సాక్షి, సిటీబ్యూరో: ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఓట్ల శాతం పెంపునకు విసృత్త ప్రచారం చేస్తూంటుంది. ఓటర్లను చైతన్యపర్చడానికి అవగాహన కార్యక్రమాలతో పాటు వివిధ రకాల ప్రకటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూంటుంది. అయినా ఎన్నికల సంఘం అనుకున్న స్థాయిలో ఓట్ల శాతం పెరగడం లేదు. మరోవైపు ఓటింగ్ టైం మేనేజ్‌మెంట్‌ను పరిశీలించగా ఓటరు శాతం పెరగడానికి చేస్తున్న ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు అనిపిస్తోంది.
ఓటింగ్ టైం ప్రకారం పోలింగ్ బూత్‌లో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని, వారికి సమయం సరిపోదని తెలుస్తోంది. ఒక ఓటరు ఓటు వేయడానికి కనీసం రెండు నిమిషాలు అనుకున్న గంటకు 60 ఓట్లు పడతాయి. పది గంటల్లో 600 ఓట్లు పడే అవకాశం ఉంది. ఒకవేళ క్రమం తప్పకుండా ఓట్లు వేసినా మరో 100– 150 మందికి ఓటు వేసే అవకాశం దక్కుతుంది. ఇలా దాదాపు 750 మందికి పది గంటల్లో ఓటు వినియోగించే అవకాశం దక్కవచ్చు. ఎందు కంటే గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాల పోలింగ్‌బూత్‌ల్లో 900 నుంచి 1200 వందల వరకు ఓటర్లు ఉన్నారు.
పోలింగ్ బూత్‌ల పరిస్థితి ఇదీ..
రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ బూత్‌ల్లో పోలింగ్ మేనేజ్‌మెంట్ సక్రమంగా ఉన్నా మిగతా నియోజకవర్గాల్లో పోలింగ్ మేనేజ్‌మెంట్ దారుణంగా ఉంది. ఎన్నికల నిర్వహణా అధికారులు ఏ లెక్క ప్రకారం పోలింగ్ బూత్‌లో 1200 వరకు అత్యధికంగా ఓటర్లు ఉండవచ్చని నిర్ధారించారో తెలియండంలేదు.
ఓటింగ్ సమయం పది గంటలు ఉంది. ప్రతి ఓటరుకు పట్టే సమయం నిముషం అనుకున్న గంటకు 60 ఓట్లు పడతాయని, పది గంటల్లో కేవలం 600 ఓట్లు మాత్రమే పడతాయి. ఈ ఎన్నికల నుంచి వీవీ ప్యాట్ కూడా ఉంది. ఇందులో అభ్యర్థి గుర్తును చూసే అవకాశం ఉంది. దీంతో సమయం మరింత పట్టవచ్చు.
10 గంటలు కేవలం 600 మందే..
ఒక ఓటరు ఓటు వేయడానికి తన ఓటరు కార్డు తీసుకొని పోలింగ్ కేంద్రానికి వస్తే అతడికి నాలుగు రకాల ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయా పార్టీల అభ్యర్థుల ఓటు నిర్ధారణ అనంతరం ప్రిసైడింగ్, అసిస్టెంట్, పోలింగ్ అధికారులు తదుపరి ప్రక్రియ కొనసాగిస్తారు. ఓటరు లిస్టులో సదరు వ్యక్తి ఓటు ఉన్నట్లు గుర్తిస్తారు. ఓటరు వేలిపై ఇంక్ పెడతారు. అధికారి బ్యాలెట్ రిలీజ్ చేస్తారు. ఓటరు ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి బటన్ నొక్కుతాడు. అనంతరం వీవీ ప్యాట్‌లో ఏ గుర్తుకు ఓటు వేశారో అది ఏడు సెకన్ల వరకు కనబడుతుంది. ఇలా ఒక ఓటరు ఓటు వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేసినా కనీసం ఒక్క నిమిషం సేపు పడుతుంది.
ఒక పోలింగ్ బూత్‌లో 1200 వరకు ఓట్లు
పోలింగ్ సమయం 10 గంటల వ్యవధి ఉంది. పది గంటల్లో కేవలం ప్రతి ఓటరు రెండు నిమిషాల సమయం కేటాయించినా కేవలం 600 మందికే ఓటు వేసే అవకాశం ఉంది. అయితే పలు పోలింగ్ బూత్‌లో 1200 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కనీసం 50 లేదా 60 శాతం ఓటింగ్ అయినా 600 నుంచి 720 మంది ఓట్లు వేయడానికి అవకాశం ఉండదు.
ఓటింగ్ వేసే సమయం పది గంటలు ఇందులో 600 ఓట్లు పడతాయి. అదే ఓటరు వేసే ఓటింగ్ ప్రక్రియ చూస్తే కనీసం రెండు నిమిషాలైనా సరిపోదని ఎన్నిక అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి పోలింగ్ బూత్‌లో ఎక్కువగా 1200 ఓట్లు, తక్కువగా 900 వరకు ఉన్నాయి. ఎన్నికల ఐటీ విభాగం పోలింగ్ బూత్‌లో అత్యధికంగా 1200 వరకు ఓటర్లు ఉండవచ్చని నిర్ధారించారు. ఏ లెక్క ప్రకారం 1200 లేదా అందులో సగం అంటే 50 శాతం 600 మంది పది గంటల్లో ఓటు ఏలా వేస్తారో వారికే తెలియాలి.
అంతుచిక్కని ఎన్నికల సమయం
ఓటింగ్ శాతం పెంచాలని ఎన్నికల సంఘం ప్రచారం చేస్తున్నా.. ప్రతి ఓటింగ్ బూత్‌లో 900– 1200 మంది వరకు ఓట్లు నమోదై ఉన్నాయి. అధికారులు చెబుతున్న ప్రకారం ప్రతి ఓటరుకు కనీసం రెండు నిమిషాలు అవుతుందని చెప్పినా.. ఓటింగ్ శాతం 50– 60 శాతం ఓటింగ్ అయినా సమయం ఎలా సరిపోతుందో అంతుపట్టడంలేదు.
పొంతన లేని సమాధానాలు
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల సమయానికి పోలింగ్ బూత్‌లో నమోదయిన ఓటరు జాబితా ప్రకారం 30– 40 శాతం ఓటింగ్‌కు సమయం సరిపోయే విధంగా ఉంది. ఈ విషయంలో ఎన్నికల అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు ఈవీఎం టైమ్ నిర్ధారణ ఓటరు లిస్టులో ఉన్న ఓటర్ల సంఖ్య ఇరు విభాగాలకు తెలియదు. దీంతో ఇలాంటి విషయం గురించి ఎన్నికల సంఘానికి తెలియవని, పోలింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
కొత్త ఓటర్లు 56,000
నగరంలో ఓటరు చైతన్యం పెరుగుతోంది. రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక, లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు 60వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 15వ తేదీలోపు హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఇది. ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటేనే లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశముంటుందని అధికారులు, మీడియా విస్తృతంగా ప్రచార కార్యక్రమా లు నిర్వహించిన నేపథ్యంలో స్వల్ప వ్యవధిలోనే 60వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన అధికారులు వీరిలో 56వేల మందికిపైగా అర్హులని గుర్తించారు. వచ్చే నెల 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వీరంతా ఓటేయనున్నారు. అందిన దరఖాస్తుల్లో దాదాపు 200 దరఖాస్తుల్ని మాత్రం అధికారులు పరిశీలించాల్సి ఉంది. కొత్తగా పేరు నమోదు కోసం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సగటున 3వేల నుంచి 4వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.
గతం లో మాదిరే అత్యధికంగా జూబ్లీహిల్స్ నుంచి 5,784 మంది కొత్తగా ఓటరు జాబితాలో పేరు కోసం దర ఖాస్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ నుం చి 5,747 మంది, అంబర్‌పేట నుంచి 5,269 మంది దరఖాస్తు చేసుకున్నారు. చార్మినార్ నుంచి 1934 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment