
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన 17 లక్షల వీవీప్యాట్(ఓటు రశీదు) యంత్రాలను నవంబర్ చివరినాటికి సమకూర్చుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వీవీప్యాట్‌లను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని వెల్లడించింది. ఇందుకోసం 17.45 లక్షల యూనిట్ల వీవీప్యాట్ మెషీన్ల తయారీకి బెంగళూరులోని బెల్, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 9 లక్షల యంత్రాలు సిద్ధమయ్యాయని, మిగిలిన 8 లక్షల యంత్రాలను నవంబర్ చివరినాటి అందిస్తామని ఆ రెండు కంపెనీలు హామీ ఇచ్చినట్లు వెల్లడించింది.