న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)చర్యలు ప్రారంభించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన 266 నియోజకవర్గాలను గుర్తించింది. ఈ స్థానాల్లో ఈసారి ఓటింగ్‌ను పెంచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్ 5) ఢిల్లీలో ఈసీ అధికారులు గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన నియోజకవర్గాల సిబ్బందితో సమావేశమయ్యారు.
తెలంగాణ, బిహార్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌లలో జాతీయ సగటు 67.40 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. ఈ ప్రాంతాల్లో అక్కడి పరిస్థితులను బట్టి వ్యూహాన్ని అమలు చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు. ప్రజలే స్వయంగా ఓటింగ్‌కు ముందుకువచ్చే వాతావరణాన్ని ఏర్పరచాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగ్ కేంద్రాలకు రవాణా, కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ప్రభావితం చేసే వ్యక్తుల సాయం తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment