సాక్షి,అగర్తలా: వచ్చే నెలలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు ఓటు వేసిన తర్వాత ఏ పార్టీకి ఓటు వేశారో ధ్రువీకరించుకునేలా రసీదులు ఇచ్చే వోటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) మెషీన్లను ఉపయోగిస్తామని ఎన్నికల ప్రధానాధికారి ఏకే జ్యోతి తెలిపారు.
ఇక నుంచి అన్ని ఎన్నికల్లో వీటిని ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు.బ్యాటరీతో రూపొందే ఈ మెషీన్లను ట్యాంపర్ చేయడం అసాధ్యమని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ పెద్దసంఖ్యలో ఈవీఎంలు, వీవీపీఏటీలను కొనుగోలు చేస్తుందని చెప్పారు.
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3170 పోలింగ్ బూత్‌ల్లో ఈవీఎంలు, వీవీపీఏటీలను వినియోగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment