కర్ణాటకలో బోరుబావిలో పడ్డ బాలుడు సురక్షితం | Kanataka: NDRF SDRF Teams Rescued 2 Years Old Boy Who Stucked In Borewell In Vijayapura - Sakshi
Sakshi News home page

20 గంటల రెస్క్యూ ఆపరేషన్‌.. కర్ణాటకలో బోరుబావిలో పడ్డ బాలుడు సురక్షితం

Published Thu, Apr 4 2024 2:28 PM | Last Updated on Thu, Apr 4 2024 5:30 PM

Kanataka: NDRF SDRF Teams Rescued Boy From Borewell - Sakshi

బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో బోరుబావిలో పడ్డ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు 20 గంటలపాటు సంయుక్త రెస్క్యూ ఆపరేషన్‌తో శ్రమించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. గురువారం మధ్యాహ్నాం ఆ బాలుడ్ని బయటకు తీసుకొచ్చాయి. ముందుజాగ్రత్తగా చిన్నారిని ఆస్పత్రికి తరలించాయి.   

విజయపుర జిల్లా లచయానా గ్రామంలో.. సతీష్‌ ముజగొండ అనే వ్యక్తి తన పొలంలో బోరు బావిని తవ్వించాడు.  బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు అతని ఏడాదిన్నర వయసున్న కొడుకు సాత్విక్. దాదాపుగా 16 అడుగుల లోతున  ఆ చిన్నారి పడినట్లు గుర్తించి రెస్క్యూ ఆపరేషన్‌ మొదలుపెట్టారు అధికారులు. 

రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌లు గంటల తరబడి శ్రమించాయి. బాలుడు మరింత లోపలికి జారిపోకుండా చూసుకుంటూనే.. పైపుల ద్వారా ఆక్సిజన్‌ను అందిస్తూ వచ్చాయి. అదే సమయంలో గ్రామస్తులంతా సాత్విక్ క్షేమంగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు స్థానికులు చేశారు. చివరకు.. అందరి ప్రార్థనలు ఫలించి బాలుడు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. 

మరో రెండు గంటలు అదనం..
బుధవారం సాయంత్రం 6గం.30 ని. ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభమైంది. తొలుత అధికారులు ఒక కెమెరాను చిన్నారి ఇరుక్కుపోయిన స్పాట్‌కు పంపించి చిన్నారి కదలికల్ని పరిశీలించారు. వాస్తవానికి 18 గంట్లోలపే సహాయక బృందాలు చిన్నారిని చేరుకున్నాయి. కానీ, రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోవడంతో తవ్వి బయటకు తీయడానికి మరో రెండు గంటల టైం పట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement