ఓటింగ్ డే అంటే చాలామంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని ఘటనల ద్వారా తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఓటుహక్కు కలిగిన పౌరులందరూ పోలింగ్‌లో తప్పక పాల్గొనాలి. ఈమేరకు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతోంది. కోట్లు సంపాదిస్తున్నవారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతిలోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందిరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు.
ముఖేశ్ అంబానీ కుటుంబం
ముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంపద విలువ: సుమారు రూ.18.9 లక్షల కోట్లు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌గా గౌతమ్ అదానీ వ్యవహరిస్తున్నారు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్: రూ.3.5లక్షల కోట్లు.
గౌతమ్ అదానీ ఎంటర్‌ప్రైజ్ బిజినెస్‌తోపాలు పోర్ట్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రిక్ పవర్, మైనింగ్, పునరుత్పాదక ఇందనం, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్‌ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా అహ్మదాబాద్‌లో ఓటు వేశారు.
ఆనంద్ మహీంద్రా
మహీంద్రా గ్రూప్ సంస్థలకు ఆనంద్ మహీంద్రా సారథ్యం వహిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండడం ఈయన ప్రత్యేకత. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆనంద్ మహీంద్రా ముంబయిలో తన ఓటు వేశారు.
అనిల్ అంబానీ
రిలయన్స్ ఏడీఏజీ గ్రూప్ ఛైర్మన్‌గా అనిల్ అంబానీ వ్యవహరిస్తున్నారు. ముంబయిలోని కఫ్ పరేడ్‌లోని జిడి సోమాని స్కూల్‌లో 17వ లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు వినియోగించుకున్నారు.
నరేష్ గోయల్
జెట్ ఎయిర్‌వేస్ ఎయిర్‌లైన్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత 2019లో ముంబయిలో ఓటువేశారు.
శక్తికాంత దాస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 25వ గవర్నర్ పనిచేస్తున్న శక్తికాంత దాస్ గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు వేశారు.
ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకునే వారు చరిత్రలో తెలుసుకోవాల్సినవి..
1649లో ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్-1 భవితవ్యంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే..
1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజు సింహాసనం అధిష్ఠించారు.
1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికా జర్మనీ భాషను కాదని ఇంగ్లిష్ అధికారిక భాష అయింది.
1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది
1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటుతో పదవీచ్యులతయ్యారు.
1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు.
1999 ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం పడిపోయింది.
ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..
2004 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సంతెమరహళ్లిలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువనారాయణ గెలిచారు.
2008లో రాజస్థాన్‌లో ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సీపీ జోసీనాథ్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, డ్రైవర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment