ఎన్నికల నిర్వహణకే నిధులు వ్యయం చేయాలి
ఇతర శాఖల పనులకు ఖర్చు చేయరాదు
వ్యయం వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల నిర్వహణ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు జిల్లాల వారీగా రూ.286.36 కోట్లు అదనపు నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పెండింగ్ బిల్లులకే అదనపు నిధులను చెల్లించాలని, ఇతర శాఖల పనులకు ఈ నిధులను వ్యయం చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఏ పద్దు కింద ఎన్ని నిధులను విడుదల చేసింది కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఖర్చు వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment