జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ‍్యలపై ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ స్పందించారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తనను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారన్న పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే అని వర్మ ట్వీట్ చేశారు. పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే అని, ఆయనను నిజంగా గెలిపించాలనుకునే ఓటర్లు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పవన్‌కే ఓటు వేసేవారంటూ వర్మ సెటైర్ వేశారు.