బెంగళూరు: కర్ణాటకలో పోలింగ్ వేళ.. ఉద్రిక్తకరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. బుధవారం పోలింగ్ కేంద్రం నుంచి తీసుకెళ్తున్న ఈవీఎంలను పగలగొట్టారు గ్రామస్థులు. విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో ఇది చోటుచేసుకోగా.. పోలీసు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
అడ్డొచ్చిన పోలీసులను చితకబాది ఈవీఎంలను లాక్కుని ధ్వంసం చేశారు గ్రామస్తులు. అంతటితో ఆగకుండా ఎన్నికల సిబ్బందిపైనా గ్రామస్తుల్లో కొందరు దాడికి తెగబడ్డారు. ఎన్నికల సిబ్బంది కారును పల్టీకొట్టించి మరీ ధ్వంసం చేశారు. వీవీఎం ప్యాట్ మిషన్లను నుజ్జు నుజ్జు చేసిన గ్రామస్తుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. బాలెట్ యూనిట్లను డ్యామేజ్ చేసిన వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఈవీఎంలను పగలకొట్టడంతో పాటు ఓ అధికారిపైనా దాడి చేసినందుకుగానూ.. 23 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కంట్రోల్, బాలెట్ యూనిట్‌తో పాటు మూడు వీవీప్యాట్‌లు ధ్వంసం చేశారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment