vijayapura police
-
కర్ణాటకలో బోరుబావిలో పడ్డ బాలుడు సురక్షితం
బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో బోరుబావిలో పడ్డ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు 20 గంటలపాటు సంయుక్త రెస్క్యూ ఆపరేషన్‌తో శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. గురువారం మధ్యాహ్నాం ఆ బాలుడ్ని బయటకు తీసుకొచ్చాయి. ముందుజాగ్రత్తగా చిన్నారిని ఆస్పత్రికి తరలించాయి. విజయపుర జిల్లా లచయానా గ్రామంలో.. సతీష్ ముజగొండ అనే వ్యక్తి తన పొలంలో బోరు బావిని తవ్వించాడు. బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు అతని ఏడాదిన్నర వయసున్న కొడుకు సాత్విక్. దాదాపుగా 16 అడుగుల లోతున ఆ చిన్నారి పడినట్లు గుర్తించి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు అధికారులు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు గంటల తరబడి శ్రమించాయి. బాలుడు మరింత లోపలికి జారిపోకుండా చూసుకుంటూనే.. పైపుల ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తూ వచ్చాయి. అదే సమయంలో గ్రామస్తులంతా సాత్విక్ క్షేమంగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు స్థానికులు చేశారు. చివరకు.. అందరి ప్రార్థనలు ఫలించి బాలుడు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మరో రెండు గంటలు అదనం.. బుధవారం సాయంత్రం 6గం.30 ని. ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. తొలుత అధికారులు ఒక కెమెరాను చిన్నారి ఇరుక్కుపోయిన స్పాట్‌కు పంపించి చిన్నారి కదలికల్ని పరిశీలించారు. వాస్తవానికి 18 గంట్లోలపే సహాయక బృందాలు చిన్నారిని చేరుకున్నాయి. కానీ, రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో తవ్వి బయటకు తీయడానికి మరో రెండు గంటల టైం పట్టింది. #WATCH | Karnataka: After 20 hours of rescue operation, NDRF and SDRF teams have succeeded in rescuing a 1.5-year-old child who fell into an open borewell in the Lachyan village of Indi taluk of the Vijayapura district. (Source: SDRF) https://t.co/0zWcT99XI5 pic.twitter.com/pZ8IJP8i8s — ANI (@ANI) April 4, 2024 -
కర్ణాటక ఎన్నికలో రచ్చ రచ్చ...
-
కర్ణాటక: ఈవీఎంలను పగలకొట్టి.. కారును పల్టీకొట్టించి..
బెంగళూరు: కర్ణాటకలో పోలింగ్ వేళ.. ఉద్రిక్తకరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. బుధవారం పోలింగ్ కేంద్రం నుంచి తీసుకెళ్తున్న ఈవీఎంలను పగలగొట్టారు గ్రామస్థులు. విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో ఇది చోటుచేసుకోగా.. పోలీసు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అడ్డొచ్చిన పోలీసులను చితకబాది ఈవీఎంలను లాక్కుని ధ్వంసం చేశారు గ్రామస్తులు. అంతటితో ఆగకుండా ఎన్నికల సిబ్బందిపైనా గ్రామస్తుల్లో కొందరు దాడికి తెగబడ్డారు. ఎన్నికల సిబ్బంది కారును పల్టీకొట్టించి మరీ ధ్వంసం చేశారు. వీవీఎం ప్యాట్ మిషన్లను నుజ్జు నుజ్జు చేసిన గ్రామస్తుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. బాలెట్ యూనిట్లను డ్యామేజ్ చేసిన వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఈవీఎంలను పగలకొట్టడంతో పాటు ఓ అధికారిపైనా దాడి చేసినందుకుగానూ.. 23 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కంట్రోల్, బాలెట్ యూనిట్‌తో పాటు మూడు వీవీప్యాట్లు ధ్వంసం చేశారని తెలిపింది. -
పెళ్లికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి..
సాక్షి, యశవంతపుర: లారీ, ట్రాక్టర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన దావణగెరె తాలూకా రామగొండనహళ్లి వద్ద బుధవారం రాత్రి జరిగింది. కారులో ప్రయాణిస్తున్న బిల్లహళ్లి మంజునాథ్(24), పాండోమట్టి అమృత్ (23)లు మృతులు. కారులో దావణగెరెలో పెళ్లికి వెళ్లి తిరిగి చెన్నగిరి తాలూకా పాండోమట్టికి వెళ్తున్నారు. ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ను, తరువాత లారీని కారు ఢీకొంది. కారు పూర్తిగా నుజ్జునుజ్జుయింది. ఇద్దరు చనిపోగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మాయకొండ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. త్వరలో పెళ్లి కావలసిన యువకులు మృతి చెందటంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. క్యాంటర్ ప్రమాదం.. ఒకరి మృతి విజయపుర జిల్లా ఇండి పట్టణంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన క్యాంటర్ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పి సర్కిల్‌ను ఢీకొంది. డ్రైవర్‌కు బలమైన గాయాలయ్యాయి. డ్రైవర్ పక్కన కూర్చున్న మలకు మానె (36) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. (చదవండి: సిగ్నల్ వద్ద బ్రేక్ బదులు ఎక్స్‌లేటర్ తొక్కడంతో..ఇద్దరు మృతి) -
మంత్రి సోదరి ఇంట్లో దొంగల బీభత్సం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం వేకువజామున రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఎంబీ.పాటిల్ సహోదరి కల్పనాపాటిల్ ఇంటిలోకి ప్రవేశించిన 15 మంది దుండగులు నలుగురిని తాళ్లతో బంధించి 300 గ్రాముల బంగారు నగలు, రూ.8 లక్షల విలువైన వజ్రం, రూ.15 లక్షల నగదు దోచుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. విజయపుర శాంతినికేతన కాలనీలో కల్పనాపాటిల్ నివాసముంటున్నారు. గురువారం వేకువజామున 2 గంటల సమయంలో ఇంట్లో వారంతా గాఢనిద్రలో ఉండగా దుండగులు తలుపు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించారు. మారణాయుధాలతో బెదిరించి ఇంట్లో ఉన్న కల్పనాపాటిల్, మరో ముగ్గురిని తాళ్లతో బంధించారు. కేకలు వేయకుండా నోటిలో దుస్తులు కుక్కారు. అనంతరం బీరువాలో ఉన్న బంగారు నగలు, వజ్రం, నగదును దోచుకుని ఉడాయించారు. కొద్దిసేపటి అనంతరం బాధితులు కట్టు విడిపించుకొని విజయపుర పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించి దొంగల కోసం గాలింపు చేపట్టారు.