ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తథ్యం | RTC Will Merge In Government Says By Manda Krishna Madiga | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తథ్యం

Published Thu, Nov 14 2019 8:24 AM | Last Updated on Thu, Nov 14 2019 10:33 AM

RTC Will Merge In Government Says By Manda Krishna Madiga - Sakshi

మాట్లాడుతున్న మందకృష్ణ, స్థానిక నాయకులు

సాక్షి, వనపర్తి టౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కంటే సీఎం కేసీఆర్‌ తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు, ప్రజాఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపేందుకు బుధవారం వనపర్తికి వచ్చిన ఆయన మాట్లా డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఏనాడూ ప్రభుత్వ అత్యున్నత అధికారి, మరో ముగ్గురు ఐఏఎస్‌లను హైకోర్టు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసిందంటే  అన్యాయం ప్రభుత్వం వైపు ఉందని తెలుస్తోందన్నారు. తెలంగాణ ఇస్తే చాలా రాష్ట్రాల డిమాండ్‌లు వస్తాయని కేంద్రం అంటే.. ఉన్న తెలంగాణ ఇవ్వాలని అడిగినం.

అలాగే ఆర్టీసీ విలీనం చేస్తే 91 కార్పొరేషన్‌ల డిమాండ్‌ చేస్తాయని చెబుతున్న సీఎం కేసీఆర్‌.. పూర్వం ప్రభుత్వంలో ఉన్న ఆర్టీసీనే విలీనం చేయమని కోరుతున్నామని తెలుసుకోవాలని హితవు పలికారు. హైకోర్టులో తీర్పు రాకముందే సుప్రీం కోర్టు వెళ్తామని చెప్పడం కార్మికుల అంతిమ విజయానికి నిదర్శనమన్నారు.  ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ సంగతి చూస్తాం... అంతు తేలుస్తాం అంటారే తప్పితే చేసిందేమీ లేదని, న్యాయస్థానంలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు బోనులో దోషిగా నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీ కార్మికులదని అన్నారు. ఆర్టీసీ కార్మికులు  కేసీఆర్‌కు శాపనార్థాలు పెట్టవద్దని, దేవుడా కేసీఆర్‌ ఆరోగ్యం బాగుండాలని ప్రతి కార్మికుడు కోరుకోవాలని అన్నారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంకావడం తథ్యమని అన్నారు. యుద్ధంలో శత్రువు బతికి ఉన్నప్పుడే గెలవాలని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులు కేసీఆర్‌ జాగీరుకాదని, ఏవడబ్బ సొమ్మని అమ్ముకుంటావు అంటూ నిప్పులు చెరిగారు. కార్మికులు విధుల్లో చేరకపోతే 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం చూస్తే కేసీఆర్‌ ముందే కుట్రపన్నాడని తెలుస్తోందన్నా రు. హైకోర్టులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వానికి అక్షింతలు తప్పడంలేదని, ఒక దశలో ఇదేమి రాజరికంకాదని వ్యా ఖ్యానించిందంటే ప్రభుత్వంపై రాజ్యాంగ సంస్థ ఎంతమేర అసహనంతో ఉందో ఇట్టే అర్థమైతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ఆర్‌.గోపిగౌడ్, జేవీ స్వామి, ఖయ్యాం, విశ్వనాథ్, యాదయ్య, డీబీకే రెడ్డి, వీవీమూర్తి, చలపతిరెడ్డి, బాలస్వామి ఉన్నారు.  

40వ రోజుకు చేరిన సమ్మె  
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 40వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు సుప్రీం కోర్టు రిటైర్డ్‌ న్యా్యమూర్తులతో కమిటీ వేస్తామంటే విముఖత చూపడం ప్రభుత్వ దివాళాకోరు తానికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, బీసీ సంఘం నేత యుగంధర్‌గౌడ్, బీజేపీ కృష్ణ, పరశురాం, వెంకటేశ్వర్‌రెడ్డి. ఎమ్మార్పీఎస్‌ గద్వాల కృష్ణ, కోళ్ల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement