rtc srtike
-
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తథ్యం
సాక్షి, వనపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కంటే సీఎం కేసీఆర్ తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, ప్రజాఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపేందుకు బుధవారం వనపర్తికి వచ్చిన ఆయన మాట్లా డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఏనాడూ ప్రభుత్వ అత్యున్నత అధికారి, మరో ముగ్గురు ఐఏఎస్‌లను హైకోర్టు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేసిందంటే అన్యాయం ప్రభుత్వం వైపు ఉందని తెలుస్తోందన్నారు. తెలంగాణ ఇస్తే చాలా రాష్ట్రాల డిమాండ్లు వస్తాయని కేంద్రం అంటే.. ఉన్న తెలంగాణ ఇవ్వాలని అడిగినం. అలాగే ఆర్టీసీ విలీనం చేస్తే 91 కార్పొరేషన్ల డిమాండ్ చేస్తాయని చెబుతున్న సీఎం కేసీఆర్.. పూర్వం ప్రభుత్వంలో ఉన్న ఆర్టీసీనే విలీనం చేయమని కోరుతున్నామని తెలుసుకోవాలని హితవు పలికారు. హైకోర్టులో తీర్పు రాకముందే సుప్రీం కోర్టు వెళ్తామని చెప్పడం కార్మికుల అంతిమ విజయానికి నిదర్శనమన్నారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ సంగతి చూస్తాం... అంతు తేలుస్తాం అంటారే తప్పితే చేసిందేమీ లేదని, న్యాయస్థానంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు బోనులో దోషిగా నిలబెట్టిన చరిత్ర ఆర్టీసీ కార్మికులదని అన్నారు. ఆర్టీసీ కార్మికులు కేసీఆర్‌కు శాపనార్థాలు పెట్టవద్దని, దేవుడా కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని ప్రతి కార్మికుడు కోరుకోవాలని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంకావడం తథ్యమని అన్నారు. యుద్ధంలో శత్రువు బతికి ఉన్నప్పుడే గెలవాలని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులు కేసీఆర్ జాగీరుకాదని, ఏవడబ్బ సొమ్మని అమ్ముకుంటావు అంటూ నిప్పులు చెరిగారు. కార్మికులు విధుల్లో చేరకపోతే 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం చూస్తే కేసీఆర్ ముందే కుట్రపన్నాడని తెలుస్తోందన్నా రు. హైకోర్టులో విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వానికి అక్షింతలు తప్పడంలేదని, ఒక దశలో ఇదేమి రాజరికంకాదని వ్యా ఖ్యానించిందంటే ప్రభుత్వంపై రాజ్యాంగ సంస్థ ఎంతమేర అసహనంతో ఉందో ఇట్టే అర్థమైతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ఆర్.గోపిగౌడ్, జేవీ స్వామి, ఖయ్యాం, విశ్వనాథ్, యాదయ్య, డీబీకే రెడ్డి, వీవీమూర్తి, చలపతిరెడ్డి, బాలస్వామి ఉన్నారు. 40వ రోజుకు చేరిన సమ్మె ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 40వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యా్యమూర్తులతో కమిటీ వేస్తామంటే విముఖత చూపడం ప్రభుత్వ దివాళాకోరు తానికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, బీసీ సంఘం నేత యుగంధర్‌గౌడ్, బీజేపీ కృష్ణ, పరశురాం, వెంకటేశ్వర్‌రెడ్డి. ఎమ్మార్పీఎస్ గద్వాల కృష్ణ, కోళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఆర్టీసీ భవిష్యత్తు ఏమిటి?
-
తేల్చే వరకు తెగించి కొట్లాడుడే..
సాక్షి, మంకమ్మతోట(కరీంనగర్)/హుజూరాబాద్ : సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె క్రమంగా ఉధృతమవుతోంది. కార్మికులకు ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు పెరుగుతోంది. ఆర్టీసీ సమ్మె గురువారం ఆరో రోజుకు చేరుకుంది. దసరా పండుగ వరకు వేచి చూసిన కార్మికులు పోరాటాలను క్రమంగా ఉధృతం చేస్తున్నారు. జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు కరీంనగర్ బస్టాండ్ నుంచి తెలంగాణచౌక్ మీదుగా బస్టాండ్వరకు అఖిప పక్షం నాయకులు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల మద్దతుతో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ చౌరస్తాలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడి నిరసన తెలుపారు. కార్మికులు బస్టాండ్ ఆవరణలోని డిపోల వద్ద ఆందోళన చేశారు. హుజూరాబాద్‌లో ఆర్టీసి డిపో నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్డీవో చెన్నయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, ప్రభుత్వ ఇచ్చే రాయితీలు చెల్లించాలని, అన్ని రకాల ట్యాక్స్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఖండించారు. దసరా పండుగ జరుపుకుని తిరుగి వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ రద్దీగా కనిపించింది. కార్మికులెవరూ విదులకు హాజరు కాలేదు. అ«ధికారులు ఆర్టీసీతోపాటు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలించే ఏర్పాటు చేశారు. బస్సుల్లో అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపించారు. హుజూరాబాద్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న ఆర్టీసీ కార్మికులు వెనుకడుగు వేయం.. ప్రభుత్వం దిగివచ్చి కార్మికులతో చర్చలు జరిపేంతవరకు సమ్మె విషయంలో వెనుకగుడు వేసేది లేదని, ఆర్టీసీ కార్మికులకు తాము అండగా ఉంటామని అఖిల పక్ష నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీని విలీనం చేసి కార్మికులకు బంగారు భవిష్యత్తు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ సాధించుకుంటే మన రాష్ట్రంలో మన నీళ్లు, మన నిధులతో బంగారు తెలంగాణ చేసుకుందామని చెప్పి పండుగ పూట కార్మికుల కుటుంబాలను పస్తులుంచిన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల జీతభత్యాల సవరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన అన్ని బెన్ఫిట్స్ ప్రభుత్వం కల్పించాలని, కార్మికులు సంతోషంగా ఉంటేనే ఏసంస్థ అయినా అభివృద్ధి పథంలో నడుస్తుందనే విషయాన్ని ప్రభుత్వ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. వెంటనే ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. సంఘీభావ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, నగర అధ్యక్షుతు బేతి మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ముకుందరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శులు కూన శోభారాణి, సృజన్‌కుమార్, ఏఐటీయుసీ నాయకుడు టేకుమల్ల సమ్మయ్య,టీడీపీ నగర అధ్యక్షుడు ఆగయ్య, జేఏసీ నాయకులు జక్కుల మల్లేశం, కె.సురేందర్‌రాజు, గుర్రాల రవీందర్, టీఆర్.రెడ్డి, ఎన్‌కె.రాజు, ఎంపీ.రెడ్డి, కాళిదాసు, ఆర్టీసీ జేఏసీ నాయకులు పీఎల్.రావు, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, రమేశ్, జె.రవీందర్, టీఎస్.సింగ్, యాకుబ్‌పాషా, సమ్మిరెడ్డి, సర్దార్, అశోక్‌బాబు, రాజమణి, ఎస్ఎస్.రాణి, విజయలక్ష్మి, శ్రీదేవి, పద్మ, సారయ్య, ఎన్వీ రెడ్డి, యూసఫ్‌అలీ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్టీసీ 567 బస్సులు ఏర్పాటు.. సమ్మె జరుగుతున్నప్పటికీ తాత్కాళిక డ్రైవర్లు, కండక్టర్లతో గురువారం మొత్తం 642 బస్సులకుగాను 567 బస్సులు నడిపించినట్లు ఆర్ఎం జీవన్‌ప్రసాద్ తెలిపారు. 364 మంది తాత్కాలిక డ్రైవర్లు, 364 మంది కండక్టర్లతో బస్సులు నడిపిస్తున్నారు. 1.03 లక్షల కిలోమీటర్లు బస్సులు నడుపగా రూ.25 లక్షల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. -
ప్రభుత్వం అప్పుల్లో ఉంది.. మరి ప్రయివేట్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: అప్పుల్లో ఉన్న ఆర్టీసీనీ ప్రయివేటీకరణ చేస్తానని చెబుతున్న సీఎం కేసీఆర్.. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించగలరా అంటూ జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. దాదాపు 50 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, టీఎంయూ ఆర్టీసీ యూనియన్ అధ్యక్షుడు అశ్వద్దామరెడ్డి, ఆర్టీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కార్మికులు, తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీని బతికించడమే మా లక్ష్యం ఈ సందర్భంగా అశ్వద్దామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదని స్పష్టం చేశారు. ‘ఆర్టీసీ సమ్మెపై సీఎం చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. అయితే ఆర్టీసీని బతికించడమే మా లక్ష్యం. గత ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదు. కార్మికులు దాచుకున్న పీఎఫ్ డబ్బును ఎందుకు ఇవ్వడం లేదు?. ఆర్టీసీపై డిజీల్ భారం ఎక్కువైంది. 27 శాతం డిజీల్‌పై పన్ను వేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థపై నాలుగో వంతు ప్రజలు ఆధారపడి ఉన్నారు. ప్రజలు మా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు మాకు సహకరించాలి. అవసరమైతే తెలంగాణ బందుకు పిలుపునిద్దాం’అని అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు. కాగా, తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఐదో రోజుకు చేరింది. ప్రజల ప్రయాణ కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దసరా పండగ ముగించుకోని తిరిగి గమ్యస్థానాలకు వెళ్లాలనుకునేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా సమ్మెపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పోరాడటానికి ఏం చేయాలనే దానిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమావేశంతో అనంతరం గవర్నర్‌ను కలవాలని అఖిలపక్ష సభ్యులు భావిస్తున్నారు. -
సెల్ టవర్ ఎక్కి ఆర్టీసీ డ్రైవర్ నిరసన
సాక్షి, కడ్తాల్: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్‌లో వెంకటేష్ అనే ఆర్టీసీ డ్రైవర్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తమ డిమాండ్లు నెరవేరేవరకు సెల్ టవర్ దిగబోనని అతను భీష్మించుకొని కూర్చున్నాడు. దాదాపు గంటసేపు టవర్‌పైన ఉండి నిరసన తెలిపిన వెంకటేశ్‌ను పోలీసులు, స్థానికుల నచ్చజెప్పి కిందకు దించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు రెండో రోజు ఆదివారం కూడా సమ్మె కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మె విషయంలో ఇటు ప్రభుత్వం అటు కార్మిక సంఘాలు పట్టువిడవడం లేదు. సమ్మె ఎన్నిరోజులు కొనసాగినా కార్మికులతో చర్చలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేయగా.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని కార్మికులు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ముగిసినా కార్మికులంతా సమ్మె కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. -
ఆర్టీసీని మూసివేసేందుకు కుట్ర జరుగుతోంది..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయని ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు అశ్వత్ధామరెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..‘ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని సమ్మెలోకి నెట్టింది. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ చర్యల వల్లే సమ్మెకు వెళ్లేలా చేశాయి. విమానాలపై ఉన్న ప్రేమ ఆర్టీసీపై లేదా?. ఆర్టీసీని మూసివేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా యత్నిస్తోంది. ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. జీతభత్యాల గురించి మా పోరాటం కాదు. రవాణా వ్యవస్థను చిన్నాభిన్నం కాకుండా చూడటమే మా థ్యేయం. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. ఇది ఆరంభం మాత్రమే, పోరాటం ఇంకా కొనసాగుతోంది. ఇంత దుర్భరమైన పరిస్థితి ఆర్టీసీ ఎప్పుడూ రాలేదు. అన్ని పార్టీలు ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. ఆర్టీసీ ఇమేజ్ పోగొట్టాలని కేసీఆర్ కుట్ర పన్నారు. దసరా ముందు బలవంతంగా సమ్మెకు వెళ్లేలా చేసారు. రేపటి ఆర్టీసీ కార్మికుల ధర్నాకు అందరూ మద్ధతు తెలపాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. మంత్రుల కమిటీ వేసినా సమస్య పరిష్కారం కాలేదు. మంత్రి పువ్వాడ అజయ్ ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నారా?. గతంలోనే కేసీఆర్ వైఖరిని ఇదే పువ్వాడ అజయ్ తప్పుపట్టలేదా. మా సమస్యలు ఏనాడు ముఖ్యమంత్రి వద్ద పరిష్కారం కాలేదు. ఆర్టీసీతో నాకు సంబంధం లేదన్న మంత్రి...అర్థరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి ఉద్యోగులను తీసేస్తా అని ఎలా ప్రకటించారు. మీలా ముఖ్యమంత్రి తీసేస్తే పోయే ఉద్యోగం కాదు మాది’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
పట్టు‘దళం’గా..
కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల నిరసనలు ఉద్యమంలో ముందున్న మహిళా కార్మికులు కార్మిక శాఖ కార్యాలయాల ముట్టడి సంఘీభావం తెలిపిన కొత్తపల్లి సుబ్బారాయుడు నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నాలకు పిలుపు ఏలూరు (ఆర్ఆర్ పేట) :వేతన సవరణ, ఫిట్మెంట్, ఇతర డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఏడవ రోజుకు చేరింది. కార్మికులంతా పట్టుదలతో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా కార్మికులు సైతం రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఏలూ రులో నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు తదితరులు కలిసి సంఘీభావం తెలిపారు. కార్మిక లోకానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి మద్దతుగా బుధవారం జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద అఖిలపక్షంతో కలసి వైఎస్సార్ సీపీ శ్రేణులు ధర్నాలు నిర్వహిస్తాయని చెప్పారు. మంగళవారం ఉదయం కార్మికులు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకూ అర్ధనగ్న ప్రదర్శన జరిపి, మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక కార్మికుడు శీర్షాసనం వేసి వినూత్నంగా నిరసన తెలిపాడు. జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ ఎండీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం వంటావార్పు నిర్వహించారు. తణుకులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు కార్మికులను కలుసుకుని సంఘీభావం తెలిపారు. భీమవరంలో మహిళా కార్మికులు రిలే దీక్షలో పాల్గొన్నారు. కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళి ధర్నా నిర్వహించారు. నరసాపురంలోనూ కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కొవ్వూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరగంట పాటు ధర్నా నిర్వహించి డిపోనుండి బస్సులను బయటకు రానీయకుండా అడ్డగించారు. వైసీపీ సమన్వయకర్త తానేటి వనిత, నాయకులు పరిమి హరిచరణ్, ముదునూరి నాగరాజు, ఎస్సీ సెల్ కార్యదర్శి ముప్పిడి విజయరావు పాల్గొన్నారు. ఉద్యమాన్ని కొనసాగిస్తాం భీమవరం : విధులకు హాజరు కావాలంటూ హైకోర్టు ఆదేశించినా ఉద్యమాన్ని నిలిపివేసేది లేదని ఆర్టీసీ ఈయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ రావు, ప్రాంతీయ కార్యదర్శి అల్లం సత్యనారాయణలు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం దిగివచ్చే వరకు శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. -
ఆగిన ఆర్టీసీ బస్సులు
- అవస్థలు పడ్డ ప్రయాణికులు - శ్రీవారి భక్తులకు తప్పని ఇక్కట్లు - బోసిపోయిన బస్టాండ్లు - ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన కార్మికులు - సమ్మెతో 1.5 కోట్లు నష్టపోయిన ఆర్టీసీ తిరుపతి కల్చరల్: ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో జిల్లావ్యాప్తంగా బుధవారం బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వోద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు 43 ఫిట్మెంట్ కల్పించాలనే డిమాండ్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు మంగళవారం అర్ధరాత్రి నుంచి పిలుపునిచ్చాయి. జిల్లావ్యాప్తంగా 7,500 మంది కార్మికులు సమ్మె చేపట్టారు. దీంతో సుమారు 4 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రోజువారీ తిరుమలకు నడిచే 450 బస్సుల్లో కేవలం 43 సర్వీసులు మాత్రమే నడిచాయి. కొన్ని సర్వీసులు అలిపిరి-తిరుమల మధ్య నడిచాయి. తిరుమలకు వచ్చిన వేలాదిమంది భక్తులు తిరుగు ప్రయాణంలో ఇబ్బం దులు పడ్డారు. సమ్మె కారణంగా జిల్లాలో బుధవారం ఆర్టీసీ సుమారు 1.5 కోట్లు ఆదాయాన్ని నష్టపోయింది. ఆయా డిపోల్లో ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు, కార్మికులు ప్రభుత్వం, యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెడిసికొట్టిన అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు సమ్మెలో యథాతథంగా రవాణా సాగించాలని ఆర్టీసీ యాజ మాన్యం ప్రత్యామ్నాయ చర్యల ఆదేశాలు బెడిసికొట్టాయి. రోజుకు డ్రైవర్‌కు రూ.1000లు, కండక్టర్‌కు రూ.800లు ఇస్తామని అధికారులు ప్రకటించారు. హెవీ లెసైన్స్, టెన్త్ ఉత్తీర్ణత సాధించిన వారికి డ్రైవర్, కండక్టర్లు ఉద్యోగులు కల్పిస్తామని ఇచ్చిన ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది నిరుద్యోగులు ఆయా ఆర్టీసీ డిపోలకు పరుగులు తీశారు. సుమారు 200 మంది నిరుద్యోగులు సర్టిఫికెట్లతో తిరుపతి ఆర్టీసీ డిపోకు చేరుకున్నారు. అధికారులు చర్యలను పసిగట్టిన కార్మికులు ఇంటర్వ్యూలను అడ్డుకున్నారు. దీంతో కార్మికులు, నిరుద్యోగల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పిలిచి అవమానించిన అధికారుల తీరును ఎండగడుతూ ధర్నా చేపట్టారు. పోలీసుల రంగప్రవేశంతో ప్రశాంతత నెలకొంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం కార్మికులు సమ్మె బాట పట్టడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నామని ఆర్టీసీ ఆర్ఎం మహేశ్వర తెలిపారు. జిల్లాలో 180 అద్దె బస్సుల్లో 60 బస్సులను నడిపి ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించామన్నారు. గురువారం నుంచి సర్వీసులను నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
సమ్మెట దెబ్బ
- నిలిచిపోయిన బస్సులతో ప్రయాణికుల పాట్లు - అధిక ధరలు దండుకున్న ప్రైవేట్ ఆపరేటర్లు - 120 సర్వీసులు నడిపిన ఆర్టీసీ అధికారులు - తాత్కాలిక ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ విజయవాడ : జిల్లాలో ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు ఆగిపోయాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు బుధవారం ఉదయం నుంచి సమ్మెబాట పట్టారు. వందల సంఖ్యలో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మరోవైపు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులు మాత్రం యథావిధిగా వెళ్లిపోయాయి. అధికార తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన టీఎన్టీయూసీ మినహా అన్ని సంఘాలు పాల్గొనడంతో మొదటి రోజు సమ్మె పూర్తిస్థాయిలో విజయవంతమైంది. టీఎన్టీయూసీ కార్మికులు విధులకు హాజరయ్యేందుకు యత్నించగా ఎంప్లాయీస్ యూనియన్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు సంఘాల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మరోవైపు సమ్మె ప్రభావం ఆర్టీసీ ఆదాయంపై కూడా పడింది. బుధవారం ఒక్కరోజే రూ.1.42 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 10 నెలలుగా విన్నపాలు... తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు గత పది నెలలుగా అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించాయి. ప్రధానంగా 2013 ఏప్రిల్ నుంచి పేస్కేల్ వేతన సవరణ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా తమకు 43 శాతం ఫిట్మెంట్, అంతకుముందు రావాల్సిన 19 శాతం ఫిట్మెంట్ కలిపి ప్రకటించాలని, సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్న 60 రోజులను స్పెషల్ లీవ్‌గా పరిగణించాలని తదితర డిమాండ్లను ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి. దీనిపై మంత్రి శిద్దా రాఘవరావు, ఆర్టీసీ ఎండీతో ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం మాత్రం శూన్యం. ఈ క్రమంలో బుధవారం ఉదయం నాలుగు గంటల నుంచి సమ్మె మొదలుపెట్టారు. దీంతో జిల్లాలోని 14 డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముఖ్యంగా విజయవాడ బస్టాండ్‌లో బస్సులు పూర్తిస్థాయిలో డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలతో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నాగరాజు విజయవాడ జోన్‌లోని మూడు జిల్లాల్లో ఉన్న అద్దె బస్సుల్ని ప్రైవేట్ డ్రైవర్లతో నిర్వహించాలని ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జిల్లాలో 120 బస్సు సర్వీసులు రాకపోకలు సాగించాయి. దీంతో 8 లక్షల మేర ఆదాయం వచ్చింది. జిల్లాలోని దగ్గర ప్రాంతాలకు మాత్రమే బస్సుల రాకపోకలు సాగాయి. మరోవైపు సమ్మె నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ యూనియన్‌కు నేషనల్ మజ్దూర్ యూనియన్‌తో పాటు అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. బస్సుల్ని అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు... మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం మధ్యాహ్నం నుంచి రోజువారీ వేతనంపై డ్రైవర్లను, కండక్టర్లను నియమించింది. డ్రైవర్‌గా పనిచేయటానికి 170 మంది, కండక్టర్‌గా పనిచేయటానికి 300 మంది వరకు విజయవాడ బస్టాండ్‌లో దరఖాస్తులు అందజేశారు. ఈ క్రమంలో దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియను కార్మిక సంఘాలు అడ్డుకొని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దీంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఈ క్రమంలో 120 మంది డ్రైవర్లు, 120 మంది కండక్టర్లను రోజువారీ వేతనం కింద నియమించుకొని 120 సర్వీసుల్ని నడిపారు. రోజువారీ వేతనంపై నియమితులైన కార్మికులు డిపోల నుంచి బస్సులను తీస్తున్న క్రమంలోనూ ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బస్సుల్ని అడ్డుకొని నిరసన తెలిపాయి. దీంతో పోలీసుల పహారా నడుమ బస్సులను బయటికి తీసుకెళ్లారు. గురు, శుక్రవారాల్లో సగటున 500 బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. యథేచ్ఛగా ప్రైవేటు దోపిడీ... ఆర్టీసీ సమ్మెతో ప్రైవేట్ బస్సుల దోపిడీ యథేచ్ఛగా సాగింది. హైదరాబాద్‌కు టిక్కెట్ ధర కంటే సగటున రూ.100 నుంచి రూ.300 వరకు అధికంగా వసూలు చేశారు. విజయవాడ నుంచి 100 ప్రత్యేక సర్వీసుల్ని నడిపారు. బెంగళూరు, చైన్నైకి రూ.300 నుంచి రూ.500 వరకు అధికంగా వసూలు చేశారు. ఆర్టీసీ బస్సులు లేకపోవటంతో ప్రెవేట్ బస్సులు నూరుశాతం ఆక్యుపెన్సీతో రాకపోకలు సాగించాయి.