మహబూబ్‌నగర్‌లో కారు స్పీడు తగ్గింది.. | TRS Party Struggled With Perfect Majority In Municipal Elections | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌లో కారు స్పీడు తగ్గింది..

Published Sun, Jan 26 2020 8:14 AM | Last Updated on Sun, Jan 26 2020 8:14 AM

TRS Party Struggled With Perfect Majority In Municipal Elections  - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: వరుస ఎన్నికల్లో గెలుపుతో ఫుల్‌ జోష్‌లో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీకి పుర ఫలితాలు కాస్త చేదు అనుభవాన్ని మిగిల్చాయనే చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లాలోని 17మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరవేస్తామనే ధీమాతో ఉన్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పుర ఫలితాలతో సంతృప్తిగా లేరని గులాబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో కేవలం ఎనిమిదింటిలోనే ఆ పార్టీ సంపూర్ణ మెజారీటీ సాధించింది. మిగిలిన స్థానాల్లో ఇతర పారీ్టలు, అభ్యర్థుల మద్దతు తీసుకుని పుర పీఠాల కోసం ప్రయతి్నస్తోంది. 

శనివారం ఉదయం 8గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 11గంటలకే పది వార్డులు కలిగిన ‘పుర’ ఫలితాలు వెలువడ్డాయి. 40 వార్డుల లోపు ఉన్న వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్‌ ఫలితాలు సాయంత్రం 4 గంటలకు వచ్చాయి. కాగా 49 వార్డులున్న మహబూబ్‌నగర్‌ పుర ఫలితాలు రాత్రి 9 గంటలకు వెలువడ్డాయి. మహబూబ్‌నగర్‌ పట్టణంలో టీఆర్‌ఎస్‌ 30, కాంగ్రెస్‌ 5, బీజేపీ 5, ఎంఐఎం 3, ఇతరులు ఆరింటిలో విజయం సాధించారు. వనపర్తిలో 33 వార్డులకు 21 వార్డులతో టీఆర్‌ఎస్‌ స్పష్టమైన మెజారిటీ సాధించి.. పుర పీఠాన్ని కైవసం చేసుకుంది. కొత్తకోటలో 15 వార్డులకు పది వార్డులు, ఆత్మకూరులో పది వార్డులకు ఆరు, నాగర్‌కర్నూల్‌లో 24 వార్డులకు 14, గద్వాలలో 37 వార్డులకు 19, అలంపూర్‌లో పది వార్డులకు ఏడు స్ధానాలతో గెలుపొందింది.

కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 22వార్డులుండగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పది స్థానాల నుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఏడు స్థానాల్లో, నాలుగు చోట్ల స్వతంత్రులుగా పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ రెబల్స్, ఒక చోట బీజేపీ అభ్యర్ధి గెలిచాడు. దీంతో ఫలితాలు వెలువడ్డ గంటన్నర లోపే పట్టణానికి చేరుకున్న ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రెబెల్స్‌కు గులాబీ కండువా కప్పారు. దీంతో పుర పీఠం కైవసం చేసుకునేలా ఆ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. శనివారం సాయంత్రమే టీఆర్‌ఎస్‌ చైర్మన్‌ అభ్యర్ధి ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో అభ్యర్థులు క్యాంపునకు తరలివెళ్లారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో పది వార్డులున్నాయి. వీటిలో టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు నాలుగు చొప్పున, కాంగ్రెస్‌ అభ్యర్థులు రెండు స్థానాలు గెలుచుకున్నారు. దీంతో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్‌ కౌన్సిలర్లను బీజేపీ క్యాంపునకు తరలించింది. పది వార్డులు ఉన్న అమరచింత మున్సిపాలిటీలోనూ ఏ పారీ్టకి మెజారిటీ రాలేదు. అక్కడ టీఆర్‌ఎస్‌ 3, సీపీఎం 2, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇండిపెండెంట్, సీపీఐల నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు.

స్వతంత్ర అభ్యరి్థగా గెలుపొందిన రాజŒ కుమార్‌కు గులాబీ కండువా కప్పిన ఆ పారీ్ట..  ఆరో వార్డు నుంచి గెలిచిన మాధవి, పదో వార్డు నుంచి గెలుపొందిన గోపి సీపీఎం అభ్యర్థులతో మంతనాలు ప్రారంభించారు. రంగంలో దిగిన అమరచింత మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రాజేందర్‌సింగ్‌ సీపీఎం అభ్యర్థులిద్దరినీ మక్తల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి వారితో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీపీఎం అభ్యర్థుల్లో ఒకరికి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. 

కేటీఆర్‌ కోర్టులో కొల్లాపూర్‌ బంతి.. 
నరాలు తెగే ఉత్కంఠ నడుమ వెల్లడైన కొల్లాపూర్‌ పుర ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వర్గపోరు ఆది నుండే ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తన వర్గీయులకు టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్లు ఇప్పించుకోవడంలో విఫలమైన జూపల్లి వారిని ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి బరిలో దింపారు. దీంతో జూపల్లి వర్గాన్ని ఓడించేందుకు అధికార టీఆర్‌ఎస్‌ సైతం శక్తివంచనా లేకుండా ప్రచా రం నిర్వహించింది. హోరాహోరీగా కొనసాగిన పోరులో జూపల్లి వర్గీయులు పదలకొండు స్థానాల్లో స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు   తొమ్మిది స్థానాల్లో గెలుపొందారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎక్స్‌అఫీయో ఓట్లతో గట్టెక్కాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ  క్రమంలో   టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  గెలిచిన   తొమ్మిది  మందిని   తీసుకుని   క్యాంపునకు    తరలించాలని సూచించడంతో.. వారికి క్యాంప్‌నకు  తీసుకెళ్లారు.  మున్సిపల్‌ ఎన్నికల   ఫలితాల తర్వాత   టీఆర్‌ఎస్‌  తన   వర్గీయులకు గాలం వేస్తుందని   భావించిన జూపల్లి ఫలితాలకు ఒక రోజు  ముందే  క్యాంపునకు  తరలించడం విశేషం.  

‘పేట’లో గట్టెక్కిన గులాబీ..
నారాయణపేట మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పారీ్టకి బీజేపీ ముచ్చెమటలు పట్టిచ్చింది. 24 వార్డులు ఉన్న పట్టణంలో టీఆర్‌ఎస్‌ పది స్థానాలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌ 2, బీజేపీ 9, ఎంఐఎం 1, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఇద్దరు స్వతంత్రులను కలుపుకుని పుర పీఠంపై పాగా వేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తొమ్మిదో వార్డు నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్ధి మహేశ్‌ను టీఆర్‌ఎస్‌లో చేరి్పంచుకున్నారు. 23వ వార్డు నుంచి గెలిచిన ఎంఐఎం అభ్యర్థి తఖీచాంద్‌ మద్దతు కూడగట్టుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌కు 12 సంఖ్యాబలం వచ్చింది. దీంతో ఎమ్మెల్యే తన ఎక్స్‌అఫీíÙయో ఓటును వేసి పేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయడం దాదాపు ఖరారైంది.

అయిజ మున్సిపాలిటీలో మారుతోన్న రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. 20 వార్డులు ఉన్న ఆ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ ఆరు స్థానాల్లో, కాంగ్రెస్‌ నాలుగు స్థానాల్లో గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ రెబెల్స్‌ పది మంది గెలుపొందారు. దీంతో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కర్నూలులో తన వద్దకు పిలిపించుకున్న అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం.. కాంగ్రెస్‌ అభ్యర్థుల మద్దతుతో పాటు ఎక్స్‌అఫీíÙయో కింద తన ఓటునూ వేసి మున్సిపాలిటీపై పాగా వేసేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.

49స్థానాలతో సరి..
లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో పుంజుకున్న బీజేపీ 338 వార్డులకు కేవలం 49 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో మక్తల్, నారాయణపేట, భూత్పూర్, ఆత్మకూరు, అమరచింత, గద్వాల, మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్న ఆ పార్టీ 5 స్థానాలతోనే సరిపెట్టుకుంది. 16 వార్డులు కలిగిన మక్తల్‌ మున్సిపాలిటీలో 8 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ రెండు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థుల సహకారంతో పురపీఠాన్ని కైవసం చేసుకోనుంది. ఇటు నారాయణపేటలోనూ బీజేపీకి ఆఖరి నిమిషంలో పుర పీఠం చేజారింది.

అక్కడ 24 వార్డులుంటే టీఆర్‌ఎస్‌ పది, బీజేపీ 9 వార్డులు దక్కాయి. ఇద్దరు స్వతంత్రులు, మరో ఇద్దరు కాంగ్రెస్, ఒక ఎంఐఎం సభ్యులతో పుర పీఠం కైవసానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వలేదు. చివరి క్షణంలో రంగంలో దిగిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎక్స్‌ అఫీషియో కింద తన ఓటు హక్కును వినియోగించుకుని ఎంఐఎం, ఇండిపెండెంట్‌ అభ్యర్థుల మద్దతుతో పీఠం దక్కించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

మక్తల్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వేర్వేరుగా క్యాంపునకు తరలివెళ్లారు. అక్కడ 16 వార్డులు ఉంటే.. టీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 8స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్‌ రెండు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఒకరు గెలిచారు. దీంతో అవసరమైతే టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్, ఇండిపెండెంట్ల సహకారంతో పాటు ఎమ్మెల్యే ఎక్స్‌అఫిఫియో ఓటుతో గట్టెక్కే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో గెలిచిన తమ అభ్యర్థులకు గాలం వేయకుండా ఇరుపారీ్టలు ముందస్తు జాగ్రత్తగా క్యాంపు బాటపట్టాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement