న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లలో వేసిన మొత్తం ఓట్ల వీవీప్యాట్ స్పిప్పులు వెరిఫై చేయాలని వేసిన పిటిషన్‌లపై బుధవారం(ఏప్రిల్24) మరోసారి విచారణ జరిపిన అత్యున్నత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగసంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఏ పనిచేయాలన్నది తాము సూచించలేమంది. ఎన్నికల్లో మొత్తం వీవీప్యాట్ స్లిప్పుల వెరిఫికేషన్‌పై సుప్రీంకోర్టు బుధవారమే తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే ఈ విషయంలో తమకు ఉన్న పలు సందేహాలపై న్యాయమూర్తులు ఈసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తీర్పు రిజర్వు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment