ఈవీఎం వయస్సు  36 ఏళ్లు | EVM Invented From 36 Years | Sakshi
Sakshi News home page

ఈవీఎం వయస్సు  36 ఏళ్లు

Published Sun, Mar 17 2019 2:39 PM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

EVM Invented  From 36 Years - Sakshi

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌(ఈవీఎం) పుట్టి 36 ఏళ్లు అవుతోంది. ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాలకు ప్రత్యామ్నాయంగా ఈ యంత్రాలను ప్రవేశ పెట్టింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఈవీఎంల పుట్టుకతో వాటి నిర్వహణ లోపాలు, సందేహాలతో కొంత కాలం కొట్టుమిట్టాడి ఆ తర్వాత నిలదొక్కుకుంది. అప్పటి నుంచి అనేక ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగిస్తున్నారు.    

  • మొదటి సారి కేరళ రాష్ట్రం పరూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 19 మే 1982లో ఈవీఎంలను వినియోగించారు. 
  • ఆ తర్వాత 1982, 83లో జరిగిన ఉపఎన్నికల్లో దేశవ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో వీటిని వాడారు. 
  • ఈవీఎంలను ఉపయోగించవద్దని 1984, మే 5వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
  • ఈవీఎంల వాడకాన్ని 1988 డిసెంబర్‌లో కేంద్రం సెక్షన్‌ 61 ఏ ద్వారా ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేర్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 61 ఏ సవరణ 1989 మార్చి 15న అమల్లోకి తేవడంతో ఆ తర్వాత సుప్రీం కూడా సమర్థించింది. 
  • జనవరి 1990లో ఎన్నికల సంస్కరణల కమిటీ(ఈఆర్‌సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఏప్రిల్‌లో ఈవీఎంల వాడకాన్ని సాంకేతిక నిపుణుల కమిటీ సమర్థించింది. 
  • ఎన్నికల సవరణను 1992 మార్చి 24న ఎన్నికల నియమావళి 1961ని ప్రభుత్వం అధీకృతం చేసింది. 
  • ఈవీఎంల వాడకానికి 1998లో ప్రజామోదం లభించింది. 
  • వివిధ రాష్ట్రాల్లో 1999, 2004 సంవత్సరాల్లో వివిధ శాసనసభల ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వినియోగించారు. 
  • లోక్‌సభకు 2004–14 మధ్య జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఈవీఎంలను వినియోగించారు. 
  • వీవీ ప్యాట్‌ల వినియోగాన్ని 2013 ఆగస్టు 14న ఈవీఎంలకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. 
  • నాగాలాండ్‌ రాష్ట్రంలోని నాక్సెన్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 2013 సెప్టెంబర్‌ 4న వీవీ ప్యాట్‌లను మొదటిసారిగా వినియోగించారు. 
  • 2013 అక్టోబర్‌ 8న దశలవారీగా వీవీ ప్యాట్‌లను వినియోగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 
  • దశల వారీగా 2013 నుంచి వీవీ ప్యాట్‌లను ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. 
  • 2017 ఏప్రిల్‌లో రూ. 3,173.47 కోట్లతో 16.15 లక్షల వీవీ ప్యాట్‌ల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కూడా వీవీ ప్యాట్‌లను వినియోగించేందుకు ఎన్నికల కమిషన్‌ కసరత్తు పూర్తి చేసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement