న్యూఢిల్లీ: ఓటు ధ్రువీకరణ యంత్రాలు (వీవీప్యాట్) సక్రమంగా పనిచేసేలా వాటికి చిన్న చిన్న మార్పులు చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓం ప్రకాశ్ రావత్ చెప్పారు. 10 రాష్ట్రాల్లోని నాలుగు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది మే 28న ఉప ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే. ఇందుకోసం మొత్తం 10,300 వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగించగా దాదాపు 1,150 యంత్రాలు మధ్యలో మొరాయించాయి. దీంతో సాంకేతిక నిపుణులు ఆయా యంత్రాలను పరిశీలించి అవి పనిచేయకపోవడానికి మూల కారణాన్ని గుర్తించారు.
కాంట్రాస్ట్ సెన్సర్‌పై నేరుగా కాంతి పడుతుండటం వలన కొన్ని యంత్రాలు పనిచేయలేదనీ, దీనిని నివారించడంకోసం కాంట్రాస్ట్ సెన్సర్‌లపై చిన్న ముసుగును వినియోగించనున్నట్లు రావత్ వెల్లడించారు. అలాగే గాలిలో తేమ ఎక్కువ కావడం వల్ల ఆ తడికి పేపర్ కాస్త మెత్తబడటంతో మరికొన్ని వీవీప్యాట్ యంత్రాలు ఓటు ధ్రువీకరణ కాగితాన్ని ముద్రించలేకపోయాయని ఆయన వివరించారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఇకపై గాలిలోని తేమకు మెత్తబడకుండా ఉండే కాగి తాన్నే వీవీప్యాట్ యంత్రాల్లో ఉపయోగిస్తా మని తెలిపారు. ఓటర్లు ఈవీఎంలో ఓటు వేయగానే, వారు ఏ పార్టీకి ఓటు వేశారో ఆ పార్టీ గుర్తును ఓ చిన్న కాగితంపై వీవీప్యాట్ యం త్రాలు ముద్రిస్తాయి. ఏడు సెకన్ల పాటు ఈ కా గితం వీవీప్యాట్ యంత్రంపై ఉండి ఆ తర్వాత దానంతట అదే ఓ డబ్బాలోకి పడిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment