Voting Awareness
-
USA Presidential Elections 2024: పోలింగ్ డే ఉచితాలు
మన లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను పెంచేందుకు.. కొన్ని కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు గుర్తున్నాయా? ఓటేస్తే ఉచితంగా బీర్, రెస్టారెంట్లో బిల్లుపై డిస్కౌంట్, పోలింగ్ కేంద్రానికి ఉచిత ప్రయాణం..! ఆ... అలాంటి ఆఫర్లే ఇప్పుడు అమెరికా ఎన్నికల్లోనూ ఓటర్లకు పలు కంపెనీలు ఇస్తున్నాయి. 2,000 కంటే ఎక్కువ కంపెనీలు ‘టైమ్ టు ఓట్’ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాయి. ఉద్యోగులు ఓటు వేసేందుకు అనుగుణంగా పని షెడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ఓటేయడానికి వెళ్లేందుకు ఉచిత ప్రయాణాల నుంచి.. ఓటేసిన వారికి ఉచిత డోనట్స్వరకు కొన్ని సంస్థలో ఉచితాలు ప్రకటించాయి. → పోలింగ్ రోజు ఉబర్ యాప్‌లోని ‘గో ఓట్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే యూజర్లకు రకరకాల ఆఫర్లు వస్తాయి. పోలింగ్ కేంద్రానికి ప్రయాణాలపై 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల వరకు) పొందవచ్చు. సమీపంలోని పోలింగ్ కేంద్రాన్ని కూడా యాప్‌లో తెలుసుకోవచ్చు. ఉబర్ ఈట్స్ కూడా 25 శాతం డిస్కౌంట్‌పై ఆర్డర్లను అందిస్తోంది. → పోలింగ్ రోజున 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల దాకా) ఇస్తున్నట్లు ‘లిఫ్ట్’ యాప్ తెలిపింది. యూజర్లు నవంబర్ 5లోగా రైడ్ కోడ్ ఓటీటీ24ను ప్రీలోడ్ చేసుకోవచ్చు. దీనివ్లల కనీసం 30 లక్షల మంది ఓటేసేందుకు వస్తారని లిఫ్ట్ అంటోంది. → కారు రెంటల్ కంపెనీ హెరŠట్జ్ ‘డ్రైవ్ ది ఓట్’ డీల్‌లో భాగంగా అక్టోబర్ 21 నుంచి నవంబర్ 5 దాకా రెండు, అంతకంటే ఎక్కువ రోజులు రెంట్‌కు తీసుకునే వారికి ఒక రోజు రెంట్ డిస్కౌంట్ ఇస్తోంది. → సెలవు దినాల్లో ఆఫర్లు ప్రకటించే క్రిస్పీ క్రీమ్.. ఉచితంగా డోనట్స్ ఆఫర్ చేస్తోంది. యూఎస్‌లోని అన్ని క్రిస్పీ క్రీమ్ దుకాణాలు ఓటేసిన వారికి ఉచిత ఒరిజినల్ గ్లేజ్డ్ డోనట్ అందిస్తున్నాయి. → ఓటేసినట్టు రుజువు చూపించి తమ స్టోర్‌లో ఏదైనా కొనుగోలు చేస్తే ఉచిత షేక్ ఇస్తామని డైనర్ స్టైల్ చైన్ జానీ రాకెట్స్ ప్రకటించింది. → 400 కంటే ఎక్కువ స్టోర్లున్న రౌండ్ టేబుల్ పిజ్జా పలు ఆఫర్లు ప్రకటించింది. తమ అతి పెద్ద పిజ్జాపై ఆరు డాలర్ల డిస్కౌంట్ ఇస్తోంది. → ఫర్నిచర్ స్టోర్ ఐకియా కూడా ఓటింగ్ డే నాడు ఓటర్లకు ఫ్రోజెన్ యోగర్ట్ ఉచితంగా ఇస్తోంది. → ఎనిమిది రాష్ట్రాల్లో 50 రెస్టారెంట్లున్న లేజీ డాగ్ కూడా ‘ఐ ఓట్’ స్టిక్కర్ ఉన్నవారికి ఎంట్రీ కొనుగోలుపై నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ ఉచితంగా అందిస్తోంది. → ఓటింగ్ రోజు ఉచిత ప్రయాణాన్ని ‘లైమ్’ అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు చెకౌట్ ఆప్షన్ దగ్గర కోడ్ Vౖఖీఉ2024 నమోదు చేస్తే లైమ్ స్కూటర్, బైక్ రైడ్‌తో పోలింగ్ కేంద్రానికి ఉచితంగా వెళ్లొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అందరూ పోలింగ్‌లో పాల్గొనాలి: అదానీ
ఆసియా కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ కుటుంబ సమేతంగా అహ్మదాబాద్‌లో మంగళవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటుహక్కు కలిగి ఉన్న పౌరులందరూ పోలింగ్‌లో తప్పక పాల్గొనాలని ఆయన తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌గా గౌతమ్ అదానీ వ్యవహరిస్తున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.3.5లక్షల కోట్లుగా ఉంది. గౌతమ్ అదానీ ఎంటర్ప్రైజ్ బిజినెస్‌తోపాలు పోర్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిక్ పవర్, మైనింగ్, పునరుత్పాదక ఇందనం, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు. -
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
ఓటింగ్ డే అంటే చాలామంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని ఘటనల ద్వారా తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఓటుహక్కు కలిగిన పౌరులందరూ పోలింగ్‌లో తప్పక పాల్గొనాలి. ఈమేరకు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతోంది. కోట్లు సంపాదిస్తున్నవారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతిలోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందిరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు.ముఖేశ్ అంబానీ కుటుంబంముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు.రిలయన్స్ ఇండస్ట్రీస్ సంపద విలువ: సుమారు రూ.18.9 లక్షల కోట్లు.2019 సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.గౌతమ్ అదానీఅదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌గా గౌతమ్ అదానీ వ్యవహరిస్తున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్: రూ.3.5లక్షల కోట్లు.గౌతమ్ అదానీ ఎంటర్ప్రైజ్ బిజినెస్‌తోపాలు పోర్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిక్ పవర్, మైనింగ్, పునరుత్పాదక ఇందనం, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా అహ్మదాబాద్‌లో ఓటు వేశారు.ఆనంద్ మహీంద్రామహీంద్రా గ్రూప్ సంస్థలకు ఆనంద్ మహీంద్రా సారథ్యం వహిస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండడం ఈయన ప్రత్యేకత. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆనంద్ మహీంద్రా ముంబయిలో తన ఓటు వేశారు.అనిల్ అంబానీరిలయన్స్ ఏడీఏజీ గ్రూప్ ఛైర్మన్‌గా అనిల్ అంబానీ వ్యవహరిస్తున్నారు. ముంబయిలోని కఫ్ పరేడ్‌లోని జిడి సోమాని స్కూల్లో 17వ లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు వినియోగించుకున్నారు.నరేష్ గోయల్జెట్ ఎయిర్వేస్ ఎయిర్‌లైన్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత 2019లో ముంబయిలో ఓటువేశారు.శక్తికాంత దాస్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 25వ గవర్నర్ పనిచేస్తున్న శక్తికాంత దాస్ గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు వేశారు.ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకునే వారు చరిత్రలో తెలుసుకోవాల్సినవి..1649లో ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్-1 భవితవ్యంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే..1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజు సింహాసనం అధిష్ఠించారు.1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికా జర్మనీ భాషను కాదని ఇంగ్లిష్ అధికారిక భాష అయింది.1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటుతో పదవీచ్యులతయ్యారు. 1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు.1999 ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం పడిపోయింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..2004 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సంతెమరహళ్లిలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువనారాయణ గెలిచారు.2008లో రాజస్థాన్‌లో ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సీపీ జోసీనాథ్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, డ్రైవర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
‘ఈసీ’ న్యూ ప్లాన్.. ఓటర్లకు రవాణా సదుపాయం !
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)చర్యలు ప్రారంభించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన 266 నియోజకవర్గాలను గుర్తించింది. ఈ స్థానాల్లో ఈసారి ఓటింగ్‌ను పెంచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్ 5) ఢిల్లీలో ఈసీ అధికారులు గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన నియోజకవర్గాల సిబ్బందితో సమావేశమయ్యారు. తెలంగాణ, బిహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌లలో జాతీయ సగటు 67.40 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. ఈ ప్రాంతాల్లో అక్కడి పరిస్థితులను బట్టి వ్యూహాన్ని అమలు చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు. ప్రజలే స్వయంగా ఓటింగ్‌కు ముందుకువచ్చే వాతావరణాన్ని ఏర్పరచాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగ్ కేంద్రాలకు రవాణా, కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ప్రభావితం చేసే వ్యక్తుల సాయం తీసుకోవాలని సూచించారు. ఇదీ చదవండి.. వందలసార్లు ఓడినా మళ్లీ బరిలోకి -
పోలింగ్ డే హాలీడే.. హైదరాబాద్‌లో పెరగని పోలింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, హైదరాబాద్‌లో మాత్రం పోలింగ్ శాతం 32గా ఉంది. సిటీలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇదిలా ఉండగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ డేను సెలవు రోజుగానే చదువుకున్న ఓటర్లు చూస్తున్నారు. గతంలానే ఓటేసేందుకు హైదరాబాదీలు ముఖం చాటేశారు. సెలబ్రేటీలు ఉదయాన్నే ఓటు వేసి బాధ్యతను గుర్తు చేసినా, ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటింగ్ శాతం మాత్రం పెరగలేదు. ఇక, మెదక్‌లో అత్యధికంగా 70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మరోవైపు.. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియనుంది. ఇల్లందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజక వర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. ఒకటి, రెండు ప్రాంతాల్లో తప్ప మిగతా అన్నిచోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. మిగతా స్థానాల్లో ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. -
'ఈవీఎం' విశేషాల గురించి.. మీకు పూర్తిగా తెలుసా..!?
సాక్షి, ఆదిలాబాద్: సమర్థవంత ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాలెట్ బాక్స్ మొదలు ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) వరకు ఓటింగ్ విధానంలో మార్పులు తెచ్చింది. ఈవీఎం, వీవీప్యాట్, నోటా లాంటి నూతన విధానాలతో పారదర్శక ఓటింగ్‌కు భరోసానిస్తోంది. 1999 ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ కోసం ఈవీఎం వాడడంతో 10 వేల టన్నుల కాగితం మిగిలింది. ఈవీఎంలను మొదటిసారిగా 1982లో కేరళ రాష్ట్రంలోని పర్వూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు. ఈవీఎంలపై నెలకొన్న సందేహాలకు నివృత్తిగా పలు సమాధానాలను ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం విశేషాలపై కథనం.. ఈవీఎం అంటే? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఇది ఎన్నికల్లో పోలైన ఓట్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో రికార్డు చేయడంతో పాటు లెక్కించే పరికరం. ఈవీఎంలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌తో పాటు జతగా వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) ఉంటుంది. రవాణా సులభం.. బ్యాలెట్ బాక్సులతో పోలిస్తే ఈవీఎంల రవాణ చాలా సులభం. తేలికంగా, పోర్టబుల్‌గా ఉండడంతో దూరంగా, రోడ్డు సౌకర్యం లేనిప్రాంతాలకు సైతం వీటిని సులభంగా తరలించవచ్చు. గరిష్టంగా అభ్యర్థుల సంఖ్య, వేసే ఓట్లు.. ఈవీఎం బ్యాలెట్ యూనిట్లో నోటాతో పాటు 15 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. ఒకవే ళ అంతకంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉంటే మ రో బ్యాలెట్ యూనిట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇలా ఒక ఈవీఎంకు 24 బ్యాలెట్ యూని ట్లు అనుసంధానించవచ్చు. తద్వారా 384 మంది అభ్యర్థుల వరకు సేవలు అందిస్తుంది. ఇక ఓట్ల విషయానికి వస్తే గరిష్టంగా 2 వేల ఓట్లను రికార్డు చేస్తుంది. కానీ ఎన్నికల్లో సాధారణంగా 1500 ఓట్లను నమోదు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. విద్యుత్ లేని ప్రాంతాల్లో.. ఈవీఎంలకు విద్యుత్ సరఫరా అవసరం లేదు. ఈవీఎం, వీవీప్యాట్లకు సొంతంగా బ్యాటరీ/పవర్–ప్యాక్ సౌకర్యం ఉండడంతో విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో సైతం వీటిని వినియోగించవచ్చు. నిర్ధారించుకున్న తర్వాతే పోలింగ్.. పోలింగ్ ప్రారంభానికి ముందు కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ బటన్‌ను నొక్కి ఇప్పటికే ‘దాచిన’ ఓట్లేవీ నమోదు కాలేదని ప్రిసైడింగ్ అధికారి హాజరైన పో లింగ్ ఏజెంట్లకు ప్రదర్శిస్తారు. వీవీప్యాట్ డ్రాప్బా క్స్ తెరిచి ఖాళీగా ఉందని చూపుతారు. వారి సమక్షంలో కనీసం 50 ఓట్లతో మాక్ పోల్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ ఫలితాన్ని క్లియర్ చేసి అసలు పోల్ ప్రారంభించే ముందు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్‌కు సీలు వేస్తారు. పోలైన ఓట్ల సంఖ్య ఇలా తెలుసుకోవచ్చు.. ఈవీఎం కంట్రోల్ యూనిట్లో ఫలితం బటన్‌తో పాటు, టోటల్ బటన్ ఉంటుంది. పోల్ సమయంలో ఎప్పుడైనా ఈ బటన్ నొక్కితే అప్పటి వరకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్య తెలుస్తుంది. పోలింగ్ ముగియగానే క్లోజ్ బటన్ నొక్కితే మెషిన్ ఇకపై ఓట్లను అంగీకరించదు. ఈవీఎంల భద్రత.. పోలింగ్ తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో సె క్యూరిటీ బలగాల పహారాలో భద్రపరుస్తారు. అభ్యర్థులు నియమించిన ఏజెంట్లు కౌంటింగ్ వరకు ఈవీఎంలను 24 గంటలూ చూసేందుకు అనుమతిస్తారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌లకు తాళాలు వేసి ఎన్నికల అధికారులతో పాటు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సంతకాలతో సీలు వేస్తారు. కౌంటింగ్ డే.. కౌంటింగ్ రోజున అభ్యర్థులు/వారి ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారి, ఎన్నికల సంఘం పరిశీలకుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తెరుస్తారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత, వీవీప్యాట్ స్లిప్‌లను బయటకు తీసి, అభ్యర్థులు/వారి ప్రతినిధుల సమక్షంలో నల్లటి కవరులో భద్రపరుస్తారు. ఓటరు ఫిర్యాదు చేయవచ్చు.. ఓటరు ఓటును నమోదు చేసిన తర్వాత వీవీప్యాట్‌లో కనిపించే పేపర్ స్లిప్‌లో ఓటు వేసిన అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థి పేరు, గుర్తు వచ్చినట్లయితే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. నిజమని తేలితే ఆ ఓటింగ్ యంత్రంలో తరువాతి ఓట్ల నమోదును నిలిపివేసి రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం నడుచుకుంటారు. ఓటు ఎలా వేయవచ్చు? ఈవీఎం ఓటింగ్ విధానంలో కంట్రోల్ యూ నిట్ ప్రిసైడింగ్ అధికారి వద్ద, బ్యాలెట్ యూ నిట్, వీవీప్యాట్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటుంది. బ్యాలెట్ యూనిట్‌పై ఓటరు తన కు నచ్చిన అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న బ్లూబటన్ నొక్కగానే ఎరుపురంగు లైట్ మె రుస్తుంది. ఎంపిక చేసుకున్న అభ్యర్థి సీరియ ల్ నంబర్, పేరు, గుర్తు చూపించే పేపర్ స్లిప్ వీవీప్యాట్ విండో ద్వారా సుమారు 7 సెకన్ల పాటు కనిపించి డ్రాప్‌బాక్స్‌లో పడగానే కొద్దిసేపు బీప్ అనే శబ్దం వస్తుంది. దీంతో ఓటు నమోదైందని తెలుసుకోవచ్చు. ఈవీఎం మొరాయిస్తే.. పోలింగ్ సమయంలో బ్యాలెట్, కంట్రోల్ యూనిట్ క్రమం తప్పితే బ్యాలట్, కంట్రోల్ యూనిట్‌తో పాటు వీవీప్యాట్‌తో కూడిన కొత్త సెట్ ఏర్పాటు చేస్తారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో రిజర్వ్ దశ నుంచి పనిచేయని దశ వరకు నమోదైన ఓట్లు, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ బ్యాలెట్ స్లిప్‌లు కంపార్ట్మెంట్ మెమరీలో భద్రంగా ఉంటాయి. వీవీప్యాట్ మాత్రమే పనిచేయకపోతే కంట్రోల్ యూనిట్లో నమోదైన ఓట్లు దాని మెమరీలో భద్రంగా ఉంటాయి. దీంతో రిజర్వ్ మెషిన్ల నుంచి పనిచేయని వీవీప్యాట్ తొలగించి మరొకటి ఏర్పాటు చేసిన తర్వాత పోలింగ్ తిరిగి ప్రారంభిస్తారు. ఏదైనా సాంకేతిక కారణాలతో కంట్రోల్ యూనిట్లలో నమోదైన ఓట్లను నిర్ధారించకపోతే కంట్రోల్ యూనిట్ వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కిస్తారు. -
ఓట్ తో దుమ్ము రేపుదాం..!
-
TS Election 2023: 'ఈవీఎం'లపై ఓటర్లకు అవగాహన తప్పనిసరి..
ఆదిలాబాద్: శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లపై అధికార యంత్రాంగం అవగాహన కల్పిస్తోంది. ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తోంది. ఓటింగ్‌లో కచ్చితత్వానికి వినియోగిస్తున్న వీవీ పాట్లపైనా వివరిస్తోంది. ఈవీఎంలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెల్లని ఓట్లకు చెక్ పడింది. భారీయెత్తున కాగితం వినియోగమూ తగ్గింది. ఎప్పటికప్పుడు మార్పులు.. ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెటింగ్ యూనిట్ ఉంటాయి. ఐదు మీటర్ల కేబుల్‌తో ఈ రెండింటిని అనుసంధానం చేస్తారు. బ్యా లెటింగ్ యూనిట్లో 16 మంది అభ్యర్థుల గుర్తులు, పేర్లుంటాయి. 2006 కంటే ముందు ఎం1, ఆ తర్వాత ఎం2 ఈవీఎంలు ఉండగా.. నాలుగు బ్యాలెటింగ్ యూనిట్లను అనుసంధానం చేయడం ద్వారా గరిష్టంగా 64 మంది(నోటాతో కలిపి) అభ్యర్థులు బరిలో ఉన్నా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 2006 తర్వాత ఎం3 ఈవీఎంలను తయారు చేయగా.. 24 బ్యాలెటింగ్ యూనిట్లను అనుసంధానం చేయడం ద్వారా గరిష్టంగా నోటాతో కలిపి 384 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ఎన్నికలు నిర్వహించవచ్చు. ఒకే కంట్రోల్ యూనిట్ అవసరం అవుతుంది. అలా మొదలై ఇలా.. బ్యాలెట్ బాక్సు, పేపర్ స్థానంలో ఈవీఎం తీసుకు రావడానికి ఎన్నికల సంఘం 1977లో హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)ను సంప్రదించింది. దీంతో 1979లో నమూనా ఈవీఎంను రూపొందించింది. దీన్ని ఎన్నికల సంఘం 1980 ఆగస్టు 6న రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రదర్శించింది. ప్రభుత్వ రంగంలోని మరో సంస్థ బెంగళూర్‌లోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్(బెల్)తో కలిసి ఈసీఐఎల్ ఈవీఎలను తయారు చేసింది. వినియోగంలోకి.. 1982లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలను మొదటిసారి వినియోగించారు. కానీ వినియోగానికి సంబంధించి నిర్దిష్ట చట్టం లేకపోవడంతో ఆ ఎన్నికలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్నికల్లో ఈవీఎంల వినియోగానికి సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని పార్లమెంటులో 1989లో సవరించారు. ఆ తర్వాత 1998లో మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 25 శాసనసభ నియోజకవర్గాల్లో ఈవీఎంలను వినియోగించారు. 1999 ఎన్నికల్లో 45 పార్లమెంటరీ స్థానాల్లో, 2000లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో 45 అసెంబ్లీ స్థానాల్లో వినియోగించారు. 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఈవీఎంలను ఉపయోగించారు. అప్పటి నుంచి ప్రతీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఈవీఎంలనే వినియోగిస్తోంది. 2004లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో దేశంలోని 543 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈవీఎంలు వినియోగించారు. ఓటు కచ్చితత్వం.. ఓటు కచ్చితత్వానికి వీవీ ప్యాట్(ఓటరు వెరిఫైయేబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) వినియోగిస్తున్నారు. ఓటు వేయగానే ఒక స్లిప్పై సీరియల్ నంబరు, అభ్యర్థి పేరు, గుర్తు ప్రింట్ అయి బాక్సులో పడుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల్లో 315కోట్ల ఓట్లు పోలయ్యాయి. ఒకే ఎన్నిక.. 25వేల బ్యాలెట్ యూనిట్లు 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి అత్యధికంగా 185మంది బరిలో నిలిచారు. పార్లమెంటు నియోజకవర్గంలోని 1,788 పోలింగ్ కేంద్రాల్లో మొత్తంగా 25వేల బ్యాలెటింగ్ యూనిట్లు, 2000 కంట్రోల్ యూని ట్లు, 2000 వీవీప్యాట్లు వినియోగించి ఎన్నిక నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12బ్యాలెట్ యూనిట్లు, ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీ ప్యాట్ అమర్చారు. రికార్డు స్థాయిలో అభ్యర్థులు బరిలో నిలిచినా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం దేశంలోనే ఇది మొదటిసారి. కలెక్టరేట్లలో అవగాహన.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ స్థా నాలు ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖా నాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ ఉన్నాయి. ఎన్నికలు రానున్న నే పథ్యంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో ఈవీఎంలను ప్రదర్శిస్తూ సంబంధిత అధికారు లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. -
ఆ రాష్ట్ర ఐకాన్‌గా ఫోక్ సింగర్.. 22 ఏళ్లకే అరుదైన ఘనత..
పాట్నా: బిహార్ రాష్ట్ర ఐకాన్‌గా ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్‌ను(22) నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి సోమవారం వెల్లడించారు. బిహార్ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా మైథిలి ఉండనున్నారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. 22 ఏళ్ల మైథిలి ఠాకూర్ ఇండియన్ క్లాసికల్, ఫోక్ మ్యూజిక్‌లో శిక్షణ పొందారు. 2021లో బిహార్ జానపద సంగీతానికి తనవంతు భాగస్వామ్యం అందించినందుకు సంగీత్ నాటక్ అకాడెమీ ఆమెను 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్'తో సన్మానించింది. బిహార్ మధుబనిలో జన్మించిన మైథిలికి ఆమె తండ్రి, తాత చిన్నతనం నుంచే జానపదం, హిందుస్తానీ క్లాసికల్ సంగీతం, హార్మోనియం, తబ్లాలో శిక్షణ ఇచ్చారు. దీంతో ఆమె ఫోక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తర బిహార్ ప్రాంతీయ భాష అయిన మైథిలితో పాటు హిందీ, భోజ్‌పురిలో జానపద పాటలు పాడి పాపులర్ అయ్యారు. తన కూతురుకు ఈ అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందని మైథిలి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేసి ఓటింగ్ శాతం పెంచేందుకు తన కూతురు కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి' -
18 ఏళ్లు నిండాయా? ఓటరుగా నమోదు చేయించుకోండి
సాక్షి, హైదరాబాద్: జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సూచించారు. ఓటరు జాబితాపై అభ్యంతరాలపై ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం సందర్భంగా తెలియజేయవచ్చన్నారు. పేరు, చిరునామా వంటి వాటిల్లో పొరపాట్లుంటే సరిచేసుకునే వెసులుబాటు ఉందన్నారు. బుధవారం ఓటరు జాబితా సవరణపై స్వీప్ కమిటీ సభ్యులతో లోకేశ్‌కుమార్ వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరుగా పేరు నమోదు, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి చిరునామా మార్పుల కోసం సంబంధిత ఈఆర్ఓను సంప్రదించవచ్చని సూచించారు. ఓటరు నమోదు యాప్ ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) పంకజ పాల్గొన్నారు. చదవండి: ఎన్నారైనంటూ ప్రేమ, సహజీవనం.. ఆపై బ్లాక్‌మెయిలింగ్ -
ఓటే ఆయుధం.. అందరూ వేయండి
ఓటే ఆయుధం.. అందరూ వేయండి‘మనం మనకోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది.’ – జాతిపిత మహాత్మాగాంధీ సాక్షి, కరీంనగర్: అహింసే ఆయుధంగా.. సహనమే డాలుగా దేశానికి స్వేచ్ఛావాయువులందించిన మహోన్నతుడు మన జాతిపిత మహాత్మాగాంధీ. ఆంగ్లేయుల బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించిన స్ఫూర్తి ప్రధాత. రాజకీయాల్లో అడుగడుగునా విలువలు పెరగాలని.. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆకాంక్షించిన గొప్ప వ్యక్తి. పల్లెలే పట్టుగొమ్మలుగా సిద్ధాంతాలతో కూడిన నాయకత్వం పెంపొందాలని పరితపించిన ఆదర్శనీయుడు కోట్లాది మంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ ఓటర్లు, అభ్యర్థులు, ఎన్నికల యంత్రాంగం బాపూజీ మాటల్ని మననం చేసుకొని, విలువల మంత్రాల్ని ఆచరించాల్సిన తరుణమిది. ఓటరన్నా.. విలువ కాపాడుకో.. ఓటు విషయంలో నీ విలువ కాపాడుకో. మంచి నాయకుడిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకునేందుకు ఓటు అనే ఆయుధాన్ని వాడుకోవాలి. హుజూరాబాద్ ఎన్నికలో మొత్తం 305 పోలింగ్ కేంద్రాలు వినియోగిస్తుండగా 2,36,283 మంది ఓటర్లున్నారు. ప్రతిఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలి. మంచి నాయకుడికి పట్టం గట్టాలి. సిద్ధాంతాలు లేని రాజకీయాలు వ్యర్థం ఎన్నికల్లో గెలుపోటములు సహజం. విలువలతో ప్రజల మనసుని గెలవాలి. సిద్ధాంతాలకు లోబడి ఉండలేని రాజకీయాలు వ్యర్థం. అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడాలి. ఆయా పార్టీల అభ్యర్థులుగా బరిలో ఉండే నాయకులంతా ప్రజాసేవపై దృష్టి సారించాలి. విలువలకు కట్టుబడాలి.. విధి నిర్వహణకు మించిన సేవ లేదు. విలువలకు కట్టుబడకుండా.. వ్యక్తిత్వాన్ని కోల్పోయి సేవలందించినా అది నిరుపయోగమే. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించడంలో బాధ్యత ముఖ్యమన్నది మరవొద్దు. చెడుకు సహాయ నిరాకరణ చేయడం ద్వారా విలువల్ని పరిరక్షించవచ్చు. బంధుప్రీతి.. ఇతర వ్యామోహాలకు వెరవకుండా ఎన్నికల్లో సమర్థంగా పనిచేస్తే ఎన్నికల ఆశయానికి ఊపిరిపోసినట్లే. నైతికత.. పారదర్శకత అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు.. రంగు గో డలు కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన అభివృద్ధి. అలాగే నాయకులు అందించే పాలనలో పారదర్శకత ముఖ్యం. సమాజానికి మేలు చేయాలనే భావన నాయకుల హృదయాంతరాల్లో నుంచి రావాలి. అందుకు ప్రణాళికతో కూడిన సాధన అవసరం. ప్రగతితో కూడిన పాలన నిత్యం అత్యవసరం. మద్యం జోలికి వెళ్లకండి.. ప్రజాస్వామ్య వ్యవస్థ పునర్నిర్మాణంలో యువతే కీలకం. నేను కన్న కలల లోకంలో విహరించాలంటే నా బాటలో నడవండి. అహింసాయుత జీవనానికి నాంది పలకండి. ఏరులై పారే మద్యం జోలికి ఈ ఎన్నికల్లో అసలు వెళ్లకండి. ఎవరినీ వెళ్లనివ్వకండి. 305 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను ప్రలోభపెట్టే అవినీతి సొమ్ము సహా మద్యాన్ని కట్టడి చేసేలా ఊరూరా మీ బాధ్యత చూపండి. స్వచ్ఛమైన మనసుతో ఆలోచించండి. అసత్య ప్రచారాల్ని నమ్మకండి. నీతి, నిజాయతీలకు పట్టం కట్టండి. చదవండి: తొలి రోజు మూడు నామినేషన్ల దాఖలు -
ఊరిని మార్చడం కోసం 81 ఏళ్ల వృద్ధురాలు
ఊరే ముందు పుట్టిందో, రాణిదేవే ముందు పుట్టారో ఆ ఊళ్లో ఎవరికీ తెలియదు. ఊళ్లోని చెట్టూ పుట్టా, చేనూ చెరువూ, కొండా కోన ఆమె కళ్ల ముందే ఎదిగాయి. ఎదగకుండా ఉన్నది మాత్రం ఊరే. ఎదగని ఆ ఊరిని చూస్తూ.. ఇక చూస్తూ ఊరుకోకూడదని నిర్ణయించుకున్నారు రాణి దేవి. రాణిదేవి బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యురాలో, లేక ‘గ్రామ ప్రధాన్’నో కానవసరం లేదు. ఆమెకై ఆమె వెళ్లి అడిగితే గ్రామంలోని ఏ ప్రభుత్వ ఉద్యోగి, అధికారి అయినా వెంటనే కుర్చీలోంచి లేచి, ఎదురెళ్లి ఆమెకు నమస్తే పెట్టి, అవసరమైన పని చేసిపెట్టేంత గౌరవనీయమైన పెద్ద వయసులో ఉన్నారు రాణిదేవి. 81 ఏళ్లు! అసలైతే ప్రభుత్వమే ఆమె దగ్గరకు రావాలి. ఆమె ప్రభుత్వం దగ్గరకు వెళ్లే అవసరం లేదు. ఉందీ అంటే ఆ గ్రామంలో ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే! ఎలాగంటే ఒక వృద్ధ మహిళ అడిగితేనే లక్ష్య పెట్టని ప్రభుత్వ సిబ్బంది.. తక్కినవారు అడిగితే పని చేసి పెడతారా?! అలా చేసి పెట్టి ఉంటే ఈ ఎనభై ఏళ్లలో.. రాణిదేవికి ఊహ తెలిసినప్పటి నుంచైతే.. ఈ డెబ్బై ఏళ్లలో రుద్రాపూర్ ఎంతో అభివృద్ధి చెంది ఉండాలి. అభివృద్ధి అంటే పెద్దగా ఏం కాదు.. మంచి రోడ్లు, మంచి నీరు, శుభ్రమైన పరిసరాలు.. ఇలా మనిషి మనుగడకు అవసరమైన కనీస వసతులు. కానీ రుద్రాపూర్‌లో ఏడు దశాబ్దాలుగా ఇవేవీ లేవు. చిత్రంగా ఉంటుంది.. వచ్చి వెళ్లిన పాలకులు, అధికారులు ఏం చేసినట్లు?! ∙∙ ఏం చేయలేదని, ఏం చెయ్యరు కూడానని చివరికి రాణిదేవే బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యురాలిగా నిలబడేందుకు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఏప్రిల్ 15 నుంచి విడతల వారిగా పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. మే 2 న కౌంటింగ్. అదే రోజు ఫలితాలు రావచ్చు. ఏ పంచాయితీకి ఏ ఫలితం వచ్చినా.. కాన్పూర్ జిల్లా చౌబేపుర్ బ్లాక్ కౌన్సిల్ సభ్యురాలిగా రాణిదేవి గెలవడం అత్యుత్తమ ఫలితం అవుతుంది. రాణిదేవి స్వగ్రామమైన రుద్రాపూర్ ఆ బ్లాక్ పరిధిలోనిది. ఆమె గెలుపు ఎలా అత్యుత్తమమైన ఫలితం అవుతుందో చూడండి. ఆమేమీ అధికారం కోసం, పదవి కోసం, నాలుగు రాళ్లు సంపాదించుకోవడం కోసం ఈ వయసులో నామినేషన్ వేయలేదు. ఏదైనా ఒక పార్టీ తరఫున అసలే పోటీ చేయడం లేదు. తనకై తను సొంతంగా, స్వతంత్ర అభ్యర్థిగా, ఊరిని మార్చడం కోసం ఎన్నికల్లో నిలబడ్డారు. ‘‘నన్ను గెలిపిస్తే ఊరిని నివాస యోగ్యం చేస్తాను’’ అని రాణిదేవి అంటున్నారు. మంచి మాటే! ఆకాశాన్ని కిందికి తెస్తాం, భూమిని పైకి తీసుకెళతాం అని హామీలు ఇవ్వడం కాకుండా.. ఊళ్లో నివాసం ఉండే పరిస్థితుల్ని కల్పిస్తాను అని రాణిదేవి అనడం.. ‘ఊరొదిలి ఎక్కడికీ వెళ్లనవసరం లేదు’ అని నమ్మకమైన హామీని ఇవ్వడమే. అయినా రుద్రాపూర్ గ్రామ ప్రజలు ఊరెందుకు వదలి వెళ్లాల్సి వస్తుంది?! ∙∙ ఇన్నేళ్లుగా ఊరిని చూస్తూనే ఉన్నారు కదా రాణిదేవి.. ఊళ్లో సరైన రోడ్లు లేవు. ఆ ఊళ్లో కాలి నడక కూడా మనిషిని కిందపడేస్తుంది. ఎగుడు దిగుడు దిబ్బలే అక్కడి రహదారులు. ఎక్కడ పడితే అక్కడ చెత్త కొండలా పేరుకుపోయి ఉంటుంది. ఊరి నిండా మురికి కుంటలే. అంత ‘సౌకర్యవంతంగా’ ఉంటే దోమలు తమ సంతతి ని వృద్ధి చేసుకోకుండా ఉంటాయా, మనుషుల్ని ఆసుపత్రులకు చేర్చకుండా ఉంటాయా?! పరిశుభ్రత అన్న మాటే కనిపించదు. చెప్పీ చెప్పీ ఊళ్లో వాళ్ల నోళ్లు పోయాయి తప్పితే, వాళ్ల ఓట్లతో గెలిచిన పంచాయితీ పాలకులు సక్రమంగా చెత్తను ఎత్తి పారేయించింది లేదు. మురికి కాలవల్ని సాఫీగా పారించింది లేదు. దోమల్ని తరిమిందీ లేదు. ‘‘ఇదిగో ఈ దుస్థితినంతా పోగొట్టి ఊరిని చక్కబరుస్తాను’’ అంటున్నారు రాణిదేవి పట్టుపట్టినట్లుగా. ‘‘పూర్వపు పాలకుల వైఫల్యాలను మా అమ్మ ఎత్తి చూపించడమే కాకుండా, ఎత్తి పారేయబోతున్నారు కూడా’’ అని రాణిదేవి కుమారుడు చాంద్ పాల్ అంటున్నారు. రాణిదేవి మనవరాలు కూడా తన నానమ్మను గెలిపిస్తే ఊరెంత వెలిగిపోతుందో చెబుతూ ఆమె తరఫున ప్రచారం చేస్తోంది. అయితే ఎవరూ ‘ఓట్ ఫర్’ అని చెప్పకుండానే... రుద్రాపుర్ బ్లాక్‌లోని వారంతా ఇప్పటికే మూకుమ్మడిగా రాణిదేవికే ఓటు వేయాలని తీర్మానించుకున్నారు. -
ఓటు విలువ తెలుసుకో!
సాక్షి, బాన్సువాడ : వందశాతం పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఎంత కసరత్తు చేస్తున్నా ఓటర్లు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఓటర్లు నిర్లిప్తంగా వ్యవహరిస్తుండడంతో ఎన్నికల సంఘం ఆశించిన ఫలితాలు రావడం లేదు. పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఓటుహక్కుపై సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. ఓటుహక్కు ప్రాధాన్యాన్ని చాటుతూ ఊరూరా ర్యాలీలు తీశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రచార వాహనాలతో స్థానిక భాషల్లో మైక్‌ల ద్వారా ప్రచారం చేయించారు. అయినా ఇంకా లక్షలాది మంది పోలింగ్ బూత్‌లవైపు తొంగి చూడడం లేదు. గతతో పోలిస్తే పోలింగ్ శాతం కొంతమేర పెరిగినా ఇంకా చాలా మంది ఓటు వేయడంపై నిరాసక్తతతో ఉండడం ఆందోళన కల్గిస్తోంది. గ్రామీణ ఓటర్లకంటే పట్టణ ఓటర్లే తమహక్కు వినియోగంపై అలసత్వం వహిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికలు మినహా సాధారణ ఎన్నికల్లో పోలింగ్ 75 శాతం మించడం లేదు. నిర్లిప్తతను వీడాలి ఐదేళ్లకోసారి ఒక్కగంట కేటాయిస్తే చాలు.. తమ తలరాతలు మార్చే ప్రతినిధిని ఎన్నుకోవచ్చన్న వాస్తవాన్ని ఓటర్లు గుర్తించాలి. ఓటేసినప్పుడే ప్రజాప్రతినిధిని ప్రభుత్వాన్ని నిగ్గదీసి, నిలదీసే హక్కు ఉంటుందని తెలుసుకోవాలి. ఒకవేళ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ‘నోటా’ బటన్ నొక్కినా ఓటు హక్కు వినియోగించుకున్నట్లే.. ‘నేను ఒక్కడినే ఓటేయకపోతే మన తలరాతలు మారవు కదా? అన్న నిర్లిప్తతను వీడాలి. ఓటర్లును తరళించే బాధ్యత ఈసీ తీసుకోవాలి. ఓటుహక్కు ప్రాధాన్యాన్ని చెబుతూ ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఓటర్ను పోలింగ్ కేంద్రానికి రప్పించడమే అసలైన పని. వాహన సదుపాయం కల్పించి బూత్‌లకు రప్పించడంలో రాజకీయ పార్టీలే ఇప్పటికీ క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలా వాహనాలు ఏర్పాటు చేయడంపై ఆంక్షలు విధించిన, ఎన్నికల కమిషన్ వికలాంగులు, వయో వృద్ధు, అశక్తులను పోలింగ్ కేంద్రాలకు రప్పించడానికి ఒక ఆటోను ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని మారుమూల గ్రామాలు, అనుబంధ తండాల్లో, వాగులు, వంకలు దాటి బూత్‌లకు వెళ్లాల్సి ఉంది. ఇలాంటి చోట్ల సరైన వాహన సదుపాయం కల్పించే బాధ్యతను ఎన్నికల కమిషన్ తీసుకోవాలి. పోలింగ్ రోజుతో పాటు ముందురోజు, మర్నాడుకూడా ప్రభుత్వ పరంగా సెలవు ప్రకటిస్తే దూరప్రాంతాల్లో ఉండే ఓటర్లు స్వస్థలాలకు వచ్చి ఓటేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
ఓటు విశ్వాసాన్ని కాపాడతాం
సాక్షి,కృష్ణా : సార్వత్రిక సంగ్రామం రసవత్తరంగా మారింది. తొలి విడత పోలింగ్ గురువారం నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పించాయి. మరో వైపు ఓటు హక్కు వినియోగంపై అధికార యంత్రంగం విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. తొలి సారిగా అధిక సంఖ్యలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో హామీలు గుప్పించి మోసం చేసిన నేతలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.. విలువలున్న నేతలనే ఎన్నుకుని ఓటుపై ఉన్న విశ్వాసం కాపాడతాం అని చెబుతున్నారు. ప్రతిఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విద్యావేత్తలు, మేధావులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటు హక్కు ప్రాధాన్యం గుర్తించండి ఓటు వజ్రాయుధం. సమాజాన్ని మార్చే శక్తి ఓటుకే ఉంది. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నూరుశాతం ఓటింగ్ జరగాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మోసగించే నేతలను దూరంగా ఉంచాలి. నిజాయితీతో పనిచేసే నాయకులను ఎన్నుకోవాలి. –జంపాన శ్రీనివాసగౌడ్, సామాజిక కార్యకర్త దేశ పౌరులుగా మన బాధ్యత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది దేశపౌరుల చేతిలో వజ్రాయుధం లాంటిది. నిజాయితీపరుడు, ప్రజలకు నిస్వార్థసేవలు చేస్తాడని విశ్వసనీయత కలిగిన వ్యక్తులను తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపడం ద్వారా విలువలను కాపాడుకోవలసిన బాధ్యత మనదే. ఓటుహక్కు వినియోగించుకోలేనివారు దేశపౌరులుగా ఎలాంటి బాధ్యత కలిగి ఉంటారు? తప్పనిసరిగా ఓటువేయాలి. –బచ్చు శేషగిరిరావు, నాగాయలంక ఓటును అమ్ముకోకండి... ఓటును అమ్ముకోవద్దని ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశా. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును అమ్ముకోవటం సరైంది కాదు. ప్రజలు చైతన్య వంతులు కావాలి. ఓటు విలువ తెలుసుకోవాలి. ఐదేళ్లపాటు ఉండే ప్రజా నాయకుడిని ఎన్నుకోవాలి. నిస్వార్థంగా సేవ చేసేవారినే ప్రజాప్రతినిధిగా అవకాశం ఇవ్వాలి. హామీలతో మోసం చేసేవారిని నమ్మవద్దు. – వైవీ మురళీకృష్ణ, సామాజిక కార్యకర్త, గుడివాడ మన భవిష్యత్ మన చేతుల్లో.. ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకోవాలి. రాజ్యాంగం మన పాలకులను ఎన్నుకునే అవకాశం కల్పించింది. దేశ ప్రగతిని మార్చే ఓటు అనే ఆయుధం మన చేతుల్లోనే ఉందని మరువకండి. ప్రజల అవసరాలను తీర్చే వారిని గుర్తించి వారికే ఓటు వేయండి. సాధారణంగా ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ఐదేళ్లు ప్రజలను పట్టించుకోరు. ఇప్పటి వరకు ఇదే రాజకీయాలను చూస్తున్నాం. మీ ప్రాంతంలో అలాంటివి జరిగితే ఇప్పుడు ఓటు కోసం వచ్చే వారిని నిలదీయండి. – బొప్పన విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు సరియైన నిర్ణయం తీసుకోండి ఐదేళ్లకు పాలకులను ఎన్నుకుంటాం. తప్పుడు నిర్ణయం తీసుకుంటే మన భవిష్యత్ అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. పిల్లలపై దాని ప్రభావం ఉంటుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు పడతాం. అందువలన ఓటు విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాలి. లేకుండా ఇబ్బంది. ప్రసుత్తం ఎన్నికల రసవత్తరంగా ఉన్నాయి. మార్పు అవసరం. –వడ్లమన్నాటి ప్రసాద్, సింగరాయపాలెం నైతిక విలువలకు ప్రాధాన్యం విలువలతో రాజకీయాలు చేసే వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. హామీల పేరుతో మోసగించే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలి. ఎన్నికల రాగానే మన చుట్టూ తిరుగుతున్న నేతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ఇబ్బందులు పడతాం. మాట ఇచ్చిన తప్పని నేతలను ఎన్నుకోవాలి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. –విస్సంశెట్టి కోటేశ్వరరావు, పెదగొన్నూరు -
ఓటర్లు ఎక్కువ.. సమయం తక్కువ!
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఓట్ల శాతం పెంపునకు విసృత్త ప్రచారం చేస్తూంటుంది. ఓటర్లను చైతన్యపర్చడానికి అవగాహన కార్యక్రమాలతో పాటు వివిధ రకాల ప్రకటనలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూంటుంది. అయినా ఎన్నికల సంఘం అనుకున్న స్థాయిలో ఓట్ల శాతం పెరగడం లేదు. మరోవైపు ఓటింగ్ టైం మేనేజ్మెంట్ను పరిశీలించగా ఓటరు శాతం పెరగడానికి చేస్తున్న ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఓటింగ్ టైం ప్రకారం పోలింగ్ బూత్‌లో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని, వారికి సమయం సరిపోదని తెలుస్తోంది. ఒక ఓటరు ఓటు వేయడానికి కనీసం రెండు నిమిషాలు అనుకున్న గంటకు 60 ఓట్లు పడతాయి. పది గంటల్లో 600 ఓట్లు పడే అవకాశం ఉంది. ఒకవేళ క్రమం తప్పకుండా ఓట్లు వేసినా మరో 100– 150 మందికి ఓటు వేసే అవకాశం దక్కుతుంది. ఇలా దాదాపు 750 మందికి పది గంటల్లో ఓటు వినియోగించే అవకాశం దక్కవచ్చు. ఎందు కంటే గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాల పోలింగ్‌బూత్‌ల్లో 900 నుంచి 1200 వందల వరకు ఓటర్లు ఉన్నారు. పోలింగ్ బూత్‌ల పరిస్థితి ఇదీ.. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ బూత్‌ల్లో పోలింగ్ మేనేజ్మెంట్ సక్రమంగా ఉన్నా మిగతా నియోజకవర్గాల్లో పోలింగ్ మేనేజ్మెంట్ దారుణంగా ఉంది. ఎన్నికల నిర్వహణా అధికారులు ఏ లెక్క ప్రకారం పోలింగ్ బూత్‌లో 1200 వరకు అత్యధికంగా ఓటర్లు ఉండవచ్చని నిర్ధారించారో తెలియండంలేదు. ఓటింగ్ సమయం పది గంటలు ఉంది. ప్రతి ఓటరుకు పట్టే సమయం నిముషం అనుకున్న గంటకు 60 ఓట్లు పడతాయని, పది గంటల్లో కేవలం 600 ఓట్లు మాత్రమే పడతాయి. ఈ ఎన్నికల నుంచి వీవీ ప్యాట్ కూడా ఉంది. ఇందులో అభ్యర్థి గుర్తును చూసే అవకాశం ఉంది. దీంతో సమయం మరింత పట్టవచ్చు. 10 గంటలు కేవలం 600 మందే.. ఒక ఓటరు ఓటు వేయడానికి తన ఓటరు కార్డు తీసుకొని పోలింగ్ కేంద్రానికి వస్తే అతడికి నాలుగు రకాల ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయా పార్టీల అభ్యర్థుల ఓటు నిర్ధారణ అనంతరం ప్రిసైడింగ్, అసిస్టెంట్, పోలింగ్ అధికారులు తదుపరి ప్రక్రియ కొనసాగిస్తారు. ఓటరు లిస్టులో సదరు వ్యక్తి ఓటు ఉన్నట్లు గుర్తిస్తారు. ఓటరు వేలిపై ఇంక్ పెడతారు. అధికారి బ్యాలెట్ రిలీజ్ చేస్తారు. ఓటరు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి బటన్ నొక్కుతాడు. అనంతరం వీవీ ప్యాట్‌లో ఏ గుర్తుకు ఓటు వేశారో అది ఏడు సెకన్ల వరకు కనబడుతుంది. ఇలా ఒక ఓటరు ఓటు వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేసినా కనీసం ఒక్క నిమిషం సేపు పడుతుంది. ఒక పోలింగ్ బూత్‌లో 1200 వరకు ఓట్లు పోలింగ్ సమయం 10 గంటల వ్యవధి ఉంది. పది గంటల్లో కేవలం ప్రతి ఓటరు రెండు నిమిషాల సమయం కేటాయించినా కేవలం 600 మందికే ఓటు వేసే అవకాశం ఉంది. అయితే పలు పోలింగ్ బూత్‌లో 1200 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కనీసం 50 లేదా 60 శాతం ఓటింగ్ అయినా 600 నుంచి 720 మంది ఓట్లు వేయడానికి అవకాశం ఉండదు. ఓటింగ్ వేసే సమయం పది గంటలు ఇందులో 600 ఓట్లు పడతాయి. అదే ఓటరు వేసే ఓటింగ్ ప్రక్రియ చూస్తే కనీసం రెండు నిమిషాలైనా సరిపోదని ఎన్నిక అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి పోలింగ్ బూత్‌లో ఎక్కువగా 1200 ఓట్లు, తక్కువగా 900 వరకు ఉన్నాయి. ఎన్నికల ఐటీ విభాగం పోలింగ్ బూత్‌లో అత్యధికంగా 1200 వరకు ఓటర్లు ఉండవచ్చని నిర్ధారించారు. ఏ లెక్క ప్రకారం 1200 లేదా అందులో సగం అంటే 50 శాతం 600 మంది పది గంటల్లో ఓటు ఏలా వేస్తారో వారికే తెలియాలి. అంతుచిక్కని ఎన్నికల సమయం ఓటింగ్ శాతం పెంచాలని ఎన్నికల సంఘం ప్రచారం చేస్తున్నా.. ప్రతి ఓటింగ్ బూత్‌లో 900– 1200 మంది వరకు ఓట్లు నమోదై ఉన్నాయి. అధికారులు చెబుతున్న ప్రకారం ప్రతి ఓటరుకు కనీసం రెండు నిమిషాలు అవుతుందని చెప్పినా.. ఓటింగ్ శాతం 50– 60 శాతం ఓటింగ్ అయినా సమయం ఎలా సరిపోతుందో అంతుపట్టడంలేదు. పొంతన లేని సమాధానాలు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల సమయానికి పోలింగ్ బూత్‌లో నమోదయిన ఓటరు జాబితా ప్రకారం 30– 40 శాతం ఓటింగ్‌కు సమయం సరిపోయే విధంగా ఉంది. ఈ విషయంలో ఎన్నికల అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు ఈవీఎం టైమ్ నిర్ధారణ ఓటరు లిస్టులో ఉన్న ఓటర్ల సంఖ్య ఇరు విభాగాలకు తెలియదు. దీంతో ఇలాంటి విషయం గురించి ఎన్నికల సంఘానికి తెలియవని, పోలింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. కొత్త ఓటర్లు 56,000 నగరంలో ఓటరు చైతన్యం పెరుగుతోంది. రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక, లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు 60వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 15వ తేదీలోపు హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఇది. ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటేనే లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశముంటుందని అధికారులు, మీడియా విస్తృతంగా ప్రచార కార్యక్రమా లు నిర్వహించిన నేపథ్యంలో స్వల్ప వ్యవధిలోనే 60వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన అధికారులు వీరిలో 56వేల మందికిపైగా అర్హులని గుర్తించారు. వచ్చే నెల 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వీరంతా ఓటేయనున్నారు. అందిన దరఖాస్తుల్లో దాదాపు 200 దరఖాస్తుల్ని మాత్రం అధికారులు పరిశీలించాల్సి ఉంది. కొత్తగా పేరు నమోదు కోసం ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సగటున 3వేల నుంచి 4వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. గతం లో మాదిరే అత్యధికంగా జూబ్లీహిల్స్ నుంచి 5,784 మంది కొత్తగా ఓటరు జాబితాలో పేరు కోసం దర ఖాస్తు చేసుకున్నారు. కంటోన్మెంట్ నుం చి 5,747 మంది, అంబర్‌పేట నుంచి 5,269 మంది దరఖాస్తు చేసుకున్నారు. చార్మినార్ నుంచి 1934 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. -
వచ్చేసింది.. ఓట్ల పండుగ
పేరు చెప్పడానికీ సిగ్గుపడే దశ నుంచి... ఓటు మా హక్కు అని మహిళలు గొంతెత్తే వరకూ... నా ఒక్క ఓటేయకపోతే పోయేదేముందిలే అనుకునే దగ్గర్నుంచి... బాధ్యతగా చేసుకున్న మిలినియల్స్ వరకూ.. గల్లీ గల్లీ తిరిగి కరపత్రాలు పంచి ప్రచారం చేసే స్థాయి నుంచి... కాక రేపే ఫేస్బుక్ పోస్టు ఒక్కటి చాలని అనుకునే వరకు... గెలిచింది ఎవరో తెలిసేందుకు రోజులు పట్టే కాలం నుంచి.. గంటల్లో విజేతలను నిర్ణయించే దశ వరకూ... ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం.. మన భారతీయంలో వింతలు విశేషాలు.. అన్నీ ఇన్నీ కావు! సామాన్యుడు.. దేవుడయ్యే సమయం దగ్గరకొచ్చింది! ఎడమచేతి చూపుడువేలిపై సిరా గుర్తు పడే రోజు వచ్చేస్తోంది! ఏడు దశాబ్దాల ఎన్నికల పండుగ ప్రజాస్వామ్య ప్రస్థానం సాగింది ఇలా... అభ్యర్థికో బాక్స్ నుంచి ఈవీఎంల వరకు మన ఎన్నికల ప్రక్రియ అభ్యర్థికో బాక్స్ నుంచి బ్యాలెట్ పత్రం దిశగా వెళుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు చేరుకుంది. తొలి ఎన్నికల్లో ప్రతీ అభ్యర్థికి వేర్వేరు రంగుల్లో ఉన్న ఒక్కో బ్యాలెట్ బాక్స్‌ని కేటాయించారు. ఆ బాక్స్‌పై వారి పేరు, ఎన్నికల గుర్తుని పెయింట్ చేశారు. ప్రతీ పోలింగ్ బూత్‌లో బరిలో ఉన్న అభ్యర్థులు ఒక్కొక్కరికీ ఒక బ్యాలెట్ బాక్స్ అన్నమాట. నచ్చిన అభ్యర్థి బ్యాలెట్ బాక్స్‌లో ఓటరు బ్యాలెట్ పేపర్‌ను వేస్తే సరిపోతుంది. అప్పట్లో ఈ బ్యాలెట్ బాక్స్‌లను గోద్రేజ్ కంపెనీ బొంబాయిలోని విఖ్రోలి ప్రాంతంలో తయారు చేసింది. 1957 ఎన్నికల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించారు. మూడవ సార్వత్రిక ఎన్నికల (1962)లో బరిలో ఉన్న అభ్యర్థులు, గుర్తులను ఒకే బ్యాలెట్ పేపర్‌పై ముద్రించారు. ఇరవైఏళ్లపాటు ఇదే పద్ధతి కొనసాగగా.. 1982లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) వాడారు. అయితే అప్పట్లో పరూరు నియోజకవర్గంలోని 50 పోలింగ్ స్టేషన్లకే వీటిని పరిమితం చేశారు. 1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాల్లో వీటిని మరోసారి పరీక్షించారు. ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వడంతో 2004లో తొలిసారి మొత్తం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈవీఎంల వాడకం మొదలుపెట్టారు. అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో ఓటింగ్ ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు 2010లో ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీప్యాట్)లను ప్రవేశపెట్టారు. ఈవీఎంల వాడకంతో ఓటింగ్ ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా, ఫలితాల ప్రకటన కూడా వేగవంతమైంది. పోలింగ్ కేంద్రాల్లో జరిగే రిగ్గింగ్, ఆక్రమణ వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమైంది. తక్కువ బరువు ఉండటం వల్ల ఈవీఎల రవాణ కూడా సులభం. ఒక్కో ఈవీఎం ఖరీదు ఐదారు వేలు ఉంటుంది. పదిహేనేళ్ల పాటు పని చేస్తుంది. ఇన్ని లాభాలున్నా.. ఈవీఎంలలో లోపాలున్నాయన్న ఆరోపణలు రావడం సాధారణమైపోయింది. కాలినడక, పడవల్లో, ఏనుగులపై ప్రయాణాలు ఒకప్పుడు ప్రయాణ సాధనాలు అంతగా లేవు. సరైన రహదారి సౌకర్యాలు ఉండేవి కావు. కొండ ప్రాంతాల్లోనూ, నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, ఎడారుల్లోనూ, సముద్రం మధ్య ద్వీపాల్లోనూ ఓటింగ్ నిర్వహణ దుర్లభంగా ఉండేది. ఎన్నికల కమిషన్ సభ్యులు నానా పాట్లు పడేవారు. ఎన్నికల సామగ్రి మోసుకుంటూ మైళ్లకి మైళ్లు నడిచే పరిస్థితి. ఇఅదీ ప్రజాస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం. హిందూమహాసముద్రం ద్వీపాల్లో ఎన్నికల కోసం ఏకంగా నేవీ అధికారుల సాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని చేర్చడానికి హెలికాప్టర్ సాయం తీసుకునే వారు. ఇప్పుడు ప్రయాణ సాధనాలు మెరుగు పడినప్పటికీ అటవీ ప్రాంత పోలింగ్ స్టేషన్లకి వెళ్లాలంటే కాలినడకే మార్గం. ఇక ప్రత్యేక వాహనాలు, రైళ్లు, హెలికాప్టర్లు, బోట్లలో కూడా సిబ్బందని తరలిస్తారు. కొన్నిసార్లు పోలింగ్ స్టేషన్ చేరుకోవడానికి ఏనుగులు వాడిన సందర్భాలూ లేకపోలేదు. రాజస్థాన్ వంటి ఎడారుల్లో ఒంటెలే సాధనం. దేశం మొత్తమ్మీద దాదాపుగా 80 వేల పోలింగ్ కేంద్రాల వద్ద మోబైల్ఫోన్ సౌకర్యం కూడా లేదు. ఇంకో ఇరవై వేల పోలింగ్ స్టేషన్లు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కడున్నాడు! ఒక్క ఓటు. ఒకే ఒక్క ఓటు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది కూడా ఎంతో కీలకం. అందుకే ఎన్నికల సంఘం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మరీ గుజరాత్లో దట్టమైన గిర్ అడవుల్లోకి కాలినడకన వెళుతుంది. ఆ ఒక్కడి కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అతని పేరు మహంత్ భరత్‌దాస్ దర్శన్ దాస్. ఆలయపూజారి. ఆయన ప్రతీ ఏడాది తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సిబ్బంది గిర్ అడవుల్లోని బనేజ్కు ఏకంగా 35 కి.మీ. ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణంలో వారిని సింహాలు భయపెడతాయి. అడవి జంతువులు ఎదురవుతాయి. అయినా ప్రాణాలకు తెగించి మరీ ఆ ఒక్క ఓటు నమోదు కోసమే అధికారులు వెళతారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ పౌరుడు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 2 కి.మీ.దూరానికి మించి ప్రయాణించకూడదు. అందుకే తాము భరత్‌దాస్ దగ్గరకి వెళతామని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఆ ప్రాంతంలో ఫోన్లు పని చెయ్యవు. టీవీ రాదు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అయినప్పటికీ దర్శన్‌దాస్ శివుడిపై అపారమైన భక్తితో ఆ ప్రాంతంలోనే చాలా ఏళ్లుగా ఉంటున్నారు. చూడడానికి కాస్త ఆధునికంగానే కనిపిస్తారు. 60 ఏళ్లు దాటిన దర్శన్ దాస్ నల్ల కళ్లద్దాలు,తెల్ల గడ్డం, తలకి టోపీతో అందరినీ ఆకర్షిస్తుంటారు. ఆయనపై నమ్మకంతో ఆ అడవిలో వెళ్లేవారికి ఆధ్యాత్మిక బోధనలు చేస్తారు. పౌర సమాజానికి దూరంగా విసిరేసి ఉన్నప్పటికీ ఆయనకు ఓటు విలువ గురించి బాగా తెలుసు. ‘‘నా ఓటు ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. వాజపేయి సర్కార్ కేవలం ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిపోయింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని ఎన్నికల సిబ్బంది ఇంత దూరం వస్తున్నందుకు వారిని ఎంతో గౌరవిస్తాను. నా ఓటు ఎంత విలువైనదో తెలుసుకొని గర్విస్తాను‘‘ అని అంటారు. ఒక్క వ్యక్తి కోసం పోలింగ్ బూల్ ఏర్పాటు చేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చాక ఎందరో జర్నలిస్టులు గిర్ అడవుల్లోకి వెళ్లి భరత్దాస్తో మాట్లాడారు. అతని ప్రత్యేకతను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. శభాష్ శరణ్.. ఆయనకు ఓటంటే బాధ్యత శ్యామ్ శరణ్ నేగి. ఆయన వయసు 102 సంవత్సరాలు. మన దేశంలో అతి పెద్ద వయసున్న ఓటరు ఆయనే. స్వాతంత్య్ర సమర సంగ్రామంలో పాల్గొన్న నేగికు ఓటు అంటే హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. అందుకే ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్న ఏకైక ఓటరుగా ఆయన రికార్డులకెక్కారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కల్పా అనే చిన్న గ్రామంలో ఉంటారు. కిన్నెర కైలాస్ పర్వత శ్రేణుల్లో ఉండే ఆ గ్రామంలో నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయరు. మొదటి ఓటు తనే వేయాలనుకుంటారు. దీనికి గ్రామస్తులు కూడా సహకరిస్తారు. పొద్దున్నే ఇంకా ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్ తెరవక ముందే ఉన్ని కోటు వేసుకొని ఆయన వస్తారు. గ్రామస్తులందరూ కూడా ఆయనకు గౌరవాన్ని ఇచ్చి దారి విడిచిపెడతారు. 1951–52లో జరిగే మొదటి ఎన్నికల్లో కూడా నేగి తొలి ఓటును వేసి ప్రజాస్వామ్య భారతంలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తిగా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. అప్పట్నుంచి వేగి ప్రతీసారి ఎన్నికల్లో తన ఓటు హక్కుని వినియోగించుకుంటూనే ఉన్నారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వ్యక్తిగా మహాత్మగాంధీ సిద్ధాంతాలను ఆయన బాగా ఒంట బట్టించుకున్నారు. నూలు ఒడికి ఖాదీ వస్త్రాలు ధరించేవారు. ఒకప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పలేనంత ఇష్టం ఉండేది. దేశానికి స్వాతంత్య్రం సాధించిన పార్టీగా ఆయనకు కాంగ్రెస్ పట్ల దేశభక్తి పొంగిపొర్లేది. కానీ కాలంతోపాటు ఆయన అభిప్రాయాలూ మారిపోయాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అత్యంత ఇష్టమైన నాయకుడు. ‘‘ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్ కాదు. ఎన్నో కుంభకోణాలకు పాల్పడింది. ఇప్పుడున్న నేతల్లో మోదీనే అభిమానిస్తాను. అవినీతిని అంతమొందించడానికి ఆయన తనకు చేతనైంది చేస్తున్నారు‘‘ అంటూ ప్రశంసిస్తారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఓటేసేందుకు ఆయన అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తొలి అడుగు.. సుకుమార్ సేన్ చుట్టూ చీకటి. ముందున్న దారి కనిపించదు. అడుగు ఎలా వెయ్యాలో తెలీదు. కానీ వెయ్యాలి. ఎవరో ఒకరు ముందుగా నడవాలి. అలా నడిచి మన ఎన్నికల వ్యవస్థని ఒక గాడిలో పెట్టింది మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్‌సేన్. ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసీఎస్) అధికారిగా, న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియకు తొలిసారిగా వేసిన బాట మరువలేనిది. ఎన్నికల నిర్వహణకు ముందు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల జాబితా రూపకల్పనలో సుకుమార్ సేన్ బృందానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఓటర్లలో 70 శాతం నిరక్షరాస్యులు కావడం, మహిళా ఓటర్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో ఓటర్ల జాబితా రూపొందించడమే కష్టసాధ్యమైంది. దీంతో చాలా మంది ఓటు హక్కు పొందలేకపోయారు. 17 కోట్ల మంది ఓట్లతో తొలి జాబితా రూపొందింది. ఎన్నికల్లో బూత్‌ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బ్యాక్స్‌లు రూపొందించడం వంటివన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసి సుకుమార్ సేన్ బృందం విజయవంతమైంది. తొలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలల పాటు జరిగింది. ఒకసారి వేటు వేసిన వాళ్లు మళ్లీ ఓటు వెయ్యకుండా చూపుడు వేలి మీద ఇంకు గుర్తు వేయడం తొలి ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. నేపాల్, ఇండోనేసియా, సూడాన్ వంటి దేశాలు భారత్ ఎన్నికల నిర్వహణను దగ్గరుండి పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్‌లో తొలి ఎన్నికల నిర్వహణను శెభాష్ అంటూ ప్రశంసించింది. సూడాన్ దేశం కూడా తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతను సుకుమార్ సేన్ చేతుల్లోనే పెట్టింది. కానీ ఆయనకు రావల్సిన గుర్తింపు రాలేదని రామచంద్రగుహ వంటి చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. భారతరత్న పురస్కారం ఇవ్వదగిన వ్యక్తిని చరిత్ర మరచిపోయిందన్నది ఆయన అభిప్రాయం. ఎన్నికల సిత్రాలు అనామకుడి చేతిలో ఓడిన అంబేడ్కర్... రాజ్యాంగ నిర్మాత, భారత తొలి న్యాయశాఖా మంత్రి, తరతరాలుగా అణచివేతకు గురవుతోన్న అట్టడుగు వర్గాలైన దళిత, ఆదివాసీలకు ప్రత్యేక నియోజవకర్గాలకోసం అహరహం కృషిచేసి రిజర్వుడు నియోజకవర్గాలను తీసుకువచ్చిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజకీయవేత్త. అయినప్పటికీ ఒక అనామకుడి చేతిలో, అది కూడా రిజర్వుడు నియోజకవర్గంనుంచి ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ అంబేడ్కర్ బొంబాయి(నార్త్ సెంట్రల్) రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఆల్ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తరఫున పోటీ చేసి ఓ అనామకుడి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ వ్యక్తి పేరు నారాయణ్ నడోబా కజ్రోల్కర్. నడోబా కజ్రోల్కర్కి 1,38,137 ఓట్లు వస్తే, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌కి 1,23,576 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత అంబేడ్కర్ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. మళ్ళీ 1954లో భన్దారా లోక్‌సభ ఉప ఎన్నికలో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బోర్కర్ చేతిలో మళ్ళీ ఓటమిపాలయ్యారు. జేబీ కృపలానీ – సుచేతా కృపలానీ... అతను ఓడినా ఆమె గెలిచారు... బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని సాధించుకునే సమయానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆచార్య జేబీ కృపలానీ ఉన్నారు. పూర్తి పేరు జీవత్రామ్ భగవాన్‌దాస్ కృపలానీ. స్వాతంత్య్రానికి పూర్వమూ, స్వాతంత్య్రానంతరమూ భారత రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మన్మోహినీ సెహెగల్ ని ఢిల్లీలో ఆచార్యకృపలానీ భార్య సుచేతా కృపలానీ ఓడించారు. 1957లోనే పోలింగ్ బూత్‌ల ఆక్రమణ.... పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని పోలైన ఓట్లను «ధ్వంసం చేయడం, తాము గెలవమనుకున్న చోట్ల బ్యాలెట్ బాక్స్‌లను ఎత్తుకెళ్ళడం, లేదా బ్యాలెట్ బాక్సుల్లో ఇంకుపోసి ఓట్లు చెల్లకుండా చేయడం లాంటి దుశ్చర్యలు 1957 సార్వత్రిక ఎన్నికల నుంచి ప్రారంభం అయ్యాయి. బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లాలోని రచియాహిలోని మటిహాని అసెంబ్లీ నియోజకవర్గంలో 1957లో జరిగిన ఎన్నికల్లో తొలి పోలింగ్ బూత్‌ల ఆక్రమణ జరిగింది. పోటీ చేసే అభ్యర్థులూ, పార్టీల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగి, పోటీ పెరిగిపోవడంతో 1970–80 వ దశకం చివర్లో బూత్‌ల ఆక్రమణ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పార్టీలు బూత్‌లను ఆక్రమించుకోవడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం మొదలయ్యింది. పోలింగ్ బూత్‌ల ఆక్రమణని సైతం శిక్షార్హమైన నేరంగా పరిగణించి, బూత్‌ల ఆక్రమణ జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు రద్దు చేయడం, లేదా అక్కడ ఎన్నికలు వాయిదా వేసేలా ప్రజాప్రాతినిధ్య(1951) చట్టానికి 1989లో మార్పులు చేసారు. 13 రోజుల ప్రధాని... గుల్జారీలాల్ నందా మొత్తం రెండు సార్లు ప్రధాని అయ్యారు. అయితే రెండు సందర్భాల్లోనూ 13 రోజులు, 13 రోజులే ప్రధాని పదవిలో ఉండడం ఒక విశేషం అయితే, రెండు సార్లూ పదవిలో ఉన్న ప్రధానమంత్రులు మరణించడంతో ఈయనకు ఆ అవకాశం లభించింది. ఒకటి జవహర్ లాల్ నెహ్రూ మరణం అయితే, మరొకరు లాల్‌బహదూర్ శాస్త్రి మరణంతో గుల్జారీలాల్కి ఈ అవకాశం దక్కింది. రెండుసార్లూ కలుపుకొని మొత్తం 26 రోజులు పాటు గుల్జారీలాల్ నందా ప్రధానిగా పనిచేశారు. రెండవ లోక్‌సభ(ఏప్రిల్ 2, 1962 – మార్చి 3 1967)నుంచి 1964, మే 27 జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. మే 27, 1964 జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత తొలిసారి గుల్జారీలాల్ తాత్కాలిక ప్రధాని అయ్యారు. మే 27 నుంచి జూన్ 9, 1964న లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా ఉన్నారు. రెండవసారి 1966 జనవరి 11న లాల్‌బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత మళ్ళీ 13 రోజుల పాటు గుల్జారీలాల్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. శాస్త్రి మరణానంతరం ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఇందిరాగాంధీ 1966 జనవరి 24న ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా కొనసాగారు. ఆపరేషన్ దుర్యోధన... 2005, డిసెంబర్ 12 న స్టార్ టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన స్టింగ్ ఆపరేషన్, ఆపరేషన్ దుర్యోధనతో 11 మంది పార్లమెంటు సభ్యులు స్వయంగా డబ్బులు తీసుకుంటున్న విజువల్స్ బయటపెట్టారు. దీనిపై పార్లమెంటులో దుమారం రేగడంతో రాజ్యసభలోని ఎథిక్స్ కమిటీ, లోక్ సభ ప్రత్యేక కమిటీ విచారణలో వీరిని దోషులుగా నిర్ధారించడంతో 10 మంది లోక్ సభ సభ్యులూ, ఒక రాజ్య సభ సభ్యుడిని ఆయా సభల నుంచి తొలగించారు. -
బోథ్:ఓటుపై ‘నవనిర్మాణ్ ’ కృషి అభినందనీయం
బోథ్: నోటుకు ఓటును అమ్ముకోవద్దంటూ వినూత్న రీతిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చిన నవ నిర్మాణ్ సొసైటీ సభ్యులను బోథ్ రిటర్నింగ్ అధికారి, పీవో కృష్ణఆదిత్య అభినందించారు. బోథ్ మండలంలోని సొనాల గ్రామానికి చెందిన నవనిర్మాణ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఓటుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి తయారు చేసిన పోస్టర్‌ను శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో పీవో విడుదల చేశారు. యువత ప్రజలను మేల్కొలిపేలా కార్యక్రమాలు నిర్వహించడంపట్ల ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. ఓటు గొప్పదనాన్ని ప్రజలకు తెలియజేయడానికి తన సంస్థ నిర్ణయం తీసుకుందని, గ్రామాల్లోకి వెళ్లి ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తామని సొసైటీ అధ్యక్షుడు కోస్మెట్టి శుద్ధోధన్ అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు కె.మహేశ్వర్, లోకేశ్, రవీందర్, రాజేశ్వర్, సొసైటీ అధ్యక్షుడు కోస్మెట్టి శుద్ధోధన్, ప్రధాన కార్యదర్వి బాశెట్టి రాజ్ కుమార్, కోశాధికారి శ్రీరాం విజయ్, సభ్యులు సోమ సురేశ్‌రెడ్డి, రాజశేఖర్, రమణ, శ్రీనివాస్, పోతన్న తదితరులు పాల్గొన్నారు. -
వాట్సాప్.. హ్యాట్సాప్!
తొలిరోజు 600 ఫిర్యాదులు పరిష్కారానికి చర్యలు ఓటింగ్ అవగాహనలో లఖాని ఈసీకి వ్యతిరేకంగా వర్తకుల నిరసన సాక్షి, చెన్నై: వాట్సాప్ ఫిర్యాదులకు ఈసీ శ్రీకారం చుట్టిన కొన్ని గంటల్లో వందలాది ఫిర్యాదులు వచ్చి చేరాయి. వీటిని పరిశీలించి, చర్యలు తీసుకునే పనిలో ఎన్నికల యంత్రాంగం మునిగింది. ఇక, ఓటింగ్ హక్కు కల్గిన విద్యార్థులకు అవగాహన తరగతులకు ఈసీ రాజేష్ లఖానీ మంగళవారం శ్రీకారం చుట్టారు. ఇక, ఎన్నికల పేరిట సాగుతున్న తనిఖీలు తమకు సంకటంగా మారాయంటూ వర్తకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలలు సమయం ఉన్నది. ఓ వైపు రాజకీయ పక్షాలు ఇంటర్వ్యూల పర్వాన్ని ముగించి అభ్యర్థుల ఎంపిక బిజీలో పడ్డాయి. పొత్తు, సీట్ల పందేరాల్ని వేగవంతం చేసి, ప్రచార బాటకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక, మరో వైపు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. శిక్షణ తరగతులు, ఈవీఎంల పరిశీలన, కోడ్ కూయడంతో నిబంధనల ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా ముందుకు సాగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఫిర్యాదుల స్వీకరణకు వాట్సాప్ నంబర్‌ను ఈసీ రాజేష్ లఖానీ ప్రకటించడంతో కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన వ్యవహారాలతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తొలి రోజు ఆరు వందల ఫిర్యాదులు రావడంతో, వాటిని పరిశీలించి, చర్యలు తీసుకునే పనిలో ఎన్నికల వర్గాలు నిమగ్నం అయ్యాయి. ఇక, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్ల నేతృత్వంలో రాజకీయ పక్షాలతో సమావేశాలు సాగుతున్నాయి. చెన్నై కలెక్టర్ గోవిందరాజ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నగరంలో గోడ ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ రాజకీయ పక్షాలకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికలు ఇచ్చి ఉన్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రజలకు ఇబ్బంది కల్గే విధంగా, అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో కొత్త ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక శిక్షణా శిబిరాలకు ఈసీ రాజేష్ లఖాని శ్రీకారం చుట్టారు. 18 సంవత్సరాలు నిండి, ఓటు హక్కు కల్గి ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఆవడిలోని ఓ విద్యా సంస్థలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మీడియాతో రాజేష్ లఖాని మాట్లాడుతూ, కోడ్ ఉల్లంఘనలపై తీవ్రంగా స్పందిస్తున్నామని పేర్కొన్నారు.వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించి, తక్షణం చర్యలకు ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లాల్లో రాజకీయ పక్షాలతో సమావేశాలు సాగుతున్నాయని, కోడ్ ఉల్లంఘన,తనిఖీలు, భద్రతా పరంగా చర్యల్లో ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నారన్నారు. విద్యార్థులకు ఓటు విలువను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, ఈ సారి ఓటింగ్ శాతం పెంపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈసీకి వ్యతిరేకత : నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా రాష్ట్రంలో తనిఖీలు ముమ్మరం చేసి ఉన్న విషయం తెలిసిందే.ఈ తనిఖీలు తమకు సంకటం సృష్టిస్తున్నాయని వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వస్తువుల కొనుగోళ్లకు నగదు తీసుకు వెళ్ల లేని పరిస్థితి ఉందని, వసూళ్లకు వెళ్లి వచ్చే సిబ్బందిని తనిఖీల పేరిట అడ్డుకుని, నగదు స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తమకు తనిఖీల్లో మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వర్తక సమాఖ్య నేత విక్రమ రాజ నేతృత్వంలో వర్తకులు చెన్నై కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.