wanaparty
-
శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కేటీఆర్
సాక్షి, వనపర్తి: కాంగ్రెస్ పార్టీ పేరుకే ప్రజాపాలన.. చేస్తుంది ప్రతీకార పాలన అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. జూపల్లి కృష్ణారావు ప్రమేయంతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి జూపల్లిని వెంటనే బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వరుస హత్యలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని కల్లోల ప్రాంతంగా ప్రకటించాలన్నారు.వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి అంతిమయాత్రలో కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి హత్యలు ఎప్పుడు జరగలేదని తెలిపారు. తాము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండేదా అని ప్రశ్నించారు.రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యలు జూపల్లి కృష్ణారావు సహకారం లేకుండ జరగవని అన్నారు. తెలంగాణలో ఎక్కడలేని ఫ్యాక్షని సంస్కృతి కొల్లాపూర్‌లో నెలకొందని, శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హత్యలను ఇలాగే కొనసాగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కేటీఆర్. మా వాళ్ళని ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని, ఎంతటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హత్యల సంస్కృతి తెలంగాణకి మంచిది కాదని, శ్రీధర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు. -
వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
పదేళ్లుగా కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారు: రేవంత్ రెడ్డి
-
తొయ్యరా తొయ్యి.. హైలెస్సా!
సాక్షి, వనపర్తి: రోజంతా ఆడిన పాడిన పిల్లాడు సాయంత్రం ఇంటికి చేరడానికి అవస్థలు పడే లాగే.. ఉదయం డిపో నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ డీలక్స్ బస్సు సాయంత్రం డిపోలోకి చేరే సమయంలో మొరాయించింది. డ్రైవర్ శతవిధాల ప్రయత్నం చేసిన స్టార్ట్ కాకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు, మెకానికులు అందరూ కలిసి డిపోలోకి బస్సును నెట్టుకెళ్లారు. ఇంజన్, క్లచ్ ప్లేట్స్, తదితర కారణాలతో బస్సు మొరాయించిందని, అద్దె బస్సులు వినియోగంలో లేకపోవడంతో కాలం చెల్లిన బస్సులతో రాకపోకలు సాగించడం కష్టంగా ఉందని ఉద్యోగులు అంటున్నారు. పలుమార్లు ప్రయాణ మార్గ మధ్యంలోనే ఇబ్బందులు తల్లెత్తుతున్నాయని ఆర్టీసీ వర్గాలు బస్సు నెట్టుతున్న సమయంలో చర్చించుకోవడం గమనార్హం. -
మహబూబ్‌నగర్‌లో భూముల ధరలకు రెక్కలు?
రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి మరింత ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఏడేళ్లుగా భూములు, పాట్ల మార్కెట్ విలువను పెంచే విషయంలో ఉదారంగా వ్యవహరించిన ప్రభుత్వం, ప్రస్తుతం భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఆయా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఎంతమేరకు పెంచవచ్చనే విషయమై ప్రతిపాదనలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. సాక్షి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల, మహబూబ్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూములు, ప్లాట్లకు మార్కెట్ విలువ అత్యధికంగా పెరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు ఎక్కువగా అయ్యే ప్రాంతాల్లో మార్కెట్ విలువను అమాంతం పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. మిగతా ప్రాంతాల్లో 50 నుంచి వందశాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లా పరిధిలోని రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ఇక్కడ 60 నుంచి 100శాతం పెరగవచ్చునని ప్రభుత్వం ఎప్పుడు పెంచుతుందనే సమాచారంలేదని వనపర్తి సబ్ రిజిస్ట్రార్ ఖుషియా బదర్ తెలిపారు. ఏడేళ్ల తర్వాత తెరపైకి మార్కెట్ విలువ అంశం మార్కెట్ విలువ పెంచే విషయాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏడేళ్ల తర్వాత తెరపైకి తీసుకువచ్చింది. నిబంధనల ప్రకారం.. ప్రతి రెండేళ్లకు ఒకసారి భూములు, ప్లాట్ల విలువను పెంచాల్సి ఉంది. ఆయా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి ప్రభుత్వానికి ఇదివరకు రెండుసార్లు ప్రతిపాదనలు పంపించినా మార్కెట్ విలువ పెంచలేదు. నెలరోజుల నుంచి ప్రభుతం ఈ విషయంపై క్షేత్రస్థాయి అధికారులతో ఫీడ్‌బ్యాక్ తీసుకోవటం, తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపాదనలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుంచే పెంచాలనుకుంది. కానీ కొన్నిమార్పులు చేయాలనే ఉద్దేశంతో మరికొంత సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్నిరకాల భూములకు ఒకే మార్కెట్ విలువ? ఇదివరకే తరి, మెట్ట భూములకు వేర్వేరు మార్కెట్ విలువ ఉండేది. ప్రస్తుతం పెంచే మార్కెట్ విలువరేట్లలో అన్నిరకాల భూములకు, ప్లాట్లకు ఒకే రకమైన మార్కెట్ విలువను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఒకరు చెప్పారు. వనపర్తి రెండింతలు.. మహబూబ్‌నగర్, జడ్చర్ల తర్వాత అత్యధికంగా వనపర్తి జిల్లాలోనే మార్కెట్ విలువను పెంచేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. మార్కెట్ విలువను బట్టి స్టాంప్ డ్యూటీ ప్రతి రిజిస్టేషన్‌కు మార్కెట్ విలువను బట్టి కొ నుగోలుదారులు రూ.లక్షకు రూ.6వేల చొప్పు న ప్రభుత్వానికి స్టాంప్‌డ్యూటీ పేర చెల్లించాల్సి ఉంటుంది. ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా ల నుంచి ఏటా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరగనున్న మార్కెట్ విలువతో రెట్టింపు కానుంది. ఫిబ్రవరి 1న పెంచుతామన్నారు ఇప్పటికే మార్కెట్ విలువను పెంచేందుకు పలుమార్లు ఉన్నతాధికారులు సమావేశాలు ఏర్పాటు చేశారు. మాతో ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఏయే ప్రాంతంలో ఎంత మేరకు పెంచాలనే అంశంపై ఇదివరకు ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లతో ప్రతిపాదనలు తీసుకునేది. కానీ ప్రస్తుతం ఉన్నతాధికారులు, ప్రభుత్వం జిల్లా రిజిస్ట్రార్లతో ప్రతిపాదనలు తెప్పించుకుంటున్నారు. – ఖుషియా బదర్, సబ్‌రిజిస్ట్రార్, వనపర్తి స్పష్టత లేదు.. మార్కెట్ విలువపై సమావేశాలు నిర్వహించారు. ప్రతిపాదనలు అడిగారు. పెంచిన మార్కెట్ విలువ రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి చేయాలనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టతరాలేదు. – రవీందర్, జిల్లా రిజిస్ట్రార్, మహబూబ్‌నగర్ -
మహబూబ్‌నగర్‌లో కారు స్పీడు తగ్గింది..
సాక్షి, మహబూబ్‌నగర్: వరుస ఎన్నికల్లో గెలుపుతో ఫుల్ జోష్‌లో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి పుర ఫలితాలు కాస్త చేదు అనుభవాన్ని మిగిల్చాయనే చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లాలోని 17మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరవేస్తామనే ధీమాతో ఉన్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పుర ఫలితాలతో సంతృప్తిగా లేరని గులాబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో కేవలం ఎనిమిదింటిలోనే ఆ పార్టీ సంపూర్ణ మెజారీటీ సాధించింది. మిగిలిన స్థానాల్లో ఇతర పారీ్టలు, అభ్యర్థుల మద్దతు తీసుకుని పుర పీఠాల కోసం ప్రయతి్నస్తోంది. శనివారం ఉదయం 8గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 11గంటలకే పది వార్డులు కలిగిన ‘పుర’ ఫలితాలు వెలువడ్డాయి. 40 వార్డుల లోపు ఉన్న వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ ఫలితాలు సాయంత్రం 4 గంటలకు వచ్చాయి. కాగా 49 వార్డులున్న మహబూబ్‌నగర్ పుర ఫలితాలు రాత్రి 9 గంటలకు వెలువడ్డాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో టీఆర్ఎస్ 30, కాంగ్రెస్ 5, బీజేపీ 5, ఎంఐఎం 3, ఇతరులు ఆరింటిలో విజయం సాధించారు. వనపర్తిలో 33 వార్డులకు 21 వార్డులతో టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించి.. పుర పీఠాన్ని కైవసం చేసుకుంది. కొత్తకోటలో 15 వార్డులకు పది వార్డులు, ఆత్మకూరులో పది వార్డులకు ఆరు, నాగర్‌కర్నూల్‌లో 24 వార్డులకు 14, గద్వాలలో 37 వార్డులకు 19, అలంపూర్‌లో పది వార్డులకు ఏడు స్ధానాలతో గెలుపొందింది. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 22వార్డులుండగా.. టీఆర్ఎస్ అభ్యర్థులు పది స్థానాల నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఏడు స్థానాల్లో, నాలుగు చోట్ల స్వతంత్రులుగా పోటీ చేసిన టీఆర్ఎస్ రెబల్స్, ఒక చోట బీజేపీ అభ్యర్ధి గెలిచాడు. దీంతో ఫలితాలు వెలువడ్డ గంటన్నర లోపే పట్టణానికి చేరుకున్న ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రెబెల్స్‌కు గులాబీ కండువా కప్పారు. దీంతో పుర పీఠం కైవసం చేసుకునేలా ఆ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. శనివారం సాయంత్రమే టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్ధి ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో అభ్యర్థులు క్యాంపునకు తరలివెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పది వార్డులున్నాయి. వీటిలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నాలుగు చొప్పున, కాంగ్రెస్ అభ్యర్థులు రెండు స్థానాలు గెలుచుకున్నారు. దీంతో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లను బీజేపీ క్యాంపునకు తరలించింది. పది వార్డులు ఉన్న అమరచింత మున్సిపాలిటీలోనూ ఏ పారీ్టకి మెజారిటీ రాలేదు. అక్కడ టీఆర్ఎస్ 3, సీపీఎం 2, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇండిపెండెంట్, సీపీఐల నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు. స్వతంత్ర అభ్యరి్థగా గెలుపొందిన రాజŒ కుమార్‌కు గులాబీ కండువా కప్పిన ఆ పారీ్ట.. ఆరో వార్డు నుంచి గెలిచిన మాధవి, పదో వార్డు నుంచి గెలుపొందిన గోపి సీపీఎం అభ్యర్థులతో మంతనాలు ప్రారంభించారు. రంగంలో దిగిన అమరచింత మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేందర్‌సింగ్ సీపీఎం అభ్యర్థులిద్దరినీ మక్తల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి వారితో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీపీఎం అభ్యర్థుల్లో ఒకరికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కేటీఆర్ కోర్టులో కొల్లాపూర్ బంతి.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ వెల్లడైన కొల్లాపూర్ పుర ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వర్గపోరు ఆది నుండే ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తన వర్గీయులకు టీఆర్ఎస్ నుంచి టికెట్లు ఇప్పించుకోవడంలో విఫలమైన జూపల్లి వారిని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలో దింపారు. దీంతో జూపల్లి వర్గాన్ని ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ సైతం శక్తివంచనా లేకుండా ప్రచా రం నిర్వహించింది. హోరాహోరీగా కొనసాగిన పోరులో జూపల్లి వర్గీయులు పదలకొండు స్థానాల్లో స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు తొమ్మిది స్థానాల్లో గెలుపొందారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎక్స్‌అఫీయో ఓట్లతో గట్టెక్కాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలిచిన తొమ్మిది మందిని తీసుకుని క్యాంపునకు తరలించాలని సూచించడంతో.. వారికి క్యాంప్‌నకు తీసుకెళ్లారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ తన వర్గీయులకు గాలం వేస్తుందని భావించిన జూపల్లి ఫలితాలకు ఒక రోజు ముందే క్యాంపునకు తరలించడం విశేషం. ‘పేట’లో గట్టెక్కిన గులాబీ.. నారాయణపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పారీ్టకి బీజేపీ ముచ్చెమటలు పట్టిచ్చింది. 24 వార్డులు ఉన్న పట్టణంలో టీఆర్ఎస్ పది స్థానాలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 2, బీజేపీ 9, ఎంఐఎం 1, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇద్దరు స్వతంత్రులను కలుపుకుని పుర పీఠంపై పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తొమ్మిదో వార్డు నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్ధి మహేశ్‌ను టీఆర్ఎస్లో చేరి్పంచుకున్నారు. 23వ వార్డు నుంచి గెలిచిన ఎంఐఎం అభ్యర్థి తఖీచాంద్ మద్దతు కూడగట్టుకున్నారు. దీంతో టీఆర్ఎస్కు 12 సంఖ్యాబలం వచ్చింది. దీంతో ఎమ్మెల్యే తన ఎక్స్‌అఫీíÙయో ఓటును వేసి పేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయడం దాదాపు ఖరారైంది. అయిజ మున్సిపాలిటీలో మారుతోన్న రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. 20 వార్డులు ఉన్న ఆ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఆరు స్థానాల్లో, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ రెబెల్స్ పది మంది గెలుపొందారు. దీంతో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులను కర్నూలులో తన వద్దకు పిలిపించుకున్న అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం.. కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతుతో పాటు ఎక్స్‌అఫీíÙయో కింద తన ఓటునూ వేసి మున్సిపాలిటీపై పాగా వేసేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. 49స్థానాలతో సరి.. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో పుంజుకున్న బీజేపీ 338 వార్డులకు కేవలం 49 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో మక్తల్, నారాయణపేట, భూత్పూర్, ఆత్మకూరు, అమరచింత, గద్వాల, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీల్లో కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న ఆ పార్టీ 5 స్థానాలతోనే సరిపెట్టుకుంది. 16 వార్డులు కలిగిన మక్తల్ మున్సిపాలిటీలో 8 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ రెండు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ అభ్యర్థుల సహకారంతో పురపీఠాన్ని కైవసం చేసుకోనుంది. ఇటు నారాయణపేటలోనూ బీజేపీకి ఆఖరి నిమిషంలో పుర పీఠం చేజారింది. అక్కడ 24 వార్డులుంటే టీఆర్ఎస్ పది, బీజేపీ 9 వార్డులు దక్కాయి. ఇద్దరు స్వతంత్రులు, మరో ఇద్దరు కాంగ్రెస్, ఒక ఎంఐఎం సభ్యులతో పుర పీఠం కైవసానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వలేదు. చివరి క్షణంలో రంగంలో దిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో కింద తన ఓటు హక్కును వినియోగించుకుని ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మక్తల్‌లో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు వేర్వేరుగా క్యాంపునకు తరలివెళ్లారు. అక్కడ 16 వార్డులు ఉంటే.. టీఆర్ఎస్ 5, బీజేపీ 8స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ రెండు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలిచారు. దీంతో అవసరమైతే టీఆర్ఎస్ కాంగ్రెస్, ఇండిపెండెంట్ల సహకారంతో పాటు ఎమ్మెల్యే ఎక్స్అఫిఫియో ఓటుతో గట్టెక్కే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో గెలిచిన తమ అభ్యర్థులకు గాలం వేయకుండా ఇరుపారీ్టలు ముందస్తు జాగ్రత్తగా క్యాంపు బాటపట్టాయి. -
వృత్తి పొగాకు వ్యాపారం.. ప్రవృత్తి కరాటే మాస్టర్
సాక్షి, కొత్తకోట రూరల్: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. చిన్నపాటి డబ్బాలో పొగాకు అమ్ముకుంటూ కరాటేలో ప్రతిభకనబర్చి ఉన్నతస్థాయి వ్యక్తుల నుంచి మన్ననలు పొందుతున్న ఓ నిరుపేద యువకుడు అబ్దుల్నబీ. కొత్తకోట పట్టణ కేంద్రానికి చెందిన సుల్తాన్‌బీ, ఖాజామియ్యా దంపతుల కుమారుడు అబ్దుల్ నబీ చిన్నప్పుడు సరదాగా పంచ్‌లు విసిరిన చేతులే నేడు పట్టెడన్నం పెడుతున్నాయి. ఓ పేదింటి యువకుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రశంసలు పొందుతున్నాడు. నబీ తల్లి బీడీ కారి్మకులు కాగా తండ్రి పొగాకు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుండేవారు. తాను నేర్చుకున్న విద్య నలుగురికి నేర్పుదామని 2015లో ‘గాడ్స్ ఆన్ వారియర్స్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ అకాడమీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అకాడమీలో 500 మంది విద్యార్థులు కిక్ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది విద్యార్థులు తన దగ్గర శిక్షణ తీసుకున్నట్టు నబీ తెలిపాడు. ఇక్కడ శిక్షణ తీసుకున్న విద్యార్థులు తక్కువ కాలంలోనే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని పలుమార్లు బంగారు, వెండి పతకాలు సాధించారు. తన దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థులు పోలీస్, ఆర్మీ, సీఆర్పీఎఫ్ తదితర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు ప్రైవేట్ పాఠశాలల్లో పీఈటీలుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక పోటీల్లో పతకాలు అందుకున్నాడు. ఒలింపిక్స్‌లో ఆడించడమే లక్ష్యం నేను నేర్చుకున్న కరాటేలో అన్నిస్థాయిల్లో మంచి ప్రతిభకనబర్చుతూ మేధావుల నుంచి ప్రశంసలు పొందిన అబ్దుల్నబీ రాబోయే రోజుల్లో తన అకాడమీ విద్యార్థులను ఒలింపిక్ క్రీడల్లో ఆడించడమే నా లక్ష్యం. ప్రభుత్వం కరాటేను ఆదరించి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కరాటే నేరి్పంచేందుకు మాలాంటి వారికి ఉద్యోగావకాశాలు కలి్పంచాలి. – అబ్దుల్నబీ, కరాటే మాస్టర్, కొత్తకోట -
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తథ్యం
సాక్షి, వనపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కంటే సీఎం కేసీఆర్ తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, ప్రజాఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపేందుకు బుధవారం వనపర్తికి వచ్చిన ఆయన మాట్లా డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఏనాడూ ప్రభుత్వ అత్యున్నత అధికారి, మరో ముగ్గురు ఐఏఎస్‌లను హైకోర్టు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసిందంటే అన్యాయం ప్రభుత్వం వైపు ఉందని తెలుస్తోందన్నారు. తెలంగాణ ఇస్తే చాలా రాష్ట్రాల డిమాండ్లు వస్తాయని కేంద్రం అంటే.. ఉన్న తెలంగాణ ఇవ్వాలని అడిగినం. అలాగే ఆర్టీసీ విలీనం చేస్తే 91 కార్పొరేషన్ల డిమాండ్ చేస్తాయని చెబుతున్న సీఎం కేసీఆర్.. పూర్వం ప్రభుత్వంలో ఉన్న ఆర్టీసీనే విలీనం చేయమని కోరుతున్నామని తెలుసుకోవాలని హితవు పలికారు. హైకోర్టులో తీర్పు రాకముందే సుప్రీం కోర్టు వెళ్తామని చెప్పడం కార్మికుల అంతిమ విజయానికి నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ సంగతి చూస్తాం... అంతు తేలుస్తాం అంటారే తప్పితే చేసిందేమీ లేదని, న్యాయస్థానంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు బోనులో దోషిగా నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీ కార్మికులదని అన్నారు. ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌కు శాపనార్థాలు పెట్టవద్దని, దేవుడా కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని ప్రతి కార్మికుడు కోరుకోవాలని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంకావడం తథ్యమని అన్నారు. యుద్ధంలో శత్రువు బతికి ఉన్నప్పుడే గెలవాలని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులు కేసీఆర్ జాగీరుకాదని, ఏవడబ్బ సొమ్మని అమ్ముకుంటావు అంటూ నిప్పులు చెరిగారు. కార్మికులు విధుల్లో చేరకపోతే 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం చూస్తే కేసీఆర్ ముందే కుట్రపన్నాడని తెలుస్తోందన్నా రు. హైకోర్టులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వానికి అక్షింతలు తప్పడంలేదని, ఒక దశలో ఇదేమి రాజరికంకాదని వ్యా ఖ్యానించిందంటే ప్రభుత్వంపై రాజ్యాంగ సంస్థ ఎంతమేర అసహనంతో ఉందో ఇట్టే అర్థమైతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ఆర్.గోపిగౌడ్, జేవీ స్వామి, ఖయ్యాం, విశ్వనాథ్, యాదయ్య, డీబీకే రెడ్డి, వీవీమూర్తి, చలపతిరెడ్డి, బాలస్వామి ఉన్నారు. 40వ రోజుకు చేరిన సమ్మె ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 40వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యా్యమూర్తులతో కమిటీ వేస్తామంటే విముఖత చూపడం ప్రభుత్వ దివాళాకోరు తానికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, బీసీ సంఘం నేత యుగంధర్‌గౌడ్, బీజేపీ కృష్ణ, పరశురాం, వెంకటేశ్వర్‌రెడ్డి. ఎమ్మార్పీఎస్ గద్వాల కృష్ణ, కోళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యాశే కొంపముంచింది
సాక్షి, వనపర్తి: అత్యాశ పతనానికి దారితీస్తుందన్న విషయం మరోసారి నిరూపితమైంది. రూ.వేలల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు అధికారులు పేద, ధనిక అనే తేడా లేకుండా లంచం కోసం వేధించటం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. ఓ చిన్న పనికోసం ఇదివరకే రూ.ఒక లక్ష లంచం తీసుకున్న వనపర్తి మైన్స్‌శాఖ ఏడీ జాకబ్ మరో రూ.20 వేల కోసం అత్యాశపడి చివరికి ఏసీబీ వలకు శుక్రవారం చిక్కిన సంఘటన వనపర్తిలో సంచలనం రేకెత్తిస్తోంది. ఏసీబీ డీఎస్పీలు ఫయాజ్, శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన దిలీపాచారికి వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో మినరల్స్ క్వారీ ఉంది. దానిని మరో కంపెనీకి విక్రయించిన దిలీపాచారి మైన్స్‌క్వారీని శ్రీ సాయి మినరల్స్ అండ్ మైన్స్ నుంచి మరో సంస్థ పేరున మార్చాలని కోరుతూ దరఖాస్తు చేశాడు. తనిఖీ.. ఐదురెట్లు అదనంగా ఫైన్ ఇదిలాఉండగా, క్వారీని తనిఖీ చేసిన మైన్స్ ఏడీ జాకబ్ చెల్లించాల్సిన రాయల్టీకి ఐదురెట్లు అదనంగా ఫైన్ వేస్తూ షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఫై న్ వేసేందుకు కారణమేంటి నేను ప్రభుత్వ నిబంధనల మేరకే క్వారీ నిర్వహణ చేస్తున్నానని బాధితుడు అధికారిని అభ్యర్థించగా రూ.ఒక లక్ష లంచం ఇవ్వమని ఏడీ కోరాడు. దీంతో సె ప్టెంబర్ 27వ తేదీన స్థానికంగా ఉన్న మైన్స్ ఏడీ జాకబ్ దిలీపాచారిని తన ఇంటికి పిలిపించుకుని రూ.ఒక లక్ష లంచం తీసుకున్నాడు. అయినా కూడా పనిచేయకుండా ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చాడు. శుక్రవారం ఆర్ఐకి ఇవ్వాలంటూ మరో రూ.20వేలు తీసుకురమ్మని ఏడీ కోరాడు. దీంతో బాధితుడు దిలీపాచారి తమను ఆశ్రయించాడని ఏసీబీ అధికారులు తెలిపారు. పథకం ప్రకారం పట్టుకున్నారు.. ఇదివరకే రూ.ఒక లక్ష లంచం తీసుకుని పనిచేయకుండా రోజూ ప్రదక్షణలు చేయిస్తూ ఇంకా లంచం కావాలని వేధించటంతో బాధితుడు దిలాపాచారి ఏబీసీ అధికారులను ఆశ్రయించారు. వారు పౌడర్ చల్లిన నోట్లను బాధితుడికి ఇచ్చారు. మైన్స్‌ఏడీ జాకబ్ ఆ నోట్లని తెలియక లంచంగా తీసుకుని రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. బాధితుడితో లంచం తీసుకున్న వెంటనే వనపర్తిలోని కార్యాలయం సమీపంలో కాచుకుని ఉన్న సుమారు 20 మంది ఏసీబీ అధికారులు సిబ్బంది ఒక్కసారిగా.. దాడి చేసి జాకబ్‌ను పట్టుకున్నారు. జాకబ్‌తో పాటు లంచంలో భాగస్వామ్యం ఉన్న సాయిరాంను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను లాక్కున్నారు. ఇల్లు, కార్యాలయంలో సోదాలు మైన్స్ ఏడీ లంచావతారంపై ఫిర్యాదు రాగానే ఏసీబీ అధికారులు ఆఫీస్‌తో పాటు అతని ఇంట్లోను సోదాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ లంచం తీసుకుంటూ పట్టుబడగానే హైదరాబాద్‌లోని తన నివాసంలోనూ సోదాలు ప్రా రంభించినట్లు ఏబీసీ అధికారులు తెలిపారు. -
ఎట్టకేలకు టీఆర్టీలకు మోక్షం
సాక్షి, వనపర్తి : టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) అభ్యర్థుల నియామకాలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ ఏడాదైనా ప్రభుత్వం బడులు తెరిచే నాటికి నియమాకాలు చేపట్టాలనే వారి డిమాండ్ కొంచెం అటు, ఇటుగా ఫలించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను ఆర్టీటీ అభ్యర్థులతో భర్తీ చేసేందుకు 2017లో టీఆర్టీ పరీక్ష నిర్వహించి, ఇందుకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినా.. ఎంపికైన వారికి నియమాక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లు అయోమయ పరిస్థితిలో వారంతా కొట్టుమిట్టాడారు. ఇదే క్రమంలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నా వారు నియమాకాల కోసం రోజుల తరబడి ఎదురుచూపులకు ఫలితం దక్కనుంది. ప్రభుత్వం వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించడంతో ఎన్ని రోజుల ఎదురుచూపుల ఆశలు నేరవేరనున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా ఉమ్మడి జిల్లా కేంద్ర కలెక్టర్ చైర్మన్‌గా, జేసీ వైస్ చైర్మన్‌గా, డీఈఓ కార్యదర్శిగా, జెడ్పీసీఈఓ లేదా ఇతర అధికారిని సభ్యులను కమిటీగా ఏర్పాటు చేసి, వారి ద్వారా నియమాకాల ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రోస్టర్, మెరిట్ జాబితా ప్రకారం ప్రభుత్వ పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. నాలుగు కేటగిరీల్లో నియామకాలు టీఆర్టీల నియమకాలను ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా కమిటీలు నాలుగు కేటగిరిల్లో భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులుండి ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన కొత్త జిల్లాల అధికారులను సమన్వయం చేసుకుంటూ పోస్టులు భర్తీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఎవరైనా అభ్యర్థులు కౌన్సెలింగ్ హాజరుకాకపోతే మిగిలిన స్థానాల్లో నియమిస్తున్నట్లు వారికి రిజిష్టర్ పోస్టు ద్వారా సమాచారం అందించనున్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి.ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 2005 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో సెకండ్ గ్రేడ్ టీచర్స్( ఎస్జీటీ) 1465, స్కూల్ ఆసిస్టెంట్లు 391, ల్వాంగేజ్ పండిట్స్ 113, పీఈటీలు 36 మంది ఉన్నారు. -
ఈవీఎం, వీవీఫ్యాట్లపై అవగాహన
సాక్షి, గోపాల్పేట: ఉమ్మడి గోపాల్పేట మండలంలోని ఏదుట్ల, గొల్లపల్లి గ్రామాల్లో మంగళవారం ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏదుట్ల గ్రామంలోని కూలీలకు, గ్రామస్తులకు ఓటుహక్కు, మరియు ఓటును ఎలా వినియోగించుకోవాలని అధికారులు అవగాహన కల్పించారు. ఇంతకు ముందు ఓటు వేసేప్పుడు బీప్ శబ్ధం మాత్రమే వచ్చేదని ఇప్పుడు బీప్ శబ్ధంతో పాటు వారి ఓటుహక్కు ఎవరికి వినియోగించుకున్నారో వీవీప్యాట్‌లో చూపెడుతుందని అధికారులు వివరించి చెప్పారు. గొల్లపల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సులో గ్రామస్తులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఓటు ఎలా వేయాలో తెలుసుకున్నారు. సర్పంచ్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఓటును డబ్బులకు, లేదా మద్యానికి అమ్ముకోకుండా నిజాయితీగా వారికి ఏ నాయకుడు మేలు చేస్తాడో వారికే ఓటు వేయాలని సూచించాడు కార్యక్రమంలో వీఆర్ఓ కిషన్‌రావు, వీఆర్ఏ సతీష్ కుమార్, ఉడుముల యాదగిరి ఉన్నారు. గడువులోగా అభ్యంతరాలు తెలపాలి పాన్‌గల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై గడువులోగా తెలియపర్చాలని ఎంపీడీఓ సాయిబ్రింద అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పరిషత్ ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. డ్రాఫ్ట్ జాబితాపై ఈనెల 25 వరకు అభ్యంతరాలను స్వీకరించి మార్పులు చేస్తామన్నారు. పరిషత్ ఎన్నికలపై ఈనెల 27న తుది జాబితా విడుదల చేస్తామన్నారు. గడువులోగా అభ్యంతరాలు తెల్పకుంటే మార్పులకు అవకాశం ఉండదన్నారు. ఓటర్ల తుది జాబితా తర్వాత ఆయా రాజకీయ పార్టీల నేతలకు ఓటర్ల జాబితా ప్రతిని అందజేస్తామన్నారు. -
పోలీసులకు సవాల్..
సాక్షి, వనపర్తి క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెలరోజులుగా దొంగలు హల్చల్ చేస్తున్నారు. వ్యాపార దుకాణాలు, ఆలయాలు, ఇళ్లు తేడా లేకుండా వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలకు దగ్గరవుతున్న పోలీస్ యంత్రాంగం చోరీల విషయంలో ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో రోజురోజుకు వారిపై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లుతోంది. చోరీల పర్వం ఇలాగే సాగితే.. పోలీస్ శాఖపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. దొంగతనం జరిగినప్పుడే హడావుడి.. దొంగతనం జరిగినప్పుడే క్లూస్ టీం, ఇతర పోలీస్ అధికారులు హడావుడి చేయడం, ఆ తర్వాత ఆ ఊసే మరిచిపోవడంతో చోరీలు యధావిధిగా కొనసాగుతున్నాయి. తరుచూ జరుగుతున్న దొంగతనాలను చేధించడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న చిన్న చోరీలను పోలీసులు నామమాత్రంగా వదిలేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా.. దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. రాత్రివేళలోనే కాకుండా పట్టపగలే చోరీలకు పాల్పడుతూ ఆనవాళ్లు దొరకకుండా విజృంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో నిత్యం ఏదో ఒకచోట దొంగతనం జరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తే అరికట్టవచ్చని ప్రజలు అంటున్నారు. దేవాలయాల్లో.. చోరీలకు అలవాటుపడిన కొందరు దేవాలయాలను కూడా వదలడంలేదు. ఆలయాల్లోకి చొరబడి మరీ హుండీలను పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు దేవాలయాల్లో వరుస హుండీల దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారింది. ఫిబ్రవరి 27 వనపర్తి మండలం నాగవరం కోదండరామస్వామి ఆలయం, రాజనగరం అయ్యప్ప దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని హుండీలను పగులగొట్టి నగదును ఎత్తికెళ్లారు. ఈ నెల 1న అర్ధరాత్రి చిన్నచింతకుంట మండలం కురుమూర్తిస్వామి ఆలయంలో హుండీని పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. మంగళవారం కొత్తకోట మండల శివారులోని వెంకటగిరి, పట్టణంలోని సాయిబాబ, కోట్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీలను పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. అదేవిధంగా వెంకటగిరి ఆలయంలో శఠగోపంతోపాటు తీర్థం పోసే పాత్ర ఎత్తుకెళ్లారు. ఆలయాల్లో జరుగుతున్న వరుస హుండీల చోరీలతో ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతుంది. -
ఓటర్లకు గాలం.. లాబీయింగ్ షురూ..
సాక్షి వనపర్తి: ముందస్తు ఎన్నికల ప్రచారానికి ఈనెల 5వ తేదీతో గడువు ముగిస్తుండటం, 7న పోలింగ్ జరగనుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. గడిచిన కొన్ని రోజులుగా గ్రామాలు, పట్టణాల్లో కార్యకర్తలు, కులసంఘాలు, యువజన సంఘాలను కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ఎంత గొప్పగా ప్రచారం చేసినప్పటికీ పోలింగ్ సమయంలో మేనేజ్మెంట్ చేయకపోతే దాన్ని ఓట్లుగా మార్చడంలో విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఓటింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే అసలు కథ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఓటర్ను పోలింగ్ కేంద్రం వరకు రప్పించి, ఓటు వేయించడంతో పోల్ మేనేజ్మెంట్ ముగుస్తుంది. బూత్‌స్థాయిలో బలమైన క్యాడర్ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో టీఆర్ఎస్ పార్టీ కి గట్టి పట్టుంది. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపైనే దృష్టి సారించిన నాయకులు అధికారంలోకి వచ్చాక జరిగిన రాజకీయ పునరేకీకరణలో భాగంగా టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలలో బలమైన ప్రజాప్రతినిధులు, నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు చాలామంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో పార్టీ బూత్ స్థాయిలో పటిష్టంగా మారింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో పాతుకుపోయి పేరుమోపిన నాయకులంతా టీఆర్ఎస్లో చేరడంతో ఇతర పార్టీలకు కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. చాలా ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవమున్న నాయకులు టీఆర్ఎస్లో ఉండడంతో వారంతా ఈ ఎన్నికల్లో ఓటర్ను పోలింగ్ కేంద్రానికి రప్పించడానికి కృషి చేస్తున్నారు. నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండటం, గత ప్రభుత్వాల హయాంలో కంటే ఎక్కువగా అభివృద్ధి, సంక్షేమ పధకాలను అమలు చేశాము కాబట్టి క్షేత్రస్థాయిలో ఓటర్ల మద్దతు తమకే ఉందని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. రాజకీయ అనుభవం ఉన్న వారితో.. కాంగ్రెస్, టీడీపీలు 2014 ఎన్నికల వరకు ఉప్పు, నిప్పులా ఉన్న మారిన పరిస్థితుల నేపథ్యంలో రెండు పార్టీలు ఒక్కటై కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో నిలుచున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలలో చాలాఏళ్లపాటు పనిచేసిన నాయకులు, పార్టీ మారినా రాజకీయంగా అనుభవమున్న వారితో పోల్ మేనేజ్మెంట్ చేయించే పనిలో కూటమి అభ్యర్థులు ఉన్నారు. పోల్ మేనేజ్మెంట్లో మొదటి నుంచి పట్టున్న టీడీపీ జతకట్టడంతో అధిష్టానం నుంచి ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కూటమి చర్యలు చేపట్టింది. మూడు దశాబ్దాలుగా వనపర్తి రాజకీయాల్లో ఉంటూ రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి మద్దతు కూడా చిన్నారెడ్డికి ఉండటంతో అది పోలింగ్‌లో ఉపయోగపడే అవకాశం ఉంది. ఇద్దరిదీ సుదీర్ఘ రాజకీయ అనుభవం వనపర్తి నియోజవర్గం బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి జిల్లెల చిన్నారెడ్డి 8వ సారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. 9వ సారి బరిలో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడంతో ఓటర్లను ఆకర్శించడం, పోలింగ్ కేంద్రం వరకు తీసుకురావడంలో ఆయన దిట్ట. ఆయనకు తోడుగా ఎన్నికల సమయంలో అనుచరులు అధిక సంఖ్యలో రంగంలోకి దిగుతారు. టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 2001 నుంచి కేసీఆర్ వెంట ఉద్యమంలో పాల్గొన్న అనుభవం, నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా పని చేయడంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకున్నాడు. 2001కి ముందు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఖాదీబోర్డు చైర్మన్‌గా పనిచేశారు. మొత్తానికి నిరంజన్‌రెడ్డికి మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉండడంతో ఆయన కూడా ఓటర్ల నాడిని పసిగట్టడంలో ముందుంటాడు. -
పథకాలు ఓట్లు రాల్చేనా? లబ్ధిదారులు ఎటువైపో?
సాక్షి, వనపర్తి: పోలింగ్ సమయం సమీపిస్తున్నా కొద్దీ అభ్యర్థులు తమకు ఓటర్ల బలమెంతో బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంతకుముందు అమలుచేసిన ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులు, పొందనివారు ఎవరికి ఓటు వేస్తారోనని లెక్కలు వేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఎల్ఎఫ్, ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. వనపర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి , కాంగ్రెస్ అభ్యర్థి జిల్లెల చిన్నారెడ్డి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రచారానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండటంతో వారు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ఓట్లు రాబట్టే పనిలో ఉన్నారు. నిరంజన్‌రెడ్డి నాలుగేళ్ల కాలంలో టీఆర్ఎస్ అమలుచేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే వీటితో పాటు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. చిన్నారెడ్డి మాత్రం తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, మంత్రిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంతకన్నా మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇదే సమయంలో నాలుగేళ్లుగా వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందినవారు ఈ ఎన్నికల్లో ఎటు నిలుస్తారనే అంతటా చర్చ సాగుతోంది. ఆసరా ఓట్లు రాల్చేనా? ఈ ఎన్నికల్లో ఆసరా పింఛన్లు అందుకున్న లబ్ధిదారుల ఓట్లు కీలకం కానున్నాయి. ఎందుకంటే 2014 కంటే కాంగ్రెస్ పాలనలో రూ.200 వృద్ధులు, వితంతువులు, రూ.500 వికలాంగులకు అందించేవారు. 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చినట్లుగానే నియోజకవర్గంలోని 15,483 మంది వృద్ధులు, వితంతువులు 14,145 మంది, చేనేత కార్మికులు 219, గీత కార్మికులు 219 మంది, బీడీ కార్మికులు 143మంది, ఒంటరి మహిళలు 1496 మందికి ప్రతినెలా రూ.వెయ్యి చొప్పున అందించారు. అలాగే 6,343 మంది వికలాంగులకు ప్రతినెలా రూ.1,500 అందించారు. ఆసరా పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులు ఒక వైపే మొగ్గు చూపే అవకాశం ఉందనే భయంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తాము అధికారంలోకి వస్తే రెట్టింపు చేస్తామని ప్రకటిస్తున్నాయి. ఆసరా లబ్ధిదారులు ఎవరి వైపు మెగ్గు చూపుతారనేది ఫలితాల అనంతరం తేలనుంది. రైతే లక్ష్యంగా.. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్న జిల్లాలో రైతులు ఎవరివైపు నిలుస్తారన్నది తెలియాల్సిందే. ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో రైతుబంధు పథకం ద్వారా ఇప్పటికే రెండుసార్లు ఎకరానికి రూ.4వేల చొప్పున అందించింది. వనపర్తి నియోజకవర్గంలోని 79,374 మంది రైతులకు రూ.70.98కోట్లు అందించారు. అలాగే రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే పదిరోజుల్లో బాధిత కుటుంబానికి సహాయం చేకూరే విధంగా రైతుబీమా పథకం ద్వారా 71,281 మందికి బీమా సౌకర్యం కల్పించారు. మరోసారి అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తామని ఇప్పటికే టీఆర్ఎస్ ప్రకటించగా, కాంగ్రెస్ కూడా దాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. రైతులు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతుగా నిలుస్తారో వేచి చూడాలి. రెండు సామాజిక వర్గాల ఓట్లే కీలకం నియోజకవర్గంలో గొల్ల, కురుమ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లతోపాటు తెలుగు సామాజిక వర్గానికి చెందిన వారు అధికంగా ఉన్నారు. వీరిలో గొల్ల, కురుమల కోసం ప్రభుత్వం 2017నుంచి గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో 5,817 మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. తెలుగు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధికశాతం మందికి చేపల వృత్తి ప్రధానం కావునా మూడు పర్యాయాలుగా 123 చెరువుల్లో 99,18,730 చేప పిల్లలను ఉచితంగా వదిలారు. ఈ రెండు సామాజిక వర్గాల వారు ఏవైపు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ సామాజికవర్గాల ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. పేదబిడ్డలకు పెళ్లిళ్లకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలని, అనవసరమైన ఆపరేషన్లను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2017 జూన్ 3 నుంచి కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా 2,972 మంది లబ్ధిపొందారు. గతంలో ఆడపిల్ల పెళ్లిచేస్తే కుటుంబాలపై ఆర్థికభారం పడేది. నాలుగేళ్లుగా క ళ్యాణలక్ష్మి పథకంలో 4,081 మందికి రూ. 25 కోట్లు, షాదీముబారక్ పేరుతో 371 మందికి రూ. 2.71కోట్లు ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఖర్చుచేశారు. ప్రస్తుతం రూ.1.16లక్షలు అందిస్తున్నారు. గతం లో ఎన్నడూ లేని విధంగా కూతుళ్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి ఓట్లు వేస్తారా లేక మరింత కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా? అన్నది వేచిచూడాల్సిన విషయం. -
ప్రశ్నిస్తే తిడతారా?
ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రోడ్ షో ఉత్సాహంగా సాగింది. సీఎం కేసీఆర్ ఇటీవల తమపై చేసిన విమర్శలకు దీటుగా కాంగ్రెస్ నేతలు స్పందించారు. అభివృద్ధిని ప్రశ్నిస్తే బూతులు తిడతారా? అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శలు సంధించారు. సాక్షి, వనపర్తి : ఖర్చుచేసిన నిధులు, చేపట్టిన అభివృద్ధి గురిం చి ప్రశ్నిస్తే కేసీఆర్, అతని కుటుంబ సభ్యులు తిట్ల దండకం అందుకుంటున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎం స్థాయి వ్యక్తి తూ నీ బతుకు చెడా అని అంటుంటే, ఆయన కుమారుడు కేటీఆర్ తెలంగాణ ఇచ్చి న సోనియాగాంధీని అమ్మా నా బొమ్మ అని అంటుం టే చూస్తూ ఉపేక్షిద్దామా? అని కార్యకర్తలను కోరారు. బుధవారం దేవరకద్ర అసెం బ్లీ నియోజకవర్గం కొత్తకోట నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారపర్వాన్ని ప్రారంభించారు. పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, మాజీ మంత్రి డీకే అరుణతో కలిసి కొత్తకోట నుంచి ఆత్మకూర్ మీదుగా అమరచింత, మక్తల్, నారా యణపేటల్లో రోడ్డు షోలు, సభ లు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో మొదటి ఏడాది రూ.1.05కోట్లు, రెండో ఏడాది రూ.1.50 కోట్లు, మూడో ఏడాది రూ.1.75కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, దీనికితోడు మరో రూ.లక్ష కోట్ల అప్పు ప్రజల నెత్తినమోపారని ధ్వజమెత్తారు. ఇంత ఖర్చుచేసినా తెలంగాణలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని, ఈ సంపద ఎటు పోయిందో లెక్కలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తే తప్పించుకు తిరుగుతూ బూతులు తిడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకుల కళ్లను అభివృద్ధి కనిపించడం లేదని సీఎం కేసీఆర్ అంటున్నారని, నాగార్జునసాగర్, శ్రీశైలం, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను నీవు కడితే తమ కళ్లకు కనిపించడం లేదా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటంటే ఖాళీగా ఉన్న పైపులు, నీళ్లు తోడని పంపులు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. హామీలు అమలుచేస్తాం నాడు పాదయాత్ర సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని, ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే నిలబెట్టుకున్నామని గుర్తుచేశారు. ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా, నిరుద్యోగులకు రూ.3వేల భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేస్తారని ఓట్లు వేస్తే రూ.800 కోట్ల కాంట్రాక్టులు తీసుకుని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కాంట్రాక్టర్ అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు. అక్కడ దోచుకున్న డబ్బుతో ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు వస్తారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి దొరల ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రజల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రూ.కోట్లు కూటబెట్టుకున్నారు: విజయశాంతి టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో శూన్యమని, ప్రజలను దోచుకోవడంలో మిన్న అని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి విమర్శించారు. రాష్ట్రా న్ని అప్పులకుప్పగా మార్చారని, రూ.30వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, సొమ్ము ఆ నలుగురి వద్దే ఉందని ఆరోపించారు. బడుగు బలహీనవర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ప్రజలను దోచి సీఎం కేసీఆర్ రూ.వేల కోట్లు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. దోచుకున్న డబ్బుతో ఓట్లను కొనడానికి వస్తారని, వారు ఇచ్చింది తీసుకుని కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ను నమ్మి ఒకసారి ఓటు వేస్తే ప్రజలను బకరా చేశారని, ఈ సారి కేసీఆర్‌ను బకరా చేయాలని సూచించారు. కేంద్రంలో బీ జేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ కుమ్మకయ్యాయ ని, అం దువల్లే తెలంగాణలో 20 లక్షల ఓట్లు గల్లంతైనా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం వచ్చాయా? దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా? కార్యకర్తలను ఆమె అడిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచారని విమర్శించారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామనడం సిగ్గుచేటు: డీకే మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా కరువు కాటకాలు, వలసలతో అల్లాడిపోతుంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. 2014కు ముందే 95 శాతం పనులు పూర్తిచేశామని, నాలుగేళ్ల పాలనలో కొన్నింటిని పూర్తిచేసి తామే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవాచేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ వట్టెం సభలో ప్రాజెక్టుల వద్దే కుర్చి వేసుకుని కూర్చుని పనులు చేయిస్తా నని అన్నారని, ఎందుకు పూర్తికాలేదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నా రని అనడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, మరోసారి అతని మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. మక్తల్ నియోజకవర్గాన్ని అన్నివిధాలు గా విస్మరించిన చిట్టెం రాంమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలని డీకే కోరారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి : డోకూరు దేవరకద్ర నియోజకవర్గంలో అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని పార్టీ సమన్వయ కర్త డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లాలో నాలుగు రిజర్వాయర్లు ఉన్నా సాగునీరు అందడం లేదని రూ.200 –300కోట్లు ఖర్చుచేసి పనులు చేపడితే వేల ఎకరాల భూములు సాగులోకి వచ్చే అవకాశం ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పాలన చేతకాక రద్దుచేశారు: జీఎంఆర్ నేడు పాలమూరు, కందనూలులో రోడ్‌షో స్టేషన్ మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ చేప ట్టిన రెండో ప్రచారం ఎన్నికల ప్రచారం గు రువారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలో సాగనుంది. ఈ మేరకు గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ రోడ్‌షో ఉదయం 11 గంటలకు పాలమూరు యూనివర్సిటీ నుంచి వన్‌టౌన్, అశోక్‌టాకీస్ చౌరస్తా మీదుగా క్లాక్‌టవర్ వరకు సాగుతుందని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత క్లాక్‌టవర్‌లో బహిరంగ సభ ఏర్పాటుచేశామన్నారు. ఈ సభలో స్టార్ కాంపెయినర్ విజయశాంతి, ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి డీకే.అరుణ, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం క్లాక్‌టవర్ నుంచి ఏనుగొండ వరకు రోడ్‌షో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రోడ్డు షో గురువారం సాగుతుందని ఆ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి మరో ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5గంటలకు ప్రారంభమ య్యే ఈ ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క హాజరుకానున్నారపని పేర్కొన్నారు. సాయంత్రం తిమ్మాజిపేట, బిజినపల్లి మండలాల మీదుగా నాగర్‌కర్నూల్‌కు రోడ్డు షో చేరుకుంటుందని తెలిపారు. పట్టణ ప్రధాన చౌరస్తాలో ప్రసంగించిన అనంతరం నాయకులు కొల్లాపూర్ వెళ్లనున్నారని వివరించారు. హెలీప్యాడ్ వద్ద ఉద్రిక్తత సాక్షి, వనపర్తి: పోలీసులు సరైన భద్రతాచర్యలు తీసుకోకపోవడంతో కాంగ్రెస్ నాయకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తకోటలో జరిగిన రోడ్ షోలో పాల్గొనేందుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెయినర్, సినీనటి విజయశాంతి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో బుధవారం మధ్యాహ్నం కొత్తకోట చేరుకున్నారు. అప్పటికే సిద్ధంచేసిన హెలిప్యాడ్ చుట్టూ సుమారు 2వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు చేరు కున్నారు. హెలిక్యాప్టర్ ఆగడంతోనే వారంతా దూసుకొచ్చారు. రక్షణ కంచె పూర్తిగా విరిగిపోయింది. ఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సినీనటి వస్తున్నా రని తెలిసినా హెలిప్యాడ్ వద్ద ఇద్దరు ఎస్ఐలు, 18 మంది కానిస్టేబుళ్లను మాత్రమే నియమించారు. హెలిక్యాప్టర్ దిగకముందే ప్రజలను దూ రంగా ఉంచాల్సిన పోలీసులు పట్టించుకోకపోవడం, రక్షణ కంచె పటిష్టంగా లేకపోవడం, బందోబస్తు తక్కువగా ఉండటంతో జనం దూసుకొచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు వారిని వాహనంలోకి ఎక్కించారు. అధికార పార్టీ నాయకులకు రాచమర్యాదలు చేసే పోలీసు లు తమను చిన్నచూపు చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మహిళల నిరసన బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ చేయాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ మహిళా సంఘాల బాధ్యులు నారాయణపేటలో నిరసన తెలిపారు. మూడు రోజుల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు నారాయణపేటలో బుధవారం రాత్రి రోడ్డు షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ కోచైర్మన్ డీకే అరుణ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. వారు ప్లకార్డులు ప్రదర్శించగా.. పోలీసులు సర్దిచెప్పి వెనక్కి పంపించారు. -
కాంగ్రెస్‌కు మంచిరోజులు : ఎమ్మెల్యే చిన్నారెడ్డి
వనపర్తి అర్బన్ : కాంగ్రెస్‌కు మంచిరోజులు వస్తున్నాయని ఎమ్మెల్యే చిన్నారెడ్డి తెలిపారు. మండలంలోని కాశీంనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కందిరీగ తండాలో ఆదివారం పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ గ్రామ కమిటీలతో పాటు మహిళా విభాగం, యువజన విభాగం కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంజనగిరి తండా, మేఘ్యతండా, కందిరీత తండా, ఎద్దుల గేరీ, నాగమ్మతండా, కాశీంనగర్, ఎర్రగట్టుతండాల్లో కమిటీలు వేశారు. కార్యక్రమంలో రమేష్‌నాయక్, లాలునాయక్, మన్యంనాయక్, శివసేనారెడ్డి, ధనలక్ష్మీ, సహదేవ్, తిరుపతయ్య, కిరణ్, సత్యంసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
మొరాయిస్తున్నాయి..!
‘‘ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. అందులో భాగంగానే రేషన్ దుకాణాల్లో ఈ పాస్ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ, అందులో నెలకొంటున్న సాంకేతిక సమస్యలను సత్వరం పరిష్కరించకపోవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.’’ జడ్చర్ల : ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబందించి ఈ–పాస్ విధానాన్ని అమలులోకి తేగా సాంకేతిక సమస్యలతోఅటు డీలర్లు ఇటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివైస్‌లకు సంబందించి గ్రామీణప్రాంతాలలో పూర్తి స్థాయిలో నెట్ రాకపోవడంతో పంపిణీలో ఆలస్యం చోటు చేసుకుం టుంది. దీనికి తోడు ఇటీవల డివైస్‌లలో సాఫ్ట్‌వేర్‌ను ఆకస్మికంగా మార్పు చేయడంతో ఈనెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ నిలిచిపోయింది. ఏమైంది అన్న విషయం అర్థం గాక మొదటి రోజు అటు అధికారులు ఇటు డీలర్లు తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. తీరా వయాసిస్ కంపెనీ తమ సాఫ్ట్వేర్ మార్పు చేసి ఆధార్ అనుసంధానంగా సర్వర్‌తో లింక్ చేసే కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి అమలు చేస్తుందని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్తోనే.. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ పూర్తి చేసే విధంగా అధికారులు విధివిధానాలను రూపొందించారు. 15వ తేదీ తర్వాత బియ్యం పంపిణీ ఉండదు. ఆ సమయంలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసే విధంగా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఆకస్మికంగా 1వ తేదీనుంచి అంటే బియ్యం పంపిణీ ప్రారంభంరోజు నుంచే సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేయడంతో సమస్య నెలకొందని అటు అధికారులు ఇటు రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ సమస్యలు ఈ–పాస్ విధానంలో తరచు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేక పోవడంతో సమస్య నెలకొంటుందని అంటున్నారు. తమకు ఎయిర్టెట్, ఐడియా సిమ్‌లు జారీ చేశారని అయితే కొన్ని ప్రాంతాల్లో ఆయా సిమ్‌లు పనిచేయడం లేదన్నారు. ఒక వేళ పనిచేసినా నెట్ సిగ్నల్ సరిగ్గా లేక నెట్ నెమ్మదిగా ఉంటుందని.. దీంతో పొద్దస్తమానం సమయం వెచ్చించే పరిస్థితి ఉంద న్నారు. 4జీ నెట్ అందించే జియో సిమ్‌లను సరఫరా చేస్తే బాగుంటుందని వారు పేర్కొంటున్నారు. నెట్ స్పీడ్‌గా వస్తే పని కూడా సులువు అవుతుందని, బియ్యం పంపిణీని త్వరగా పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నా మని కొందరు డీలర్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేగాక మిషన్లలో సాంకేతిక సమస్య తలెత్తితే సదరు మిషన్‌ను తీసుకుని సంబందిత తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని టెక్నిషియన్ కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంటుందన్నారు. దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు ఇటీవల డివైస్(మిషన్)లలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఓ టెక్నీషియన్‌ను తమ కార్యాలయంలో అందుబాటులో ఉంచి సమస్యను సరిచేయిస్తున్నాం. దాదాపుగా సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి బియ్యం పంపిణీకి చర్యలు తీసుకున్నాం. – లక్ష్మీనారాయణ, తహసీల్దార్, జడ్చర్ల -
ప్రజల పక్షాన మాట్లాడటం నేరమా?
వనపర్తి టౌన్: పాలనలో లోపాలను ఎత్తి చూపడం దేశం, రాష్ట్రంలో నేరంగా మారిందని పౌరహక్కుల నేత జి.హరగోపాల్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడం పాలకుల దృష్టిలో నేరంగా మారిందని ఆక్షేపించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం పాలమూరు అధ్యయన వేదిక నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దోపిడీదారులకు అనుకూలంగా పాలన సాగుతోందని, రైతులు అప్పులు తీర్చలేక పోతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రాణాలు విడిచిన 3 లక్షల మంది రైతులు ప్రభుత్వంపై తిరగబడి ఉంటే పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 19న హైదరాబాద్‌లో నీటి వాటాపై సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ నగరి బాబయ్య మాట్లాడుతూ.. గౌరీ లంకేష్ ప్రశ్నించేతత్వం, వాస్తవాలు రాసినందుకే రాజ్యం హత్య చేసిందని ఆరోపించారు. -
వనపర్తి వద్దు.. పాలమూరే ముద్దు
ఆత్మకూర్ : మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఆత్మకూర్, చిన్నచింతకుంట, అమరచింత మండలాలను విడగొట్టి వనపర్తిలో కలిపితే ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యేలు దయాకర్‌రెడ్డి, సీతమ్మ, టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మకూర్ జూనియర్ కళాశాల ఆవరణలో సర్పంచ్ గంగాధర్‌గౌడ్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో కలపకముందే ఇక్కడ ఉన్న నీటిని ఎక్కడెక్కడికో తరలించుకుపోయి అక్కడి చెరువులు, కుంటలు సైతం నింపుకొంటున్నారని విమర్శించారు. అన్ని అర్హతలున్న ఆత్మకూర్‌ను డివిజన్, నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలన్నారు.