ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
సాక్షి, గోపాల్‌పేట: ఉమ్మడి గోపాల్‌పేట మండలంలోని ఏదుట్ల, గొల్లపల్లి గ్రామాల్లో మంగళవారం ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏదుట్ల గ్రామంలోని కూలీలకు, గ్రామస్తులకు ఓటుహక్కు, మరియు ఓటును ఎలా వినియోగించుకోవాలని అధికారులు అవగాహన కల్పించారు. ఇంతకు ముందు ఓటు వేసేప్పుడు బీప్ శబ్ధం మాత్రమే వచ్చేదని ఇప్పుడు బీప్ శబ్ధంతో పాటు వారి ఓటుహక్కు ఎవరికి వినియోగించుకున్నారో వీవీప్యాట్‌లో చూపెడుతుందని అధికారులు వివరించి చెప్పారు.
గొల్లపల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సులో గ్రామస్తులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఓటు ఎలా వేయాలో తెలుసుకున్నారు. సర్పంచ్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఓటును డబ్బులకు, లేదా మద్యానికి అమ్ముకోకుండా నిజాయితీగా వారికి ఏ నాయకుడు మేలు చేస్తాడో వారికే ఓటు వేయాలని సూచించాడు కార్యక్రమంలో వీఆర్‌ఓ కిషన్‌రావు, వీఆర్‌ఏ సతీష్ కుమార్, ఉడుముల యాదగిరి ఉన్నారు.
గడువులోగా అభ్యంతరాలు తెలపాలి
పాన్‌గల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై గడువులోగా తెలియపర్చాలని ఎంపీడీఓ సాయిబ్రింద అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పరిషత్ ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. డ్రాఫ్ట్ జాబితాపై ఈనెల 25 వరకు అభ్యంతరాలను స్వీకరించి మార్పులు చేస్తామన్నారు.
పరిషత్ ఎన్నికలపై ఈనెల 27న తుది జాబితా విడుదల చేస్తామన్నారు. గడువులోగా అభ్యంతరాలు తెల్పకుంటే మార్పులకు అవకాశం ఉండదన్నారు. ఓటర్ల తుది జాబితా తర్వాత ఆయా రాజకీయ పార్టీల నేతలకు ఓటర్ల జాబితా ప్రతిని అందజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment