Villagers attack
-
పులిపై దాడి చేసి చంపిన గ్రామస్తులు
రాయ్‌చూర్: ఆ పులి గ్రామంలో నలుగురిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో గ్రామస్తులకు పులిపై ఎక్కడలేని కోపం వచ్చింది. ఇంకేముంది వందలాది మంది గ్రామస్తులు కర్రలు,రాళ్లతో పులిపై దాడి చేసి చంపేశారు. ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన రాయ్‌చూర్ జిల్లాలోని దేవదుర్గ ఫారెస్ట్ రేంజ్లో జరిగింది. పులిని చంపిన ఘటనపై కర్ణాటక అటవీ శాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అయితే ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి ట్రాప్‌లో చిక్కుకున్న పులిని కాపాడారు. -
కర్ణాటక: ఈవీఎంలను పగలకొట్టి.. కారును పల్టీకొట్టించి..
బెంగళూరు: కర్ణాటకలో పోలింగ్ వేళ.. ఉద్రిక్తకరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. బుధవారం పోలింగ్ కేంద్రం నుంచి తీసుకెళ్తున్న ఈవీఎంలను పగలగొట్టారు గ్రామస్థులు. విజయపుర జిల్లా మసబినళ గ్రామంలో ఇది చోటుచేసుకోగా.. పోలీసు బలగాల మోహరింపుతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అడ్డొచ్చిన పోలీసులను చితకబాది ఈవీఎంలను లాక్కుని ధ్వంసం చేశారు గ్రామస్తులు. అంతటితో ఆగకుండా ఎన్నికల సిబ్బందిపైనా గ్రామస్తుల్లో కొందరు దాడికి తెగబడ్డారు. ఎన్నికల సిబ్బంది కారును పల్టీకొట్టించి మరీ ధ్వంసం చేశారు. వీవీఎం ప్యాట్ మిషన్లను నుజ్జు నుజ్జు చేసిన గ్రామస్తుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. బాలెట్ యూనిట్లను డ్యామేజ్ చేసిన వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఈవీఎంలను పగలకొట్టడంతో పాటు ఓ అధికారిపైనా దాడి చేసినందుకుగానూ.. 23 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. కంట్రోల్, బాలెట్ యూనిట్‌తో పాటు మూడు వీవీప్యాట్లు ధ్వంసం చేశారని తెలిపింది. -
Viral Video: ఎమ్మెల్యేపై గ్రామస్థుల దాడి.. తరిమి తరిమి కొట్టిన జనం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఓ ఎమ్మెల్యేను గ్రామస్థులు చితకొట్టారు. తరిమి తరిమి అతనిపై దాడి చేశారు. ఈ ఘటన చిక్కమగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. అసలేం జరిగిందంటే.. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి చెందింది. దీంతో తమ ప్రాంతంలో తరుచూ ఏనుగు బారిన పడి ప్రజలు చనిపోతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ మృతదేహంతో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కుమారస్వామి ఆదివారం సాయంత్రం అక్కడకు వెళ్లారు. అయితే మృతదేహంతో తాము ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే తీరిగ్గా సాయంత్రం వస్తారా అంటూ మ్మెల్యేపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా బదులివ్వడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన జనం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊరు నుంచి తరిమి తరిమి కొట్టారు. The villagers were outraged & gave gherao to #BJP MLA #MPKumaraswamy. They have been driven on the main road of the village. Some of the villagers who were very indignant also abused with unspoken sounds. #BJPMLA's were grabbed & dragged.#Karnataka #Chikkamagaluru pic.twitter.com/NyY2oOegeT — Hate Detector 🔍 (@HateDetectors) November 20, 2022 ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు అతికష్టం మీద ఎమ్మెల్యేను కాపాడి, తరలించారు. కాగా ఏనుగు దాడిలో చనిపోయిన బాధిత కుటుంబ సభ్యలను పరామర్శించడానికి వెళ్తే గ్రామస్థులు తనపై దాడి చేశారని ఎమ్మెల్యే కుమారస్వామి ఆరోపించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే చొక్కా కూడా చిరిగిపోయింది. Chikkamagaluru, Karnataka | Mudigere MLA from BJP, MP Kumaraswamy's clothes were allegedly torn by locals of Hullemane village when he visited them following the death of a woman in an elephant attack. The villagers alleged that the MLA didn't respond properly to elephant attacks pic.twitter.com/xIeCiSlBDX — ANI (@ANI) November 21, 2022 ఏనుగు దాడిలో మహిళ మృతి.. భర్త కళ్ల ముందే ఘోరం ఏనుగు దాడిలో మహిళ మృతి చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పశువులకు మేత కోయడానికి సతీశ్‌గౌడ, శోభ దంపతులు పొలానికి వెళ్లారు. ఒక్కసారిగా ఏనుగు ఇద్దరిపై దాడికి యత్నించగా పరుగులు తీశారు. శోభను ఏనుగు వెంబడించి ఆమెను తొక్కి చంపేసింది. కళ్ల ముందే భార్య చనిపోవడంతో భర్త తీవ్రంగా విలపించాడు. గతంలోను కెంజి గ్రామానికి చెందిన ఆనంద దేవాడిగను ఏనుగు ఇలాగే బలిగొంది, ఈ ఘటనతో గ్రామస్థులు భయందోళనకు గురవుతున్నారు. -
తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని కట్టేసి కొట్టారు!
కొమరాడ: అధిక వడ్డీలు ఇస్తానంటూ ఆశ చూపి గ్రామస్తుల నుంచి భారీగా అప్పులు చేసింది. ఆ సొమ్ముతో జల్సాలు చేసింది. చివరకు అప్పులు తీర్చలేనంటూ చేతులెత్తేయడంతో బాధితులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రచ్చబండ వద్ద తాడుతో కట్టేసి కొట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని సివిని గ్రామానికి చెందిన శోభ గత కొన్ని రోజులుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. అధికంగా వడ్డీలు ఇస్తానంటూ గ్రామస్తుల నుంచి సుమారుగా రూ.1.40 కోట్ల మేర అప్పుచేసింది. డబ్బు తిరిగివ్వాలంటూ వారంతా అడిగేసరికి చేతులెత్తేసింది. దీంతో ఏప్రిల్ 7న కొమరాడ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం కొంత మంది బాధిత మహిళలు, గ్రామస్తులు కలిసి ఆమెను రామమందిరం వద్ద ఉన్న రచ్చబండ స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఆమెను విడిపించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ ప్రయోగమూర్తి చెప్పారు. -
టీచర్ పాడు బుద్ధి.. విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపించి..
ధర్మారం(ధర్మపురి)జగిత్యాల జిల్లా: ఓ ఉపాధ్యాయుడే విద్యార్థినులకు సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపించిన ఘటన ధర్మారం మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. సదరు టీచర్ ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్‌డే సందర్భంగా విద్యార్థులకు సెల్ఫోన్లో సైన్స్ ప్రయోగాలు చూపించాడు. అయితే తమకు అశ్లీల చిత్రాలు చూపించాడని పేర్కొంటూ ఇద్దరు విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు తెలిపారు. అప్పటినుంచి పాఠశాలకు సెలవులు రావడంతో ఆ విషయాన్ని మర్చిపోయారు. అయితే సదరు ఉపాధ్యాయుడు గురువారం తొమ్మిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థినికి అశ్లీల చిత్రాలు చూపించాడు. చదవండి: ప్రేయసితో పెళ్లికి భార్య అంగీకరించలేదని.. దీంతో ఆమె ఇంటికెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కోపోద్రిక్తులైన వారు ఫోన్ చేసి, హెచ్ఎంకు ఫిర్యాదు చేశారు. తర్వాత గ్రామస్తులతో కలిసి పాఠశాలకు చేరుకొని, ఆ ఉపాధ్యాయుడిని గదిలో బంధించి, చితకబాదారు. టీచర్‌ను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయురాలు డీఈవోకు తెలిపారు. డీఈవో ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడి నిర్వాకంపై ఆమె జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై శ్రీనివాస్ రాత్రి గ్రామానికి వెళ్లి, విచారణ జరిపినట్లు సమాచారం. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
అటవీశాఖ అధికారులపై గ్రామస్తుల దాడి
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ అటవీ అధికారులపై దాడి జరిగింది. తప్పించుకునే క్రమంలో పరుగెడుతూ 8 నెలల గర్భిణీ అయిన ఎఫ్‌బీవో అస్వస్థతకు గురయ్యారు. కాగజ్‌నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం ఊట్పల్లిలో మంగళవారం కళాజాత నిర్వహించారు. వంట చెరుకును తీసుకోనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, గొడ్డళ్లు, సైకిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారని అధికారులను గ్రామస్తులు ఘెరావ్ చేశారు. దీంతో కళాజాత బృందం సభ్యులు అర్ధాంతరంగా కార్యక్రమాలను ఆపేసి వెళ్లిపోయారు. కోసిని ఎఫ్‌బీవో శిరీష, వాచ్మేన్లు దేవ్‌సింగ్, రాములు, శంకర్ తమ ద్విచక్ర వాహనాలపై బయల్దేరుతుండగా గ్రామస్తులు అడ్డుకొని కర్రలతో దాడికి దిగారు. శిరీష ఎడమ చేతికి గాయాలయ్యాయి. దాడి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న శిరీష భర్త బైక్‌పై ఆమెను పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అటునుంచి ఆమెను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. -
వృద్ధురాలిపై అత్యాచారం.. కొట్టి చంపిన గ్రామస్తులు
పుంగనూరు(చిత్తూరు జిల్లా): ఓ దళిత వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని రాళ్లతో, కట్టెలతో కొట్టి చంపిన ఘటన శుక్రవారం పుంగనూరు మండలం అప్పిగానిపల్లెలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అప్పిగానిపల్లెకు చెందిన వృద్ధురాలు సమీపంలోని వనమలదిన్నె గ్రామానికి వెళ్లి మినీ బ్యాంకులో నగదు డ్రా చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన గురుమూర్తి(47) ఆమెను అనుసరించి.. ఎవరూ లేని సమయంలో వనమలదిన్నె సమీపంలోని సబ్‌స్టేషన్ వెనుక పొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగదు, బంగారు కమ్మలు, చైను, ముక్కు పుడక లాక్కెళ్లాడు. బాధితురాలు స్పృహ కోల్పోయింది. కొన్ని గంటల తర్వాత తీవ్ర గాయాలతో గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులకు విషయం చెప్పింది. అనంతరం స్థానికులు ఆమెను పుంగనూరు ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలించారు. గ్రామ సమీపంలో తచ్చాడుతున్న నిందితుడు గురుమూర్తిని పట్టుకున్న గ్రామస్థులు మూకుమ్మడిగా రాళ్లు, కట్టెలతో కొట్టి చంపేశారు. డీఎస్పీ గంగయ్య, సీఐ గంగిరెడ్డి, ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గురుమూర్తికిది అలవాటే.. వనమలదిన్నెకు చెందిన గురుమూర్తి గతంలోనూ మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అతనిపై పుంగనూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. గురుమూర్తి ఒంటరి మహిళలపై దాడులు, అత్యాచారాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. కొన్నేళ్ల క్రితం అతని భార్య, పిల్లలు వదిలి వెళ్లిపోయారు. -
అర్ధరాత్రి ప్రియురాలి కోసం వెళ్తే..
సాక్షి, చెన్నై : అర్ధరాత్రి ప్రియురాలిని కలవడానికి వెళ్లిన యువకుడు, అతని స్నేహితుడిని ఊరి ప్రజలు కట్టేసి దాడిచేసిన ఘటన తంజావూర్ జిల్లా రక్తనాడు సమీపంలోని వడక్కి కోటలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు మిత్రులు నిలబడి మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ దారిన వచ్చిన వారు చూసి అనుమానంతో ఇద్దరిని దొంగలుగా భావించి చుట్టముట్టి తాడుతో కట్టి వేసి చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక ఇద్దరు స్పృహతప్పి పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి స్థానికుల నుంచి రక్షించి పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెళ్లారు. అనంతరం జరిపిన విచారణలో తంజావూరు జిల్లా ఒరత్తనాడు తాలూకా తెన్నమనాడు గ్రామానికి చెందిన ప్రవీణ్ (20). ఇతనికి ఒరత్తనాడు సమీపంలో ఉన్న వడికి కోట గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రియురాలిని చూడటానికి ప్రవీణ్ తన స్నేహితుడితో వడిక్కి కోట గ్రామానికి వచ్చాడు. ఈ సమాచారం ప్రియురాలికి తెలిపి ఆమె వచ్చే వరకు ఇంటి సమీపంలో ఇద్దరు ఎదురుచూస్తుండగా గ్రామస్తులు దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. చదవండి: చైనాతో యుద్ధానికి నేను సైతం.. రాష్ట్రపతికి రక్తంతో.. -
కొండచిలువను బంధించిన గ్రామస్తులు
తూర్పుగోదావరి, ఆత్రేయపురం (కొత్తపేట): అంకంపాలెం గ్రామ శివారు పాటి చెరువు వద్ద గురువారం కొండచిలువ కనిపించడంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. అయితే గ్రామస్తులు నేర్పుగా కొండచిలువను బంధించి అటవీ శాఖాధికారులకు అప్పగించారు.ప్రధానపంటకాలువ మూసివేయడంతో మత్స్య కారులు వేట సాగిస్తుంటే సుమారు 15 అడుగుల పొడవైన కొండచిలువ కాలువలో వారికి కనిపించింది. దీంతో మత్స్యకారులు కంగారు పడి పరుగులు తీశారు. గ్రామస్తులకు సమాచా రం అందడంతో పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. భయాందోళనతో వారు పొలంలో ఉన్న పశువులు, కోళ్లను గ్రామంలోకి తీసుకుపోయారు. ఈ విషయం మండలం అంతా వ్యాపించడంతో పంట కాలువ వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు.మత్స్యకారులు, ప్రజలు చేపలుపట్టే వలతో కొం డచిలువను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే కొండచిలువ మెల్లగా పంట కాలువ పైకి రావడంతో కోళ్లను పెట్టే బుట్టలో గ్రామస్తులు బంధించి అటవీ శాఖాధికారులకు తెలియజేశారు. అధికారులు గ్రామానికి చేరుకుని కొండచిలువను తీసుకువెళ్లారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. -
భర్తను భుజాలపై మోసేలా శిక్ష
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఇంటినుంచి పారిపోయిన ఓ వివాహితను తన భర్తను భుజాలపై మోస్తూ నడిచేలా అక్కడ గ్రామస్తులు శిక్ష విధించారు. ఆమె వస్త్రాలను లాగడం వంటి చర్యలతో ఘోరంగా అవమానిం చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో శనివారం రావడంతో పోలీసులు చర్యలు చేపట్టి ఇద్దరిని అరెస్టు చేశారు. ఝభువా జిల్లా దేవిగడ్‌కు చెందిన 27 ఏళ్ల వివాహిత తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి రెండు వారాల క్రితం గుజరాత్‌కు పారిపోయింది. అత్తింటివారు ఆమెను కనిపెట్టి స్వగ్రామానికి తీసుకొచ్చారు. భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోయినందుకు ఆమెను అవమానిం చారు. భర్తను భుజాలపై మోస్తూ నడవాల్సిందిగా శిక్ష విధించారు. ఎంతో కష్టంతో ఆమె నడుస్తుండగా ఆకతాయిలు ఆమె ముందు చేరి ఈలలు వేస్తూ, గోల చేశారు. ఇలాంటి ఘటనలు అమానవీయమని ఝభువా జిల్లా ఎస్పీ వినీత్ జైన్ అన్నారు. ఘటన సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న వారినందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాల్సిందిగా తాను ఇప్పటికే ఆదేశించానని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 12 మందిపై కేసు నమోదు చేశామనీ, ఇద్దరిని అరెస్టు చేశామని అదనపు ఎస్పీ విజయ్ వెల్లడించారు. -
నెల్లూరు జిల్లా రాపూర్‌లో పోలీసులపై దాడి
-
పోలీసులు X గొల్లలపేట గ్రామస్తులు
బొండపల్లి: మండల కేంద్రమైన బొండపల్లి మధుర గ్రామం గొల్లలపేటలో శనివారం రాత్రి జరిగిన సంఘటన చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన యువకుడిపై ఎస్సై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ గ్రామపెద్ద పీతల రాము ఆధ్వర్యంలో అనుచరులు ఆదివారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నీలాతి సత్యం శనివారం రాత్రి మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వస్తుండగా వాహన తనిఖీల్లో భాగంగా బొండపల్లి పోలీసులు ఆపారు. అయితే సత్యం వాహనం ఆపకుండా స్వగ్రామమైన గొల్లలపేట వెళ్లిపోయాడు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లు అతడ్ని అనుసరిస్తూ గ్రామానికి చేరుకోగా అక్కడ గ్రామపెద్ద పీతల రాము, అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సత్యంను పంపించేది లేదంటూ స్పష్టం చేయడంతో పాటు కానిస్టేబుళ్లను నిర్బంధించడంతో వారు ఎస్సై సుదర్శన్‌కు విషయం తెలియజేశారు. దీంతో ఎస్సై గ్రామానికి చేరుకోగా అతడ్ని కూడా నిర్బంధించారు. అనంతరం వదిలేయడంతో పోలీసులు వెళ్లిపోయి నిందితుడితో పాటు మరికొందరిపై విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. తెల్లారేసరికి మారిన సీన్ ఇదిలాఉంటే ఆదివారం ఉదయం గ్రామస్తులు స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఎస్సై చేయిచేసుకోవడం వల్ల సత్యం గాయపడ్డాడని ఆరోపించారు. అంతకుముందు బాధితుడ్ని గజపతినగరం సీహెచ్‌సీలో జాయిన్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఏ నాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు బాలాజీ, తదితరులు ఆస్పత్రికి వెళ్లి బాధితుడ్ని పరామర్శించారు. ఈ విషయమై ఎస్సై మాట్లాడుతూ, వాహన తనిఖీల్లో భాగంగా సత్యం వాహనాన్ని సిబ్బంది ఆపారని, అయితే అతను ఆపకుండా గ్రామానికి వెళ్లిపోయాడని విలేకరులకు తెలిపారు. గ్రామానికి వెళ్లిన తమను అడ్డగించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
ఊళ్లోకొచ్చి.. ఉసురు తీసుకుంది!
ఆలూరు: వందలాది మంది గ్రామస్తులు.. ఒకటే అరుపులు, కేకలు.. వారితో పాటు పోలీసులు, మీడియా ప్రతినిధులు.. కొందరు కంపచెట్ల వైపు పరుగులు తీస్తున్నారు.. మరికొందరు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోకి వెళ్లి తలుపులు మూసేసుకుంటున్నారు.. ఇంకొందరు ఇళ్లపైకి చేరుకుని ఆసక్తిగా గమనిస్తున్నారు.. అదిగో..అదిగదిగో అంటూ కిందున్న వారిని అప్రమత్తం చేస్తున్నారు.. ఇవీ సోమవారం ఆలూరు మండల కేంద్రంలో కన్పించిన దృశ్యాలు. గ్రామంలోకి ప్రవేశించిన ఓ ఎలుగుబంటిని బంధించేందుకు దాదాపు 600 మంది గ్రామస్తులు, పోలీసులు ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో దాన్ని తీవ్రంగా కొట్టడంతో కొన్ని గంటల తర్వాత మృతిచెందింది. ఉదయం ఆరు గంటల సమయంలో వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలకు ఆదోని–బళ్లారి రోడ్డు సమీపంలోని ఏడు మోరీల వద్దఎలుగుబంటి కన్పించింది. దీంతో వారు పనులు మానుకొని ఇళ్ల వైపు పరుగులు తీశారు. తర్వాత అది కర్నూలు–బళ్లారి రోడ్డు, సాయిబాబా కాలనీ, మండల పరిషత్, హౌసింగ్, ఎక్సైజ్ కార్యాలయాలు..తదితర ప్రాంతాల్లో జనానికి కన్పించింది. దీంతో భయభ్రాంతులకు గురై ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఈ సమాచారాన్ని కొందరు ఫోన్లో నేరుగా, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖాధికారులకు చేరవేశారు. అటవీ అధికారులు స్పందించలేదు. సీఐ ఎం.దస్తగిరిబాబు స్పందించి ఎస్ఐ గోపీనాథ్, సిబ్బందిని పంపారు. వారితో పాటు ఉపాధ్యాయనగర్, ఎన్జీఓ కాలనీ, కోయనగర్, డమ్మరువీధి, వడ్డేగేరి తదితర కాలనీలకు చెందిన దాదా పు 600 మంది గ్రామస్తులు ఎలుగును బం« దించేందుకు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రంగంలోకి దిగారు. సాధ్యం కా కపోవడంతో కోయనగర్‌కు చెందిన బుడగ జంగాల వారి నుంచి వలలు తెప్పించారు. ఎట్టకేలకు రాత్రి ఏడు గంటల సమయంలో ఎంపీడీఓ క్వార్టర్స్‌లోని శారదమ్మ ఇంట్లోకి చొరబడిన ఎలుగును బంధించారు. ఈ క్రమంలో ఎస్ఐ గోపీనాథ్, కమ్మరచేడు గ్రామ మాజీ సర్పంచ్ దేవేంద్ర, గ్రామస్తులు రాజు, రవి, ఈరన్న, మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. బంధించిన ఎలుగును అటవీ సిబ్బందికి అప్పగించగా..వారు దాన్ని ఆదోనికి తరలించారు. అక్కడ పశువైద్యుడి పర్యవేక్షణలో ఉంచగా..కొన్ని గంటల తర్వాత మృతిచెందింది. -
ఏకంగా 300 మొసళ్లను చంపేశారు
-
వదంతులు నమ్మవద్దు
నిజామాబాద్: సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులు నమ్మ వద్దని నిజామాబాద్ ఇంచార్జ్ సీపీ, కామారెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం చేంగల్‌లో ఓ గిరిజనుడిని దొంగగా భావించి గ్రామస్తులు దాడి చేయడంతో ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది నిందితులను గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం హత్యా నేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మాకు సమాచారమిస్తే మేము స్పందిస్తామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని చెప్పారు. సురక్షిత సమాజాన్ని నిర్మించేందుకు పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోందని వ్యాఖ్యానించారు. అవసరమైన అన్ని చోట్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘాను ఏర్పాటు చేశామని చెప్పారు. వదంతులను నమ్మకుండా ప్రజల్ని చైతన్యపరిచేందుకు కళాజాత ద్వారా వదంతులను తిప్పికొట్టేలా ప్రచారం చేస్తామని వివరించారు. జిల్లాలో అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలు మా దృష్టికొస్తున్నాయని చెప్పారు. -
దొంగలనుకొని గ్రామస్తుల దాడి
భీమ్‌గల్ (బాల్కొండ): గ్రామస్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ గిరిజనుడు మృతి చెందాడన్న వార్త నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న సమీపంలోని 12 తండాల గిరిజనులు చేంగల్ గ్రామంలోని పలు ఇళ్లపై దాడులకు దిగారు. అడ్డుకోబోయిన పోలీసులపై ఎదురుతిరిగారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు గ్రామస్తులు భయపడ్డారు. ఒకదశలో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. మంగళవారం దొంగలుగా భావించి గ్రామస్తులు జరిపిన దాడిలో నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం డీబీ తండాకు చెందిన మాలావత్ దేవ్యా (40), దేగావర్ లాలూ గాయపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దేవ్యా బుధవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గిరిజనులు చేంగల్‌కు చేరుకొని ఆందోళనకు దిగారు. అడిషనల్ డీసీపీ శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో సుమారు 10 మంది సీఐలు, 15 మంది ఎస్సైలతో సహా 100 మంది సిబ్బందిని రంగంలోకి దింపి పరిస్థితిని అదుపు చేసేందుకు విఫలయత్నం చేశారు. చివరకు నిజామాబాద్ ఆర్డీవో వినోద్‌కుమార్ రంగంలోకి దిగి గిరిజన పెద్దలతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి రూ.8.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇల్లు, ఐదెకరాల ప్రభుత్వ భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దాడికి పాల్పడిన 12 మంది నిందితులను అదుపులోకి తీసుకుని హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వీడియో ఫుటేజీ ఆధారంగా ఇంకా ఎంత మంది ఉన్నా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతో గిరిజనులు శాంతించి వెనుదిరిగారు. గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. -
వాట్సప్ లో పుకార్లు.. అమాయకుడి మృతి
సాక్షి, నిజామాబాద్ : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లు నిజామాబాద్ జిల్లాలోని పల్లెల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. జనాల్లో నెలకొన్న అనుమానాలు, భయాలు అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. భీమ్ గల్ మండలం చెంగల్లో ఇలాంటి అనుమానాలతోనే ఇద్దరు గిరిజనులను జనాలు తీవ్రంగా చితకబదారు. దాడిలో గాయపడ్డ ఒకరు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. చెంగల్ సమీపానికి ఉన్న తాండాలకు చెందిన దేవాగత్ లాలూ, అతని బావమరిది మాలావత్ దేవ్యా అనే గిరిజనులు మామిడి కాయల కోసం ఓ తోటలోకి వచ్చారు. సరిగ్గా అదే సమయానికి నీళ్లకోసం అటుగా వెళ్లిన పశువుల కాపరి వాళ్లను చూసి భయపడి తన తండ్రికి సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న గ్రామస్తులు ఇద్దరినీ కర్రలతో తీవ్రంగా చితకబాదారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ భవనం వద్ద బంధించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు దేగావత్ లాలూను ఆర్మూరు మహాత్మాగాంధీ ఆస్పత్రికి, మాల్యావత్ దేవ్యాను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. గ్రామస్తుల చేతిలో తీవ్రంగా గాయపడిన దేవ్యా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడిది దర్పల్లి మండలం ధనబండ తాండాగా పోలీసులు గుర్తించారు. ప్రజలు భయంతోనే వారిపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 12 మంది చెంగల్ గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం ముందస్తు జాగ్రత్తగా చెంగల్లో భారీ పోలీస్ బందోబస్తు చేర్పాటు చేశారు. అనంతరం పోలీసుల మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని, వాస్తవాలను గుర్తించాలని కోరారు. ఏదైనా అనుమానంగా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. -
చాకలపల్లిలో కలకలం
నవాబుపేట (జడ్చర్ల) : మండలంలోని చాకలపల్లిలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు కలకలం సృష్టించారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లతో గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేయడంతో.. పోలీసులు కల్పించుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు. వివరాలిలా.. మండలంలోని చాకలపల్లిలో సోమవారం నలుగురు వ్యక్తులు సారా కోసం వాకబు చేశారు. అయితే ఇటీవల చిన్నపిల్లలను ఎత్తుకెళ్లేందుకు కొందరు గ్రామాలకు వస్తున్నారని తెలుసుకుని గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేíశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు వెంటనే గ్రామానికి చేరుకుని అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. వీరు గతంలో చాకలపల్లిలో మేస్త్రీపని చేశారని అదే సమయంలో వారికి ఇక్కడ సారా అలవాటు కావడంతో సోమవారం సారా కోసం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీరిని మహబూబ్‌నగర్ మండలంలోని ఎదిర గ్రామస్తులుగా గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. గ్రామాలకు కొత్తగా అనుమానించే రీతిలో ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అకారణంగా వారిపై దాడులు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోరాదని హెచ్చరించారు. -
ఎద్దు మాంసం అమ్ముతున్నారని..
భోపాల్ : ఎద్దు మాంసం అమ్ముతున్నారనే నెపంతో ఇద్దరిని తీవ్రంగా కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాలోని అమ్‌ఘర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి బాదేరా పోలీసు స్టేషన్ పరిధిలో రియాజ్(45), షకీల్ (33)లు తమ ఊరికి తిరిగి వెళుతుండగా మార్గం మధ్యలో కొంతమంది గ్రామస్తులు వీరికి ఎదురయ్యారు. రియాజ్, షకీల్ వద్ద ఎద్దు మాంసం ఉన్నట్లు గుర్తించిన గ్రామస్తులు వారు మాంసం అమ్ముతున్నారన్న అనుమానంతో తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే రియాజ్ మృతి చెందాడు. తీవ్రగాయాలపాలై ప్రాణాలతో పోరాడుతున్న షకీల్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరిలించారు. సంఘటనా స్థలంలో ఒక ఎద్దు కళేబరంతో పాటు మూటకట్టి ఉంచిన మాంసాన్ని పోలీసులు గుర్తించారు. కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రక్తపు గాయాలతో ఆందోళన
గార/శ్రీకాకుళం సిటీ:జిల్లా పోలీస్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద గురువారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకూర్మం పంచాయతీ డొంకలపేట గ్రామానికి చెందిన 12 మంది తమకు న్యాయం చేయాలని రక్తమోడుతున్న గాయాలతో ఆందోళనకు దిగారు. ప్రత్యర్థి వర్గం దాడిలో గాయాలయ్యాయని తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న శ్రీకాకుళం డీఎస్పీ వి.బీమారావు ఆద్వర్యంలో సీఐలు ప్రసాదు, తిరుపతి, పోలీసులు డీపీఓ కార్యాలయానికి చే రుకుని వారిని రిమ్స్‌కు తరలించారు. తమపై దాడి వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని వీరు ఆరోపించారు. డొంకలపేటకు చెందిన పట్నాన చిన్నమ్మడు, వంజరాపు ధనలక్ష్మి, పట్నాన గంగులు, పట్నాన అప్పన్న, పట్నాన రాం బాబు, పి.సూర్యనారాయణ, కలగ అ ప్పారావుతో పాటు మరికొందరు బాధితులు ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదీ గొడవ.. శ్రీకూర్మం పంచాయతీ పరిధిలోని అటవీ భూముల్లో సుమారు 40 ఎకరాల జీడితోటను వనసంరక్షణ సమి తి పేరిట డొంకలపేట గ్రామానికి చెం దిన 113 మందికి అటవీ శాఖ 2004లో అప్పగించింది. ఏటా జీడితోటపై వచ్చే ఫలసాయాన్ని డొంకలపేటతో పాటు బొద్దవానిపేట, వనుమువానిపేట, నగరాలపేట, పట్నానపేట, తండ్యాలపేట గ్రామాలకు చెం దిన రైతులు పంచుకుంటున్నారు. అయితే తోటను కాంట్రాక్టర్‌కు అప్పగించడం, దీనిపై కొందరికి నమ్మకం లేకపోవడం వివాదానికి కారణ మైంది. డొంకలపేట గ్రామస్తులు రికా ర్డులు తమకు అప్పగించారని, ఇకపై తామే సాగు చేసుకుంటామని తీర్మానించారు. దీన్ని మిగిలిన ఐదు గ్రామాల రైతులు ఈ నిర్ణయానికి ఒప్పుకోకపోవడంతో కొన్నేళ్లుగా ఈ వివాదం నలుగుతోంది. మధ్యాహ్నం.. గురువారం తోటలోని ఫలసాయం తీ సేందుకు డొంకలపేట రైతులు వెళ్లా రు. మిగిలిన ఐదు గ్రామాల వారు తోటలోకి వెళ్లి వారికి అడ్డుకున్నారు. మధ్యాహ్నం 1 సమయంలో çబొద్దవానిపేట, వనుమువానిపేట, నగరా లపేట, పట్నానపేట, తండ్యాలపేట గ్రామాలకు చెందిన రైతులు కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారని డొంకలపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే హస్తంతోనే తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయమై స్థానిక సీఐ ప్రసాదు, ఎస్ఐ గణేష్, అటవీశాఖ అధికారి శాంతిస్వరూప్ల దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేయాలని కోరడం జరిగిందని పేర్కొన్నారు. మితిమీరిన రా జకీయ జోక్యం కారణంగానే గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. రద్దు చేయాలని లేఖ అయితే ఐదు గ్రామాల రైతుల వాదన మరోలా ఉంది. వన సంరక్షణ సమితి ఏర్పాటయ్యాక మిగిలిన గ్రామాలకు చెందిన 65 మందిని సమితిలో చేర్చుకునేందుకు తీర్మానం చేశారని వారు చెబుతున్నారు. గత ఏడాది నుంచే గొడవలు జరుగుతున్నాయని, దీనిపై సమితిని రద్దు చేయాలని కోరుతూ గార పోలీసులు అటవీ శాఖ అధికారులకు లేఖ రాశారని చెబుతున్నారు. రికార్డు సభ్యులే.. దీనిపై జిల్లా అటవీ శాఖ అధికారి సీహెచ్ శాంతిస్వరూప్ మాట్లాడుతూ వన సంరక్షణ సమితిలో రికార్డైన మెం బర్లే హక్కుదారులని, ఫలసాయంపై వారికే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. వీరి మధ్య గతంలోనే సమావేశాలను ఏర్పాట్లు జరిగినా సఫలం కాలేదని తెలిపారు. వీఎస్‌ఎస్‌ను రద్దు చేస్తే నిజమైన హక్కు దారులకు నష్టం జరుగుతుందని అన్నారు. బాధితులకు వైద్య సేవలు.. రక్తపు గాయాలతో ఆందోళన చేస్తున్న వారిని రిమ్స్‌కు తరలించామని డీఎస్పీ బీమారావు తెలిపారు. గ్రామానికి చెందిన వారితో మాట్లాడాలని ఎస్పీ ఆదేశించారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం అందిస్తున్నాం. -
ఎంపి నారాయణ , మంత్రి రవీంద్రలకు చేదు అనుభవం.
-
సర్పంచ్‌పై దాడి: ఆస్పత్రికి తరలింపు
పశ్చిమగోదావరి: పాతకక్షలతో సర్పంచ్ పై దాడి చేసిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం కోనాల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. కోనాల గ్రామసర్పంచ్ బూరుగుపల్లి ఆనంద రమేష్ ఇటీవలి కాలంలో పొలం తగాదాకు సంబంధించి ఒక వివాదాన్ని సద్దుమనచడానికి ప్రయత్నించారు. ఈ విషయంపై సర్పంచ్‌తో చర్చించేందుకు వచ్చిన కొందరు వ్యక్తులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామస్థుల దాడిలో ముగ్గురు మావోయిస్టుల మృతి
ఇన్ఫార్మర్ అనే ముద్ర వేసి మావోయిస్టులు ఓ గిరిజనుడిని హతమార్చారు. దాంతో ఆగ్రహించిన గ్రామస్థులు మావోయిస్టులపై ఎదురుదాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈ సంఘటన విశాఖ జిల్లా ఏజెన్సీ పరిధిలోని చింతపల్లి మండలం కోరుకొండలో జరిగింది. కొత్తగా పెళ్లయిన ఓ గిరిజన యువకుడిని ప్రజాకోర్టులో ఇన్ఫార్మర్ అని మావోయస్టులు ముద్ర వేశారు. అయితే అతడిని చంపొద్దని గ్రామస్థులు వేడుకున్నా, మావోయిస్టులు వినిపించుకోకుండా అతడిని చంపేశారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గిరిజనులు.. రాళ్లతో కొట్టి ముగ్గురు మావోయిస్టులను చంపేశారు. మృతుల్లో డీసీఎం స్థాయి నేత కూడా ఒకరున్నారు. ఏకే 47 సహా మరికొన్ని ఆయుధాలు సంఘటన స్థలంలో లభించాయి. ఇటీవలి కాలంలో ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో మావోయిస్టుల కదలికలు కొంత వరకు తగ్గుముఖం పట్టాయి. అందులోనూ, హుదూద్ తుఫానుతో ఈ ప్రాంతం అంతా అల్లకల్లోలంగా మారడంతో.. మావోయిస్టులు కూడా పెద్దగా ఎలాంటి కార్యకలాపాలు చేయట్లేదు. అయితే ఉన్నట్టుండి ఓ గిరిజనుడిని వాళ్లు హతమార్చడంతో.. గ్రామస్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గ్రామస్థులు ఇలా దాడి చేయడం, వారి దాడిలో మావోయిస్టులు మరణించడం లాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేవు. -
దొంగతనమే ప్రాణాలు తీసింది
దొంగతనానికి వచ్చిన వ్యక్తిని గ్రామస్తులు చితకబాదడంతో మృతి చెందిన సంఘటన కృష్ణాజిల్లా నూజివీడు మండలం అన్నవరంలో గురువారం తెల్లవారుజామునా చోటు చేసుకుంది. గత అర్థరాత్రి ఐదుగురు దొంగలు అన్నవరంలోని ఇళ్లలో చోరీకి యత్నించారు. ఆ విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమైయ్యారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఓ దొంగను గ్రామస్తులు పట్టుకుని... కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. దాంతో దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురు దొంగలు పరారైయ్యారు. ఆ ఘటనపై అన్నవరం గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వీరంగం సృష్టించిన దొంగకు దేహశుద్ధీ
కృష్ణాజిల్లా నూజీవిడు తాలుకా ముసునూరు మండలం చిన్నబోయినపల్లిలో గత అర్థరాత్రి దొంగ ఓ ఇంట్లోకి చొరబడి కత్తితో వీరంగం సృష్టించాడు. ఇంట్లోని భార్యాభర్తలపై దాడి చేశారు. ఆ క్రమంలో భర్త గాయపడగా, భార్య మెడలోని బంగారు గొలుసు తెంచేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆమె గట్టిగా అరిచింది. స్థానికులు వెంటనే అప్రమత్తమైయ్యారు. దొంగను పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్దీ చేసిశారు. అనంతరం దొంగను ముసునూరు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.