు చేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చాక ఎందరో జర్నలిస్టులు గిర్ అడవుల్లోకి వెళ్లి భరత్దాస్తో మాట్లాడారు. అతని ప్రత్యేకతను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. శభాష్ శరణ్.. ఆయనకు ఓటంటే బాధ్యత శ్యామ్ శరణ్ నేగి. ఆయన వయసు 102 సంవత్సరాలు. మన దేశంలో అతి పెద్ద వయసున్న ఓటరు ఆయనే. స్వాతంత్య్ర సమర సంగ్రామంలో పాల్గొన్న నేగికు ఓటు అంటే హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. అందుకే ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్న ఏకైక ఓటరుగా ఆయన రికార్డులకెక్కారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కల్పా అనే చిన్న గ్రామంలో ఉంటారు. కిన్నెర కైలాస్ పర్వత శ్రేణుల్లో ఉండే ఆ గ్రామంలో నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయరు. మొదటి ఓటు తనే వేయాలనుకుంటారు. దీనికి గ్రామస్తులు కూడా సహకరిస్తారు. పొద్దున్నే ఇంకా ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్ తెరవక ముందే ఉన్ని కోటు వేసుకొని ఆయన వస్తారు. గ్రామస్తులందరూ కూడా ఆయనకు గౌరవాన్ని ఇచ్చి దారి విడిచిపెడతారు. 1951–52లో జరిగే మొదటి ఎన్నికల్లో కూడా నేగి తొలి ఓటును వేసి ప్రజాస్వామ్య భారతంలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తిగా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. అప్పట్నుంచి వేగి ప్రతీసారి ఎన్నికల్లో తన ఓటు హక్కుని వినియోగించుకుంటూనే ఉన్నారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వ్యక్తిగా మహాత్మగాంధీ సిద్ధాంతాలను ఆయన బాగా ఒంట బట్టించుకున్నారు. నూలు ఒడికి ఖాదీ వస్త్రాలు ధరించేవారు. ఒకప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పలేనంత ఇష్టం ఉండేది. దేశానికి స్వాతంత్య్రం సాధించిన పార్టీగా ఆయనకు కాంగ్రెస్ పట్ల దేశభక్తి పొంగిపొర్లేది. కానీ కాలంతోపాటు ఆయన అభిప్రాయాలూ మారిపోయాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అత్యంత ఇష్టమైన నాయకుడు. ‘‘ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్ కాదు. ఎన్నో కుంభకోణాలకు పాల్పడింది. ఇప్పుడున్న నేతల్లో మోదీనే అభిమానిస్తాను. అవినీతిని అంతమొందించడానికి ఆయన తనకు చేతనైంది చేస్తున్నారు‘‘ అంటూ ప్రశంసిస్తారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఓటేసేందుకు ఆయన అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తొలి అడుగు.. సుకుమార్ సేన్ చుట్టూ చీకటి. ముందున్న దారి కనిపించదు. అడుగు ఎలా వెయ్యాలో తెలీదు. కానీ వెయ్యాలి. ఎవరో ఒకరు ముందుగా నడవాలి. అలా నడిచి మన ఎన్నికల వ్యవస్థని ఒక గాడిలో పెట్టింది మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్‌సేన్. ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసీఎస్) అధికారిగా, న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియకు తొలిసారిగా వేసిన బాట మరువలేనిది. ఎన్నికల నిర్వహణకు ముందు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల జాబితా రూపకల్పనలో సుకుమార్ సేన్ బృందానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఓటర్లలో 70 శాతం నిరక్షరాస్యులు కావడం, మహిళా ఓటర్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో ఓటర్ల జాబితా రూపొందించడమే కష్టసాధ్యమైంది. దీంతో చాలా మంది ఓటు హక్కు పొందలేకపోయారు. 17 కోట్ల మంది ఓట్లతో తొలి జాబితా రూపొందింది. ఎన్నికల్లో బూత్‌ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బ్యాక్స్‌లు రూపొందించడం వంటివన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసి సుకుమార్ సేన్ బృందం విజయవంతమైంది. తొలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలల పాటు జరిగింది. ఒకసారి వేటు వేసిన వాళ్లు మళ్లీ ఓటు వెయ్యకుండా చూపుడు వేలి మీద ఇంకు గుర్తు వేయడం తొలి ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. నేపాల్, ఇండోనేసియా, సూడాన్ వంటి దేశాలు భారత్ ఎన్నికల నిర్వహణను దగ్గరుండి పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్‌లో తొలి ఎన్నికల నిర్వహణను శెభాష్ అంటూ ప్రశంసించింది. సూడాన్ దేశం కూడా తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతను సుకుమార్ సేన్ చేతుల్లోనే పెట్టింది. కానీ ఆయనకు రావల్సిన గుర్తింపు రాలేదని రామచంద్రగుహ వంటి చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. భారతరత్న పురస్కారం ఇవ్వదగిన వ్యక్తిని చరిత్ర మరచిపోయిందన్నది ఆయన అభిప్రాయం. ఎన్నికల సిత్రాలు అనామకుడి చేతిలో ఓడిన అంబేడ్కర్... రాజ్యాంగ నిర్మాత, భారత తొలి న్యాయశాఖా మంత్రి, తరతరాలుగా అణచివేతకు గురవుతోన్న అట్టడుగు వర్గాలైన దళిత, ఆదివాసీలకు ప్రత్యేక నియోజవకర్గాలకోసం అహరహం కృషిచేసి రిజర్వుడు నియోజకవర్గాలను తీసుకువచ్చిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజకీయవేత్త. అయినప్పటికీ ఒక అనామకుడి చేతిలో, అది కూడా రిజర్వుడు నియోజకవర్గంనుంచి ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ అంబేడ్కర్ బొంబాయి(నార్త్ సెంట్రల్) రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఆల్ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తరఫున పోటీ చేసి ఓ అనామకుడి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ వ్యక్తి పేరు నారాయణ్ నడోబా కజ్రోల్కర్. నడోబా కజ్రోల్కర్కి 1,38,137 ఓట్లు వస్తే, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌కి 1,23,576 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత అంబేడ్కర్ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. మళ్ళీ 1954లో భన్దారా లోక్‌సభ ఉప ఎన్నికలో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బోర్కర్ చేతిలో మళ్ళీ ఓటమిపాలయ్యారు. జేబీ కృపలానీ – సుచేతా కృపలానీ... అతను ఓడినా ఆమె గెలిచారు... బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని సాధించుకునే సమయానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆచార్య జేబీ కృపలానీ ఉన్నారు. పూర్తి పేరు జీవత్రామ్ భగవాన్‌దాస్ కృపలానీ. స్వాతంత్య్రానికి పూర్వమూ, స్వాతంత్య్రానంతరమూ భారత రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మన్మోహినీ సెహెగల్ ని ఢిల్లీలో ఆచార్యకృపలానీ భార్య సుచేతా కృపలానీ ఓడించారు. 1957లోనే పోలింగ్ బూత్‌ల ఆక్రమణ.... పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని పోలైన ఓట్లను «ధ్వంసం చేయడం, తాము గెలవమనుకున్న చోట్ల బ్యాలెట్ బాక్స్‌లను ఎత్తుకెళ్ళడం, లేదా బ్యాలెట్ బాక్సుల్లో ఇంకుపోసి ఓట్లు చెల్లకుండా చేయడం లాంటి దుశ్చర్యలు 1957 సార్వత్రిక ఎన్నికల నుంచి ప్రారంభం అయ్యాయి. బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లాలోని రచియాహిలోని మటిహాని అసెంబ్లీ నియోజకవర్గంలో 1957లో జరిగిన ఎన్నికల్లో తొలి పోలింగ్ బూత్‌ల ఆక్రమణ జరిగింది. పోటీ చేసే అభ్యర్థులూ, పార్టీల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగి, పోటీ పెరిగిపోవడంతో 1970–80 వ దశకం చివర్లో బూత్‌ల ఆక్రమణ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పార్టీలు బూత్‌లను ఆక్రమించుకోవడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం మొదలయ్యింది. పోలింగ్ బూత్‌ల ఆక్రమణని సైతం శిక్షార్హమైన నేరంగా పరిగణించి, బూత్‌ల ఆక్రమణ జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు రద్దు చేయడం, లేదా అక్కడ ఎన్నికలు వాయిదా వేసేలా ప్రజాప్రాతినిధ్య(1951) చట్టానికి 1989లో మార్పులు చేసారు. 13 రోజుల ప్రధాని... గుల్జారీలాల్ నందా మొత్తం రెండు సార్లు ప్రధాని అయ్యారు. అయితే రెండు సందర్భాల్లోనూ 13 రోజులు, 13 రోజులే ప్రధాని పదవిలో ఉండడం ఒక విశేషం అయితే, రెండు సార్లూ పదవిలో ఉన్న ప్రధానమంత్రులు మరణించడంతో ఈయనకు ఆ అవకాశం లభించింది. ఒకటి జవహర్ లాల్ నెహ్రూ మరణం అయితే, మరొకరు లాల్‌బహదూర్ శాస్త్రి మరణంతో గుల్జారీలాల్కి ఈ అవకాశం దక్కింది. రెండుసార్లూ కలుపుకొని మొత్తం 26 రోజులు పాటు గుల్జారీలాల్ నందా ప్రధానిగా పనిచేశారు. రెండవ లోక్‌సభ(ఏప్రిల్ 2, 1962 – మార్చి 3 1967)నుంచి 1964, మే 27 జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. మే 27, 1964 జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత తొలిసారి గుల్జారీలాల్ తాత్కాలిక ప్రధాని అయ్యారు. మే 27 నుంచి జూన్ 9, 1964న లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా ఉన్నారు. రెండవసారి 1966 జనవరి 11న లాల్‌బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత మళ్ళీ 13 రోజుల పాటు గుల్జారీలాల్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. శాస్త్రి మరణానంతరం ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఇందిరాగాంధీ 1966 జనవరి 24న ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా కొనసాగారు. ఆపరేషన్ దుర్యోధన... 2005, డిసెంబర్ 12 న స్టార్ టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన స్టింగ్ ఆపరేషన్, ఆపరేషన్ దుర్యోధనతో 11 మంది పార్లమెంటు సభ్యులు స్వయంగా డబ్బులు తీసుకుంటున్న విజువల్స్ బయటపెట్టారు. దీనిపై పార్లమెంటులో దుమారం రేగడంతో రాజ్యసభలోని ఎథిక్స్ కమిటీ, లోక్ సభ ప్రత్యేక కమిటీ విచారణలో వీరిని దోషులుగా నిర్ధారించడంతో 10 మంది లోక్ సభ సభ్యులూ, ఒక రాజ్య సభ సభ్యుడిని ఆయా సభల నుంచి తొలగించారు. -
ఓటు హక్కు వినియోగించుకోవాలి
సాక్షి, మొగల్రాజపురం(విజయవాడ తూర్పు) : ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అప్పుడే ప్రజాస్వామ్యంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. ఓటు హక్కు వినియోగంతో పాటుగా ఓటింగ్ యంత్రాలపై అవగాహన కార్యక్రమం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో మౌలిక సదుపాయాలు సాధించుకోవడంతో పాటుగా ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఎంతో విలువ ఉందన్నారు. ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయడం ఇష్టం లేని పక్షంలో నోటా వినియోగించుకోవచ్చునని చెప్పారు. క్రిమినల్ చరిత్ర తెలియజేయాల్సిందే... తాజాగా సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికల పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలను కూడా తప్పనిసరిగా అఫిడవిట్లో పేర్కొనాల్సిందేనని స్పష్టం చేసిందని ఇంతియాజ్ తెలిపారు. బాహుబలిలా.... ఎన్నికల ఓటింగ్ యంత్రాల అవగాహనలో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్ విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి బాహుబలి సినిమాతో పాటుగా మిసిసిపి మషాలా అనే ఇంగ్లిష్ సినిమాలోని అంశాలను ప్రస్తావించారు. కెన్యాలోని ఒక నియంత నాయకుడు అయితే ఆ పాలన ఎలా సాగుతుందోననే అంశాలతో మిసిసిపి మషాలా సినిమాలో చూపించారని అప్పుడు ఓటు విలువ తనకు తెలిసిందని చెప్పారు. మొదటి సారిగా వివి ప్యాట్ల వినియోగం ఓటర్ వెరిఫేబుల్ పేపర్ ఆడిట్ వేర్ (వీవీ ప్యాట్)ను మన రాష్ట్రంలో మొదటి సారిగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగిస్తున్నామని, ఈవీఎంలో ఓటరు ఎవరికి ఓటు వేశారో ఈ ప్యాట్‌లో ఏడు సెకన్ల పాటు ఓటరుకు కనిపిస్తోందని చెప్పారు. ఫారం–7 కింద 25 కేసులు నమోదు చేశాం.. జిల్లా పరిధిలో ఒకరి పేరుతో ఉన్న ఓటును తొలగించమని కొంత మంది ఫారం–7 ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ఈ విధంగా దరఖాస్తు ఎవరు చేశారనే విషయంపై విచారణ జరుగుతుంది. తప్పుగా దరఖాస్తు చేసిన వారిపై జిల్లాలో 25 కేసులు నమోదు చేశాం. విచారణ జరిపిన చర్యలు తీసుకుంటామని సదస్సు అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సదస్సులో తూర్పు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి.గురుప్రకాష్, తహసీల్దార్ లలిత, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ పాల్గొన్నారు. సదస్సు అనంతరం ఎన్నికల ప్రచార వాహనాలను కలెక్టర్ పరిశీలించారు. -
ఈవీఎం ఫలితాలను వీవీప్యాట్లతో పోల్చాలి
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాల ప్రకటనకు ముందుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా(ఈవీఎం)ల ద్వారా వెల్లడైన ఫలితాలను ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్(వీవీప్యాట్లు)లతో సరిపోల్చాలని ప్రతిపక్షాలు కోరాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ)ని కలిసి వినతిపత్రం ఇచ్చాయి. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఫలితాలను వీవీ ప్యాట్లతో పోల్చి చూడాలనీ, సగం ఈవీఎంల ఫలితాలనైనా వీవీప్యాట్లతో సరిపోల్చి చూశాకే ఫలితాలను వెల్లడించాలని నేతలు కోరారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థికి, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి 5 శాతం కంటే తక్కువగా ఓట్ల తేడా ఉన్న సందర్భాల్లో కూడా ఆ నియోజకవర్గంలోని అన్ని ఈవీఎంలను వీవీప్యాట్లతో పూర్తిగా సరిచూసిన తర్వాతే ఫలితం ప్రకటించాలన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, తెలంగాణలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని తేలినట్లు వివరించారు. ఈసీని కలిసిన నేతల్లో కాంగ్రెస్‌కు చెందిన గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ, చంద్రబాబు నాయుడు(టీడీపీ), మజీద్ మెమన్(ఎన్సీపీ), డెరెక్ ఒ బ్రియాన్(టీఎంసీ), ఫరూఖ్ అబ్దుల్లా(ఎన్సీ) తదితరులున్నారు. సాధ్యమైతే చేస్తాం:ఈసీ ప్రతిపక్షాలు పేర్కొన్న అంశాలకు సంబంధించి కోర్టు తీర్పులను, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్ అశోక్ లావాసా తెలిపారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థికి, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి 5 శాతం ఓట్ల తేడా ఉన్నప్పుడు ఈవీఎంలతోపాటు వీవీప్యాట్లను పరిశీలించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. -
హఠాత్తుగా మీడియా ముందుకు లగడపాటి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వీవీప్యాట్లను లెక్కిస్తే అనుమానాలు తీరతాయని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోలింగ్ శాతం ప్రకటించడానికి ఎన్నిక సంఘం ఒకటిన్నర రోజు ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించిన తర్వాత వెంటనే జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షం గణనీయంగా పుంజుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు బలపడుతున్నాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు ఎందుకు తప్పాయనే దానిపై సమీక్ష చేసుకుంటున్నానని వెల్లడించారు. తాను ఎవరి ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని, రాజకీయ సన్యాసానికి కట్టుబడ్డానని చెప్పుకొచ్చారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను ముందుగా ప్రకటించనని తెలిపారు. తెలంగాణలో పోటీ చేస్తా అవకాశం వస్తే తెలంగాణలో పోటీ చేస్తానని గతంలో తాను చెప్పిన మాటకు కట్టుబడానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. టీడీపీలో ఎప్పుడు చేరుతున్నారని విలేకరుల ప్రశ్నించగా... చాటుమాటు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని, రాజకీయాల్లో మళ్లీ చేరాలనుకుంటే చెప్పే చేస్తానని సమాధానమిచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏపీ సీఎం చంద్రబాబును రహస్యంగా కలిసి ఏం మాట్లాడారని అడగ్గా... చంద్రబాబుకు, తనకు మధ్య జరిగిన విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే చంద్రబాబును కలిసిన తర్వాత లగడపాటి హఠాత్తుగా ఢిల్లీలో మీడియాకు ముందుకు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. (లగడపాటితో చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం) -
మళ్లీ బ్యాలెట్‌కు నో
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా స్పందించారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలె ట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న కొన్ని రాజకీయ పక్షాల డిమాండ్‌కు తలొగ్గబోమని స్పష్టం చేశారు. మళ్లీ బ్యాలెట్ బాక్సులను వినియోగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈవీఎంలను కొందరు ఫుట్బాల్లా ఆడుకుంటున్నారనీ, వాటి పనితీరుపై ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నారని మండిపడ్డారు. బ్యాలెట్‌తో సిబ్బందికి నరకమే.. ఢిల్లీలో గురువారం జరిగిన ‘మేకింగ్ అవర్ ఎలక్షన్స్ ఇన్‌క్లూజివ్ అండ్ యాక్సెసబుల్’ అనే కార్యక్రమంలో అరోరా మాట్లాడుతూ.. ‘నేను ఒక విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో కూడా మేం బ్యాలెట్ పేపర్ల విధానానికి మొగ్గుచూపబోం. మనుషుల సాయంతో బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం, కౌంటింగ్‌లో తీవ్రమైన ఆలస్యం.. ఇదంతా పోలింగ్ సిబ్బందికి నరకంలా ఉంటుంది. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి విమర్శలు, సలహాలు స్వీకరించేందుకు సిద్ధం గా ఉన్నాం. ఇదే సమయంలో బెదిరింపులు, ఒత్తిడి, విజ్ఞప్తులకు తలొగ్గి ఈవీఎంలను వదిలి బ్యాలెట్ విధానానికి మళ్లే ప్రసక్తే లేదు. మనం ఈవీఎంలను ఫుట్‌బాల్‌గా ఎందుకు మార్చేశాం? వాటిపై ఉద్దేశపూర్వకంగా బురదచల్లే కార్యక్రమం కొనసాగుతోంది’ అని తెలిపారు. ఒకే ఫలితం రావాలి కదా.. ఈవీఎంల సమర్థతపై స్పందిస్తూ..‘2014 లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్నిరోజులకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మిజోరంతో పాటు తాజాగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా ఎన్నికల ఫలితాలు నమోదయ్యాయి. నిజంగా ఈవీఎంలలో సమస్య ఉంటే ఇక్కడంతా ఒకేరకమైన ఫలితాలు రావాలి కదా. ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)లో రూపొందిస్తారు. వీటిని హ్యాక్ లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. ఇటీవల రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1.76 లక్షల పోలింగ్ కేంద్రాల్లో కేవలం ఆరంటే ఆరు చోట్ల మాత్రమే ఈవీఎంల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయంలో అలసత్వం చూపకుండా మేం వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాం’ అని అరోరా వెల్లడించారు. ఇక వీవీప్యాట్ యంత్రాలకు సంబంధించి చిన్నచిన్న ఘటనలు నమోదయ్యాయని అంగీకరించారు. వీవీప్యాట్ యంత్రాల వినియోగం విషయంలో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నామనీ, ఈ తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ‘బ్యాలెట్’తోనే ఎన్నికలు జరపండి త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈవీఎంల సమర్థతపై తలెత్తిన వివాదంతో మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే నీలినీడలు కమ్ముకున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం సాంకేతికను దుర్వినియోగం చేస్తున్నారనీ, ఇందులో తమకు ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. విద్యావంతులైన ప్రజలు ఈవీఎంలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలన్నారు. హ్యాకర్ సయిద్ షుజా చేసిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్‌చేశారు. -
ఇబ్రహీంపట్నం వీవీ ప్యాట్ల లెక్కింపు వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలకు సంబంధించి వీవీ ప్యాట్ల లెక్కింపుపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(సీఈసీ) హైకోర్టు బుధవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియోజకవర్గ పోలింగ్‌కు సంబంధించి అన్నీ వీవీ ప్యాట్లను లెక్కించేలా ఆదేశాలివ్వాలంటూ ఇబ్రహీంపట్నం నుంచి పోటీచేసి ఓడిన బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. -
ప్రతాప్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సందర్భంగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేటట్లు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అక్రమాలు జరిగాయని భావిస్తే ఎన్నికల ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేసుకోవాలని ఓట్లలెక్కింపు ప్రారంభమైన తర్వాత ఎన్నికల వివాదాల్లో తాము జోక్యం చేసుకోలేమంది. -
పోలింగ్ స్లిప్ పై గూగుల్‌మ్యాప్!
సాక్షి, పెద్దపల్లిఅర్బన్: జిల్లావ్యాప్తంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు పెద్దఎత్తున ఓటుహక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసేలా అవగాహన ర్యాలీలు, ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగంపై వివిధ సంస్థల ద్వారా కార్యక్రమాలు కొనసాగించారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు పోలింగ్ స్లిప్పులు అందిస్తున్నారు. ఓటుహక్కు వినియోగించుకుంటే కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీదేవసేన సందేశ పత్రాన్ని ఓటర్లకు అందజేస్తున్నారు. గ్రామాల్లో ఓటుహక్కు వినిచయోగించుకునే వారి సంఖ్య బాగానే ఉన్నా.. పట్టణ ప్రాంతాల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంపై అధికారులు ఆలోచనలోపడ్డారు. ఇందులో భాగంగా పోలింగ్ స్లిప్పుల్లో కొత్తగా మార్పులు చేపట్టారు. పోలింగ్ స్లిప్ మీద ఓటరు ఫొటోతో పాటు వెనకాల బూత్‌కు వెళ్లే దారి, చిరునామా, గూగుల్‌మ్యాప్ ప్రింట్చేశారు. పోలింగ్ స్టేషన్ నంబర్, పోలింగ్ తేదీని ముద్రించారు. తేలికగా పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. జిల్లాలోని 6,17,726 మంది ఓటుహక్కు వినియోగించుకోవడం కోసం 804 పోలింగ్ స్టేషన్ల వివరాలు గూగుల్ మ్యాప్‌తో అనుసంధానం చేశారు. పోలింగ్‌శాతం పెరిగేలా.. జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ఎక్కువగా నమోదవుతోంది. చదువుకున్నవారు, మేధావులు, వ్యాపారులు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఓటింగ్ నమోదవడం అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రచారాన్ని చేపట్టడంతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2009 ఎన్నికలతో పోల్చుకుంటే 2014లో ఓటింగ్ శాతం మెరుగైనప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. స్పందించిన అధికారులు కారణాలను అన్వేషించి కొత్త చర్యలకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో పెరిగిన ఓటింగ్.. 2009 ఎన్నికల్లో మంథనిలో 2,02,756 ఓటర్లుండగా 1,50,881 ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో 2,25,755 ఓటర్లుండగా 1,59,384 ఓట్లు పోలయ్యాయి. రామగుండంలో 2,04,981 మంది ఓటర్లుండగా 1,19,051 ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో మంథనిలో 2,10,161 ఓటర్లుండగా 1,69,898 ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో 2,20,926 ఓటర్లుండగా 1,11,674 ఓట్లు పోలయ్యాయి. రామగుండంలో 2,22,354 మంది ఓటర్లుండగా 1,39,394 ఓట్లు పోలయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదు కావడం విశేషం. అంటే 2009లో మంథనిలో 74.40, పెద్దపల్లి 70.60, రామగుండం 58.08, 2009లో మంథనిలో 81.02 పెద్దపల్లి 75.97, రామగుండం 61.91గా నమోదైంది. మంథనిలో చైతన్యం.. 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో కంటే మంథని నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. మారుమూల ప్రాంతంకావడం, పోలింగ్ కేంద్రాలు గ్రామాలకు దూరంగా ఉన్నప్పటికీ, మావోయిస్టుల ప్రభావాన్ని సైతం అధిగమించి ఓటింగ్‌లో పాల్గొని మిగితా వారికి ఆదర్శంగా నిలిచారు. 2009లో 74.40 శాతం, 2014లో 81.02 శాతం ఓటింగ్ నమోదుచేసి రికార్డు సృష్టించారు. 2009లో 58.08, 2014లో 61.91 శాతం ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనగా రామగుండం అట్టడుగునా నిలిచింది. యూత్‌పై ప్రత్యేక దృష్టి.. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని పోలింగ్ బూత్‌కు తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ఓటుహక్కు పొందిన వారిపై దృష్టిని కేంద్రీకరించారు. 18 నుంచి 35 ఏళ్ల యువతను పోలింగ్ కేంద్రానికి రప్పించేలా టెక్నాలజీ సహాయాన్ని తీసుకుంటున్నారు. గూగుల్ సహాయంతో పోలింగ్ కేంద్రాలను గుర్తించేందుకు మ్యాప్‌లు ప్రింట్చేసి ఆకట్టుకుంటున్నారు. జిల్లాలో 1,64,009 మంది యువత ఓటుహక్కును కలిగి ఉన్నారు. వీరిలో పురుషులు 88,076 మంది కాగా యువతులు 75,933 మంది ఉన్నారు. -
సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి
సాక్షి,బిచ్కుంద (నిజామాబాద్): పోలింగ్ నిర్వహణపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. బుధవారం బిచ్కుంద డిగ్రీ కళాశాలలో పోలింగ్ నిర్వహణ అధికారులకు అం దిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాక్ పోలింగ్, వీవీ ప్యా ట్లు, బ్యాలెట్ యూనిట్లు సీల్ చేయడం , పోలింగ్ సమయ పాలన తదితర అంశాలపై సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలి చిన్న చిన్న పొరపాట్లతో పెద్ద సమస్యలు ఏర్పడతాయి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలు ప్రీసైడింగ్ అధికారులు పాటించాలని ఆదేశించారు. శిక్షణ తరగతులలో సూచించిన విధంగా వీవీ ప్యాడ్, ఈవీఎంలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలో గత నెల రోజుల నుంచి మాక్ పోలింగ్‌తో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలింగ్ బూత్‌లలో అన్ని యంత్రాలను సక్రమంగా బిగించాలని, మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు రాకుండా చూడాలని సూచించారు. ఓటు వేయడానికి బూత్‌లలో వికలాంగులకు ర్యాంపులు, వీల్చేర్, వాహన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఆరు మండలాల అధికారులు పాల్గొన్నారు. తప్పులు దొర్లకుండా చూడాలి మద్నూర్(జుక్కల్): రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తప్పులు దొర్లకుండా చూసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ పత్రాల స్వీకరణ, స్ట్రాంగ్ రూంను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పారదర్శకత కోసమే ఎన్నికల కమిషన్ వీవీప్యాట్ల విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో 740 పోలింగ్ స్టేషన్లకు 740 బీఎల్వోలు, 74 సూపర్వైజర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్, తహసీల్దార్ రవీంధర్, అధికారులు ఉన్నారు. -
బ్రహ్మాస్త్రంపై అవగాహన
కోస్గి (కొడంగల్) : ఓటంటే ఐదేళ్ల బతుకు. ఎలాంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలన్నా అది ఓటర్ల చేతుల్లోనే ఉంటది. అంతటి ప్రాముఖ్యత కలిగి ఓటును నోటుకో మద్యానికే అమ్ముకోవద్దు. సమర్ధవంతంగా సేవేచేసే వారిని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉంది. రాజకీయ నాయకుల తలరాతను మార్చేశక్తి ఓటుకు మాత్రమే ఉంది. అందుకే ఎన్నికల ప్రచారంలో నాయకులు సిత్ర విచిత్రాలు ఇప్పటికే మనం చూస్తున్నాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటేసేందుకు అర్హులే. ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనేదే ఈ కథనం... స్టెప్-1 ఓటరు పోలింగ్‌బూత్ గదిలోకి ప్రవేశించిన అనంతరం ప్రిసైడింగ్ ఆఫీసర్, కంట్రోల్‌రూం యూనిట్‌ను సిద్ధం చేయగానే బ్యాలెట్ యూనిట్లో గ్రీన్‌సిగ్నల్ లైటింగ్ వెలుగుతుంది. బ్యాలెట్ యూనిట్లో టాప్‌లో గ్రీన్‌లైట్ కలిగిన అనంతరం మాత్రమే బ్యాలెట్ యూనిట్ ఓటును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఓటరు బ్యాలెట్ యూనిట్‌ను ముందుగా ఈ గ్రీన్ లైట్‌ను గమనించాల్సి ఉంటుంది. స్టెప్-2 బ్యాలెట్ యూనిట్‌కు టాప్‌లో గ్రీన్‌లైట్ వచ్చిన తర్వాత ఓటేయాల్సి ఉంటుంది. ఇందుకు బ్యాలెట్ యూనిట్ ప్యానల్ మీద వరుసగా అభ్యర్థి పేరు, వారికి కేటాయించిన పార్టీ గుర్తు కనిపిస్తుంది. ఒకవేల స్వతంత్ర అభ్యర్థి అయితే వారికి కేటాయించిన గుర్తు కనిపిస్తుంది. దీని పక్కనే నీలిరంగులో ఉన్న బటన్ కనిపిస్తుంది. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి గుర్తు మీద బటన్ నొక్కితే ఓటు పడుతుంది స్టెప్-3 ఎప్పుడైతే ఓటరు బ్యాలెట్ యూనిట్లో నీలిరంగు బటన్ నొక్కుతారో అప్పుడు ఓటరు ఎంచుకున్న అభ్యర్థిపేరు గుర్తుకు ఎదురుగా ఉన్న ఎర్రలైట్ వెలుగుతుంది. దీంతో ఓటు మిషన్‌లో నమోదవుతుంది. స్టెప్-4 ఎప్పుడైతే బ్యాలెట్ యూనిట్లో ఎర్రలైట్ వెలుగుతుందో అప్పుడు పక్కనే ఉన్న వీవీ ప్యాట్ యూనిట్లో ఓటరు ఎన్నుకున్న అభ్యర్థి సీరియల్ నెంబర్ పేరు, గుర్తుతో ఒక బ్యాలెట్ పేపర్‌పై ప్రింట్ చూపిస్తుంది. ఈ ప్రింట్ పేపర్ వీవీ ప్యాట్‌లో ప్రత్యేకంగా రూపొందించి తెరలో ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది. అనంతరం ఆటోమెటిక్‌గా స్లిప్ కట్అయి వీవీ పాయింట్లో ఉన్న డ్రాప్ బాక్సులో పడిపోతుంది. దాంతో ఓటేసే ప్రక్రియ పూర్తవుతుంది. ఒక వేళ ఓటరుకు బ్యాలెట్ స్లిప్ కనబడకపోయినా, బీఫ్ శబ్థం పెద్దగా వినిపించకపోయినా ప్రిసైడింగ్ ఆఫీసర్‌ను సంప్రదించవచ్చు. ఇలా చేయడం ద్వారా ఓటును సరైన పద్ధతిలో వినియోగించుకోవచ్చు. -
ఫొటో చూసి ఓటేయవచ్చు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు వివిధ ప్రత్యేకతలను సంతరించుకోనున్నాయి. ప్రజలు ఎవరికి ఓటు వేసిందీ తెలుసుకునేందుకు వీవీప్యాట్లు వినియోగించనుండటం, నగరంలో దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు ‘వాదా’యాప్ ఉపయోగపడనుండటం, అంధులకు బ్రెయిలీ లిపిలో ఎపిక్ కార్డులు జారీ చేస్తుండటం గురించి తెలిసిందే. ఈసారి అభ్యర్థి ఫొటో చూసి కూడా ఓటేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది. ఈవీఎంలలో అభ్యర్థి పేరు, గుర్తుతోపాటు 2్ఠ2.5 సెం.మీల ఫొటో కూడా ఉంటుంది. నోటా వద్ద మాత్రం ఫొటో స్థానంలో ఖాళీగా ఉంటుంది. అభ్యర్థుల పేర్లు అక్షరక్రమంలో తొలుత జాతీయపార్టీల అభ్యర్థులవి, తర్వాత ప్రాంతీయ పార్టీలవి, ఆ తర్వాత ఇండిపెండెంట్లు లేదా ఇతర పార్టీలవి ఉండనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించినట్లు జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఓటరు గందరగోళానికి గురికాకుండా ఒక నియోజకవర్గంలో పోటీచేసే అభ్యర్థుల్లో ఒకరి కంటే ఎక్కువమందికి ఒకే పేరు, లేదా దగ్గరి పోలికలతో ఉన్న పేరు ఉంటే ప్రజలు ఓటు వేసేటప్పుడు గందరగోళానికి గురి కాకుండా ఉండేందుకే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను పోటీ చేసే అభ్యర్థులు తాజాగా తీయించుకున్న తమ స్టాంప్ సైజ్ కలర్‌ఫొటోను సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మరో నాలుగు రాష్ట్రాల్లోనూ దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. ఫొటోలు పెట్టినా రీ పోలింగ్ గతేడాది మార్చిలో జరిగిన మహబూబ్‌నగర్, రంగారెడ్డి,హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సాధారణ బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల ఫొటోలుంచారు. ఎన్నికల విధుల్లోని అధికారుల అశ్రద్ధ కారణంగా బ్యాలెట్ పత్రాల్లో ఒక అభ్యర్థి పేరున్న చోట మరో అభ్యర్థి ఫొటో ముద్రించారు. ఎన్నికల బరిలో ఉన్న ఆదిలక్ష్మయ్య, పాపన్నగారి మాణిక్‌రెడ్డిల ఫొటోలు తారుమారయ్యాయి. దీంతో రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఓటర్లు రెండుసార్లు ఓట్లు వేయాల్సి రావడంతోపాటు ప్రభుత్వానికి బోలెడు వ్యయప్రయాసల్ని ఈ ఎలక్షన్ మిగిల్చింది. -
ఎన్నికల నిర్వహణపై పోలీస్ సిబ్బందికి శిక్షణ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల కమిషన్ (ఈసీ) అధికారులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలకు ఈసీ అధికారులు అవగాహన కల్పించారు. ఇక దశల వారీగా కింది స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. డీఎస్పీల నుంచి ఎస్ఐల వరకు... జిల్లాల్లో పనిచేస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకు ఈసీ అధికారులు వీవీ ప్యాట్స్, ఈవీఎంల పనితీరుపై ప్రత్యేకం గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కల్పించనున్నారు. అలాగే ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వ్యవహారాలను ఏ విధంగా అడ్డుకోవాలి, ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలు, ప్రచార రథాల అనుమతుల తదితరాలపై నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన అంశాలను అధికారులకు వివరించనున్నారు. ఇకపోతే రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన అనుమతులకు సంబంధించి ఈసీ తయారుచేసిన సువిధ యాప్ ద్వారా ఎలా తీసుకోవాలి.. వాటికి సంబంధించిన తదితరాలపై అవగాహన కల్పించబోతున్నారు. సీ–విజిల్‌పై ప్రత్యేక శిక్షణ.. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు పంచే బహుమతులు, కూపన్లు, మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు ఈసీ రూపొందించిన ప్రత్యేక కార్యాచరణపై పోలీసు సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇకపోతే అభ్యర్థుల ప్రలోభాలపై నేరుగా ఓటర్లే ఈసీకి ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన సీ–విజిల్ యాప్ పనితీరుపైనా అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ యాప్ ద్వారా డబ్బులు పంచే వీడియోలు, మద్యం పంపిణీ తదితరాలన్నింటిపై ఓటర్లు నేరుగా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. దీనిపై విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే నేరచరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా, రౌడీషీటర్ల బైండోవర్, లైసెన్సు ఆయుధాల డిపాజిట్ తదితరాలపై వేగవంతమైన చర్యలు తీసుకునేలా ఆదే శించబోతున్నారు. -
వందలమందైనా బేఫికర్
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటి వరకు ఈవీఎంలలో ఓటు వేస్తే ఎవరికి పడిందో ఓటర్లకు తెలిసేది కాదు. త్వరలో రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు తాను వేసిన ఓటు ఎవరికి పడిందో కూడా ఏడు సెకన్లపాటు తెరపై తెలుసుకోవచ్చు. ఇందుకు ఓటు వేసే ఈవీఎంలతోపాటు వీవీప్యాట్ మెషీన్లను వినియోగిస్తున్నారు. ఓటరు ఈవీఎంలో ఓటు వేశాక తాను ఏ అభ్యర్థికి ఓటు వేసిందీ, బ్యాలెట్లో సీరియల్ నంబర్‌తో సహా తెలుస్తుంది. అలాగే ఈసారి నోటాతోసహా 384 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ఈవీఎంలను వినియోగించవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో విక్టరీ ప్లేగ్రౌండ్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, దివ్యాంగులకు ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కల్పించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో వారితో మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం రజత్‌కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో తొలిసారిగా వినియో గిస్తున్న వీవీప్యాట్లపై అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు. 19 వేలకు పైగా పోలింగ్ లొకేషన్లలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహి స్తామన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈవీఎం–ఎం3లను టాంపరింగ్ చేసే అవకాశం లేదని, ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈవీఎంల్లో సమస్యలున్నవి ఒక శాతం కంటే తక్కువే అన్నారు. వీవీప్యాట్లలో 8 నుంచి 9 శాతం వరకు ఇబ్బందులుండగా, అవి సాంకేతిక కారణాలతోనో లేక çసరైన జాగ్రత్తలు తీసుకోనందునో జరిగి ఉండవచ్చని పేర్కొంటూ బీఈఎల్ ఇంజనీర్లు కారణాలు పరిశీలిస్తున్నారని చెప్పారు. అవసరమైతే అదనపు వీవీప్యాట్లు తెప్పిస్తామన్నారు. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరావులతో పాటు బీజేపీ, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, ఎంఐఎంల ప్రతినిధులు అవగాహన కార్యక్రమంలో, మాక్ పోలింగ్‌లో పాల్గొన్నారు. వారు వేసిన ఓట్లు సరిగ్గా పడటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అవగాహన వాహనాల ప్రారంభం... ఈవీఎం, వీవీప్యాట్ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా రాష్ట్రంలో 95 శాతం పూర్తయిందని రజత్‌కుమార్ తెలిపారు. మరో రెండు రోజుల్లో అంతటా పూర్తవుతుందన్నారు. ఈ సందర్భంగా 19 వాహనాలకు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ వాహనాలు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తాయని, వీటిల్లో కొన్ని దివ్యాంగుల కోసం కేటాయించినట్లు తెలిపారు. ఇదే కాక ప్రతివార్డులో ఓటరు అవగాహన కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ‘వీవీప్యాట్’సమయం పెంచాలి... వీవీప్యాట్‌లో తాము ఎవరికి ఓటు వేసింది తెలుసుకునేందుకు 7 సెకన్ల సమయం చాలదని, దాన్ని పెంచాలని కోరినట్లు మర్రి శశిధర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. అవసరమైతే దీని కోసం సుప్రీంకోర్టుకు కూడా వెళతామన్నారు. ఓటరు జాబితాలో పొరపాట్లున్నాయని సీఈఓ దృష్టికి తెచ్చామని చెప్పారు. ముందస్తుకు సంబంధించి ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు వేయడాన్ని ప్రస్తావిస్తూ, విచారణ సమయంలో అదనపు సమాచారాన్ని అందజేస్తామన్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలతో పోలింగ్ ఆగితే ఆ మేరకు అదనపు సమయమిస్తామని రజత్‌కుమార్ తెలిపినట్లు టీడీపీ ప్రతినిధి వనం రమేశ్ తెలిపారు. ఓటింగ్ మెషీన్ల పనితీరు, వీవీప్యాట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి 42 ప్రాంతాల్లో శాశ్వత కేంద్రాలను, 3 సంచార వాహనాలను వినియోగించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. మూడొందల మంది పోటీలో ఉన్నా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించనున్న ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)లతో ఓటరు తాను ఎవరికి ఓటు వేసిందీ చూసుకునే సదుపాయంతోపాటు, కొత్త సాంకేతికతతో బరిలో వంద మందికి పైగా అభ్యర్థులున్నా ఈవీఎంలను వినియోగింవచ్చు. ఇప్పటి వరకు 64 మంది అభ్యర్థుల వరకే ఈ సదుపాయం ఉండేది. అంతకంటే ఎక్కువమంది అభ్యర్థులు పోటీలో ఉంటే పేపర్ బ్యాలెట్ అవసరమయ్యేది. ఈసారి వినియోగిస్తున్న ఎం–3 ఈవీఎంల్లో ఒక కంట్రోల్ యూనిట్‌కు సంబంధించి ఒక బ్యాలెట్ యూనిట్ నుంచి మరో బ్యాలెట్ యూనిట్‌కు అనుసంధానం చేసే అవకాశం ఉండటంతో గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానం చేయవచ్చు. తద్వారా నోటాతో సహా 384 మంది వరకు పోటీలో ఉన్నా ఈవీఎంలను వినియోగించవచ్చని అధికారులు వివరించారు. స్వల్ప తేడాతో గెలుపోటములు ప్రభావితమయ్యేప్పుడు అభ్యర్థుల ఫిర్యాదుల మేరకు లెక్కించడానికి ఇవి ఉపకరిస్తాయని తెలిపారు. ఏదైనా పోలింగ్ కేంద్రంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థి ఫిర్యాదు చేసినా లెక్కించేందుకు ఉపకరిస్తాయన్నారు. -
ఈవీఎంలు.. ఎలాంటి ఆందోళన అవసరం లేదు!
సాక్షి, హైదరాబాద్ : ఈవీఎంలలో సాంకేతిక వినియోగంపై రాజకీయ పార్టీలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే 85 శాతంపైగా ఈవీఎంల తనిఖీ పూర్తయిందని, ఈ నెల 4లోగా అన్ని జిల్లాల్లో తనిఖీలు పూర్తవుతాయని వెల్లడించారు. ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలతోపాటు కొత్తగా వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర స్థాయి మాక్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించిన రజత్ కుమార్.. ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు తెలిపారు. వీవీప్యాట్ యంత్రాల పనితీరు, సాంకేతిక సమస్యలు-పరిష్కారాలను వివరించారు. దేశంలో ఎంతో నమ్మకమైన బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ వంటి సంస్థలు వీవీప్యాట్ లను తయారు చేశాయని, ఎన్నికల్లో వినియోగించే సాంకేతికతపై తమకు పూర్తి విశ్వాసం ఉందని రజత్ కుమార్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 10 మొబైల్ వాహనాల ద్వారా వీవీపాట్ యంత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం సీ-విజిల్ అనే ప్రత్యేక యాప్ ను రూపొందించిందని, ఎన్నికల సమయంలో ప్రజలు అందులో అక్రమాలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
నవంబర్ చివరినాటికి వీవీప్యాట్లు సిద్ధం
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన 17 లక్షల వీవీప్యాట్(ఓటు రశీదు) యంత్రాలను నవంబర్ చివరినాటికి సమకూర్చుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వీవీప్యాట్లను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని వెల్లడించింది. ఇందుకోసం 17.45 లక్షల యూనిట్ల వీవీప్యాట్ మెషీన్ల తయారీకి బెంగళూరులోని బెల్, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 9 లక్షల యంత్రాలు సిద్ధమయ్యాయని, మిగిలిన 8 లక్షల యంత్రాలను నవంబర్ చివరినాటి అందిస్తామని ఆ రెండు కంపెనీలు హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. -
వీవీప్యాట్‌ల్లో చిన్న మార్పులు
న్యూఢిల్లీ: ఓటు ధ్రువీకరణ యంత్రాలు (వీవీప్యాట్) సక్రమంగా పనిచేసేలా వాటికి చిన్న చిన్న మార్పులు చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ చెప్పారు. 10 రాష్ట్రాల్లోని నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది మే 28న ఉప ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే. ఇందుకోసం మొత్తం 10,300 వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగించగా దాదాపు 1,150 యంత్రాలు మధ్యలో మొరాయించాయి. దీంతో సాంకేతిక నిపుణులు ఆయా యంత్రాలను పరిశీలించి అవి పనిచేయకపోవడానికి మూల కారణాన్ని గుర్తించారు. కాంట్రాస్ట్ సెన్సర్‌పై నేరుగా కాంతి పడుతుండటం వలన కొన్ని యంత్రాలు పనిచేయలేదనీ, దీనిని నివారించడంకోసం కాంట్రాస్ట్ సెన్సర్లపై చిన్న ముసుగును వినియోగించనున్నట్లు రావత్ వెల్లడించారు. అలాగే గాలిలో తేమ ఎక్కువ కావడం వల్ల ఆ తడికి పేపర్ కాస్త మెత్తబడటంతో మరికొన్ని వీవీప్యాట్ యంత్రాలు ఓటు ధ్రువీకరణ కాగితాన్ని ముద్రించలేకపోయాయని ఆయన వివరించారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఇకపై గాలిలోని తేమకు మెత్తబడకుండా ఉండే కాగి తాన్నే వీవీప్యాట్ యంత్రాల్లో ఉపయోగిస్తా మని తెలిపారు. ఓటర్లు ఈవీఎంలో ఓటు వేయగానే, వారు ఏ పార్టీకి ఓటు వేశారో ఆ పార్టీ గుర్తును ఓ చిన్న కాగితంపై వీవీప్యాట్ యం త్రాలు ముద్రిస్తాయి. ఏడు సెకన్ల పాటు ఈ కా గితం వీవీప్యాట్ యంత్రంపై ఉండి ఆ తర్వాత దానంతట అదే ఓ డబ్బాలోకి పడిపోతుంది. -
వీవీప్యాట్ మిషన్లు ఫొటోలు తీయబోవు..
న్యూఢిల్లీ: ఓటు ధ్రువీకరణ యంత్రాల(వీవీప్యాట్)తో అనుసంధానం చేసిన ఈవీఎంలు ఓటు వేసే సమయంలో ఓటర్లను ఫొటోలు తీయబోవని, వీటిపై ప్రచారమవుతున్న అవాస్తవాలను నమ్మవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ‘వీవీప్యాట్ ఈవీఎం మిషన్లు ఓటు వేసే సమయంలో ఫొటోలు తీస్తాయి. మీరు మా నుంచి డబ్బులు తీసుకుని ఓటు వేయకపోతే మాకు తెలుస్తుంది. మీరు మమ్మల్ని మోసం చేయలేరని కొందరు రాజకీయ నాయకులు ఓటర్లను భయపెడుతున్నారు. ఇవి పూర్తిగా అవాస్తవాలు. వీటిని నమ్మవద్దు’అని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ వివరించారు. వీవీప్యాట్ మిషన్లు ఈవీఎంతోపాటు ఉంటాయని, ఓటరు ఓటు వేసిన వెంటనే తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరు, గుర్తు వీవీప్యాట్ పరికరం నుంచి చిన్న పేపర్‌పై ప్రింట్ అయ్యి బయటకు వస్తాయని చెప్పారు. ఆ పేపరు సుమారు 7 సెకన్లపాటు ఓటరుకు కనిపించి.. అక్కడే ఉన్న బాక్స్‌లోకి వెళుతుందని తెలిపారు. -
బ్యాలెట్ ప్రశ్నేలేదు
కోల్‌కతా: ఈవీఎంలు, వీవీప్యాట్ (ఓటు ధ్రువీకరణ యంత్రం)ల ద్వారానే అన్ని ఎన్నికలు జరుగుతాయనీ, బ్యాలెట్ విధానాన్ని తీసుకువచ్చే ప్రశ్నే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఓపీ రావత్ స్పష్టం చేశారు. శనివారం ఆయన కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. ‘ఈవీఎంల పనితీరు, సమగ్రత విషయంలో అనుమానాలు అక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగం, చట్టాల్లో మార్పులు చేయడంతోపాటు అవసరమైన సామగ్రిని భారీగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల్లో అవకతవకలపై ఎన్నికల సంఘం(ఈసీ) మొబైల్ యాప్ ద్వారా సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ మొబైల్ యాప్‌నకు 780 వరకు ఫిర్యాదులు వీడియోల రూపంలో అందాయి. యాప్ సాయంతో పౌరులూ సాక్ష్యాధారాలను ఈసీకి నేరుగా పంపొచ్చు. అన్ని ఎన్నికల్లో యాప్‌ను వాడకంలోకి తెస్తాం. ‘రికార్డుల్లో మాత్రమే ఉండి, కార్యకలాపాలు జరపని దాదాపు 1000 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేశాం. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల పూర్తి పదవీ కాలం ముగియడానికి 6 నెలల ముందుగా ఎలాంటి ప్రకటన చేసే అధికారం ఈసీకి లేదు’ అని రావత్ వివరించారు. -
123 చోట్ల రీ పోలింగ్
న్యూఢిల్లీ: సోమవారం ఉప ఎన్నిక జరిగిన ప్రాంతాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా నియోజకవర్గంలోని 73 పోలింగ్ స్టేషన్లు, మహారాష్ట్ర భండారా–గోండియా నియోజకవర్గంలోని 49, నాగాలాండ్‌లోని ఒక పోలింగ్ కేంద్రాల్లో బుధవారం మళ్లీ పోలింగ్ జరగనుంది. వీవీపాట్లలో లోపాలు తలెత్తటంతో రీపోలింగ్ అవసరమైందని, ఆయా ప్రాంతాలకు కొత్త మెషీన్లను తరలించినట్లు ఈసీ తెలిపింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గోండియా కలెక్టర్‌ను బదిలీ చేసి, కొత్త కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించింది. -
123 చోట్ల రీ పోలింగ్
న్యూఢిల్లీ: సోమవారం ఉప ఎన్నిక జరిగిన ప్రాంతాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా నియోజకవర్గంలోని 73 పోలింగ్ స్టేషన్లు, మహారాష్ట్ర భండారా–గోండియా నియోజకవర్గంలోని 49, నాగాలాండ్‌లోని ఒక పోలింగ్ కేంద్రాల్లో బుధవారం మళ్లీ పోలింగ్ జరగనుంది. వీవీపాట్లలో లోపాలు తలెత్తటంతో రీపోలింగ్ అవసరమైందని, ఆయా ప్రాంతాలకు కొత్త మెషీన్లను తరలించినట్లు ఈసీ తెలిపింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గోండియా కలెక్టర్‌ను బదిలీ చేసి, కొత్త కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించింది. -
ఉపఎన్నికల్లో ఈవీఎం పంచాయితీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సోమవారం 14 చోట్ల ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో రెండు, యూపీలో ఒకటి, నాగాలాండ్‌లో ఒక పార్లమెంటు స్థానాలకు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 31న జరగనుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్, భండారా–గోందియా లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల్లో ఈవీఎంల గందరగోళంపై శివసేన, ఎన్సీపీలు మండిపడ్డాయి. 25శాతం ఈవీఎంలు సరిగా పనిచేయలేదని మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్‌పటేల్ అన్నారు. చాలాచోట్ల వీవీపీఏటీ (ఓటు ధ్రువీకరణ యంత్రం)లు పనిచేయలేదన్నారు. ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడంపై విచారణ జరిపించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. భండారా–గోందియాలో 40%, పాల్ఘర్లో 46% ఓటింగ్ నమోదైంది. నాగాలాండ్ లోక్‌సభ స్థానంలో 70 శాతం పోలింగ్ నమోదైంది. కైరానాలో హైరానా! అటు యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం, నూర్పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంల విషయంలో అధికార, విపక్షాలు విమర్శలు గుప్పించుకున్నాయి. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఎన్నికల సంఘం వేరే ఈవీఎంలను ఏర్పాటుచేసింది. వీలుకాని చోట్ల రీపోలింగ్ జరపనుంది. కాగా, ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసిందని ఎస్పీ, బీఎస్పీలు ఆరోపించాయి. పలుచోట్ల ఈవీఎంలు చాలాసేపు పనిచేయకపోవడంపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కైరానాలో 54.17% పోలింగ్ నమోదైంది. కర్ణాటకలోని రాజరాజేశ్వర నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 54 శాతం పోలింగ్ నమోదైంది. కొన్నిచోట్ల సమస్య ఉత్పన్నమైన మాట వాస్తవమేనని.. కానీ విపక్షాలు దీన్ని ఎక్కువచేసి చూపిస్తున్నాయని ఈసీ పేర్కొంది. చాలాచోట్ల ముందుగానే అదనపు ఈవీఎంలు ఏర్పాటుచేశామని తెలిపింది. ఉప ఎన్నికలు జరిగిన లోక్‌సభ స్థానాలు కైరానా (యూపీ) 2014 ఎన్నికల్లో విజేత: హుకుమ్‌సింగ్ (బీజేపీ) ప్రత్యర్థి: నహీద్ హసన్ (ఎస్పీ) మెజారిటీ: 2,36,828 పాల్ఘర్ (మహారాష్ట్ర) 2014లో విజేత: చింతామన్ వానగా (బీజేపీ) ప్రత్యర్థి: బలిరాం (బహుజన్ వికాస్ అఘాడీ) మెజారిటీ: 2,39,520 భండారా–గోందియా (మహారాష్ట్ర) 2014లో విజేత: నానాభావ్ పటోలే (బీజేపీ) ప్రత్యర్థి: ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ) మెజారిటీ: 1,49,254 నాగాలాండ్ 2014లో విజేత: – నీఫియూ రియో (ఎన్పీఎఫ్) ప్రత్యర్థి: కేవీ పుసా (కాంగ్రెస్) మెజారిటీ: 4,00,225 -
ఈవీఎంలకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యత
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల(ఈవీఎం)కు బదులు బ్యాలెట్ పత్రాలనే ఉపయోగించాలని, లేదంటే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు రసీదు వచ్చే ఈవీఎంలను ఉపయోగించాలని ఎన్డీయే ఏతర ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. అవి తమ డిమాండ్‌ను సాధించేందుకు ఏకమవుతున్నాయి కూడా. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విజయం సాధించడానికి కారణం ఈవీఎంలను ట్యాంపర్ చేయడమేనని ప్రతిపక్షాలు ఆరోపించడం, పాటిదార్ల ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్ దీనిపై పెద్ద ఎత్తున గొడవ చేసిన విషయం తెల్సిందే. ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మళ్లీ ఈవీఎంల అంశం ముందుకు వచ్చింది. ఈ అంశంపై చర్చించేందుకు సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నాయకుడు జనేశ్వర్ మిశ్రా నివాసంలో జరిగిన సమావేశానికి బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి మినహా అందరు హాజరు కావడం విశేషం. ఈవీఎంలకు వ్యతిరేకంగా మొట్టమొదట ఆందోళన నిర్వహించినదీ మాయావతియేనని, ఈ అంశంపై మున్ముందు జరిగే సమావేశాలకు ఆమె తప్పకుండా హాజరు అవతారని ఆమె పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్, సీపీఐ, సీపీఎం పార్టీలు హాజరయ్యాయి. దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో దశల వారిగా ఓటుకు రసీదు వచ్చే యంత్రాలను ఉపయోగిస్తామని, అందులో భాగంగా ముందుగా ప్రతి నియోజకవర్గంలో ఐదు శాతం పోలింగ్ కేంద్రాల్లో వీటిని అమలు చేస్తామని ఎన్నికల కమిషన్ ఇదివరకే ప్రకటించింది. అయితే ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక్క పోలింగ్ కేంద్రంలో మాత్రమే అమలు చేయగలిగింది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల అంశం డిమాండ్ ముందుకు వచ్చింది. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ అంశాన్ని సమగ్రంగా చర్చించేందుకు మరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీయే ఏతర ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఫిబ్రవరిలో జరగనున్న త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించినట్లయితే అన్నింటికీ ఓటు రసీదు వచ్చే పద్ధతి ఉండాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. -
వీవీపాట్లపై కలుగజేసుకోలేం: సుప్రీం
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో వినియోగించిన 20 శాతం ఈవీఎంలను వీవీపాట్ స్లిప్పుల ఫలితాలతో సరిపోల్చాలంటూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ గుజరాత్ శాఖకు చెందిన మహ్మద్ ఆరీఫ్ రాజ్‌పుత్.. 20 శాతం వీవీపాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చి చూడాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసువేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈవీఎం–వీవీపాట్‌లో అవక తవకలు జరిగాయని ఎన్నికల కమిషన్ నిర్థారించే వరకూ ఈ విషయంలో తాము కలుగజేసుకోలే మంది. కేసును ఉపసంహరించుకోవాలని అయితే ఎన్నికల సంస్కరణల తర్వాత సమగ్ర పిటిషన్ దాఖలు చేసేందుకు స్వేచ్ఛనిస్తున్నామని పేర్కొంది. అయితే ఎన్నికల సంస్కరణలపై గుజరాత్లో ఎన్నికల ప్రక్రియ ముగిశాక చర్చ ప్రారంభమవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికలు సక్రమంగా జరిగాయని ప్రజలకు తెలియ జేసేందుకు.. ప్రతి నియోజక వర్గంలో 20 శాతం బూత్‌ల్లో వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లు, వీవీపాట్ స్లిప్పులతో సరిపోల్చాలని కోరారు. ఈసీ నిర్ణయం లేకుండా తాము ఈ విషయంలో కలుగుజేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఎన్నికల ఫలితాలకు ముందు...
న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల ఫలితాల విడుదల కావడానికి ముందు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ ఎన్నికలపై కాంగ్రెస్ వేసిన రిట్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. వీవీపీఏటీ యంత్రాల్లో పోలైన ఓట్లలో కనీసం 25 శాతం ఓట్లను పరిశీలించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ శుక్రవారం పిటిషన్ వేసింది. ఈవీఎంలో వేసిన ఓటు కరెక్ట్‌గా పడిందో, లేదో తెలుసుకునేందుకు వీవీపీఏటీ విధానాన్ని వినియోగిస్తున్నారు. ఓటు వేసిన వెంటనే తమ ఎవరికి పడిందో ఓటర్లు తెలుసుకునేందుకు ఒక స్లిప్ వస్తుంది. ఈ స్లిప్పుల్లో ఉన్నట్టుగా ఈవీఎంలో ఓట్లు ఉన్నాయో, లేదో ఈసీ పరిశీలించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కాంగ్రెస్ కోరింది. కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అభిషేక్ మాను సింఘ్వి, కపిల్ సిబల్ కాంగ్రెస్ తరపున వాదనలు వినిపించేందుకు కోర్టులో హాజరయ్యారు. ఎలక్ట్రోరల్ వ్యవస్థపై విశ్వాసం పెంచాల్సిన అవసరముందని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ సొలాంకి వ్యాఖ్యానించారు. కాగా, ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మలా మారిందని కాంగ్రెస్ నాయకులు గురువారం ఆరోపించారు. కోడ్ ఉల్లంఘించినా మోదీపై ఈసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. -
గుజరాత్ సహా అన్ని ఎన్నికల్లో వీవీపీఏటీ యంత్రాలు
సాక్షి,అగర్తలా: వచ్చే నెలలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు ఓటు వేసిన తర్వాత ఏ పార్టీకి ఓటు వేశారో ధ్రువీకరించుకునేలా రసీదులు ఇచ్చే వోటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) మెషీన్లను ఉపయోగిస్తామని ఎన్నికల ప్రధానాధికారి ఏకే జ్యోతి తెలిపారు. ఇక నుంచి అన్ని ఎన్నికల్లో వీటిని ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు.బ్యాటరీతో రూపొందే ఈ మెషీన్లను ట్యాంపర్ చేయడం అసాధ్యమని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ పెద్దసంఖ్యలో ఈవీఎంలు, వీవీపీఏటీలను కొనుగోలు చేస్తుందని చెప్పారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3170 పోలింగ్ బూత్‌ల్లో ఈవీఎంలు, వీవీపీఏటీలను వినియోగిస్తామన్నారు. -
కాకినాడలో వీవీప్యాట్ ఈవీఎంలనే వాడాలి
-
నంద్యాల ఉపఎన్నికలో ఈవీఎంలకు వీవీప్యాట్లు
-
గుజరాత్ ఎన్నికల్లో ఓటు రశీదు యంత్రాలు!
న్యూఢిల్లీ: సెప్టెంబర్‌కల్లా తయారీ సంస్థల నుంచి ఓటు రశీదు యంత్రాలు(వీవీపీఏటీ–ఈవీఎం) వస్తే రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వాటిని వినియోగిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వివరణ ఇచ్చింది. గుజరాత్ ఎన్నికల్లో 70,000 ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీపీఏటీ) యూనిట్లు అవసరమవుతాయని, సెప్టెంబర్‌కల్లా 73,500 యూనిట్లు వస్తే ఎన్నికల్లో వాడతామని కోర్టుకు తెలిపింది. వీటిలో భారత్ ఎలక్ట్రానిక్స్, ఈసీఐఎల్ నుంచి ఆగస్గు 31కల్లా 48వేల యూనిట్లు, సెప్టెంబర్ చివరికల్లా మరో 25,500 యూనిట్లు డెలివరీ రావాల్సి ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈసీ వద్ద 53,500 యూనిట్లు ఉన్నాయి. గుజరాత్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లేదా ఈవీఎంలతోపాటు ఓటు రశీదు యంత్రాలనూ వినియోగించాలని ఈసీని ఆదేశించాలని కోరుతూ గుజరాత్ పటిదార్ నేత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఓటు రశీదుయంత్రాల వాడకంపై ఈసీని సుప్రీంకోర్టు వివరణ కోరిన సంగతి తెలిసిందే.