రాబోయే ఎన్నికలకు ఈసీ సిద్దమవుతుండగా.. ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై సచివాలయంలో ఏపీ ఎన్నికల కమీషన్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సీఈఓ గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ.. ఈవీఎంలపై అనుమానాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించాడు. ఈసారి కొత్తగా వీవీప్యాట్‌లు అందుబాటులోకి వచ్చాయని, ఓటు వేశాక సరిగా పడిందో లేదో వీవీప్యాట్ స్లిప్‌లో చూసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఏడు సెకండ్ల పాటు వీవీప్యాట్‌లో స్లిప్ కనిపిస్తుందని..