అందరూ పోలింగ్‌లో పాల్గొనాలి: అదానీ | goutham adani said that all are utilize their vote | Sakshi
Sakshi News home page

అందరూ పోలింగ్‌లో పాల్గొనాలి: అదానీ

Published Wed, May 8 2024 11:25 AM | Last Updated on Wed, May 8 2024 12:27 PM

goutham adani said that all are utilize their vote

ఆసియా కుబేరుల్లో ఒకరైన గౌతమ్‌ అదానీ కుటుంబ సమేతంగా అహ్మదాబాద్‌లో మంగళవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటుహక్కు కలిగి ఉన్న పౌరులందరూ పోలింగ్‌లో తప్పక పాల్గొనాలని ఆయన తెలిపారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఓటింగ్‌ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్‌..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.

అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌గా గౌతమ్‌ అదానీ వ్యవహరిస్తున్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ రూ.3.5లక్షల కోట్లుగా ఉంది. గౌతమ్‌ అదానీ ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌తోపాలు పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఎలక్ట్రిక్‌ పవర్‌, మైనింగ్‌, పునరుత్పాదక ఇందనం, ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇన్‌ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement