ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఆదివారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదితోపాటు అడిషనల్ సీఈఓలు వివేక్ యాదవ్, సుజాత శర్మలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల జాబితాతో కూడిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు అందజేశారు.